congress

కాంగ్రెస్ నేత వీహెచ్ అరెస్ట్

Updated By ManamTue, 06/19/2018 - 11:15

congress హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావును పోలీసులు అరెస్ట్ చేశారు. బైసన్ పోలో గ్రౌండ్‌ను కొత్త సచివాలయ నిర్మాణానికి ఇవ్వొద్దు అంటూ మద్దతుదారులతో నిరసన తెలిపేందుకు హనుమంతరావు వెళ్లారు. అయితే అక్కడకు చేరుకున్న పోలీసులు టెంట్‌ను తొలగించి, ఫ్లెక్సీలను చించేసి వీహెచ్‌ను బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీన్ని నిరసిస్తూ విహెచ్ అనుచరులు పోలీస్ స్టేషన్లో దీక్షకు దిగారు. అయితే చావనైనా చస్తాను కానీ కొత్త సచివాలయాన్ని కట్టనివ్వను అంటూ వీహెచ్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.చచ్చినా సరే సచివాలయం మాత్రం కట్టనివ్వను

Updated By ManamMon, 06/18/2018 - 14:48

Hanumantha Rao హైదరాబాద్: తాను చనిపోయినా సరే కానీ కొత్త సచివాలయం మాత్రం కట్టనివ్వనని కాంగ్రెస్ నేత వీహెచ్ అన్నారు. ఉన్న సచివాలయానికే ముఖ్యమంత్రి కేసీఆర్ రారు అని మళ్లీ కొత్తది ఎందుకుంటూ ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం చాలా విశాలంగా ఉందని, అలాంటి సమయంలో మళ్లీ బైసన్‌పోలో ఎందుకని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు నిధులు డిమాండ్ చేయాలని కానీ, అడుక్కోవడం ఏంటని ఆయన అన్నారు. ఇక కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ మోదీని ఎందుకు అడగడం లేదని వీహెచ్ అడిగారు.


 65 వేల మంది ‘ఈ’ సైనికులు!

Updated By ManamMon, 06/18/2018 - 00:25
  • మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సైబర్ యుద్ధం

  • నెటిజెన్లను ఆకట్టుకునేందుకు ఎత్తులు

 BJP, Congressభోపాల్:  యువ ఓటర్లను, నెటిజెన్లను ఆకట్టుకోవాలంటే సైబర్ యుద్ధాలకు సై అనక తప్పదు. దీంతో మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా సైబర్ యుద్ధం సాగుతోంది.  ఇంటర్నెట్ వేదికగా సాగుతున్న ‘ఈ’(ఎలక్ట్రానిక్) యుద్ధంలో పైచేయి ఎవరిదని తెలియాలంటే మాత్రం అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకూ వేచిచూడాల్సిందే.  మొత్తం 65 వేల మంది ‘సైబర్ సైనికుల’తో బీజేపీ ‘రాజీవ్ కే సిపాహీ’తో సైబర్ స్పేస్‌లో తలపడుతూ సోషల్ మీడియాను మరింత వేడెక్కిస్తోంది. త్వరలో జరుగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సాగుతున్న పోటాపోటీలో ఈ యుద్ధం అనివార్యంగా మారిందని పార్టీలు కుండబద్ధలు కొడుతున్నాయి. 

ప్రధాన ఆయుధం ‘వాట్సప్’
‘‘మా పార్టీ తరపున 65,000 మంది సైనికులను సైబర్ యుద్ధంలోకి దించాం.. గత మూడు నెలలుగా వీరం తా ఇదే పనిలో ఉన్నారు.. త్వరలో మరో 5000 మందిని కూడా నియమించబోతున్నాం.. గ్రామీణులనుకానీ రాష్ట్రం లోని సామాన్యులందరికీ అందుబాటులో ఉన్నది వాట్సప్ యాప్ కనుక మేం ఈ యాప్‌లో రెట్టించిన క్రియాశీలత ను ప్రదర్శిస్తున్నాం..ఇదే అతిపెద్ద మాధ్యమం..సాధనం’’ అంటూ బీజేపీ రాష్ట్ర ఐటీ సెల్ ఇన్‌చార్జ్, శివరాజ్ సింఘ్ దాబి మీడియాకు వెల్లడించారు.  రాష్ట్ర కాంగ్రెస్ మాత్రం 4000 మందితో రాజీవ్ కే సిపాహీ పేరుతో అధికార బీజేపీపై ఇంటర్నెట్‌లో విరుచుకుపడుతోంది.  మరో 5000 మందికి ఇప్పటికే శిక్షణ ఇస్తున్న కాంగ్రెస్ అతి త్వరలో వారిని కూడా ఎన్నికల కదనరంగంలోకి దించనుంది. ‘‘ప్రతి రెవిన్యూ డివిజన్‌లోనూ ట్రైనింగ్ సెషన్లు నిర్వహిస్తున్నాం.. ఎన్నికలప్పుడు మా అతిపెద్ద ఆయుధం వాట్సప్ యాప్’’ అంటూ కాంగ్రెస్ ఐటీ సెల్ ఇన్‌చార్జ్ ధర్మేంద్ర బాజ్‌పాయ్ వివరించారు.

