chandrababu

హాయ్‌ల్యాండ్‌పైనా చంద్రబాబు డ్రామా: జగన్

Updated By ManamSat, 11/17/2018 - 17:53
ys jagan speech in parvathipuram padayatra

విజయనగరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎన్నికలప్పుడు మాత్రమే తోటపల్లి ప్రాజెక్ట్ గుర్తుకు వస్తుందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబుకు తోటపల్లి కట్టాలనే ఆలోచనే చేయలేదని అన్నారు. 299వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ శనివారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అన్ని రంగాల్లో చంద్రబాబు సర్కా్ర్ విఫలం అయిందని ఆయన విమర్శించారు.

‘చంద్రబాబుకు ఎన్నికలప్పుడే ప్రాజెక్టులు గుర్తుకు వస్తాయి. ఇక ఝంజావతి ప్రాజెక్ట్‌ను ప్రాజెక్ట్‌ను పట్టించుకున్నవాళ్లే లేరు. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే జిల్లాలో 26వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమై... మిగిలిన పది శాతం ప్రాజెక్ట్ పనులు కూడా చంద్రబాబు సర్కార్ పూర్తి చేయలేదు. చంద్రబాబు అన్యాయమైన పాలనకు ఇదే నిదర్శనం.  జిల్లాలో 24 కరువు మండలాలు అంటే చంద్రబాబు మాత్రం కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. ప్రజలను మోసం చేసేందుకే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని నాటకం ఆడుతున్నారు.

ఇక అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అండగా నిలబడలేదు. అంతేకాకుండా హాయ్ ల్యాండ్‌పైనా చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారు. చంద్రబాబు, నారా లోకేశ్, వారి బినామీలు అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేస్తున్నారు. అగ్రిగోల్డ్ ఎండీ నిందితుడు కాదు కాబట్టే... తాము అరెస్ట్ చేయడం లేదని సీఐడీ చెబుతోంది. అలాగే అంగన్ వాడీ, ఔట్ సోర్సింగ్ పోస్టులను కూడా చంద్రబాబు అమ్ముకున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ గోడ కట్టి...ప్రాజెక్ట్ పూర్తయిందని చెబుతున్నారు. 

నాపై హత్యాయత్నం జరిగితే... దాన్ని కూడా చంద్రబాబు నీచ రాజకీయం చేశారు. పైపెచ్చు నా తల్లి, చెల్లి...ఈ దాడి చేయించారని చెప్పడం దారుణం. ఘటన జరిగిన గంటలోపే జగన్ అభిమానే కత్తితో దాడి చేశాడంటూ ఫ్లెక్సీ విడుదల చేశారు. ఆ నిందితుడు నా  అభిమానిగా చెప్పేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఘటన జరిగిన పది గంటల తర్వాత డీజీపీ లేఖ విడుదల చేశారు. 

ఆ లేఖలో రెండు, మూడు రాతలు ఉన్నాయి. చంద్రబాబు లాంటి దుష్టశక్తులు ఎన్ని కుట్రలు చేసినా.... ప్రజల కోసం తపిస్తూనే ఉంటాను. అలాగే నాపై సీబీఐ విచారణ జరిగితే... కుట్రలు, కుతంత్రాలు బయటకు వస్తాయనే భయంతోనే సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా జీవో విడుదల చేసి, ఇది కేంద్రంపై యుద్ధం అంటూ చిత్రీకరించుకుంటున్నావు.’ అని అన్నారు.బెజవాడలో ఎంతమందికి ఇళ్లు ఇచ్చారు?

