Bhakthi

జై జగన్నాథ

Updated By ManamMon, 07/09/2018 - 23:22

ఆషాఢంలో జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధం. పతితపావనుడు, నీలమాధవుడు అని భక్తులంతా కీర్తించే జగన్నాథస్వామి ఆషాఢమాసంలో రెండోరోజున రథయాత్ర చేస్తాడు. సాధారణంగా ఏ ఆలయంలో అయినా ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. పూరీలో మాత్రం మూలవిరాట్టులనే ప్రతి సంవత్సరం రథయాత్రలో ఊరేగిస్తారు. దేవేరులతో కాకుండా తోడబుట్టిన వారితో కలిసి జగన్నాథస్వామి గుండీచా మందిరం వరకు వెళ్లి, తిరిగి రావడమే రథయాత్రలోని ముఖ్య ఉద్దేశ్యం. ఈ శనివారం జగన్నాథ రథయాత్ర సందర్భంగా...

image


జగన్నాథ రథయాత్రకు రెండు రోజులు ముందుగా అమావాస్య నాడు పూరీక్షేత్రంలో దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం  లభిస్తుంది. ఆషాఢ శుక్ల విదియనాడు ఉదయకాల పూజల తరువాత పెద్దపెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని పహండీ అంటారు. ఆ దశలో కులమత భేదాలకు తావుండదు. గుండీచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులవుతారు. పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే చెరా పహారా అంటారు.

రథ నిర్మాణం
జగన్నాథ రథయాత్రకు అరవై రోజుల ముందు, వైశాఖ బహుళ విదియనాడు పనులు మొదలవుతాయి. పూరీ మహారాజు పూజారుల్ని పిలిపించి, కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. మొత్తం 13 వేల ఘనపుటడుగుల కలపను జగన్నాథ రథాల నిర్మాణానికి వినియోగిస్తారు. ముందుగా వృక్ష కాండాల్ని 2,188 ముక్కలు చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు. జగన్నాథుడి రథం నందిఘోష. ఎత్తు సుమారు 46 అడుగులు, పదహారు చక్రాలుం టాయి. ఒక్కో చక్రం ఎత్తూ ఆరు అడుగులు. సారథి పేరు దారుక. బలభద్రుడి రథం తాళధ్వజం. సుభద్రాదేవి రథం దేవదళన్. నిర్మా ణం పూర్తయ్యాక రథాల్ని యాత్రకు ఒకరోజు ముందుగా...ఆలయ తూర్పు భాగంలోని సింహ ద్వారం దగ్గర నిలబెడతారు. లాగేందుకు అనువు గా ఒక్కో రథానికీ 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు.

ఘోషయాత్ర
జగన్నాథ స్వామిని పతితపావనుడు అంటారు. లక్షలాది భక్తులు రథయాత్రలో పాల్గొంటారు. జగన్నాథస్వామి ఆలయం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయం వరకు రథయాత్ర కొనసాగుతుంది. అందుకు 12 గంటల సమయం పడుతుంది. ఆనాటి రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూలవిరాట్టులకు విశ్రాంతినిస్తారు. మర్నాడు పొద్దున మేళతాళాలతో గుడిలోపలికి తీసుకువెళతారు. స్వామి అక్కడ ఏడురోజుల పాటు ఉంటాడు. ఐదోరోజున ఓ ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది. ఆలయంలోకి తనతోపాటూ తీసుకెళ్లలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి, గుండిచా గుడి బయటి నుంచే జగన్నాథుడిని ఓరకంట దర్శించి.. పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్లిపోతుంది. ఈ ముచ్చట అంతా అమ్మవారి పేరిట పూజారులే జరిపిస్తారు. ఆ రోజును హీరాపంచమి అంటారు. వారంపాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమినాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్ని బహుదాయాత్ర అంటారు . తరువాత రోజు ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో (సునావేష) అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. ద్వాదశినాడు మళ్లీ విగ్రహాలను రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది.రాహుకాల దీపం అంటే ఏమిటి?