ప్రత్యర్థులపై ఇలా విరుచుకుపడతారు..
సోషల్ మీడియాలో అత్యంత పాప్యులర్ అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వాటిద్వారా ప్రజలను చేరుకుని.. వారికి తమ పార్టీ కార్యకలాపాలు వివరిస్తూ, తమ విరోధి పార్టీ చేస్తున్న రాజకీయాలను వివరించేలా చేయడం ఈ సైనికుల పని.  ఇందుకు వాట్సప్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెడతారు కూడా.  ఇందుకు కారణం వాట్సప్ యాప్ దాదాపు ప్రతి ఒక్క  ఓటరుకు అలవాటైన సోషల్ మీడియా కావడమేనని ఐటీ విభాగాలు పేర్కొంటున్నాయి.  ఈనెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘గావ్ బంద్’ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ప్రయోగించినట్టు బీజేపీ గర్వంగా పేర్కొంది.  ఇక బీజేపీ ఐటీ సెల్‌కు అదనపు సమాచారం అందించే పని ఎక్కువగా ఉంది.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వంటివి కూడా ప్రచారం చేయడం వీరి విధి.  నెట్‌లో కాంగ్రెస్ ఐటీ సెల్ నిర్వహించిన ‘రాహుల్ విత్ ఫార్మర్స్’ హ్యాష్ ట్యాగ్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి, విపరీతంగా ట్రెండింగ్ అయి విజయవంతమైనట్టు బాజ్‌పాయ్ పేర్కొన్నారు.  ఇరు పార్టీలు తమ ప్రత్యర్థి పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా ఖండించడం, వివరణ ఇచ్చుకోవడం, అది అసత్యమని సాక్షాధారాలతో రుజువు చేసుకోవడం వంటి చర్యలతో సైబర్ స్పేస్‌లో పోస్టులు, ట్వీటుల యుద్ధాన్ని తారాస్థాయికి తీసుకెళ్తున్నాయి. వారం క్రితం జబల్‌పూర్ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ సైబర్ సైనికులతో ఏకంగా పెద్ద చర్చా కార్యక్రమాన్ని నిర్వహించి, స్వయంగా పలు సూచనలు సలహాలు చేస్తూనే, వీరి ప్రతిస్పందనను స్వీకరించినట్టు పార్టీ వెల్లడించడం విశేషం.  కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలి

Updated By ManamSat, 06/16/2018 - 13:29

janareddy  హైదరాబాద్: విభజన హామీలపై నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రస్తావించి వాటిని సాధించాలని తెలంగాణ సీఎల్పీ నేత జానా రెడ్డి అన్నారు. అఖిలపక్ష సమావేశంలో మాట్లాడిన జానారెడ్డి.. విభజన హామీలను సాధించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు. అలాగే ముస్లింలకు ఇచ్చిన మాటను ఈ రంజాన్‌కైనా నిలబెట్టుకోవాలని, వారి రిజర్వేషన్లపై ప్రధానిని అడగాలని ఆయన అన్నారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత చట్టంలో పొందుపర్చిన ఏ హామీలను కేంద్రం నెరవేర్చలేదని.. వీటి విషయంలో ప్రధానిపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు. 

