tdp

టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేకు బుగ్గన నోటీసులు

Updated By ManamTue, 06/19/2018 - 14:23

buggana అమరావతి: అధికార టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌లకు పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను అసెంబ్లీ సెక్రటరీకి పంపిన బుగ్గన, వారిద్దరు తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. కర్నూల్‌లో మాట్లాడిన ఆయన టీడీపీ నాయకులు తనపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు.

తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అంటూ చాలెంజ్ చేశారు. ఇప్పటికైనా 
వైసీపీకి, బీజేపీకి సంబందాలు ఉన్నాయంటూ టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, ఏపి భవన్‌లో లాగ్ బుక్ ట్యాపరింగ్ చేయడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ఇక టీడీపీ అభియోగలపై తేల్చుకునేందుకు తన ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మెన్ పదవులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, దీనికి మీరు సిద్ధంగా ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని అన్నారు.కిరణ్‌కుమార్ రెడ్డి రీఎంట్రీ?

Updated By ManamTue, 06/19/2018 - 12:27

చిత్తూరు : రాష్ట్ర విభజన అనంతరం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆయన సొంతగూటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి తన సన్నిహితులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇటీవల తన స్వగ్రామం నగరిపల్లికి వచ్చిన ఆయన తనకు అత్యంత సన్నిహిత వర్గంతో భేటీ అయినట్లు తెలుస్తోంది.

Kiran Kumar Reddyసమైక్యాంధ్ర ప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని వీడి, జై సమైక్యాంధ్ర పార్టీని  ప్రారంభించారు. ఈ పార్టీ 2014  ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యింది. కిరణ్ కుమార్ రెడ్డి కూడా పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయా రు. ఆ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి సి.రామచంద్రారెడ్డి గెలుపొందారు.  దీంతో ఆయన జై సమైక్యాంధ్రపార్టీని తాత్కాలికంగా పక్కన పెట్టారు.

ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారని, టీడీపీలో చేరుతారని పలు వార్తలు వెలువడ్డాయి. ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం ఆయన తీసుకోలేదు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వడంతోపాటు పీలేరు నియోజకవర్గం బాధ్యతలను కూడా అప్పగించారు.  

ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే, కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారా లేదా అనే విషయంపై పీలేరులో ఉత్కంఠ కొనసాగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డికి రాజకీయ గురువు అయిన మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం సూచనల మేరకు మళ్లీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై కిరణ్ త్వరలో నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా కిరణ్ రాకను ఆహ్వానిస్తున్నారని సమాచారం.ప్రజల్లో వేవ్ జగన్‌కు అనుకూలంగా ఉంది కానీ..

Updated By ManamMon, 06/18/2018 - 13:31

undavalli అమరావతి: ప్రజల్లో వేవ్ జగన్‌కు అనుకూలంగా ఉందని, ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అయితే ప్రజల్లో ఉన్న వేవ్‌ను మార్చగలిగే సామర్థ్యం చంద్రబాబుకు ఉందని ఆయన చెప్పారు. జగన్‌కు సరైన ఎన్నికల బృందం లేదని ఉండవల్లి పేర్కొన్నారు. 

ఇక పవన్ కల్యాణ్ బలంపై ఇప్పుడే అంచనా వేయలేమని ఆయన వెల్లడించారు. తెలంగాణ నుంచి ఏడు మండలాలను విలీనం చేసినప్పుడే చంద్రబాబు హోదా కోసం పట్టుబట్టాల్సిందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో కొనసాగుతానని, అయితే ఏ పార్టీలో చేరనని, తనకు వైసీపీతో పాటు టీడీపీలోనూ మిత్రులున్నారని తెలిపారు. స్టీల్‌ఫ్లాంట్‌పై సీఎం రమేశ్ దీక్షకు మద్దతు కోరితే ఇస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు.ఎందుకంత ఉలిక్కి పడుతున్నారు..

Updated By ManamFri, 06/15/2018 - 14:07

హైదరాబాద్ ‌: ఏపీ పంచాయతీరాజ్ శాఖమంత్రి నారా లోకేశ్ పై వైసీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ నాకు స్నేహితుడు, ఢిల్లీలో లంచ్‌ కోసం పక్కనే ఉన్న హోటల్‌కు వెళ్లాం.

బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ విప్‌ కూన రవికుమార్‌లు ఏపీ భవన్‌లో కలిశారు. రవికుమార్‌ నన్ను ఆలింగనం కూడా చేసుకున్నారు. మరి ఈ విజువల్స్‌ ఎందుకు చూపించడం లేదు. రవి నాకు కాలేజ్‌ మిత్రుడు. టీడీపీ విప్‌ నన్ను కౌగిలించుకుంటే ఆయన వైసీపీలో చేరుతున్నాట్టా. సత్యనారాయణతో కలిసి భోజనం చేస్తేనే ఇంత ఉలిక్కి పడతారా?

Buggana Rajendranath

దీనిపై టీడీపీ ఎందుకింత రాద్ధాంతం చేస్తోంది. మైక్ ముందుకు వస్తే తన అజ్ఞానం బయటపడుతుందనే ట్విట్టర్‌కే పరిమితం అయిపోయారు. మరి గతంలో మీ గురించి కూడా సోషల్ మీడియాలో చాలా ఫోటోలు  వచ్చాయి. మరి మీ గురించి ఏం చెప్పుకోవాలి. లోకేశ్ నాయుడు చాలా అమాయకుడిలా ఉన్నాడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయన తండ్రిగారు చంద్రబాబు దగ్గర నుంచి ఏమీ సరిగా నేర్చుకున్నట్లు లేదు. లోకేశ్ అమెరికా యూనివర్శిటీలో చదవి వచ్చానన్న రెండుకు రెండు కలిపితే నాలుగు అని కూడా తెలియదా?. 

లోకేశ్ వరుస చూస్తుంటే ఓ కుందేలు కథ గుర్తుకు వస్తోంది. నిద్రపోతున్న కుందేలు మీద ఓ తాటికాయ పడింది. దాంతో కంగారు పడిన కుందేలు పరిగెత్తుకుంటూ వెళుతుంది. దారిలో దానికి ఓ జింక ఎదురైంది. ఎందుకలా కంగారుగా పరిగెడుతున్నావని అడిగితే...ఆకాశం పడిపోయిందంటూ హడావిడి చేస్తోంది. అలా ఉంది లోకేశ్ వ్యవహారం.

మీలాగా అర్ధరాత్రి చిదంబరం, గడ్కారీలను కలవలేదు. ఆ ఖర్మ మాకు పట్టలేదు. మేము నిజంగా కలిస్తే ఏమైపోతారు? అతిథి గృహం లాబీలో ఇద్దరు ఎమ్మెల్యేలు మధ్య మర్యాదపూర్వక సన్నివేశం చుట్టూ ఓకథ అల్లడం టీడీపీ అభద్రతా భావానికి నిదర్శనం. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది.’ అని వ్యాఖ్యానించారు.పచ్చ చొక్కా వేసుకున్న కాంగ్రెస్ మనిషి చంద్రబాబు

Updated By ManamFri, 06/15/2018 - 10:36

babu, somu అమరావతి: మోదీ లేకుండా చంద్రబాబు జీరో అని, బాబు పచ్చ చొక్కా వేసుకున్న కాంగ్రెస్ మనిషి అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. రాష్ట్రంలో నడుస్తోంది టీడీపీ సర్కారు కాదని, అన్ని పార్టీల నుంచి ఫిరాయించిన వారితో సర్కారు నడుస్తోందని అన్నారు. చంద్రబాబుకు ప్రజల సొమ్ము.. పప్పు, బెల్లంతో సమానమని ఆయన ఆరోపణలు చేశారు. నీరు-చెట్టు, హౌసింగ్‌ పథకాలలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని, వాటిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఒక్క హౌసింగ్‌లోనే రూ.30వేల కోట్ల దోపిడి జరిగిందని, మరో 10లక్షల ఇళ్లు మంజూరు చేస్తే రూ.లక్ష కోట్ల స్కాం జరిగేదని అన్నారు. ఈ నెలలో పార్టీ అధ్యక్షుడితో కలిసి పోలవరాన్ని సందర్శిస్తామని, రాష్ట్రంలో మరో సంపూర్ణ విప్లవం రావాలని  వెల్లడించారు.సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష!

