Putta Sudhakar Yadav

ఎన్టీఆర్, ప్రభాస్‌లకు మంత్రి సవాల్

Updated By ManamFri, 08/10/2018 - 11:25

talasani srinivasa yadavటాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్‌లకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సవాల్ విసిరారు. హరిత హారంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన తలసాని, శుక్రవారం తన ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటారు.

అనంతరం తన చాలెంజ్ స్వీకరించవలసిందిగా.. సినీ ప్రముఖులు ఎన్టీఆర్, ప్రభాస్, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, తితిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌ల పేర్లను వెల్లడించారు. మనవాళి మనుగడక కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని, భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ ఉండాలంటే అందరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు.స్వామివారి ఆభరణాలు భద్రం

Updated By ManamTue, 06/26/2018 - 12:23
  •     రమణ దీక్షితులు ఆరోపణలు దుర్మార్గం 

  •     కోర్టులోనే ఆయన సమాధానం చెప్పాలి

  •     ఆభరణాలు వెండిగుమ్మం దాటి పోలేదు

  •     టీటీడీ బోర్డు చైర్మన్ సుధాకర్ యాదవ్

  •     ఆభరణాలను చూసిన బోర్డు సభ్యులు

  •     పోటులో తవ్వకాలు అసలు జరగలేదు

  •     చీమ చిటుక్కుమన్నా తెలుస్తుంది: బోండా

తిరుపతి : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని ఆభరణాలన్నీ సురక్షితంగా ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ట్రస్టుబోర్డు సభ్యులు స్పష్టం చేశారు. తిరుమల ఆలయంలో బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ నేతృత్వంలో బోర్డు సభ్యులు తనిఖీలు నిర్వహించారు. వీరు మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆలయంలోని ఆభరణాలు ఉన్న గదిలో తనిఖీలు చేపట్టారు. 

TTD Board

 తరువాత పుట్టా సుధాకర్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ భక్తుల మనస్సుల్లో అనుమానాలను రేకెత్తించేందుకే మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, వైఎస్‌ఆర్‌సీపీ నాయుకుడు విజయుసాయిరెడ్డి టీటీడీపై ఆరోపణలు చేశారని తెలిపారు. ఆభరణాలన్నీ భద్రతావలయంలో ఉన్నాయని తెలిపారు. స్వామివారి ఆభరణాలను తాము నిశితంగా పరిశీలించామని తెలిపారు. 1952 నుంచి మిరాశీ అర్చక వ్యవస్థ ఉన్న 1996 వరకు తిరువాభరణం రిజిస్టరులో నమోదై ఉన్నాయని తెలిపారు. వీటిని అప్పట్లో జస్టిస్ జగన్నాధం కమిటీ, జస్టిస్ వాద్రా కమిటీలు స్పష్టం చేశాయని అన్నారు. 

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయుమూర్తి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అర్చక కమిటీలు ఆభరణాల గురించి సర్టిఫై చేశాక, రమణ దీక్షితులు ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. వీటిగురించి న్యాయస్థానంలో సమాధానం చెప్పాల్సి ఉందని అన్నారు. 1952 నుంచి ఆలయంలోని ఆభరణాలు  శ్రీవారి మూలవిరాట్టు ఉన్న వెండి వాకిలి దాటి వెలుపలకు రాలేదని తెలిపారు. పింక్ డైమండ్ అని చెబుతున్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించామని తెలిపారు. 2001లో జరిగిన ఒక ఘటనలో పింక్ రూబీ పగిలిపోయిందని, దానికి సంబంధించిన ముక్కలు, పొడి కూడా రిజిస్టరులో రికార్డు అయ్యిందని తెలిపారు.

కమిటీ సభ్యులు కూడా లోపలకు వెళ్లే పరిశీలించారని తెలిపారు. దీంతో పాటు ప్రతి సంవత్సరం ఆడిట్ చేసే ఉద్యోగులు కూడా లోపలకు వెళ్లే చేస్తారని అన్నారు. అదే సవుయంలో ఈ లాకర్‌లకు మూడు తాళాలు ఉంటాయని తెలిపారు. వీటిలో ఒక తాళం డిప్యూటీ ఈఓ దగ్గర, మరొకటి ఏఈఓ దగ్గర, ఇంకో తాళం సూ పరిటెండెంట్ వద్ద ఉన్నాయని తెలిపారు. ఇంకా లాకర్ నెంబర్లు కూడా ఉంటాయని తెలిపారు.  దీంతో ఆభరణాలకు ఎటువంటి సవుస్యలు ఉండవని తెలిపారు.

