Ee nagaraniki Emaindi

డైరక్టర్‌ను హీరోగా మారుస్తున్న విజయ్ దేవరకొండ..?

Updated By ManamMon, 09/17/2018 - 13:11

Vijay Devarakonda, Tarun Bhasckerహీరోగా దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ.. త్వరలో మరో అవతారం ఎత్తబోతున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో క్రేజీ ఇమేజ్ సంపాదించుకున్న విజయ్.. త్వరలో నిర్మాతగా మారనున్నాడట. ఇక తన ప్రొడక్షన్‌లో తనకు మొదటి బ్రేక్ ఇచ్చిన తరుణ్ భాస్కర్‌(పెళ్లిచూపులు దర్శకుడు)ను హీరోగా పరిచయం చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు ఓ తమిళ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు కూడా తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ‘పెళ్లి చూపులు’ చిత్రంలో టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడిగా మారిన తరుణ్ భాస్కర్.. ఆ తరువాత ‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు తరుణ్.ఇద్దరు సెన్సేషనల్ డైరక్టర్స్ ఒక్కచోటే

Updated By ManamMon, 07/02/2018 - 15:25

Tarun, Raj డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణిని ముంబాయిలో కలిశారు. ఈ నగరానికి ఏమైంది చిత్ర స్పెషల్ షోలో వీరిద్దరూ కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు దర్శకులు ‘ఈ నగరానికి ఏమైంది’ ‘సంజు’  చిత్రాల గురించి మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో తరుణ్ భాస్కర్ తన ఐడియాస్ ను డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణితో షేర్ చేసుకున్నారు. కాగా సంజు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.ఈ నగరానికి ఏమైంది? రివ్యూ

Updated By ManamFri, 06/29/2018 - 14:57
ene

రిలీజ్ డేట్‌: 29.06.2018
యాక్ట‌ర్స్: విశ్వక్సేన్‌ నాయుడు, సుశాంత్‌రెడ్డి, అభివన్‌ గోమతం, వెంకటేష్‌ కాకుమాను, అనిషా ఆంబ్రోస్‌, సిమ్రన్‌ చౌదరి తదితరులు 
మ్యూజిక్‌: వివేక్‌ సాగర్‌ 
కెమెరా: నికిత్‌ బొమ్మి 
ప్రొడ్యూస‌ర్‌: డి.సురేష్‌బాబు 
డైర‌క్ట‌ర్‌: తరుణ్‌ భాస్కర్‌ 
బ్యానర్‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌ 

త‌రుణ్ భాస్క‌ర్ దాస్యం తొలి సినిమా `పెళ్లి చూపులు`తో మంచి హిట్‌ని అందుకున్నారు. ఆయ‌న తెర‌కెక్కించిన రెండో సినిమా ` ఈ న‌గ‌రానికి ఏమైంది` శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ తాజా సినిమాను సురేశ్ ప్రొడ‌క్షన్స్ నిర్మించింది. గ‌త సినిమాతో పోలిస్తే ఈ సినిమాకు టెక్నిక‌ల్ ప‌రంగా మ‌రింత ఖ‌ర్చుపెట్టి తీశాన‌ని అన్నారు త‌రుణ్‌. క‌థ విన‌గానే న‌చ్చ‌డంతో గో ఎ హెడ్ అన్న‌ట్టు సురేశ్ ఇదివ‌ర‌కే చెప్పారు. సో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల కాన్ఫిడెన్స్ స్క్రీన్ మీద‌కు ఎంత ట్రాన్స్ ఫ‌ర్ అయిందో హావ్ ఎ లుక్‌...
క‌థ‌:
వివేక్ (విష్వ‌క్సేన్‌ నాయుడు), కార్తీక్‌(సుశాంత్‌రెడ్డి), కౌశిక్‌(అభినవ్ గోమటం), ఉపేంద్ర(వెంకటేశ్‌ కాకుమాను) అనే న‌లుగురు స్నేహితులు క‌లిసి ఓ షార్ట్ ఫిల్మ్ తీసి త‌మ ప్యాష‌న్‌ను నిరూపించుకుని సినిమాల్లోకి వెళ్లాల‌ని అనుకుంటారు. అయితే వారిలో వివేక్‌కి ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ‌. ప్ర‌తిదానికీ భ‌య‌ప‌డుతుంటాడు. అత‌ని మ‌న‌స్త‌త్వానికి త‌గ్గ‌ట్టుగానే ఓ అమ్మాయి అత‌ని జీవితంలోకి వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి వెళ్లిపోతుంది. తాను తీసే షార్ట్ ఫిల్మ్స్ కి ప్రేక్ష‌కుల మ‌ద్ద‌తు ల‌భించ‌క‌పోతే ఫ్రెండ్స్ కూడా ఎక్క‌డ త‌న‌ని వ‌దిలి వెళ్లిపోతారోన‌ని బాధ‌ప‌డుతుంటాడు. దాంతో అత‌నికి ఫ్రెండ్స్ దూర‌మ‌వుతుంటారు. ఎవ‌రికి వారు త‌మ‌కు న‌చ్చిన ఉద్యోగాలు చేసుకుంటుంటారు. కార్తిక్ కి పెళ్లి కుద‌ర‌డంతో స్నేహితుల‌కు పార్టీ ఇస్తాడు. ఆ పార్టీ హైద‌రాబాద్ నుంచి మ‌త్తులో గోవాకు చేరుతుంది. ఆ పార్టీలో కార్తిక్ ఎంగేజ్‌మెంట్ రింగ్ మిస్ అవుతుంది. దాని కోసం ఆ స్నేహితులు ప‌డ్డ పాట్లు ఏంటి? అప్ప‌టిదాకా షార్ట్ ఫిల్మ్స్ కి దూరంగా ఉన్న వాళ్లు.. మ‌ర‌లా ఏం చేశారు? వ‌ంటివి ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు.

