train

35 లెవల్ క్రాసింగ్స్‌లో ఆగి.. సాగే బండి!

Updated By ManamWed, 07/11/2018 - 23:35
  • గేటు వేసి.. తీసేందుకు రైల్లోనే ఇద్దరు

  • తమిళనాడులో చికుబుకు రైలుకు గేటు చిక్కులు!

trainతిరుచిరాపల్లి: ‘‘చికుబుకు రైలు వస్తోంది.. ఆగిన తర్వాత ఎక్కండి’’... ఇది చిన్నప్పుడు అందరూ పాడుకునే ఉంటారు!! కానీ తమిళనాడులో ఇది కొంచెం భిన్నంగా చెప్పుకొంటున్నారు. ‘‘చికుబుకు రైలు వస్తుంది.. లెవల్ క్రాసింగ్‌లో ఆగీ.. ఆగీ.. సాగేనూ.. ముందే చూసుకు గేటు దాటండీ!!’’ అని జనం నవ్వులాటగా పాడుతున్నారు. ఎందుకా అనుకుంటున్నారా? దక్షిణ రైల్వే పరిధిలోని తిరుచురాపల్లి డివిజన్‌లో కరైకూడి - పట్టుకొట్టాయ్ మధ్య నడిచే రైలుకు ఇలా ప్రతి లెవల్ క్రాసింగ్ వద్ద బ్రేకులు పడిపోతున్నాయ్ కాబట్టే!! గత నెల 30వ తేదీనే ఈ మార్గంలో బై వీక్లీ (సోమవారం, గురువారం) రైలును ప్రారంభించారు. ఈ ఒక్క రైలు మాత్రమే ఆ మార్గంలో ప్రయాణిస్తుంది. దీనికి మొదటి స్టేషన్ నుంచి గమ్యం చేరేలోపు మొత్తం 7 స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఇది ఆగేది మాత్రం 42 చోట్ల!! దీనికి కారణం ఆ మార్గంలోని కాపలా లేని లెవల్ క్రాసింగ్ గేట్లే. అది గమ్యం చేరేలోపు 35 గేట్లు ఉన్నాయి. వాటన్నింటిలో సిబ్బందిని పెట్టాలంటే కనీసం 70 మంది అవసరమవుతారని దక్షిణ రైల్వే అధికారులు వినూత్న ఆలోచన ఆలోచన చేశారు. రైలు ఇంజన్‌లో ఒక ఉద్యోగిని.. చివరి బోగీలో మరోకరిని పెట్టింది. లెవల్ క్రాసింగ్‌కు కొద్ది మీటర్ల దూరంలోనే ఆ రైలు ఆగిపోతోంది. వెంటనే ముందున్న వ్యక్తి వెళ్లి గేటును మూసి మళ్లీ రైలు ఎక్కేస్తాడు. అలాగే గేటు దాటగానే వెనుకున్న వ్యక్తి గేటు తెరిచి వస్తాడు. ఇలా ఇద్దరు సిబ్బందితోనే రైల్వే పని కానించేస్తోంది. దీంతో కేవలం 72 కిలోమీటర్ల ప్రయాణానికి మూడున్నర గంటల సమయం పడుతోంది. అయితే తిరుచిరాపల్లి డివిజన్ రైల్వే మేనేజర్ ఉదయ్ రెడ్డి మాత్రం ఇంతకు మించి మరో ప్రత్యామ్నాయం లేదని, ఒకే ఒక్క రైలు కోసం లెవల్ క్రాసింగ్‌ల వద్దే భారీ సంఖ్యలో సిబ్బంది అంటే కష్టమని చెబుతున్నారు. త్వరలో మరో మార్గంలోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నామని వెల్లడించారు. విరుధాచలం - కుడలోర్ (58 కిలోమీటర్ల మార్గం) మధ్య మూడే రైళ్లు నడుస్తున్నాయని, ఆ రూట్‌లో 62 లెవల్ క్రాసింగ్‌లు ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే ఈ విధానాన్ని దక్షిణ రైల్వే ఉద్యోగ సంఘం ఉపాధ్యక్షుడు ఆర్ ఎలంగోవన్ తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. రైలు ప్రయాణం మరింత ఆలస్యం కావడంతో పాటు భద్రతకు కూడా నీళ్లు వదలడవేునని మండిపడ్డారు. పెరిగిన రైలు బీమా