పోటులో తవ్వకాలు జరగలేదు
శ్రీవారికి అన్న ప్రసాదాలు తయారుచేసే పోటులో ఎటువంటి తవ్వకాలు జరగలేదని చైర్మన్ పుట్టా సుధాకర్‌ యాదవ్, బోర్డు సభ్యుడు బోండా ఉమావుహేశ్వరరావు అన్నారు. పోటులోని గోడలు వేడికి దెబ్బ తింటున్న కారణంగా వాటికి ఫైర్ రెఫ్రాటరీ బ్రిక్ విధానాన్ని ఒక అడుగు మేరకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోటులో ఒక్క రాయి తీసినా, మొత్తం కూలి పోయేలా ఉంటుందని తెలిపారు. అది కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పోటు అని చెప్పారు. అన్న ప్రసాదాల పోటు, లడ్డూ పోటులలో అనేక మంది పని చేస్తుంటారని తెలిపారు. ఈ ప్రాంతాలలో సర్వయెులెన్స్ కెవెురాలు కూడా ఉంటాయని తెలిపారు. పోటులో చీమ చిటుక్కమన్నా తెలిసేలా ఉంటుందని తెలిపారు.

కేవలం భక్తుల మనోభావాలు దెబ్బ తీసేందుకే రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పోటులోను, ఆభరణాల గదిలోను పద్మవ్యూహంలా ఉంటుందన్నారు.  కొన్ని ఆభరణాలు ట్రెజరీలో ఉన్న విషయం గురించి ప్రశ్నించగా, అక్కడ ఉన్నవి కూడాభద్రంగానే ఉన్నాయని తెలిపారు. ఒక ఆభరణం తీసుకుని, దాని వివరాలను రిజస్టరులో పరిశీలించానని, అది వైుసూర్ మహారాజు ఇచ్చిన ఆభరణంగా గుర్తించామని తెలిపారు. దీంతో పాటు జ్యూవెల్ టెక్నిక ల్ సలహా మండలి కూడా ఉంటుందని వివరణ ఇచ్చారు. ఆభరణాలు పరిశీలించిన వారిలో టీటీడీ బోర్డు సభ్యులు రుద్రరాజు పద్మరాజు, సుధా నారాయణమూర్తి, సండ్ర వెంకటవీరయ్య, పెద్దిరెడ్డి, రాయపాటి,  మేడా రావుకృష్ణారెడ్డి, చెన్నై కృష్ణ, రాఘవేంద్రరావు తదితరులు ఉన్నారు. వైఎస్ హయాంలో ఈ రమణ దీక్షితులు ఏమయ్యారు..?

Updated By ManamSun, 05/20/2018 - 14:13

putta తిరుమల: రమణ దీక్షితులపై కక్ష సాధింపు లేదని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. వైఎస్, కరుణాకర్‌ రెడ్డి హయాంలో రమణదీక్షితులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించిన పుట్టా.. ఇప్పుడెందుకు తమపై ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. టీటీడీపై రమణ దీక్షితుల వ్యాఖ్యలను ఆయన విఙ్ఞతకే వదిలేస్తున్నామని, టీటీడీ బోర్డు భక్తుల సేవకే గానీ, పెత్తనానికి కాదని పేర్కొన్నారు. రమణ దీక్షితుల ఆరోపణలపై త్వరలో విచారణ జరిపిస్తామని చెప్పారు. రమణ దీక్షితులే కాకుండా, సామాన్య భక్తులు తీసుకొచ్చిన అంశాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. రమణ దీక్షితులకు రాజకీయ దురుద్దేశం ఉందో లేదో తెలీదని పుట్టా తెలిపారు.

 టీటీడీలోకి కొత్త అర్చకులు..!

Updated By ManamWed, 05/16/2018 - 17:38

TTDramana deekshituluboard meetingPutta sudhakar yadavtirumala

తిరుమల: టీటీడీలో అర్చకులుగా పనిచేస్తున్న 65 ఏళ్లు నిండిన వారంతా రిటైర్మెంట్ ఇవ్వాలని టీటీడీ కొత్త పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వెంటనే ఈ నిర్ణయాన్ని అమల్లోకి తేవాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో రమణ దీక్షితులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస దీక్షితులు, నారాయణ దీక్షితులు పదవులు కోల్పోయారు. తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాస్పద నిర్ణయం తీసుకుందని పలువురు అర్చకులు, ప్రముఖులు విమర్శకులు గుప్పిస్తున్నారు.

రమణ దీక్షితులు అవుట్.. 65 ఏళ్లు దాటితే రిటైర్మెంట్
 

కాగా.. వారి స్థానంలో ప్రధాన అర్చకులుగా గొల్లపల్లి వంశం నుంచి వేణుగోపాల దీక్షితులు, పైడిపల్లి వంశం నుంచి కృష్ణ శేషాద్రి దీక్షితులు, పెద్దింటి వంశం నుంచి శ్రీనివాస దీక్షితులను టీటీడీ నియమించింది. 

