acb

ఏసీబీని ఇంకా పటిష్టం చేస్తాం: చంద్రబాబు

Updated By ManamSat, 11/17/2018 - 18:15
 • హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్‌తో ఏపీ సీఎం భేటీ

Chandrababu naidu, ACB, CBI, High court Chief justice, Radhakrishanఅమరావతి: హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. చీఫ్ జస్టిస్, హైకోర్టు న్యాయమూర్తులు శనివారం రాజధాన పర్యటనకు వచ్చారు. హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణాలను న్యాయమూర్తులు పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులతో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో హైకోర్టు భవన నిర్మాణం, హైకోర్టు తరలింపుపై వారితో సీఎం చర్చించారు.

సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ భ్రష్టు పట్టిందన్నారు. వాళ్లలో వాళ్లే అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. సీబీఐ విషయంలో రాష్ట్ర నిర్ణయానికి ఇతర రాష్ట్రాలు మద్దతు తెలపడం మంచి పరిణామంగా ఆయన పేర్కొన్నారు. సీబీఐ కంటే మన ఏసీబీ చాలా పటిష్టంగా ఉందన్నారు. ఏసీబీని ఇంకా పటిష్టం చేస్తామని చెప్పారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి పెరుగుతుందని చంద్రబాబు చెప్పారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం చేసే తప్పులను నిలదీసినట్టు అవుతుందని పునరుద్ఘాటించారు. జనవరి నాటికి అమరావతిలో హైకోర్టు భవనం సిద్ధమవుతుందని చంద్రబాబు తెలిపారు.  
 ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Updated By ManamFri, 11/16/2018 - 09:35

Chandrababu Naidu, AP Governmentఅమరావతి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ సంస్థ ప్రమేయం రాష్ట్రంలో అవసరం లేదని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సమ్మతి ఉత్తర్వును ఉపసంహరించుకుంది.

కాగా ఢిల్లీ తప్ప ఇతర రాష్ట్రాల్లో తన అధికారులను వినియోగించుకునేందుకు సీబీఐకి సమ్మతి అవసరం. అయితే గత కొంతకాలంగా సీబీఐ ప్రతిష్ఠ మసకబారుతూ వస్తుండటంతో ప్రభుత్వం గతంలో ఇచ్చిన సమ్మతిని ఉపసంహరించుకుంది. దీంతో ఇకపై రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర రంగ ఉద్యోగులపై దాడి చేసే అవకాశం సీబీఐకి ఉండదు. ఇక ఈ నిర్ణయం కేంద్రానికి చెంపపెట్టేనని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ఏపీ సంచలన నిర్ణయం తరువాత సీబీఐ పాత్రను ఏసీబీ పోషించే అవకాశం ఉంది.హౌసింగ్ ఏఈ ఆస్తులు 4 కోట్లు

