hocky

న్యూజిలాండ్, స్పెయిన్ మ్యాచ్ డ్రా

  • పురుషుల హాకీ వరల్డ్‌కప్

భువనేశ్వర్: పురుషుల హాకీ వరల్డ్‌కప్‌లో భాగంగా గురువారం న్యూజిలాండ్, స్పెయిన్ జట్ల మధ్య పూల్-ఏలో జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదోవ ర్యాంక్‌లో కొనసాగుతున్న స్పెయిన్ జట్టు ఆరంభంలో అదరగొట్టినా... చివరి అర్ధ భాగంలో తడబడింది. స్పెయిన్ జట్టు తొలి రెండు క్వార్టర్స్‌లో గోల్స్ నమోదు చేసింది. మ్యాచ్ 9వ నిమిషంలో అల్బెర్ట్ బెల్ట్న్ గోల్ చేసి స్పెయిన్‌కు తొలి గోల్‌ని అందించి ఆధిక్యంలో ఉంచగా... రెండో క్వార్టర్‌లో అల్‌వారో (27వ నిమిషం)లో గోల్ చేసి 2-0తో ముందంజలో నిలిపాడు.

Tags

సంబంధిత వార్తలు