Updated By ManamThu, 11/15/2018 - 14:19
CPM leader Ch Babu Rao demands pattas, houses to poor people in vijayawada

విజయవాడ : తెలుగుదేశం ప్రభుత్వం బెజవాడ ప్రజలను ఇళ్ల పట్టాల పేరుతో మరోసారి మోసం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబురావు విమర్శించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ నాలుగేళ్లుగా నిద్రపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. సీహెచ్ బాబురావు  గురువారం శ్రీ శ్రీ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘సర్వేలు పేరుతో నగర ప్రజలనుంచి 500 రూపాయిలు వసూలు చేస్తున్నారు. కొద్ది రోజులలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో  ప్రజల నుంచి వసూలు చేస్తున్న సొమ్ముకు ఎవ్వరు గ్యారంటీ?. నగరానికి 12 వేల ఇళ్లు వస్తే టీడీపీ ప్రజా ప్రతినిధులు ఇష్టానుసారంగా పంచుకున్నారు.  

విజయవాడలో ఇప్పటి వరకు ఎంతమందికి ఇళ్ళు పట్టాలు మంజూరు చేశారు. ఇళ్లు ఇస్తామని పేదల దగ్గర నుంచి టీడీపీ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అమరావతిలో అధికారుల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అధికారులకు ఇళ్లు కట్టారు.... పేదవారికి ఎందుకు విస్మరించారు. అస్సలు విజయవాడలో ఎంత మందికి ఇళ్లు ఇచ్చారో స్పష్టమైన ప్రకటన చేయాలి. జక్కంపూడి లో ఇప్పటివరకు ఇండ్ల నిర్మాణమే చేయలేదు ఈ నాలుగు నెలల కాలంలో ఏ విధంగా ఇళ్ళు ఇస్తారు. ఇది ఎన్నికల జిమ్మికు.’ అని దుయ్యబట్టారు.50 ఏళ్లకే రజకులకు పింఛన్

Updated By ManamFri, 10/12/2018 - 00:34
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన

  • టీడీపీలో చేరిన రజక సంఘం నేతలు

Chandrababuఅమరావతి: రజకుల కోరిక మేరకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు పాతపటి అంజిబాబు, 13 జిల్లాల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. చంద్రబాబు సమక్షంలో అంజిబాబు, ఇతరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. గురువారం ఉండవల్లిలోని ప్రజావేదికకు భారీ సంఖ్యలో తరలివచ్చిన రజక సంఘాల నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రజక సమాఖ్య ఏర్పాటు చేసి, రూ. 70కోట్లు కేటాయించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కాలం నుంచి రజకులు పార్టీలో ఉన్నారని గుర్తు చేశారు. ఆది నుంచి తెలుగుదేశంపార్టీకి బీసీ కులాలు  వెన్నుముకగా నిలిచాయన్నారు. తెలుగుదేశం పార్టీని  రజకులు అత్యధిక సంఖ్యలో ఆదరిస్తూ ఓటు వేసి గెలిపిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ రజకులకు న్యాయం చేసిన పాపాన పోలేదని విమర్శించారు. మత్స్యకారులకు అమలు చేసినట్లుగానే రజకులకు సైతం 50 ఏళ్లకు పింఛను అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు అమలు చేయాలని సంబంధిత అధికారులకు మార్గదర్శనం చేశామని గుర్తు చేశారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కోసం తెలుగుదేశం పార్టీ అహర్నిశలు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ టీడీజనార్దన్ పాల్గొన్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన అంజిబాబు మాట్లాడుతూ.. తమకు ఇచ్చిన హామీలను త్వరలో నెరవేరుస్తామని చంద్రబాబు చెప్పారని తెలిపారు. రజకులకు 50 ఏళ్లకు పింఛన్, ఎస్సీ జాబితాలో చేర్చడానికి నివేదిక రూపొందించడానికి కమిటీ ఏర్పాటు, ప్రజలకు సంబంధించిన దోబీఘాట్లు, ఉచిత విద్యుత్ ఇవ్వడం వంటి హామీలు ఇచ్చారని తెలిపారు.ఉమాపై సీబీఐకి ఫిర్యాదు చేస్తా...