Updated By ManamTue, 11/13/2018 - 23:32
 • రంగనాథ్ ఇళ్లపై ఏసీబీ దాడులు

 • కర్నూలు, హైదరాబాద్‌లో సోదాలు

 • కోటికిపైగా నగదు, బంగారం గుర్తింపు

 • వెండి, కీలక డాక్యుమెంట్లు కూడా

 • ఏఈ ఇళ్లల్లో కొనసాగుతున్న సోదాలు

acbకర్నూలు: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్నూలు జిల్లా కొత్తపల్లి మండల హౌసింగ్ ఏఈ రంగనాథ్, ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ దాడులు చేసింది. కర్నూలు నగరంలో వెంకాయపల్లె రోడ్డులోని కమ్మ భవనం వెనుక ఉన్న విజయ నగర్ కాలనీలోని ఆయన నివాసంలోనూ, బేతంచర్ల, హైదరాబాద్‌లోని బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నగదు తో పాటు బంగారు, వెండి, విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు లభించాయి. వీటి విలువ రూ. కోటికిపైనే ఉన్నట్టు ఏసీబీ డీఎస్పీ జయరామ రాజు చెప్పారు. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.4 కోట్లకు పైనే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విజయనగర్ కాలనీలో ఏఈ నిర్మించుకున్న ఇంటి విలువే రూ.కోటి వరకు ఉంటుందని సమాచారం. అలాగే బంగారు, వెండి, కర్నూలు, హైదరాబాద్‌లో భూములకు సంబంధించిన డాక్యు మెంట్లు విలువ రూ.3 కోట్లకుపైనే ఉన్నట్టు తెలుస్తోంది. హౌసింగ్ విభాగంలో పనిచేస్తున్న ఏఈకి ఇన్ని కోట్ల విలువైన ఆస్తులు ఉండ డంపై అధికారులే నివ్వెరపోయి నట్టు సమచారం. రంగనాథ్ ఇటీ వల హౌసింగ్ లబ్ధిదారుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టు బడ్డారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఒక ప్రణాళిక ప్రకారం మంగళవారం ఉదయమే ఆయన ఇంటితో పాటు ఆయనకు సంబందిం చిన బంధువుల ఇళ్లపై కూడా దాడులు నిర్వహించి నగదు, బంగారు, వెండి, భూముల డాక్యుమెంట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఏఎంవీఐపై ఏసీబీ దాడులు

Updated By ManamSun, 11/04/2018 - 00:37
 • విశాఖలో తొమ్మిది చోట్ల సోదాలు

 • కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు గుర్తింపు

acbవిశాఖపట్నం: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో విశాఖ డీటీసీ కార్యాలయంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శరగడం వెంకట్రావు ఇల్లు, బంధువుల ఇళ్లలో ఏసీబీ సీఐయూ అధికారులు దాడులు చేశారు. శనివారం విశాఖలో గాజువాక, అక్కయ్య పాలెం, అడ్డూరు, అరిపాక, విజయరామ రాజుపేటల్లో ఆయున సన్నిహితులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తొమ్మిది చోట్ల సోదాలు చేశారు. కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్టు కనుగొన్నారు. ఉదయం నుంచే ఏసీబీ సీఐయూ బృందం అధికారుల నేతృత్వంలో దాడులు ప్రారంభమయ్యాయి. 2003లో కూడా శరగడం వెంకట్రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది.కోర్టులో లొంగిపోయిన మాజీ జడ్జి గాంధీ

Updated By ManamTue, 07/10/2018 - 16:47

gandhiహైదరాబాద్ : లేబర్ కోర్టు మాజీ ప్రిసైడింగ్ అధికారి (జిల్లా జడ్జి హోదా) మల్లంపాటి గాంధీ మంగళవారం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. ఆయనకు కోర్టు 11 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో, చంచలగూడ జైలుకు తరలించారు.

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పట్టుబడ్డి అనంతరం గాంధీ బెయిల్ పై విడుదలయ్యారు. అయితే గాంధీ బెయిల్‌ను సుప్రీంకోర్టు నిన్న రద్దు చేసిన విషయం తెలిసిందే. తక్షణమే ఆయన కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా అక్రమాస్తుల కేసులో గాంధీని ఏసీబీ అధికారులు ఈ ఏడాది మార్చిలో అరెస్ట్ చేశారు.ముందస్తు బెయిల్ కోరిన పురుషోత్తంరెడ్డి