Updated By ManamSat, 07/07/2018 - 22:58
  • ఐ.ఆర్.సి.టి.సి రూ. 28 కోట్ల ప్రీమియం చెల్లించగా, 

  • 2018 ఆర్థిక సంవత్సరంలో రైలు ప్రమాద బాధితులకు.. రూ. 3.5 కోట్ల బీమా మొత్తం లభించింది

trainన్యూఢిల్లీ: రైలు ప్రమాదాల సంఖ్య 2016-17తో పోలిస్తే, 2017-18లో తగ్గినప్పటికీ 2017-2018 ఆర్థిక సంవత్సరంలో రైలు ప్రమాద బాధితులకు బీమా చెల్లింపులు ఐదు రెట్లు పెరిగాయి. ఈ వింత పరిణామానికి కారణం ఉంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐ.ఆర్.సి.టి.సి) ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు ఉచిత బీమా రక్షణను వర్తింపజేసింది. ఈ సదుపాయం 2016 డిసెంబర్ నుంచి ప్రారంభమైంది. కేంద్రం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టారు. రైలు ప్రమాదాలు లేదా ఇతర సంఘటనల్లో గాయపడినవారు లేదా చనిపోయినవారి కుటుంబీకులు ఉచిత బీమా సౌకర్యం వల్ల 2017-18 ఆర్థిక సంవత్సరంలో బీమా కంపెనీల నుంచి రూ. 3.5 కోట్లు అందుకున్నారు. అలా అందిన మొత్తం 2016-17లో రూ. 75.5 లక్షల కోట్లుగానే ఉందని అధికార వర్గాల డాటా సూచిస్తోంది. ఈ ఐచ్ఛిక ప్రయాణ బీమా పథకాన్ని మూడు (రాయల్ సుందరం జనరల్ ఇన్స్యూరెన్స్, శ్రీరామ్ జనరల్ ఇన్స్యూరెన్స్, ఐ.సి.ఐ.సి.ఐ లాంబార్డ్ జనరల్ ఇన్స్యూరెన్స్) కంపెనీలు నిర్వహిస్తున్నాయి. 2016 సెప్టెంబర్-డిసెంబర్‌ల మధ్య ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో రూపాయి చెల్లించి రూ. 10 లక్షల రూపాయల వరకు బీమా పొందే అవకాశం కల్పించారు. అయితే, ప్రయాణికుల్లో అత్యధికులు ఈ ఐచ్ఛిక బీ మా పథకాన్ని ఎంచుకోలేదు. ఈ పథకం 2016 సెప్టెంబర్‌లో, అంటే 2016-17 ఆర్థిక సంవత్సరం మధ్యలో ప్రారంభమైన వాస్తవం కూడా బీమా మొత్తం తక్కువగా ఉండడానికి ఒక కారణం. ఈ బీమా పథకాన్ని 2016 డిసెంబర్ నుంచి అన్ని ఇ-టికెట్లపైన ఉచితంగా అందుబాటులో ఉంచారు. అందుకయ్యే ప్రీమియంను ఐ.ఆర్.సి.టి.సియే చెల్లించేందుకు ముందుకొచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ‘‘పర్యవసాన ప్రమాదాల’’ సంఖ్య తగ్గింది. చనిపోయినవారి, గాయపడినవారి సంఖ్య కూడా తగ్గింది. 2016-17లో 103 ప్రమాదాలు సంభవిస్తే, 2017-18లో 72 రైలు ప్రమాదాలు సంభవించాయి. చనిపోయిన, గాయపడిన వారి సంఖ్య కూడా 607 నుంచి 254కు తగ్గింది. ఉచిత బీమా వల్ల ప్రయాణికులకు చెల్లింపులు పెరగడమే కాదు, బీమా సంస్థలకు ప్రీమియం చెల్లింపు మొత్తం కూడా పెరిగింది. 