Updated By ManamSat, 09/22/2018 - 16:08
  • చంద్రబాబు పాలనంతా అవినీతిమయమే

  • పోలవరంపై కాగ్ ఇచ్చిన నివేదికపై ఉమ స్పందించరే?

  • మంత్రి ఉమాకు కమీషన్లు దండుకోవడమే లక్ష్యం

  • ఉమా అవినీతిపై పూర్తి ఆధారాలు ఉన్నాయి

  • రమేష్ బాబు, ఉమా మధ్య ఉన్న బంధం ఏంటి?.

vasantha krishna prasad

విజయవాడ : ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘చంద్రబాబు పాలనంతా అవినీతిమయమే. 19న అసెంబ్లీలో కాగ్ నివేదికలో అనుచిత రాయితీలు పోలవరానికి అని ఇచ్చింది.

అవినీతి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు. ప్రతి విషయానికి స్పందించే మంత్రి ఇప్పటివరకు నోరు మెదపలేదు. పోలవరం సీఈ రమేష్ బాబు తెలంగాణ వ్యక్తి, అతనికి ఏమైనా అనుభవం ఉందా?. పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు అతనికి ఎలా ఇచ్చారు? రమేష్ బాబు, ఉమా మధ్య ఉన్న బంధం ఏంటి?. 

ప్రతి సోమవారం పోలవరం వెళ్లి కమీషన్లు తీసుకోవడమే ఉమా లక్ష్యం. తెలంగాణలో హరీష్ రావు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే నువ్వు మాత్రం ఒట్టి హడావిడి చేస్తూ డ్రామాలు. అసమర్థ సాగునీటి మంత్రి ఉమా... కమీషన్లు దండుకోవడమే లక్ష్యం. ఉమా రాజీనామా చెయ్. పోలవరం, పట్టిసీమ అవినీతిపై కాగ్ నివేదిక నేపధ్యంలో ఉమాపై సీబీఐకి ఫిర్యాదు చేస్తాను. వచ్చే వారం లీగల్ ఒపీనియన్ తీసుకుని సోమ, మంగళవారంలో ఫిర్యాదు చేస్తా. ఉమా అవినీతిపై పూర్తి ఆధారాలు ఉన్నాయి, అన్ని సీబీఐకి అందచేస్తా.’ అని తెలిపారు.బాబు-మోదీ మహా నటులు!

Updated By ManamSat, 07/21/2018 - 17:30

YSRCP Leader Ambati Rambabu Sensational Comments On PM Modi and Chandrababu

విజయవాడ: ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న ప్రధాని మోదీ మాటలు చాలా బాధ కలిగించాయని వైసీపీ నేత అంబంటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పార్లమెంట్‌లో జరిగిన అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇద్దరూ మహా నటులని వ్యాఖ్యానించారు. ప్రధాని నటన మాత్రమే చేయగలరని.. చంద్రబాబు మాత్రం జీవించలగరని ఆయన విమర్శించారు. 

నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను వైసీపీ సజీవంగా ఉంచిందన్నారు. హోదా కోసం పోరాటంచేస్తుంటే వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా అంబటి ప్రస్తావనకు తీసుకొచ్చారు. అవిశ్వాసంలో పార్టీలను ఏకం చేసినట్లు చంద్రబాబు హడావుడి చేశారంతేనన్నారు. చంద్రబాబు ఏ లోపాయికారి ఒప్పందం కోసం ఢిల్లీకి వెళ్లారో చెప్పాలన్నారు.  ప్రత్యేక హోదా ఉచ్చులోకి మళ్లీ మళ్లీ టీడీపీని లాగుతామన్నారు.