Updated By ManamMon, 07/09/2018 - 23:08
  • దీనిని ఇంట్లో వెలిగించవచ్చా?

imageరాహుకాలం నిడివి రోజుమొత్తంలో తొంబై నిమిషాలు ఉంటుంది.  ఆ సమయంలో రాహుప్రీతి కోసం నిమ్మకాయను మధ్యకు తరిగి, రసం తీసివేయాలి. ఖాళీ అయిన నిమ్మకాయ డిప్పలో ఆవునేతితో లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. నిజానికి నవగ్రహాలలో అందరికీ ఈ దీపాలు ఇష్టమైనవే. ఎవరి ముందు దీపారాధన చేసినా అన్నీ శివప్రీతి కలిగిస్తాయి. ఈ నిమ్మకాయ దీపాలను కార్తిక, మార్గశిర మాసాల్లో వెలిగించడం మంచిది. అందులోనూ సోమవారం నాటి ఉదయం 7.30 నుంచి 9.00 గంటల మధ్య కాలంలో చేయడం వల్ల సమస్త దోషాలూ నశిస్తాయి.

 శుభసమయం లేనప్పుడు ఏదైనా పని ప్రారంభించవలసి వచ్చినా, ప్రయాణం చేయవలసి వచ్చినా నిమ్మకాయలో రాహుకాల దీపం వెలిగించడం వల్ల తలపెట్టిన విఘ్నాలు రావని, విజయం పొందుతారని రుద్రయామళ తంత్రం చెబుతోంది. అయితే తెలుగు సంప్రదాయంలో రాహుకాలానికి పట్టింపులేదు.

- డా. అన్నదానం చిదంబర శాస్త్రి, ఆధ్యాత్మిక వేత్తయాదాద్రీశుని బ్రహ్మోత్సవం

Updated By ManamTue, 02/20/2018 - 02:25

yadadri templeప్రతి సంవత్సరం ఫాల్గుణమాసంలో యాదాద్రి బ్రహ్మోత్సవ, వార్షిక కల్యాణోత్సవాలు జరుగుతాయి. గత శనివారం ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కాగా వచ్చే శనివారం నాడు యాదాద్రీశునికి కల్యాణం, మరునాడు రథోత్సవం జరుగనున్నాయి. వచ్చే మంగళవారం నాడు నిర్వహించే చక్రస్నానం, శతఘటాభిషేకాలలో వేలాదిగా భక్తులు పాల్గొంటారు.

యాదాద్రి నృసింహుడు జగద్రక్షకడు. శ్రీరాముని బావగారైన రుష్యశృంగ మహర్షిపుత్రుడే యాదమహర్షి. ఆయన తపస్సు ఫలితంగా యాదాద్రి ఏర్పడింది. యాదర్షి పేరుమీదుగా యాదగిరి, యాదాద్రి అని పిలుస్తారు. యాదర్షి కోరిక మేరకు నృసింహస్వామి ఇక్కడజ్వాలానరసింహ, ఉగ్రనరసింహ, లక్ష్మీనరసింహస్వామి, గండభేరుండనరసింహ రూపాలతో వెలిశాడు. పంచనృసింహులు ఒకే క్షేత్రంలో ఉండడం వల్ల యాదాద్రి పంచనృసింహ క్షేత్రమని పిలుస్తారు. స్కాంద, బ్రహ్మాండ పురాణాల ప్రకారం యాదాద్రికృతయుగం నాటి పరమ పవిత్ర క్షేత్రం. 

పంచనారసింహ క్షేత్రం
సర్వాంతర్యామి అయిన శ్రీమహా విష్ణువ ప్రహ్లాదుని కోరిyadadri templeక మేరకు స్తంభంలో ఉదయించి నారసింహనిగా విచ్చేశాడు. ప్రహ్లాదుని కోరిక మేరకు అనేక ప్రాంతాల్లో ఆయన వెలిశాడు. యాదాద్రిలోని గుహలో కృతయుగం నుంచి ఉండే వాడని చెబుతారు. ఆనాడు బ్రహ్మాది దేవతలు ఈ నృసింహస్వామిని ఆకాశగంగతో అభిషేకంచేశారు. ఆయన పవిత్ర పాద తీర్థమే విష్ణుకుండమై దివ్యధారగా యాదాద్రిలో నేటికీ భక్తులను పునీతులను చేస్తోంది.

