cm ramesh

ఆమరణ దీక్షకు బయల్దేరిన సీఎం రమేశ్

Updated By ManamWed, 06/20/2018 - 08:56

ramesh  కడప: జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్షకు సిద్ధమైన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ దీక్షా శిబిరానికి బయల్దేరారు. ఉక్కు దీక్ష పేరుతో జరుగుతున్న ఈ ఆమరణ దీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో సీఎం రమేశ్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

కాగా కడపతో పాటు బయ్యారంలో ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసే దిశగా పరిశీలించిన ఏపీ విభజన చట్టంలో ఉండగా, వాటి ఏర్పాటు సాధ్యం కాదని చెబుతూ, ఇటీవల ఓ అఫిడవిట్‌ను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందించగా, ఇరు రాష్ట్రాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష!

Updated By ManamWed, 06/13/2018 - 15:04

ramesh న్యూఢిల్లీ  : కడప స్టీల్ ఫ్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సమావేశం పెట్టినా అంత ఆశాజనకంగా లేదని ఆయన బుధవారమిక్కడ అన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ అడిగామని, ఇందుకు సంబంధించి అన్ని అంశాలు ప్రస్తావిస్తామన్నారు. అప్పటికీ  స్పందించకపోతే కడపలో అన్ని వర్గాలవారిని కలుపుకొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. ఆంధ్ర ప్రజలు బాధపడుతున్న కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ప్రత్యేక హోదా అంటూ వైసీపీ రాజీనామాల డ్రామా  కొనసాగుతోంది, కనీసం రాజీనామాలు ఆమోదింపజేసుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. వారి రాజీనామాలు  ఆమోదం పొందినా ఎన్నికలు రావని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో ముగ్గురు ఎంపీలు రాజీనామాలు చేస్తే 24 గంటల్లో ఆమోదించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అంశంపై మళ్లీ పార్లమెంట్ లో అవిశ్వాసం పెడతామన్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో సత్తా చాటుతామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్  పనులను సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని, పోలవరం ఆంధ్ర, రాయలసీమకు ఒక వరం అని అన్నారు.
 జగన్‌తో సీఎం రమేశ్ కుమ్మక్కు: టీడీపీ నేత

Updated By ManamSun, 06/10/2018 - 09:16

ramesh కడప: టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ జగన్‌తో కుమ్మక్కయ్యారని  ప్రొద్దుటూరు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీతో సంబంధాలు ఏర్పాటు చేసుకొన్న రమేశ్ కడప జిల్లా టీడీపీ పార్టీలో ముఠాలు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఎంపీ సీఎం రమేశ్ వైఖరి వల్ల జిల్లాలో తెదేపా నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి తలెత్తిందని వరదరాజులు ఆందోళన వ్యక్తం చేశారు. 

పార్టీ ఇచ్చిన రాజ్యసభ పదవిని అనుభవిస్తూ జిల్లా పార్టీలో గొడవలు సృష్టించటమేమిటని ఆయన ప్రశ్నించారు. సీఎం రమేష్‌ పంచాయతీ బోర్డుకు ఎక్కువ, మండలానికి తక్కువ అని ఎద్దేవా చేశారు. ఆయనకు నేరుగా ఎన్నికల్లో పాల్గొని గెలిచే సత్తా ఉందా అంటూ వరదరాజులు ప్రశ్నించారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులు ఆగిపోతే.. వై.ఎస్‌. హయాంలో జగన్‌కు ముడుపులిచ్చి రమేష్‌ బిల్లులు చేయించుకున్నారని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ రాజీనామా

Updated By ManamWed, 03/28/2018 - 12:54

TDP Leader CM Ramesh submits resignation for MP Post

న్యూ ఢిల్లీ: రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ తన పదవికి రాజీనామా చేసేశారు. తెలంగాణ రాజ్యసభ సభ్యుడిగా త్వరలో తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సీఎం రమేశ్ రాజీనామా చేశారు. కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. టీడీపీ తరఫున సీఎం రమేశ్ రాజ్యసభ సభ్యుడిగా మరోసారి ఎంపికయ్యారు. సాంకేతిక కారణాల దృష్ట్యా, ఒకే సమయంలో అటు ఏపీ, ఇటు తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగడానికి వీల్లేదు కాబట్టి ఆయన రాజీనామా చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. వాస్తవంగా ఏప్రిల్ 2 వరకూ సీఎం రమేష్ పదవీ కాలం ఉన్నప్పటికీ, ఏపీ నుంచి ఎన్నికైనందున, ఆయన తెలంగాణ పేరిట కొనసాగరాదని నిర్ణయించుకుని రాజీనామా చేశారు. సీఎం రమేష్ రాజీనామాను వెంటనే ఆమోదించినట్టు తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

కాగా.. తెలంగాణ రాజ్యసభ సభ్యులు దేవేందర్‌ గౌడ్‌, రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్థన్ రెడ్డి లతో పాటు.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యులు చిరంజీవి, రేణుకా చౌదరి, సీఎం రమేష్‌‌ల పదవీకాలం ఏప్రిల్-2తో ముగియనుంది. కాగా వీరంతా కూడా త్వరలో రాజీనామా చేయాల్సి ఉంది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అమిత్ షా లేఖ అబద్ధాల పుట్ట: టీడీపీ ఎంపీ