హోదా అంశాన్ని సమాధి చేయడానికి ప్రధానితో కలిసి చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. కేంద్రం కుంభకోణాలు అంటూ ఊదరగొడుతున్న టీడీపీ పార్లమెంట్‌లో ఎందుకు ప్రస్తావించలేదని ఈ సందర్భంగా ఆయన సూటి ప్రశ్న సంధించారు. రాష్ట్రంలో టీడీపీ అవినీతి గురించి మాట్లాడే బీజేపీ నేతలు పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించాయరాయన. చంద్రబాబు-కేసీఆర్ మధ్య ఏం పంచాయితీ చేశారో టీడీపీ చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. కాగా.. శుక్రవారం పార్లమెంట్‌లో మాట్లాడిన ప్రధాని ప్రత్యేక ప్యాకేజీ మొదలుకుని పలు విషయాలపై మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ ప్రస్తావన తీసుకొచ్చారన్న విషయం తెలిసిందే.పార్లమెంట్ సాక్షిగా టీడీపీ సీక్రెట్ చెప్పేసిన మోదీ!

Updated By ManamFri, 07/20/2018 - 22:46

PM Modi Reveals Secrets Of TDP Over Special Status

న్యూ ఢిల్లీ: పార్లమెంట్ వేదికగా టీడీపీ బాగోతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బట్టబయలు చేశారు.! టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై లోక్‌సభలో మాట్లాడిన ఆయన.. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ చాలా బాగుందని టీడీపీ కీలక నేత ఒకరు తనతో చెప్పారన్నారు. హోదా వద్దు ప్యాకేజే కావాలని టీడీపీ వాళ్లు కోరిన విషయం ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్యాకేజీకి ఏపీ సీఎం చంద్రబాబు ఒప్పుకున్న తర్వాతే ప్రకటించామని.. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత యూటర్న్ తీసుకుని నిందిస్తే ఎలా..? అని మోదీ టీడీపీకి సూటి ప్రశ్న సంధించారు. ఎంపీలుగా మీకు తెలియని విషయాలన్నీ బయటపెడుతున్నా వినండి అంటూ పార్లమెంట్‌లో టీడీపీ డ్రామాలన్నీ మోదీ బహిర్గతం చేశారు.

2016 సెప్టెంబర్‌ 4న జైట్లీ ప్రకటనను అద్భుతమని టీడీపీనే స్వాగతించిన విషయాన్నీ పార్లమెంట్‌లో ఆయన ప్రస్తావించారు. వైసీపీ విసిరిన అస్త్రంలో మీరు చిక్కుకున్నారని టీడీపీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. అనవసరంగా మీ గొడవలో తనను వాడుకోవద్దని చంద్రబాబుకు సూచించాను.  మీ మధ్య పోటీలో నెగ్గుకురాలేరని చంద్రబాబుకు చెప్పానన్నారు. టీడీపీ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే యూటర్న్ తీసుకుందని ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

"ఎన్డీయే నుంచి బయటికొచ్చిన సమయంలో చంద్రబాబుకు నేను ఫోన్ చేశాను. వైసీపీ అస్త్రంలో చిక్కుకుంటున్నావని చంద్రబాబుతో చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతోంది.. ఏపీ ప్రజలకు నేను విశ్వాసం కల్పిస్తున్నాను. ఏపీ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం వెనకడుగు వేయదు. అనవసరంగా సమస్యను సృష్టించి సభను వాడుకుంటారా..?. ఎన్నికలు దగ్గరపడేకొద్ది టీడీపీ యూటర్న్ తీసుకుంది" అంటూ ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మాటలతో కంగుతినడం టీడీపీ ఎంపీల వంతైంది.!బ్రేకింగ్..: ఎంపీ జేసీ రేపు రాజీనామా..!

Updated By ManamThu, 07/19/2018 - 19:14

JC Diwakar Reddy to Resign as TDP MP After No Confidence Motion Discussion

అనంతపురం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొద్దిరోజులుగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన పార్లమెంట్ సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు. పార్టీ ఎంపీలకు టీడీపీ విప్ జారీ చేసినప్పటికీ సమావేశాలకు పోనంటే పోనని ఖరాకండిగా తేల్చిచెప్పేశారాయన. అయితే ఆయన అసంతృప్తికి అధిష్ఠానం ‘జీవో మందు’ వేయడంతో పార్లమెంట్‌కు వెళతానని అధిష్ఠానానికి స్పష్టం చేశారు.