ఇక ప్రధానిని కలిసిన కేసీఆర్ తనకు నచ్చిన లిస్ట్ మాత్రమే మోడీకి అందించారని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి సీఎం ఎందుకు నోరు మెదప లేదని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఇందులో ఎదో కుట్ర కోణం ఉందనే అనుమానం కలుగుతుందని ఆయన చెప్పారు. మైనార్టీ రిజర్వేషన్ల పై ఎందుకు మాట్లాడలేదని.. రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో ఎవరికి భయపడనని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు.వాళ్లు స్నానం చేయడమే నేరమా?

Updated By ManamFri, 06/15/2018 - 16:39

జల్గావ్‌ :  ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరెస్సెస్‌, బీజేపీలపై నిప్పులు చెరిగారు. ఆరెస్సెస్‌, బీజేపీల విషపూరిత రాజకీయాలు, విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. విషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళమెత్తాలని రాహుల్ పిలుపునిచ్చారు.

Dalit boys thrashed

కాగా మహారాష్ట్ర జల్గావ్‌లో  ముగ్గురు దళిత బాలురు... బావిలో ఈత కొట్టడంపై అగ్ర వర్ణాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని నగ్నంగా ఊరేగించి, వారిని దారుణంగా కొట్టిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన బావిలో దళిత చిన్నారులు స్నానం చేయడమే నేరమా అని ప్రశ్నిస్తూ  ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

జూన్‌ 10న జరిగిన ఈ ఘటనకు సంబంధించి దోషులపై ఎస్‌సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే జల్గావ్ గ్రామన్ని సందర్శించి బాధిత బాలుర కుటుంబసభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలురపై గ్రామస్తుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.లోకేష్ తో అంబిక లక్ష్మీ నారాయణ భేటీ

Updated By ManamWed, 06/13/2018 - 12:47

lokesh, ambika హిందూపురం : అనంతపురం జిల్లా హిందూపురంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. హిందూపురం కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ అంబిక  లక్ష్మీ నారాయణ హస్తానికి హ్యాండ్ ఇచ్చి సైకిల్ ఎక్కేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ వార్తలకు ఊతం ఇచ్చేలా ఆయన బుధవారం సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ ను కలిశారు.  జిల్లా పర్యటనకు వస్తున్న లోకేష్ ను అంబిక లక్ష్మీ నారాయణ కోడికొండ సమీపంలో కలిసి, కొద్ది నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడారు.

కాగా అంబిక లక్ష్మీ నారాయణ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా హిందూపురం నుంచి పోటీ చేసినప్పటికీ టీడీపీ అభ్యర్థి అబ్దుల్ ఘనీ చేతిలో ఓటమి పాలయిన విషయం తెలిసిందే. అంతకు ముందు బెంగళూరు విమానాశ్రయం వద్ద మంత్రి లోకేష్ ను మంత్రి కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే బీకె పార్థసారథి, జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు తదితరులు కలిసి స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ ఇవాళ మడకశిరలో పర్యటించనున్నారు. అందులో భాగంగా కోడికొండ చెక్ పోస్టు చేరుకున్న  ఆయనకు  జిల్లా, నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు.జయనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం

Updated By ManamWed, 06/13/2018 - 11:46

sowmya జయనగర్: కర్ణాటకలో బీజేపీకి మరో షాక్ తగిలింది. జయనగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యరెడ్డి విజయం సాధించారు.  బీజేపీ అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే  విజయ్ కుమార్ సోదరుడు ప్రహ్లాద్ బాబుపై 3,775ఓట్లతో  ఆమె గెలుపొందారు. ఫలితాల్లో సౌమ్యకు 54, 045ఓట్లు రాగా, ఫ్రహ్లాద్‌కు 50,270 ఓట్లు వచ్చాయి. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్ బలం 80కి పెరిగింది. కాగా ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ప్రచార సమయంలో జయనగర్ బీజేపీ అభ్యర్థి బీఎన్ విజయ కుమార్ గుండెపోటుతో మరణించారు. దీంతో ఆ స్థానానికి ఇటీవల ఎన్నిక జరిగింది.