పెరిగిన ప్రీమియం
2017 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.15 కోట్లుగా ఉన్న ప్రీమియం చెల్లింపు మూడు రెట్లు వృద్ధి చెంది 2018 ఆర్థిక సంవత్సరంలో రూ. 28 కోట్లకు చేరింది. ఐ.ఆర్.సి.టి.సి 2016 సెప్టెంబర్ నుంచి 2018 ఏప్రిల్ మధ్యలో ప్రయాణికులకు ప్రీమియంగా రూ. 37.15 కోట్లు చెల్లించింది. ప్రయాణికులు మొత్తం చెల్లింపులో సుమారు 7 శాతం అంటే రూ. 2.55 కోట్లు చెల్లించారు. ప్రమాదాలు తగ్గడం, అధిక బీమా ప్రీమియం చెల్లింపు కలసి, 2018 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో ప్రయాణికునికి ప్రీమియం లెక్కేసినప్పుడు తగ్గినట్లు కనిపిస్తోంది. ఐ.ఆర్.సి.టి.సి ఇప్పుడు జి.ఎస్.టితో కలిపి బీమా ప్రీమియంగా ఒక్కో ప్రయాణికునికి 68 పైసలు చెల్లిస్తోంది. ప్రయాణికులకు స్నేహపూర్వకమైన ఈ చర్య ఐ.ఆర్.సి.టి.సికి మటుకు ఖర్చును పెంచుతోంది. 2016 నవంబర్‌లో చేపట్టిన డిజిటలీకరణ చొరవ దాన్ని రెండు విధాలుగా దెబ్బతీసింది. అది ఒకపక్క ఇ-టికెట్లపై సర్వీసు చార్జి ఆదాయాలను కోల్పోయింది. మరోపక్క రానురాను ఎక్కువ మంది ప్రయాణికులకు బీమా ప్రీమియం చెల్లించవలసి వస్తోంది. ఆన్‌లైన్‌లో బుక్ అవుతున్న మొత్తం టికెట్లలో సుమారు 65 శాతం భాగానికి అది ప్రీమియం చెల్లిస్తోంది. రైల్వే‌‌స్టేషన్‌‌లో 409 నక్షత్ర తాబేళ్ల పట్టివేత

Updated By ManamTue, 02/20/2018 - 19:02

409 Star tortoise seized, And Two Women arrested in Vijayawadaవిజయవాడ: జిల్లాలోని స్థానికంగా ఉండే రైల్వే స్టేషన్‌లో నక్షత్ర తాబేళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో పెద్దఎత్తున నక్షత్ర తాబేళ్లు స్వాధీనం చేసుకుని వాటిని తరలించే వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళల బ్యాగుల్లో 409 నక్షత్ర తాబేళ్లను అధికారులు గుర్తించారు. ఇద్దర్నీ విచారించగా కదిరి నుంచి భువనేశ్వర్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. మహిళలపై కేసునమోదు చేసిన పోలీసులు, తాబేళ్లను అటవీరేంజ్ అధికారులకు అప్పగించారు. కాగా ఈ నక్షత్రాలు ఎక్కడ్నుంచి వచ్చాయి? ఎక్కడ పట్టుకొచ్చారు? ఈ వ్యవహారం వెనుక ఉన్న ముఠా ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.రైలులో రాత్రివేళ హీరోయిన్‌కు వేధింపులు