యాదమహర్షి తపస్సు చేసుకునే కాలంలో ఒక సారి భయంకర ఆకృతిగల రాక్షసుడొకడు మహర్షిని కబళించడానికి రావడంతో భక్తరక్షణార్థం భగవానుడు శ్రీచక్రరాజాన్ని ప్రయోగిం చాడు. అది దివ్యమైన అగ్నిజ్వాలలతో మండి పడుతూ ఆరాక్షసుని శిరస్సును తెంచివేసింది. యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయగోపురం పైష ట్కోణ ఆకారంలో ఆవిర్భ వించాడు. యాదా ద్రి శిఖరంపై స్వామి సుదర్శ నాన్ని దర్శించుకు న్నంత మాత్రంలో రోగాలు తగ్గిపోతా యని భక్తులు విశ్వసిస్తారు. యుగ యుగాలుగా ఆరాధన లం దుకుంటున్న యాదగిరీశుని సరికొత్త ఆలయం అతి త్వరలో రూపొందబోతోంది.
అంగరంగ వైభవం

yadadri templeయాదాద్రిలోన వాహ్నిక దీక్షతో 11రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిసంవత్సరం ఫాల్గు ణశుద్ధవిదియ నుంచి ద్వాదశివరకూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలను అంకురారోపణతో మొదలయ్యాయి. ధ్వజారోహణం నుంచి శృంగారడోలోత్సవం వరకూ వివిధ కార్యక్రమా లు ఈ పదకొండు రోజుల్లో చోటుచేసుకుం టాయి. ఈ శుక్రవారంనాడు ఎదుర్కోలు మహోత్సవం, శనివారం తిరుకల్యాణ మహోత్సవం, వచ్చే ఆదివారం దివ్య విమాన రథోత్సవం ఉంటాయి. ప్రతిరోజూ వాహన సేవలుంటాయి. ఆలయనిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, స్వామి కల్యాణాన్ని భక్తులందరూ చూసి తరించేందుకు వీలుగా దేవస్థానం అన్ని ఏర్పాట్లుచేస్తోంది.శ్రద్ధయే భగవంతుడు

Updated By ManamTue, 02/20/2018 - 02:19

82వ సూత్రం  
 

గుణమాహాత్మ్యాసక్తి రూపాసక్తి పూజాసక్తి స్మరణాసక్తి దాస్యాసక్తి సఖ్యాసక్తి కాంతాసక్తి వాత్సల్యాసక్త్యాత్మ నివేదనాసక్తి తన్మయతాసక్తి పరమవిరహాసక్తి రూపా ఏకధాప్యేకా దశధా భవతి

imageభక్తి పదకొండు రకాలుగా ఉంటుందని నారదుడు తెలియచేస్తున్నాడు. వేర్వేరు ఆసక్తులతో భగవానుని పూజించే భక్తులు పదకొండు రకాలుగా ఉంటారు.1. గుణమాహాత్మ్యాసక్తికి చెందిన భక్తులలో వేదవ్యాసుడు, శుకుడు, భీష్ముడు వంటివారు ఉదాహరణ. వీరు భగవంతుని గుణమాహాత్మ్యాన్ని ప్రపంచానికి వెల్లడి చేస్తారు. 2. రూపాసక్తి విషయానికి వస్తే దండకారణ్యంలో శ్రీరాముని పుంసా మోహనరూపాయ అని శ్లాఘించిన మహర్షులను పేర్కొనవచ్చు. 3. పూజాసక్తిలో అంబరీషుని వంటి మహారాజులను చెప్పుకోవచ్చు. 4. స్మరణాసక్తితో ప్రహ్లాదుడు వంటివారు భగవంతుని సాక్షాత్కారం పొందారు. 5. దాస్యాసక్తికి హనుమంతుడు, అక్రూరుడు, విదురుడు ప్రతీకలు. 6. సఖ్యాసక్తికి అర్జునుడు, సుదాముడు తిరుగులేని ఉదాహరణలు. 7. కాంతాసక్త భక్తుల్లో రుక్మిణిది అగ్రతాంబూలం. 8. వాత్సల్యాసక్త భక్తి వల్లనే అదితి కశ్యపులు వామనునికి జన్మనిచ్చారు. కౌసల్యా దశరథులకు శ్రీరాముడు ఉదయించాడు. దేవకి, యశోదలు శ్రీకృష్ణుని కని, పెంచి ధన్యలయ్యారు. 9. ఆత్మనివేదనాసక్తిలో విభీషణుడు, శిబిచక్రవర్తి చెప్పుకోదగి నవారు. 10. తన్మయతాసక్తికి సంబంధించి సనక సనందాది జ్ఞానయోగులను ఉదహరించాలి. 11. పరమ విరహాసక్తిలో బృందావన గోపగోపీ జనానికి సాటిరారెవరూ.