                         కేశినేనికి షాక్.. గల్లాకు చాన్స్..!

అయితే.. శుక్రవారం నాడు పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్ అయిపోయిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని తేల్చిచెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి ఇచ్చినంత ప్రాధాన్యత పార్టీ తనకు ఇవ్వలేదని జేసీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం అభివృద్ధిపై తనకు అభ్యంతరాలున్నాయని జేసీ చెబుతున్నారు. అందుకే జేసీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకపోవడానికి కారణాలు తెలుసుకున్న పార్టీ అధిష్ఠానం జీవో పాస్ చేసింది సరే.. ఈ రాజీనామా విషయంలో ఎలాంటి సన్నాహాలు చేస్తుందో వేచి చూడాల్సిందే మరి. గత మూడ్రోజులుగా జేసీ దివాకర్ రెడ్డి షాక్‌ల మీద షాకులిస్తున్నారు.. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక టీడీపీ పెద్దలు డైలామాలో పడిపోయారు.

                          జేసీ కోసం జీవో.. ఇక చలో పార్లమెంట్..!

 

కాగా.. జేసీ రాజీనామా చేస్తారని తెలియడంతో అనంతపురంకు చెందిన కొందరు కీలక నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారట. పైగా సీఎం  చంద్రబాబును మొదలుకుని ఎంపీలందరిపై ఈయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు బహిరంగ సభల్లో కూడా పార్టీ పరువుతీస్తున్నారని పలువురు జేసీపై సీఎం చంద్రబాబుకు పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారని తెలుస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న పార్టీ పెద్దలు జేసీ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదని సమాచారం.

అందుకే.. పార్టీకి దూరం కావాలని జేసీ కీలక నిర్ణయం తీసుకున్నారట. అయితే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఏం చేయబోతున్నారు..? ఏదైనా పార్టీలో చేరతారా..? లేకుంటే టీడీపీలోనే ఉంటారా..? అన్నది తెలియాల్సి ఉంది. కాగా జేసీ బ్రదర్స్ ఇద్దరూ తన కుమారులను రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయించాలని పెద్ద ప్లాన్‌తోనే ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో జేసీ ఎందుకీ నిర్ణయం తీసుకున్నారో ఎవరికీ అంతుచిక్కని పరిస్థితి..?. మొత్తానికి చూస్తే.. అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీలో టెన్షన్ టెన్షన్ నెలకొంది. అయితే తాజాగా ఎంపీ జేసీ ఇచ్చిన షాక్‌తో టీడీపీ అధిష్ఠానానికి అసలేం చేయాలో దిక్కుతోచట్లేదు.

                          టీడీపీకి సడన్ షాకిచ్చిన ఎంపీ జేసీచంద్రబాబు చివరి ప్రయత్నం ఫలించేనా?

Updated By ManamSun, 07/15/2018 - 19:39

Will Chandrababu Success Final Attempt On Centre

అమరావతి: ఏపీకి కేంద్రం ఇచ్చిన విభజన హామీలు, నిధులు రాబట్టుకునే విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు మరో అడుగుముందుకేశారు. త్వరలో చివరి పార్లమెంట్ సమావేశాలు జరగనుండటంతో కేంద్రంపై ఆఖరి అస్త్రం వదిలేందుకు సీఎం సిద్ధమయ్యారు. మొదట జాతీయ స్థాయి పార్టీ నేతల మద్దతు కూడగట్టుకునే పనిలో టీడీపీ ఎంపీలు నిమగ్నమయ్యారు. ఇందుకు ఎంపీలతో కూడిన ఆరు బృందాలను చంద్రబాబు తయారుచేశారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన ఎంపీలందరూ 18పార్టీల నేతలను కలవనున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై టీడీపీ పోరాటానికి మద్దతు కోరనున్నారు. చంద్రబాబు లేఖలను ఆయా పార్టీల నేతలకు ఎంపీలు అందజేయనున్నారు. 