Updated By ManamSun, 03/25/2018 - 14:32

 అమిత్ షా లేఖ అబద్ధాల పుట్ట: టీడీపీ ఎంపీ

కడప: బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. సీఎం చంద్రబాబుకు రాసిన లేఖ అబద్ధాల పుట్ట అని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నమ్మక ద్రోహం చేసిందన్నారు. ఏపీలోని జిల్లాలకు అధికంగా నిధులివ్వాలని ఎన్నోసార్లు పార్లమెంట్‌లో డిమాండ్ చేశామన్నారు. యూసీలు ఇవ్వలేదంటూ అమిత్ షా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఆర్థిక నేరస్థులతో బీజేపీ సంబంధాలు కొనసాగించడం దారుణమని వ్యాఖ్యానించారు. కాగా షా లెటర్‌పై టీడీపీ నేతలు, మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.టీడీపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు

Updated By ManamMon, 03/12/2018 - 19:06
cm ramesh

అమరావతి: రాజ్యసభ స్థానానికి టీడీపీ అభ్యర్ధిగా సి.ఎం.రమేష్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎంలు కె.ఈ.క్రిష్ణమూర్తి, నిమ్మకాయల చిన్న రాజప్ప, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు గారు, ఆదినారాయణ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు మరో టీడీపీ అభ్యర్థి కనకమేడల రవీంద్రకుమార్ కూడా సోమవారమే రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సమేతంగా సచివాలయానికి వచ్చి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. 

babu

అంతకుముందు సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషిచేస్తామని రాజ్యసభ అభ్యర్థులు ఈ సందర్భంగా తెలిపారు.సస్పెన్స్ థ్రిల్లర్‌‌ను తలపించిన టీడీపీ అభ్యర్థుల ఎంపిక

Updated By ManamSun, 03/11/2018 - 14:46

tdp rajyasabha

అమరావతి: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సస్పెన్స్  థ్రిల్లర్‌ను తలపించింది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి వర్ల రామయ్య, సీఎం రమేశ్ ఈ రెండు పేర్లే వినపడ్డాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఈ ఇద్దరే బరిలో ఉన్నారు. అయితే వర్లరామయ్యకు ఆఖరి నిమిషం వరకూ రేసులో ఉన్న ఆయను మాత్రం ఛాన్స్ దక్కలేదు. రాయలసీమకు చెందిన సీఎం రమేశ్.. సీనియర్ లాయర్ కనకమేడల రవీంద్ర కుమార్ పేర్లను అధిష్టానం ఖరారు చేసేసింది. ఆదివారం మధ్యాహ్నం రాజ్యసభ అభ్యర్థులను టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలుంది.

కాగా ఎస్సీ వర్గానికి చెందిన వర్లరామయ్య పేరు ఖరారైంది.. ఇక ప్రకటనే తరువాయి అనే సమయంలో అనూహ్యంగా కనకమేడల పేరు రావడం గమనార్హం. రెండు స్థానాలనూ ఓసీలకే టీడీపీ కేటాయించింది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు సహజశైలికి భిన్నంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా రామయ్యకు ఇతర వేరే పదవి కేటాయించి కనకమేడల రవీంద్రకుమార్‌ను రాజ్యసభకు పంపించాలని చంద్రబాబు నిర్ణయించారు.టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వర్ల, రమేశ్‌‌?

Updated By ManamSun, 03/11/2018 - 10:30

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వర్ల, రమేశ్‌‌?

అమరావతి: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఏపీ సీఎం చంద్రబాబు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ విషయమై చర్చించడానికి సీఎం చంద్రబాబుతో మంత్రులు యనమల, కళా వెంకట్రావు కాసేపట్లో భేటీ కానున్నారు. ఓసీ-ఎస్సీ కాంబినేషన్ వైపే టీడీపీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సీఎం రమేశ్, వర్ల రామయ్య పేర్లు ఖరారయ్యాయి.?. ప్రస్తుతానికి సమీకరణాలు మారకుంటే ఇవే పేర్లు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చివరి నిమిషం వరకు రేసులో బీదా మస్తాన్ రావు ఉన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరికొన్ని గంటల్లో సీఎం నుంచి ప్రకటన రానుంది.

కాగా శనివారం జరిగిన సమావేశంలో..
శనివారం నాడు సీఎం చంద్రబాబును ఆశావహులంతా కలిసి మాట్లాడారు. వారిలో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌, మాజీ రాజ్యసభ సభ్యుడు కంభంపాటి రామ్మోహనరావు, కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీద మస్తాన్‌రావు, నల్లగట్ల స్వామిదాస్‌, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు తదితరులు ఉన్నారు.