Updated By ManamMon, 02/12/2018 - 20:08

acbఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తవ్వేకొద్దీ ఆయన ఆస్తులు బయటపడుతూనే ఉన్నాయి. గతంలోనే ఒకసారి ఏసీబీ వలలో చిక్కినప్పటికీ.. ఏమాత్రం పద్దతి మార్చుకోకుండా.. తెలివిని ప్రదర్శించాడు.. బీనామీలను రంగంలోకి దించి.. వారి పేరుతో రియల్ ఎస్టేట్‌తో పాటు పలు వ్యాపారాలను నిర్వహిస్తున్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న పురుషోత్తం రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ ప్రత్యేక బృందాలు తెలుగు రాష్ట్రాలను జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు తమను వేధిస్తున్నారంటూ.. పురుషోత్తం రెడ్డి సన్నిహితులు శ్రీనివాస్ రెడ్డి, నిపుణ్ రెడ్డి విడివిడిగా హైకోర్టును ఆశ్రయించారు.. వీరి పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం ఇద్దరి ఆరోపణలపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఏసీబీనీ ఆదేశించింది. శ్రీనివాస్ రెడ్డి పిటిషన్‌ను 14వ తేదికి, నిపుణ్ రెడ్డి పిటిషన్‌ను 19వ తేదీకి వాయిదా వేసింది. కాగా, పురుషోత్తం రెడ్డి బినామీలుగా పేర్కొంటూ ఏసీబీ ఇప్పటికే వీరిద్దరిని అరెస్ట్ చేసింది.ఏసీబీ దూకుడు

Updated By ManamMon, 02/05/2018 - 16:21
 • మూడేళ్లలో 500కు పైగా కేసులు

 • 2500 కోట్ల ఆక్రమాస్తుల గుర్తింపు

 • కొనసాగుతున్న దాడుల వరద

 • విపరీతంగా పెరుగుతున్న అవినీతి

 • సర్వేలోనూ ప్రజల నుంచి ఫిర్యాదులు

acbఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి నిరోధక సంస్థ (ఏసీబీ) తన దూకుడును కొనసాగిస్తోంది. అవినీతి, అక్రమాలను తుదముట్టించేందుకు తన వంతుగా విశ్వప్రయత్నం చేస్తోంది. మునుపెన్నడూ లేని స్థాయిలో గత మూడేళ్లుగా ప్రతాపం చూపుతూ అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. 2015 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 500కు పైగా కేసులు నమోదు చేసి, అక్రమార్కుల ఆటకట్టించింది. మార్కెట్ విలువ ప్రకారం రూ. 2500 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించి, స్వాధీనం చేసుకుంది.  కొత్త సంవత్సరంలో మరింత దూకుడు పెంచి లంచావతారులకు చుక్కలు చూపిస్తోంది. ఒక్క నెలలోనే 12 కేసులు నమోదుచేసి, దాదాపు రూ. 300 కోట్ల విలువ కలిగిన ఆస్తులను గుర్తించింది. ఏసీబీ దూకుడు చూసి అవినీతికి అలవాటు పడిన ఉద్యోగులు, అధికారులు కలవరపడుతున్నారు. ఏ నిమిషంలో తమపై ఎలాంటి దాడులు జరుగుతాయో, ఎక్కడ దొరికేస్తామో, ఎవరు ఫిర్యాదు చేస్తారోనని అటూ ఇటూ చూసుకుంటూ బిక్కుబిక్కుమంటూ ఉద్యోగం చేస్తున్నారు. 

పెరుగుతున్న అవినీతి
రాష్ట్రంలో డిజిటల్ పాలనకు శ్రీకారం చుడుతున్నా.. అవినీతి ఏమాత్రం తగ్గడం లేదనడానికి ఏసీబీ దాడులే ప్రత్యక్ష నిదర్శనం. దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి కేంద్రాలుగా మారిపోయాయి. ప్రజలతో అత్యధిక సంబంధాలు నెరపే శాఖల్లో ఈ అవినీతి మరింత విస్తృతంగా ఉంటోంది. పలు శాఖల్లో కింది స్థాయి ఉద్యోగి నుంచి పై స్థాయి ఉన్నతాధికారుల వరకు అక్రమార్జనకు అలవాటు పడిపోయారు. ఎంతో కొంత డబ్బును ముట్టజెప్పనిదే పని అయ్యే పరిస్థితి కనిపించటం లేదు. ప్రజలు కూడా తమ పని త్వరగా అవ్వడమే ముఖ్యమని.. అవతలివాళ్ల చేతులు తడిపేందుకు వెనుకాడటం లేదు. మున్సిపల్, రవాణా, వాణిజ్యపన్నులు, రెవెన్యూ, పోలీస్, ప్రభుత్వాసుపత్రుల్లో లంచాలు ఇస్తేనే పని జరుగుతుందనే స్థితి కనపడుతోంది. మరోవైపు ప్రభుత్వం చేపడుతున్న ఐవీఆర్‌ఎస్ సర్వేలోనూ అవినీతిపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ పాలన ఎలా ఉందనే ప్రశ్నకు చాలామంది అవినీతి విపరీతమైపోయిందని అసంతృప్తిని వెళ్లగక్కుతున్నట్లు తెలియువచ్చింది.
 