స‌మీక్ష‌
న‌టీన‌టులు పాత్ర‌ల్లో ఒదిగిపోతే సినిమా స‌గం స‌క్సెస్ అయిన‌ట్టే. ఈ సినిమాకు ఆడిష‌న్స్ నిర్వ‌హించి కొత్త‌వారిని తీసుకుని మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నాడు త‌రుణ్ భాస్క‌ర్‌. న‌టీన‌టులంద‌రూ త‌మ పాత్ర‌ల్లో ఇట్టే ఒదిగిపోయారు. గోవాలోగానీ, ఫారిన‌ర్స్ ని చూపిస్తున్న‌ప్పుడుగానీ ఎక్క‌డా అశ్లీల‌త‌కు తావివ్వ‌లేదు. అక్క‌డ అంత జాగ్ర‌త్త‌లు తీసుకున్న త‌రుణ్ సినిమా క‌థ విష‌యంలో ఎందుకో ఆ జాగ్ర‌త్త‌ను తీసుకోలేదు. న‌లుగురు కుర్రాళ్లు త‌మ ప్యాష‌న్ కోసం ఏదో చేయ‌డం అనేది తెలుగు తెర‌కి కొత్త క‌థ కాదు. చాలా పాత క‌థే. నిజానికి బోర్ క‌థ‌. కానీ ఈ సినిమాలో త‌రుణ్ చూపించిన జిమ్మిక్కులు ప‌నిచేశాయి. ఆ జిమ్మిక్కు ఏంటంటే మ‌ద్యం సేవించేట‌ప్పుడు పుట్టే కామెడీని ప‌ట్టుకున్నాడు. న‌లుగురు స్నేహితులు కూర్చుని మ‌ద్యం తాగుతుంటే వాళ్లు ఎలా మాట్లాడుకుంటారు, ఫ్రెండ్స్ మ‌ధ్య గొడ‌వ‌లు ఎలా ఉంటాయి.. వాటిని మ‌రొక‌రు ఎలా అర్థం చేసుకుంటారు?  తాగిన త‌ర్వాత ఎవ‌రు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారు?  అస‌లు యువ‌త‌కు కావాల్సింది ఏంటి?  సంతోష‌మే అయితే అది యుస్ సంబంధాల‌లోనూ, డాల‌ర్ల‌లోనూ ఉందా? వ‌ంటి చాలా విష‌యాల‌ను అంత‌ర్లీనంగా చిత్రీక‌రించాడు. కామెడీని రాయ‌గ‌లిగిన ర‌చ‌యిత బారులోనే రాయాల్సిన అవ‌స‌రం లేదు. దానికి వేరే నేప‌థ్యాన్ని కూడా తీసుకొని ఉండ‌వ‌చ్చు. కానీ ఎందుకో ఆయ‌న ప‌బ్‌ల‌కే ఓటు వేశారు. పూర్తిగా యువ‌త‌ను ఉద్దేశించి తీసే ఈ సినిమాలో అన్ని తాగుడు సీన్ల‌ను పెట్ట‌కుండా ఉంటే బావుండేది. క‌డుపుబ్బ న‌వ్వించి, త‌న మార్కు స‌హ‌జ‌త్వానికి మ‌రోసారి గిరాకీ ఉంద‌ని ప్రూవ్ చేసుకున్నాడు త‌రుణ్‌. ఇది పూర్తిగా ద‌ర్శ‌కుడి సినిమానే అయినా, ప‌రిశ్ర‌మ‌కు మ‌రికొంద‌రు న‌టీన‌టులు దొరికార‌న‌డంలో అనుమానం లేదు. ప‌బ్ క‌ల్చ‌ర్‌, గోవా, ఫ్రెండ్స్, న‌చ్చింది చేయ‌డం, ప్యాష‌న్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ ఈ క‌థ అర్థ‌మ‌వుతుంది. ఎంజాయ్ చేస్తారు. కానీ అందులో తాగుడు సీన్ల‌ను చూసి ఇన్‌స్ప‌యిర్ కాక‌పోతే మ‌రీ మంచిది.
ఎండింగ్ వ‌ర్డ్:  యూత్‌కి న‌చ్చుతుంది