టీఎంసీ, బీజేడీ, ఆప్, ఎస్ఏడీ నేతలను సుజనా చౌదరి, అవంతి శ్రీనివాస్, జేసీ, మాల్యాద్రి కలవనున్నారు. సీపీఎం, సీపీఐ, శివసేన, ఎన్సీపీ నేతలను తోట నర్సింహం, మాగంటిబాబు, రవీంద్రబాబు కలుస్తారు. డీఎంకే, ఏఐడీంకే, జేడీఎస్, ఎస్పీ, బీఎస్పీ నేతలను సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, మురళీ మోహన్ కలవనున్నారు. జేడీయూ, ఆర్జేడీ, ఎల్జేపీ నేతలను గల్లా జయదేవ్, గరికపాటి మోహన్‌రావు, రవీంద్ర, టీఆర్ఎస్, ఎంఐఎం, కేరళ కాంగ్రెస్ నేతలను అశోక్ గజపతిరాజు, నారాయణ, నిమ్మలకిష్టప్ప, ఎన్.శివప్రసాద్ కలవనున్నారు. ఎన్ఎల్డీ, రాష్ట్రీయ లోక్‌దళ్, ఎస్డీఎఫ్, ఆర్పీఐ, మిగతా లెఫ్ట్ పార్టీలను రామ్మోహన్ నాయుడు, బుట్టా రేణుక, సీతారామలక్ష్మి కలిసి ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించనున్నారు. అంతేకాదు అవసరమైతే పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా ఇదివరకే ఎంపీలకు చంద్రబాబు సూచించారు. అయితే చంద్రబాబు చేస్తున్న ఈ ఆఖరి ప్రయత్నం ఎంతమేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.చంద్రబాబును ఓడించడమే కాపుల లక్ష్యం..!

Updated By ManamWed, 07/11/2018 - 22:05

Kapu Leader Mudragada Sensationsal Comments On CM Chandrababu

అమరావతి: రానున్న ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఓడించడమే మా లక్ష్యమని మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం చెప్పుకొచ్చారు. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ముద్రగడ.. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే కాపు జాతి రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. కాపులను మోసం చేసిన చంద్రబాబును సముద్రం కలుపుతామన్నారు. 

కాపు రిజర్వేషన్లపై.. కచ్చితమైన హామీ ఏ పార్టీ ఇస్తుందో వారికే కాపుజాతి మద్దతిస్తుందని ముద్రగడ తేల్చిచెప్పారు. బీజేపీ, టీడీపీలు సఖ్యతగా ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ బిల్లును పంపలేదని.. బీజేపీ నుంచి టీడీపీ విడిపోయాక బిల్లును పంపారని ముద్రగడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిధుల కోసం టీడీపీ దీక్షలు చేస్తున్నారని.. మా హక్కుల కోసం దీక్షలు చేస్తే అడ్డుకుంటున్నారెందుకు? అని సర్కార్‌కు సూటి ప్రశ్న సంధించారాయన.పోలవరంపై ఇంకా అభ్యంతరాలు, అనుమానాలు!

