notices

ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్యకు నోటీసులు

Updated By ManamThu, 06/28/2018 - 16:29

balayya ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్’ చిత్రానికి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల కుటుంబం నుంచి అభ్యంతరం వచ్చింది. సినిమాలో తమ తండ్రి నాదెండ్ల భాస్కర్‌రావు పాత్రను నెగిటివ్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పెద్ద కుమారుడు ఆరోపించారు. ఈ మేరకు ఈ చిత్రంలో నటిస్తున్న బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌కు ఆయన నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే హోదాలో ఒకటి, నటుడిగా మరొకటి బాలయ్యకు రెండు నోటీసులు జారీ చేశారు భాస్కర్ రావు పెద్ద కుమారుడు. 

ఈ సినిమాలో తమ పాత్రల గురించి వారు ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. కాగా ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాదెండ్ల భాస్కరరావు పాత్ర కోసం నటుడు సచిన్ జోషిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డిలకు టీటీడీ నోటీసులు

Updated By ManamWed, 06/13/2018 - 12:56
Vijaya Sai Reddy

తిరుమల: శ్రీవారి మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు, వైసీపీ నేత విజయసాయిరెడ్డిలకు తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థ(టీటీడీ) నోటీసులు జారీ చేసింది. పరువుకు భంగం కలిగేలా వారు చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో కోరింది. వివరణ ఇవ్వకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నోటీసులలో తెలిపింది.

కాగా గత కొన్ని రోజులుగా టీటీడీపై రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్నారు. టీటీడీలో రాజకీయాలు ఎక్కువ అయ్యాయని, స్వామి వారి నగలను అమ్మేశారని ఆయన ఆరోపణలు చేశారు. మరోవైపు టీటీడీకి చెందిన కొన్ని ఆభరణాలు సీఎం చంద్రబాబు నివాసంలో ఉన్నాయని విజయసాయి రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.మాజీ రాష్ట్రపతికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Updated By ManamFri, 04/06/2018 - 16:24

Pranab Mukharjeeన్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2016లో ప్రణబ్ 'టర్బులెంట్ ఇయర్స్ 1980-1996' అనే పుస్తకాన్ని రచించారు. అందులో కొన్ని చోట్ల హిందువుల మనోభావాలను కించపరిచేలా ప్రణబ్ ముఖర్జీ రాశారని, వాటిని తొలగించాలని 1996 నవంబర్ 30న కొంతమంది కింది కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు విముఖతను చూపడంతో వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ ప్రణబ్‌కు నోటీసులు జారీచేశారు. వివరణ ఇవ్వాలంటూ ప్రణబ్‌కు నోటీసులు పంపారు. తదుపరి విచారణను జూలై 30కి వాయిదా వేశారు.మళ్లీ షాక్.. రాజా, కనిమొళికి నోటీసులు..

Updated By ManamWed, 03/21/2018 - 13:08

2G spectrum case

న్యూ ఢిల్లీ: 2జీ స్కాంలో మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళిని నిర్దోషులుగా ప్రకటిస్తూ.. సీబీఐ ప్రత్యేక కోర్టు  తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఓ పనైపోయింది.. మాపై ఆరోపణలన్నీ పోయాయ్.. నిర్దోషులుగా తీర్పు వచ్చింది ఆల్ హ్యాపీస్ అనుకుంటున్న సమయంలో ఢిల్లీ హైకోర్టు సడన్ షాకిచ్చింది. 2జీ కుంభకోణంలో రాజా, కనమొళితోపాటు ఇతర నిందితులకు ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. వారిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసింది. దీంతో నిర్దోషులుగా విడుదలైన వారందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కోర్టులో ఎలా తీర్పు వస్తుందో వేచి చూడాల్సిందే మరి.ఏపీ కోసం కాంగ్రెస్ కీలక నిర్ణయం

Updated By ManamThu, 02/08/2018 - 12:39

congress crucial decision for Andhra Pradeshన్యూ ఢిల్లీ: లోక్‌సభలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ విభజనచట్టం, ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నోటీసులిచ్చింది. 184 నిబంధన కింద చర్చ, ఓటింగ్ జరపాలని కాంగ్రెస్ నోటీసులో పేర్కొంది. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌‌కు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే నోటీసులు అందజేశారు.