రేటింగ్‌: 2.75/5‘ఈ న‌గ‌రానికి ఏమైంది?’ ర‌న్ టైమ్ ఫిక్స్

Updated By ManamThu, 06/28/2018 - 11:09

ENE షార్ట్ ఫిలిమ్స్ నుండి ఫీచ‌ర్ ఫిలిం చేసి తొలి చిత్రం `పెళ్ళిచూపులు`తో ప్రేక్ష‌కుల‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌. ఈ సినిమాతో ఏకంగా నేష‌న‌ల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత ఈ యువ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన మ‌రో చిత్ర‌ం `ఈ న‌గ‌రానికి ఏమైంది?`. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, వెంకట్ కకుమను, అభినవ్ గోమతం, అనీషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి.సురేశ్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ‘యు/ఎ’ స‌ర్టిఫికేట్ పొందింది. స‌ర్టిఫికేట్ ప్ర‌కారం ఈ సినిమా ర‌న్ టైమ్ 140 నిమిషాలుగా ఫిక్స‌య్యింది. ‘ఈ నగరానికి ఏమైంది?’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే!

Updated By ManamSun, 06/24/2018 - 13:22

ENEనలుగురు కొత్త వాళ్లతో ‘పెళ్లి చూపులు’ ఫేం తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం ఈ నగరానికి ఏమైంది? ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అందరినీ ఆకట్టుకోగా.. సినిమాపై అంచనాలను పెంచేసింది. కాగా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. సోమవారం(జూన్ 25న) హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది.

ఇక ఈ చిత్రంలో విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్, వెంకటేశ్ కాకుమాన్ హీరోలుగా కనిపిస్తుండగా.. అనీషా అంబ్రోన్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్లుగా నటించారు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించాడు.  
 ‘ఈ నగరానికి ఏమైంది?’ ట్రైలర్ టాక్

Updated By ManamSun, 06/10/2018 - 10:43

Ee Nagaraniki Emaindi  ‘పెళ్లిచూపులు’ ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఈ నగరానికి ఏమైంది. విశ్వసేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమతమ్, వెంకటేశ్ కకుమాను ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఆద్యంతం కామెడీతో నిండిన ఈ ట్రైలర్ అందరి చేత నవ్వులు పూయిస్తోంది. ఇక ఈ చిత్రంలో అనీషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్‌పై సురేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.‘ఈ నగరానికి ఏమైంది?’ మోషన్ పోస్టర్

Updated By ManamFri, 06/01/2018 - 14:43

ee nagaraniki emaindi ‘పెళ్లి చూపులు’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రస్తుతం ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘నీ గ్యాంగ్‌తో థియేటర్‌కు రా చూస్కుందాం’ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌తో ఆకట్టుకున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్ తాజాగా విడుదలైంది. అందులో నలుగురు కొత్తవాళ్లు ఉండగా వారి కారెక్టర్లను రివీల్ చేశాడు. కాగా ఈ చిత్రం ద్వారా విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్ కకుమాను పరిచయం అవుతుండగా అనీశా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్‌గా కనిపించనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

 తరుణ్ భాస్కర్ రెండో మూవీ ఫస్ట్‌లుక్

Updated By ManamThu, 04/26/2018 - 14:58
Tharun

కొత్త నటీనటులతో పెళ్లి చూపులు ఫేం తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది?’. ‘నీ గ్యాంగ్‌తో రా థియేటర్‌కు చూసుకుందాం’ అనేది ట్యాగ్‌లైన్. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేశ్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ తాజాగా విడుదలైంది. అందులో నలుగురు యువకులు మూవీని తీసేందుకు వెళుతున్నట్లు అర్థం అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. డేట్ ఫిక్స్ చేసుకున్న 'పెళ్లిచూపులు' దర్శకుడు

Updated By ManamThu, 02/08/2018 - 15:23

Tarun 'పెళ్లిచూపులు'తో జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ప్రస్తుతం ఇతడు తన రెండో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కొత్త వారితో తరుణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా 'ఈ నగరానికి ఏమైంది' అనే డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేసుకున్నాడు.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి విడుదల తేదిని కూడా తరుణ్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వేసవి కానుకగా ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. రోడ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తుండగా.. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌ నిర్మిస్తుంది.

Related News