రమేశ్‌కు మరోసారి.. !
సమావేశం అనంతరం బయటకు వస్తున్న సంకేతాలను బట్టి చూస్తే ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు మరోసారి పొడిగింపు లభించే పరిస్థితి కనిపిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉండటం.. ఢిల్లీ స్థాయిలో సంబంధాలుండటంతో పాటు పార్టీ బలోపేతానికి అన్ని విధాలా కృషి చేయడంతో రమేశ్‌ను మరోసారి రాజ్యసభకు పంపాలని టీడీపీ అధినేత యోచిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే సీఎం రమేశ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ నేతలను టీడీపీ పెద్దలు బుజ్జగిస్తున్నారు. 

మరోవైపు వర్ల రామయ్య.. పార్టీలో చాలా సీనియర్ నేత. ఎస్సీ వర్గాల నుంచి వినిపిస్తున్న పేర్లలో వర్ల రామయ్య ముందుండటంతో ఆయనకే అవకాశమమివ్వడానికి చంద్రబాబుదాదాపు ఫిక్సయిపోయారని తెలుస్తోంది. కాగా ఇదే వర్గం నుంచి పలువురు టికెట్ ఆశించినప్పటికీ ‘వర్ల’పైనే బాబు వరాలు కురిపించారు?. అయితే ఈ ఫైనల్ పేర్లు మరికాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది.

ఆఖరి ప్రయత్నాల్లో ఆశావహులు..
అయితే ఇంకా ఆశావహులు మాత్రం ఆఖరి ప్రయత్నాల్లో ఉన్నారు. ఆదివారం ఉదయం చంద్రబాబు నివాసానికి కనకమేడల రవీంద్రబాబు, మసాల పద్మజ వెళ్లారు.

బీదా బాధపడొద్దు.. ప్రాధన్యమిస్తా!
బీదా రవిచంద్ర.. ప్రస్తుతం నెల్లూరు జిల్లా టిడిపి అధ్యక్షులు, శాసనమండలి సభ్యులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన సోదరుడు మస్తాన్‌రావు కూడా 2014 ఎన్నికల్లో రాజకీయాల్లోకి దిగారు. మస్తాన్‌రావు పోయినసారి కావలి అసెంబ్లీ సీటు నుంచి పోటీచేసి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే నేరుగా ఎన్నికల్లో పోటీచేయాల్సిన వాళ్లు కూడా పరోక్ష ఎన్నికల్లో సీటు అడిగితే ఎలా? అని రాజ్యసభ సీటు కోసం వచ్చినప్పుడు అడిగినట్లు తెలిసింది. అయితే ఇందుకు ఆయన బదులిస్తూ.. కావలి నుంచి సమర్థుడైన మరో అభ్యర్థిని అక్కడ పోటీకి తయారు చేసి ఉంచానని.. తనకు రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని.. అవకాశం ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా బీసీ వర్గాలను కూడగట్టడానికి ప్రయత్నం చేస్తానని సీఎం చంద్రబాబుకు మస్తాన్‌రావు విన్నవించుకున్నారని సమాచారం.

2019లో తగిన ప్రాధాన్యం ఇస్తానని ఆయనకు సీఎం హామీ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో రాజ్యసభ రేస్‌ నుంచి బీదా మస్తాన్ రావు తప్పుకున్నారని పార్టీ శ్రేణుల సమాచారం. ఇదిలా ఉంటే.. మస్తాన్‌రావు సామాజిక వర్గానికే చెందిన పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు టీటీడీ చైర్మన్‌ పదవి ఇవ్వాలని ఇటీవలే సీఎం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.జైట్లీతో సుజనా, రమేశ్‌ భేటీ

Updated By ManamSat, 02/10/2018 - 17:48

Sujana chowdary, CM Ramesh, Arun jaitley న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో శనివారం ఢిల్లీలో కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సి.ఎం. రమేశ్‌ భేటీ అయ్యారు. శుక్రవారం రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం చర్యలు త్వరితగతిన చేపట్టాలని జైట్లీని కోరారు. శనివారం, ఆదివారం సెలవులు ఉన్నందున అధికారులు అందుబాటులో లేకపోవడంతో సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఆయా శాఖల అధికారులతో చర్చించి చర్యలు ముమ్మరం చేద్దామని జైట్లీ వారితో చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైప కడపలో స్టీట్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి మెకాన్ రూపొందించిన నివేదిక ఈ నెల 12న రాబోతుందని, ఆ నివేదిక అందగానే అందుకు సంబంధించిన చర్యలను ముమ్మరం చేయనున్నట్టు కూడా జైట్లీ చెప్పినట్టు తెలుస్తోంది. ఏపీ ప్రజలకు ఏం చెప్పుకోవాలి?

Updated By ManamThu, 02/01/2018 - 20:43

cm rameshకేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ అసంతృప్తి వెళ్లగక్కారు. విభజనతో తీవ్రంగా నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ...కేంద్రం నుంచి ఎంతో ఆశించిందని చెప్పారు. అయితే జైట్లీ బడ్జెట్ ద్వారా ఏపీకి ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. అదే సమయంలో కర్ణాటక, మహారాష్ట్రలకు కేంద్రం ప్రత్యేక కేటాయింపులు చేసిందని అసంతృప్తి వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వంలో తాము భాగస్వామిగా ఉన్నామని, బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై ఏపీ ప్రజలకు ఏమని చెప్పుకోవాలంటూ మండిపడ్డారు. 
 

Related News