83-84 సూత్రాలు
ఇత్యేవం వదంతి జనజల్ప నిర్భయా ఏకమతాః కుమారవ్యాస శుకశాండిల్య గర్గవిష్ణు కౌండిన్య శేషోద్ధవారుణి బలి హనుమద్విభీషాణాదయో భక్త్యా చార్యాః - య ఇదం నారదప్రోక్తం శివానుశాసనం విశ్వసితి శ్రద్ధత్తే స ప్రేష్ఠం లభతే స ప్రేష్ఠం లభత ఇతి
భక్తి తత్త్వప్రబోధకులైన ఆచార్యులు అనేకులు ఉన్నారు. నారదుడే కాకుండా ఆ ఆచార్యులందరూ భక్తియే శ్రేష్ఠమని చెప్పారు అని నారదుడు వారినందరినీ పేర్కొన్నాడు. నారదుడు చెప్పిన భక్తిసూత్రాలను ఒంట పట్టించుకున్నవాడు పరమాత్మను పొందుతాడని నారదుడు చెప్పాడు. శ్రద్ధ కలిగినవాడే ప్రియతముడైన భగవానుని పొందగలడని నారదమహర్షి జీవిత సాఫల్యాన్ని తెలియచేస్తూ తన సూత్రగ్రంథాన్ని పూర్తిచేశాడు.
- ముకుందప్రియధర్మ సందేహం

Updated By ManamTue, 02/20/2018 - 02:10

పదహారు ఫలాల నోములో ఏఏ పళ్లను వాయినం ఇవ్వాలి?  

fruitsఅరటి పండు తప్ప మిగిలిన పళ్లన్నీ పదహారు ఫలాల నోములో ఇవ్వవచ్చు. దేవుడికి నివేదన చేసే ఇతర పళ్లన్నీ పనికి వస్తాయి. యాపిల్, రేగు పళ్లు పనికిరావు. పురుగులు పట్టడానికి ఎక్కువ అవకాశం ఉన్నపళ్లు ఇవ్వకపోవడం మంచిది. సీడ్ లెస్ అంటే గింజ లేని పళ్లు పనికి రావు. గింజ వంశాభివృద్ధికి దోహదం చేస్తుందని మనవారి నమ్మిక. అందుకే నోముల్లో గింజలేని పండు ఇవ్వకూడదన్నారు. సీతాఫలం, సపోటా, పుచ్చకాయ వంటివి నల్లని గింజలతో ఉంటాయి కనుక వాటిని సాధారణంగా ఇవ్వరు. కొబ్బరి, మామిడి, నారింజ, దోస, ద్రాక్ష, దబ్బ, నిమ్మ, రామాఫలం, పనస, పంపర పనస, దానిమ్మ, మాదీఫలం, జామ, వెలగ, ఖర్జూరం, గుమ్మడి వంటివి పదహారు ఫలాల నోములో వినియోగించ వచ్చు. పండు ఏదైనా చక్కనిది కావాలి. పచ్చిది, పుచ్చిపోయినది, కుళ్లినది, దెబ్బతిన్నది, సరైన ఆకారం లేక కుక్క మూతి పిందెలాగా ఉన్నది ఉపయోగించ కూడదు అని పదహారు ఫలాల నోము కథ చెబుతోంది.                        
- డా. కాకునూరి సూర్యనారాయణమూర్తిదైవానికి కృతజ్ఞత

Updated By ManamMon, 01/22/2018 - 22:16

God, Bhakthi, Thanks for Good news పూర్వం ఇస్రాయిల్ సంతతిలో ఒక కుష్టురోగి, ఒక బట్టతలవాడు, ఒక అంధుడు ఉండేవారు. దేవుడు వారిని పరీక్షించదలిచి ఒక దైవదూతను పంపాడు. ఆ దైవదూత మొట్టమొదట కుష్టురోగి వద్దకు వెళ్లి, ‘నీకు అన్నింటికంటే ఎక్కువ ఇష్టమైన వస్తువేది?’ అని అడిగాడు. దానికా కుష్టురోగి, ‘అందమైన రంగు, చర్మం. ముందు ఈ వ్యాధిపోవాలి. దీని మూలంగానే జనం నన్ను అసహ్యించుకుంటున్నారు’ అన్నాడు. దైవదూత అతని శరీరాన్ని స్పృశించాడు. అతని రూపం అతడు కోరుకున్నట్లుగానే మారింది. తరువాత దైవదూత, ‘నీకెలాంటి సంపద అంటే ఇష్టం?’ అని అడిగాడు మళ్లీ. దానికా వ్యక్తి, ‘నాకు ఒంటెలంటే ఇష్టం అని అన్నాడు. వెంటనే అతనికి పదినెలల సూడి ఒంటెలు లభ్యమయ్యాయి. దైవదూత అతణ్ణి ఆశీర్వదిస్తూ, దేవుడు నీ పశుసంపదలో శుభాభివృద్ధులు ప్రసాదించుగాక!’ అన్నాడు. ఆ తరువాత అదే విధంగా దైవదూత బట్టతల వాడి కి  అందమైన శిరోజాలను, ఆవులను ప్రసాదించాడు. అంధుడికి కంటిచూపును, మేకలను ప్రసాదించాడు. దైవదూత ఇచ్చిన ఒంటెలు, ఆవులు, మేకలు ఈనిన తరువాత వారివద్ద మందలు మందలుగా పశుసంపద వృద్ధి చెందింది.