TTDramana deekshituluboard meetingPutta sudhakar yadavtirumalaపుట్టా.. క్రైస్తవుడా.. యాదవా అనేది తేలిపోయింది!

Updated By ManamSun, 04/15/2018 - 13:54

I'm 100 percent Hindu, says newly-appointed TTD chief after rumours on social media

అమరావతి: టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ వ్యవహారం పెద్ద దుమారమే రేగుతోంది. పుట్టాను చైర్మన్‌‌గా నియమించిన మరుసటి క్షణం నుంచే వివాదస్పదమవుతోంది. చంద్రబాబు కేబినెట్‌‌లో మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు సిపారసుతో చైర్మన్ గిరి వచ్చినప్పటికీ వివాదాలు మాత్రం పుట్టాను వెంటాడుతూనే ఉన్నాయి. ఓ వైపు శివస్వామి, మరోవైపు వీహెచ్‌‌పీ సంచలన ఆరోపణలు చేస్తుండటంతో అసలు వివాదమేంటి? ఎందుకిది వెలుగులోకి వచ్చిందనే విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

ఈ ఆరోపణలు ఎందుకొచ్చాయంటే..!
టీటీడీ చైర్మన్ పదవి రాక మునుపు నుంచే పుట్టా.. యాదవులను కాదనుకొని క్రిస్టియన్లకు ప్రాముఖ్యతనిచ్చి వారి సాయం చేస్తూ వారితో కలిసిమెలిసి ఉండే వ్యక్తని ప్రధాన ఆరోపణలపై ఆయన ఇలా స్పందించారు. " అదంతా పక్కా అబద్ధం. గురుస్వామి వెనుకల ఉన్న శక్తులు కొన్ని కావాలనే రెచ్చగొట్టి ఆయన్ను ముందుకు నడిపిస్తున్నాయి. ఎడ్లపందెం జరుగుతుంటే నేను ఒక అతిథిగా మాత్రమే వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేనేదే క్రిస్టియన్‌లోకి చేరానని ఆరోపించడం దారుణాతి దారుణం. బీసీలు, యాదవులు ఎదుగుతుంటే చూసి ఓర్చుకోలేక కొన్ని శక్తులు శివస్వామి నడిపిస్తున్నాయి. ఆయన చేసే ఆరోపణాలన్నీ వందకు వంద శాతం తప్పే. నేను వంద శాతం హిందువునేఅని పుట్టా స్పష్టం చేశారు. 

పక్కా ఆధారాలున్నాయ్..!!
"
నేను రాజకీయాల్లోకి రాక 9 సంవత్సరాల మునుపే ఒక కృష్ణుడి దేవాలయం కట్టించడం జరిగింది. నేను సొంతంగా రూ. కోటి నిధులు ఖర్చు చేసి గుడి కట్టించాను. అలాగే ప్రతీ ఏడాదీ నా సొంత నిధులు రూ. 10 లక్షలు ఖర్చు పెట్టి క్రిష్ణాష్టమి, ఉగాది రోజు రెండ్రోజులు పండుగ చేసుకుంటాం. మా కులదైవం శ్రీకృష్ణుడు, మా ఇంటిదేవుడు వెంకన్న స్వామి. మేం ఇప్పటికీ మా కుటుంబం కుమారులు మొదలుకుని మనువళ్లు వరకూ తిరమల వెంకన్న దగ్గరికెళ్లి తలనీలాలు సమర్పించుకుంటాం" అని పుట్టా పేర్కొన్నారు.

శివస్వామికి సవాల్..!
"
ఈ వ్యవహారంలో క్రిస్టియన్స్ అనేది పాయింట్ కాదని.. గురుస్వామిని వెనుక నుంచి బీజేపీ, వైసీపీ నడిపిస్తున్నాయి తప్ప మరొకటి లేదు. శివస్వామి చెబుతున్న మాటల్లో ఒక్క శాతం కూడా నిజం లేదు. ఆయన నిరూపిస్తానంటే నేను దేనికైనా సిద్ధమే అంటూ పుట్టా సవాల్ విసిరారు. బీసీలు ఎదుగుతుంటే ఓర్చుకోలకే ఇవన్నీ తతంగాలు నడుపుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. టీటీడీలో సభ్యుడిగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చాలా గుళ్లు కట్టించానని..  ఇంత చేసిన తనపై క్రిస్టియన్ ముద్ర వేయడం సబబుకాదు" అని ఆయన అన్నారు.