 ఉత్తమ్ సమస్యకు స్పందించిన కేటీఆర్ 

Updated By ManamWed, 06/13/2018 - 10:30

ktr హైదరాబాద్: సామాజిక మాధ్యమాల ద్వారా తన వద్దకు వచ్చిన సమస్యలను పరిష్కరించే వారిలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఒకరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు తన వద్దకు తీసుకొచ్చే సమస్యలకు ఆయన సమాధానం ఇస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన వద్దకు తీసుకొచ్చిన సమస్యపై స్పందించిన కేటీఆర్, దానిని పరిష్కారం చేసినట్లు చెప్పారు.

అయితే కొమరం భీమ్ అసిఫాబాద్‌ జిల్లాలో ఓ గుడిసెలో ఉంటున్న ఇద్దరు వృద్ధ దంపతులకు 500రూపాయల ఇంటి పన్నును ప్రభుత్వ అధికారులు వేశారు. దానికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉత్తమ్.. ఆ వృద్ధ దంపతులను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, వారి నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేసి, డబుల్ బెడ్‌రూం ఇంటిని ఇవ్వాలని కేటీఆర్, తెలంగాణ సీఎంఓలను కోరారు. దానికి స్పందించిన కేటీఆర్.. సమస్యను తన వద్దకు తీసుకొచ్చిన ఉత్తమ్ కుమార్‌కు థ్యాంక్స్ చెబుతూ దీనిపై స్పందించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఆ తరువాత కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన జిల్లా కలెక్టర్ వారి డబ్బులను నాలుగు రోజుల క్రితమే తిరిగి ఇచ్చేశామని, అలాగే వారికి పెన్షన్, డబుల్ బెడ్‌రూం ఇంటిని కూడా విడుదల చేశామని తెలిపారు. ఇక ఈ విషయాన్ని ఉత్తమ్‌కు తెలిపిన కేటీఆర్ ఒకసారి మీరు చెక్ చేయండి అంటూ సమాధానం ఇచ్చారు.

 

 త్వరలో టీడీపీకి ఆనం గుడ్ బై..?

Updated By ManamWed, 06/13/2018 - 08:39

anam అమరావతి: పార్టీని మారుతున్నట్లు వస్తున్న వార్తలపై టీడీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. గుర్తింపు, గౌరవం లేని చోట తాను ఉండలేనని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఆయన టీడీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఏ పార్టీలో చేరాలి అనే విషయంపై నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తమ కుటుంబానికి సన్నిహితులు, అనుచరులు, అభిమానులందరితో చర్చించి మాత్రమే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. గతంలో తాను ఎన్నో పదవులు చేపట్టానని, సమర్థవంతంగా పనిచేశానని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే మంగళవారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలను ఆనం కలవడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

 'భయ్యూజీ మృతిపై సీబీఐ దర్యాప్తు జరపాలి'

Updated By ManamTue, 06/12/2018 - 20:10

Congress, MP government for Bhaiyyuji Maharaj's death, demands CBI probeభోపాల్: ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్ మంగళవారం అనుమానాస్పద స్థితిలో తన నివాసంలో తుపాకీతో కాల్చుకొని మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఆయన మృతిపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మహారాజ్ ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన కారణాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భయ్యూజీ ఆత్మహత్య చేసుకున్న స్థలం వద్ద ఓ సూసైట్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్టు డీఐజీ హరినారాయణ మిశ్రా వెల్లడించారు. ఆ సూసైట్ నోట్‌లో తాను మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు మహరాజ్  పేర్కొన్నారని, అయితే ఆ మానసిక ఒత్తిడికి కారణం ఏమిటో తెలియాల్సి ఉందని, విచారణ జరుపుతున్నామన్నారు.

దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ, మహరాజ్‌పై మధ్యప్రదేశ్ ప్రభుత్వమే ఒత్తిడి తీసుకువచ్చినట్టు ఆరోపించింది. 'మేమిచ్చింది నువ్వు తీసుకుని ప్రభుత్వానికి మద్దతిమ్మని ఆయనపై ప్రభుత్వం ఒత్తిడి చేసింది. అందుకు మహరాజ్ నిరాకరించారు' అని కాంగ్రెస్ మానక్ అగర్వాల్ ఆరోపించారు. కాగా, భయ్యూజీ మహారాజ్ తన నివాసంలో తుపాకీతో కుడివైపు తలపై కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే ఆయన్ను బాంబే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మహారాజ్ మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. 

Related News