Updated By ManamWed, 07/11/2018 - 19:20

Central govt Still Arguments and Doubts On Polavaram project

పోలవరం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పోలవరం పనుల పరిశీలనకు ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ  సీఎం చంద్రబాబుతో కలిసి సుమారు అరగంటపాటు పనులను పరిశీలించారు. పనుల పురోగతిని కేంద్రమంత్రికి బాబు వివరించడం జరిగింది. కేంద్ర మంత్రి రాకతో ఓ వైపు టీడీపీ.. మరోవైపు బీజేపీ వేర్వేరుగా వేదికలను ఏర్పాటు చేసి ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2019 డిసెంబర్ నాటికి డెడ్‌లైన్ పెట్టుకున్నామని  టార్గెట్‌గా పెట్టుకొని పనులు చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి నాటికి కాంక్రీట్ పనుల్ని పూర్తిచేస్తామన్నారు. మెజార్టీ పనులన్నీ ఏప్రిల్ కల్లా పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. డీపీఆర్-2ను కూడా వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని కేంద్రాన్ని ఈ సందర్భంగా బాబు కోరారు. 2013 చట్టం ప్రకారం ఖర్చు అంచనాలు పెరిగాయన్నారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి రూ. 57,940 కోట్లు అవసరమని కేంద్రమంత్రికి బాబు వివరించారు. భూ సేకరణకు రూ. 33వేల కోట్లు అవసరమన్నారు. పెండింగ్‌లో ఉన్న నిధులన్ని విడుదల చేయాలని ఈ సందర్భంగా బాబు కేంద్ర మంత్రికి వివరించారు. కాగా బాబు మాట్లాడుతున్నంత సేపు గడ్కరీ తథేకంగా ఆయనవైపే చూడసాగారు.

నితిన్ గడ్కరీ మాట్లాడుతూ..
"
పోలవరం ఏపీకే కాదు దేశానికి కీలకమైన ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు రైతులకు కొత్త జీవితాన్నిస్తుంది. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. ప్రాజెక్టు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. పోలవరం ఏపీకే కాదు.. దేశానికి కీలకమైన ప్రాజెక్ట్. పనులు పూర్తి చేసేందుకు నిధుల్ని అడ్వాన్స్‌గా చెల్లించాలని సీఎం కోరారు. పోలవరం పూర్తి చేయడానికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారు. ప్రాజెక్ట్ ఏపీకి కొత్త జీవితాన్నిస్తుంది.

త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను కోరాము. భూసేకరణ, పరిహారం కోసం నిధులు చెల్లించాలంటే ఫైనాన్స్ కమిషన్ అనుమతి కావలి. పోలవరం భూసేకరణ ఖర్చు దాదాపు రెట్టింపు అయింది. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రాజెక్ట్ వేరు.. రాజకీయాలు వేరు. ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదు. ముందుగా గిరిజనులకు పరిహారం విషయాన్ని సెటిల్ చేయాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర అధికారులు మూడు రోజుల పాటు ఇక్కడే మకాం వేసి సమస్యలను పరిష్కరించాలని సూచించాను. పెరిగిన ప్రాజెక్టు అంచనాను ఆర్థిక శాఖకు పంపిస్తాము. నీటి సదుపాయం ఉంటే ఎంతమేలు జరుగుతుందో నాకు తెలుసు" అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

మొత్తానికి చూస్తే.. పోలవరం విషయంలో కేంద్రం ఎలాంటి హామీలివ్వకపోగా కొర్రీలు పెట్టడం గమనార్హం. తాజా డీపీఆర్‌పై అభ్యంతరాలు, అనుమానాలు కేంద్రం వ్యక్తం చేయడమేంటో అర్థం కాని పరిస్థితి. కనీసం అడ్వాన్స్ ఇచ్చేందుకు కూడా కేంద్రం ముందుకురాకపోవడం విచిత్రం. ఇవన్నీ అటుంచితే పునరావసంపై కూడా గడ్కరీ అనుమానాలు వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్యాకేజీ భారం పెరిగిందని సీఎం చంద్రబాబు కేంద్రానికి విన్నవించుకున్నా ఎలాంటి ఫలితం లేకపోయిందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. పెరిగిన ప్యాకేజీతో పాటు సేకరించిన భూమి కూడా పెరుగుతోందని గడ్కరీ.. సీఎం బాబునే నిలదీయడాన్ని పలువురు విశ్లేషకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Related News