Updated By ManamWed, 06/13/2018 - 15:04

ramesh న్యూఢిల్లీ  : కడప స్టీల్ ఫ్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సమావేశం పెట్టినా అంత ఆశాజనకంగా లేదని ఆయన బుధవారమిక్కడ అన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ అడిగామని, ఇందుకు సంబంధించి అన్ని అంశాలు ప్రస్తావిస్తామన్నారు. అప్పటికీ  స్పందించకపోతే కడపలో అన్ని వర్గాలవారిని కలుపుకొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. ఆంధ్ర ప్రజలు బాధపడుతున్న కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ప్రత్యేక హోదా అంటూ వైసీపీ రాజీనామాల డ్రామా  కొనసాగుతోంది, కనీసం రాజీనామాలు ఆమోదింపజేసుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. వారి రాజీనామాలు  ఆమోదం పొందినా ఎన్నికలు రావని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో ముగ్గురు ఎంపీలు రాజీనామాలు చేస్తే 24 గంటల్లో ఆమోదించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అంశంపై మళ్లీ పార్లమెంట్ లో అవిశ్వాసం పెడతామన్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో సత్తా చాటుతామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్  పనులను సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని, పోలవరం ఆంధ్ర, రాయలసీమకు ఒక వరం అని అన్నారు.
 త్వరలో టీడీపీకి ఆనం గుడ్ బై..?

Updated By ManamWed, 06/13/2018 - 08:39

anam అమరావతి: పార్టీని మారుతున్నట్లు వస్తున్న వార్తలపై టీడీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. గుర్తింపు, గౌరవం లేని చోట తాను ఉండలేనని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఆయన టీడీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఏ పార్టీలో చేరాలి అనే విషయంపై నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తమ కుటుంబానికి సన్నిహితులు, అనుచరులు, అభిమానులందరితో చర్చించి మాత్రమే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. గతంలో తాను ఎన్నో పదవులు చేపట్టానని, సమర్థవంతంగా పనిచేశానని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే మంగళవారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలను ఆనం కలవడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

 ఎవరేం చేస్తున్నారో అంతా తెలుసు: పార్టీ నేతలకు బాబు వార్నింగ్

Updated By ManamTue, 06/12/2018 - 13:24

babu  అమరావతి: ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలో పార్టీ మంత్రులు, సీనియర్ నేతలతో భేటీ అయిన చంద్రబాబు అందులో ధర్మ పోరాట దీక్షలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా కొందరు నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

ఏది చేసినా చెల్లుతుందని అనుకుంటే ఊరకునేది లేదని, ఎవరేం చేస్తున్నారో అన్ని నివేదికలు ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని సహించేది లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఇకపై తాను తీసుకునే చర్యలకు నేతలే బాధ్యత వహించాలని సీఎం స్పష్టం చేశారు. 

 జగన్‌తో సీఎం రమేశ్ కుమ్మక్కు: టీడీపీ నేత

Updated By ManamSun, 06/10/2018 - 09:16

ramesh కడప: టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ జగన్‌తో కుమ్మక్కయ్యారని  ప్రొద్దుటూరు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీతో సంబంధాలు ఏర్పాటు చేసుకొన్న రమేశ్ కడప జిల్లా టీడీపీ పార్టీలో ముఠాలు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఎంపీ సీఎం రమేశ్ వైఖరి వల్ల జిల్లాలో తెదేపా నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి తలెత్తిందని వరదరాజులు ఆందోళన వ్యక్తం చేశారు. 

పార్టీ ఇచ్చిన రాజ్యసభ పదవిని అనుభవిస్తూ జిల్లా పార్టీలో గొడవలు సృష్టించటమేమిటని ఆయన ప్రశ్నించారు. సీఎం రమేష్‌ పంచాయతీ బోర్డుకు ఎక్కువ, మండలానికి తక్కువ అని ఎద్దేవా చేశారు. ఆయనకు నేరుగా ఎన్నికల్లో పాల్గొని గెలిచే సత్తా ఉందా అంటూ వరదరాజులు ప్రశ్నించారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులు ఆగిపోతే.. వై.ఎస్‌. హయాంలో జగన్‌కు ముడుపులిచ్చి రమేష్‌ బిల్లులు చేయించుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఉరేసుకుంటా

Updated By ManamWed, 06/06/2018 - 14:03

KE అమరావతి: రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని, ఒకవేళ అలా చేస్తే తాను ఉరేసుకుంటానని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం కాదని, పార్టీ నిర్ణయమని కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఇక వైసీపీ ఎంపీల రాజీనామాలు ఓ డ్రామా అని ఈ సందర్భంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. అయితే ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో చంద్రబాబు జేడీయూ- కాంగ్రెస్ కూటమికి మద్దతిచ్చారు. ఆ క్రమంలో కుమారస్వామి ప్రమాణ స్వీకారం కోసం వెళ్లి అక్కడ రాహుల్ గాంధీతో ముచ్చడించిన విషయం తెలిసిందే.

 

Related News