కొంతకాలం గడిచిపోయింది.
ఆ దైవదూత ఇదివరకటి లాగే మానవాకారంలో ఒకప్పటి కుష్టురోగి దగ్గరకు వచ్చి, ‘అయ్యా నేనొక పేదవాణ్ణి. ప్రయాణంలో నా సాధన సంపత్తి అంతా పోయింది. ఇప్పుడు నేను దేవుని దయ, నీ సహాయం లేకుండా ఇంటికి చేరుకోలేను. నీకు అందమైన దేహం, రూపం, సిరిసంపదలు ప్రసాదించిన దేవుని పేరుతో అర్ధిస్తున్నాను. నాకొక ఒంటెను దానం చెయ్యి. దాని మీదెక్కి నేను ఇంటికి చేరుకుంటాను’ అన్నాడు. గత జీవితాన్ని పూర్తిగా విస్మరించి అర్ధంతరంగా అబ్బిన సంపదతో మతె్తక్కిన ఆ ఒంటెలవాడు, ‘ప్రస్తుతం నా బాధ్యతలు, ఖర్చులు బాగా పెరిగిపోయాయి. నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను’ అన్నాడు. దైవదూత ఆ మాటలు విని, ‘బహుశా నేను నిన్ను గుర్తు పట్టాననుకుంటా. నీవు గతంలో కుష్టురోగిగా ఉండేవాడివి కదూ? దానివల్ల జనం నిన్ను అసహ్యించుకునేవారు. నువ్వు పేదవాడిగా ఉంటే, దేవుడు నీకు ఈ సంపద ప్రసాదించాడు. ఔనా’ అని అడిగాడు.
అందుకా కుష్టురోగి అంగీకరించకుండా, ‘ఈ సంపదంతా నాకు వారసత్వంగా వచ్చింద’ని సమాధానమిచ్చాడు. దైవదూత అతని మాటలు ఆలకించి, ‘నువ్వు చెప్పింది అబద్ధమయితే దేవుడు నిన్ను పూర్వస్థితికి తెచ్చుగాక!’ అని శపించి వెళ్లిపోయాడు.  

ఒంటెల యజమాని కాస్తా మళ్లీ కుష్టువ్యాధి గ్రస్తుడయ్యాడు. అదేవిధమైన సమాధానమిచ్చిన ఆవుల యజమాని కూడా మళ్లీ బట్టతలవాడైపోయాడు. అక్కడినుంచి దైవదూత పేదవానిలా అంధుని వద్దకు వెళ్లి సాయం అడిగాడు. దానికా అంధుడు సమాధానమిస్తూ, ‘నేను అంధునిగా ఉన్నప్పుడు దేవుడు నాకు దృష్టినిచ్చాడు. నన్ను ధనికుని చేశాడు. నేనాయన పట్ల కృతజ్ఞతతో అల్లాహ్ పేరుతో ఙస్తున్నాను. నా ఆస్తిలో నీవు కోరుకున్నది తీసుకునే అధికారం నీకిస్తున్నాను’ అన్నాడు. అందుకు సంతోషించిన దైవదూత ‘ఇదొక పరీక్ష మాత్రమే. నీలాగే నిరుపేదలుగా, అనేక కష్టాలు పడుతూ ఉన్నప్పుడు దైవం చేసిన సహాయాన్ని మరిచిపోయిన నీ సహచరులిద్దరూ దైవానుగ్రహానికి గురయ్యారు. నీవు దైవం పట్ల కృతజ్ఞత చెల్లించడం నా మనసుకు ఆనందాన్నిచ్చింది. నీ సంపద వల్ల నీకు సకల శుభాలూ చేకూరుగాక!’ అని ఆశీర్వదించాడు. 
- మూలం : మహాప్రవక్త మహితోక్తులు

Related News