ఆరోజు మీరంతా ఎక్కడికెళ్లారు..?
ఇంతకముందు నాస్తికుడైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అయినప్పుడు ఈ గురుస్వాములంతా ఎక్కడికెళ్లారు?. ఆ రోజు అడగకుండా కళ్లు మూసుకోనున్నారా?. అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏడుకొండలను రెండు కొండలు చేస్తూ  జీవో ఇచ్చారు. అప్పుడంతా ఈ సంఘాలు, స్వాములు  ఏమయ్యారు. వాళ్లు అగ్రకులం వారని ప్రశ్నించలేదా?.. యాదవులకు రాకరాక ఓసారి అవకాశం వచ్చిందని దీన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతోనే ఇదంతా రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రే తప్ప మరోటి లేదు" అని ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. 

మా కోరిక ఒక్కటే..!!
"
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత పెంచాలి. సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించాలి.. ఆ ఆశయంతోనో మేం ముందుకు వెళ్తున్నాం తప్ప వేరే ఆశలేదు. కచ్చితంగా పవిత్రత కాపాడుతాం. సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తాం" అని పుట్టా సుధాకర్ స్పష్టం చేశారు.

Controversy TTD Chairman Putta Sudhakar Yadav Appointmentసామాన్య భక్తుడిలా శ్రీవారికి సేవలు చేస్తా

Updated By ManamWed, 04/11/2018 - 08:43

Putta తిరుమల: ఓ సామాన్య భక్తుడిలా శ్రీవారికి సేవలు చేస్తానని టీటీడీ కొత్త చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. తనకు టీటీడీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చినందుకు సీఎంకు రుణపడి ఉంటానని.. పాలకమండలిలో సభ్యుడిగా చేసిన అనుభవాలతో ముందుకెళ్తానని పేర్కొన్నారు. పాలకమండలి నియామకం తరువాత టీటీడీ ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెడతానని.. ఎవరికీ అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ఆయన తెలిపారు. అయితే టీటీడీ చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.టీటీడీ చైర్మన్‌‌గా పుట్టా!

Updated By ManamFri, 02/02/2018 - 08:17

TDP Leader Putta Sudhakar Yadav As TTD Chairman

తిరుపతి: టీటీడీ పాలక మండలి పదవీకాలం పూర్తైనప్పట్నుంచి చైర్మన్ సీటులో ఎవర్ని కూర్చోబెట్టాలా అని సుమారు ఏడు నెలలపాటు టీడీపీ పెద్దలు కసరత్తు చేశారు. ఎట్టకేలకు కడప జిల్లా మైదుకూరుకు చెందిన పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పేరును దాదాపు ఖరారు చేసేశారు. టీటీడీ ఛైర్మన్‌గా నియమించాలని మూడు నెలల క్రితమే ప్రభుత్వం నిర్ణయించినా.. పలు కారణాలతో ఆలస్యమైంది. దీంతో ఇవాళ లేదా రేపు ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి. కాగా ఇప్పటికే టీటీడీ పాలకమండలి సభ్యులపై కూడా కసరత్తు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. చైర్మన్‌తో పాటు సభ్యుల పేర్లను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించనున్నారు. కాగా మొదట్నుంచి పుట్టా పేరే వినిపిస్తోంది.. ఆఖరికి ఆయనకే పదవి దక్కినట్లైంది కాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఆశావహులకు నిరాశ..
అయితే ఇప్పటికే పలువురు ఈ చైర్మన్ పదవికోసం పోటీపడిన విషయం తెలిసిందే. అయితే పుట్టా పేరు ఖరారు కావడంతో వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. కాగా మంత్రి పదవి కోసం ఆశించినా రాకపోడంతో కనీసం టీటీడీ చైర్మన్ పదవి అయినా వస్తుందని చాలా మంది ఆశావహులు వేచి చూసినప్పటికీ చంద్రబాబు మాత్రం వారందర్నీ పక్కనపెట్టి పుట్టా పేరు ఖరారు చేసేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌.. ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి విన్నవించుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో నందమూరి హరికృష్ణ కూడా చైర్మన్ బరిలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.!

పుట్టా రాజకీయ ప్రస్థానం..
పుట్టా సుధాకర్‌యాదవ్‌ కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం నేత. 2014 ఎన్నికల్లో మైదుకూరు నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి చేతిలో ఘోర ఓటమిని చవి చూశారు. ప్రస్తుతం మైదుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఆయన ఓడిపోయినప్పటికీ టీడీపీ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్న సుధాకర్‌యాదవ్‌ పేరును టీటీడీ చైర్మన్ పదవికి ఖరారు చేశారు.?

Related News