గత నాలుగు రోజులుగా పార్లమెంట్ లోపల, ఆవరణలో పెద్ద ఎత్తున ఏపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీపై అటు టీడీపీ, ఇటు బీజేపీ ఆఖరికి నరేంద్ర మోదీకూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో యూటర్న్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఏపీకి న్యాయం చేసే దిశగా ముందడుగులేస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఎప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఏపీకి చెందిన కాంగ్రెస్ ఎంపీ చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన చేసినందుకు తెలుగు ప్రజలు శిక్ష వేశారని.. మేం ఒప్పుకుంటున్నామని ఆయన తెలిపారు. విభజన చట్టంలోని అన్ని హామీలన్నీ అమలయ్యే వరకూ మా పోరాటం ఆగదని ఆయన తెలిపారు.ఆ పాపం ఇద్దరిదే.. హైకోర్టు ఆగ్రహం

Updated By ManamWed, 01/24/2018 - 09:22
  • విద్యార్థుల ఆత్మహత్యలు దారుణం

  • కాలేజీలు.. తల్లిదండ్రులూ బాధ్యులే

  • ర్యాంకుల మాయలో పిల్లలపై ఒత్తిడి

  • ఆత్మహత్యలపై హైకోర్టు వ్యాఖ్యలు

  • లోక్‌సత్తా నేత లేఖపై విచారణ

High Court Seriousహైదరాబాద్: ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన విద్యార్థులపై ర్యాంకుల ఒత్తిడి పెనుభారంగా మారుతోందని, దీని ఫలితంగానే కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇందులో కాలేజీలతో పాటు తల్లిదండ్రుల పాపం కూడా ఉందని అభిప్రాయపడింది. 90 శాతం మార్కులు రావాలనే ఏకైక లక్ష్యంతో పిల్లలు ఏమవుతున్నారో కూడా చూడకుండా ఒత్తిడి చేస్తున్నారని ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. 

    ప్రైవేటు విద్యాసంస్థల్లో, ఐఐటీలలో విద్యార్థులు తీవ్ర ఒత్తిళ్ల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇందుకు కారణమైన కార్పొరేట్ కాలేజీలపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరుతూ లోక్‌సత్తా ఉద్యమ సొసైటీ ప్రకాశం జిల్లా కన్వీనర్ దాసరి ఇమ్మాన్యుయేల్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది. సాక్షాత్తు ఏపీలో ఒక మంత్రికి చెందిన కార్పొరేట్ కాలేజీ ఉందని.. పలు కాలేజీలు, హాస్టళ్లకు అనుమతులు లేకుండా నడుపుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ కేసును మంగళవారం విచారించిన హైకోర్టు.. నారాయణ, శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యాలను, ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విద్యా, హోం శాఖల ప్రధాన కార్యదర్శులు, ఇంటర్ బోర్డు కార్యదర్శులు, స్విమ్స్, నిమ్స్ డైరెక్టర్లను ప్రతివాదులుగా పేర్కొంది. వారందరికీ నోటీసులు జారీ చేస్తూ విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.

ర్యాంకుల ఆశతో మాస్ కాపీయింగ్
ఎలాగైనా సరే మార్కులే కావాలనే పెద్దలు.. ర్యాంకులే ప్రధానంగా విద్యాసంస్థలు.. ఫలితంగా మాస్ కాపీయింగ్.. వీటి దుష్పరిణామాలే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయని హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విద్వత్తుతో పనిలేకుండా మార్కులు/ర్యాంకులే ప్రధానమనే దుస్థితి కారణంగానే చూచిరాత పరీక్షలు పెరిగిపోతున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని బెంచ్ ఆందోళన వెలిబుచ్చింది.

           మాస్‌కాపీయింగ్, పుస్తకాలు పెట్టి పరీక్షలు రాసే దుష్ట విధానాన్ని అడ్డుకునేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు బెంచ్ మంగళవారం విచారించింది. పరీక్షలు ఒకదారికి రావాలంటే మండల/జిల్లా స్థాయి విద్యాధికారులను బాధ్యుల్ని చేయడమే సరైన విధానం అవుతుందనే అభిప్రాయాన్ని బెంచ్ వ్యక్తం చేసింది. ఈసారి టెన్త్ పరీక్ష కేంద్రాల్లోని సీసీ కెమెరాలు పెడతామని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు తెలిపాయి. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా పడింది.

Related News