సోదాలన్నీ సక్సెస్
అక్రమార్కుల పని పట్టేందుకు ఏసీబీ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలి కాలంలో సెంట్రల్ టీం చేపట్టే ఏ ఒక్క రైడ్ కూడా ఇంతవరకు ఫెయిల్ కాలేదు. అందిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతూ పని పూర్తి చేస్తున్నారు. అక్రమాస్తుల కేసు తమ దృష్టికి వస్తే ఆరు నెలలపాటు వర్కవుట్ చేసి.. మొత్తం చిట్టా అంతా బయుటకు తీసి.. ఆ తర్వాత ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. 

భారీగా అక్రమాస్తుల గుర్తింపు
ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని విపరీతంగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ రూ. కోట్లు గడించిన అధికారుల ఆగడాలను కట్టించేందుకు ఏసీబీ తీవ్రస్థాయిలోనే శ్రమిస్తోంది. 2015 నుంచి 2018లో ఇప్పటివరకు 120కు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను నమోదు చేసింది. ఒక్కో అధికారి కనీసం రూ. 20కోట్లకు తగ్గకుండా ఆస్తులను కూడబెట్టారు. మున్సిపల్, వాణిజ్య, రవాణా శాఖల్లో ఉన్నతాధికారులగా పనిచేస్తూ, ఏసీబీ దాడుల్లో బండారం బయుటపడిన వారైతే సరాసరి రూ. 100 - 800 కోట్ల వరకు అక్రమార్జన చేశారు. 2016లో ఉప రవాణా శాఖాధికారి ఆదిమూలం మోహన్‌పై దాడులు చేసి, అధికారులే షాక్ తిన్నారు. తవ్వే కొద్దీ అతని అక్రమాస్తులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మార్కెట్ విలువ ప్రకారం అతను కూడబెట్టింది అక్షరాలా రూ. 800 కోట్లు. 2017 ఏప్రిల్ నెలలో ఆర్‌అండ్‌బీ ఇంజనీర్ గంగాధరం ఆస్తులపై దాడులు చేపట్టి రూ. 80 కోట్ల ఆస్తులను గుర్తించారు. నాలుగురోజుల క్రితం వాణిజ్యపన్నుల శాఖాధికారి లక్ష్మీప్రసాద్ ఇళ్లపై చేస్తే.. రూ. 150కోట్ల విలువైన ఆస్తులు బయుటపడ్డాయి. వారం రోజుల క్రితం విశాఖపట్నంలో పనిచేస్తున్న టౌన్‌ప్లానింగ్ జాయింట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ ఇళ్లపై దాడులు నిర్వహించి రూ. 100 కోట్ల ఆస్తులను గుర్తించింది.
  
ఉద్యోగుల్లో కలవరం
ఏసీబీ దూకుడును ప్రదర్శిస్తుండటంతో అధికారుల్లో కలవరం మొదైలెంది. తమ వరకు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్న వారంతా.. ఇప్పుడు వణికిపోతున్నారు. ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి రికార్డును ట్రాక్ చేసి, ఆస్తుల చిట్టాను బయుటకు తీస్తుండటంతో అక్రమార్కులకు ముద్ద మింగుడుపడటం లేదు. పెద్దస్థాయి అధికారులను కూడా వదలకుండా దాడులు చేస్తుండటం ఈ కలవరానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

సంవత్సరం           ట్రాప్ కేసులు        అధికాదాయం కేసులు
2015                  141                      22
2016                  105                      50    
2017                  137                      45
2018                  10                        03

Related News