Updated By ManamThu, 02/01/2018 - 19:14

sanushaతిరువనంతపురం: బంగారం సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించిన సనుష గుర్తుండే ఉంటుంది. ఓంకార్ దర్శకత్వం వహించిన జీనియస్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సనుష ఆ తర్వాత తెలుగు తెరకు దూరమయింది. మల్లూవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఈ యువనటి రైలులో ప్రయాణిస్తుండగా చేదు అనుభవం ఎదురైంది. కన్నూరు నుంచి తిరువనంతపురంనకు బుధవారం రాత్రి సనుష బయల్దేరింది. రైలులో ప్రయాణిస్తున్న ఆమెతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. తాను రైలులో నిద్రిస్తుండగా.. తన పెదాలను ఎవరో ముట్టుకున్నట్లు అనిపించిందని, ఉలిక్కిపడి నిద్రలేచానని ఆమె చెప్పింది. తన పై బెర్త్‌పై ఉన్న వ్యక్తి అని తెలుసుకుని.. చేయి అంతే పట్టుకుని లైట్ వేశానని సనుష తెలిపింది. తనను వేధిస్తున్నాడని తోటి ప్రయాణికులతో చెప్పుకున్నానని, కానీ ఏ ఒక్కరు సహాయం చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసు వచ్చి అతనిని అదుపులోకి తీసుకుళ్లే వరకూ తాను ఇబ్బంది పడినట్లు ఆమె చెప్పింది. చాలామంది సోషల్ మీడియాలో మాత్రమే అండగా ఉంటామని పోస్ట్‌లు పెడతారని, కానీ నిజజీవితంలో ఏ ఒక్కరూ సహాయం చేయరని సనుష తన అసంతృప్తిని వెళ్లగక్కింది. సనుష ఫిర్యాదుతో కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కన్యాకుమారికి చెందిన 40ఏళ్ల వ్యక్తి సనుషను వేధించినట్లు పోలీసులు తేల్చారు.రైలు టికెట్లకూ రాయితీలు!

Updated By ManamMon, 12/18/2017 - 20:15

train, tickts, bounsన్యూఢిల్లీ: ఎయిర్‌లైన్స్ తరహాలో రైలు టికెట్‌పై డిస్కౌంట్ అందించేందుకు రైల్వే శాఖ సమాయత్తమవుతోంది. డైనమిక్ ఫేర్ విధానంలో డిస్కౌంట్ ఇచ్చే అంశంపై ప్రస్తుతం రైల్వేశాఖ అధ్యయనం చేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇక్కడ జరిగిన మేధోమథన సదస్సులో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎయిర్‌లైన్స్ తరహాలో రైల్వే టికెట్లపై రాయితీ ఇచ్చే అంశంపై అధ్యయనం చేస్తున్నాం’ అని గోయల్ తెలిపారు. ఫ్లెక్సీ ఫేర్ విధానంలో ధరలు ఎక్కువగానే ఎందుకు ఉండాలి అని ఆయన ప్రశ్నించారు. ‘చివరి నిమిషంలో బుక్ చేసుకున్నప్పటికీ విమానాలు, హోటళ్లలో డిస్కౌంట్ అందిస్తున్నారు. తక్కువ ఆక్యుపెన్సీ కలిగిన మార్గాల్లో డిస్కౌంట్లు అందిస్తాం’ అని గోయల్ చెప్పారు. ప్రస్తుతం రైల్వే బోర్డు ఛైర్మన్‌గా ఉన్న అశ్వనీ లోహానీ కూడా విమానయాన సంస్థ ఎయిరిండియా నుంచి వచ్చిన వారేనని, దీనిపై ఆయన కూడా అధ్యయనం చేస్తున్నారని మంత్రి వివరించారు.

2018లో ప్రయాణికుల భద్రతపైనే ప్రముఖంగా దృష్టి సారించనున్నట్లు గోయల్ తెలిపారు. ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు రైళ్లలో సీసీటీవీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీసీటీవీలను అనుసంధానం చేసేందుకు అన్ని రైల్వేస్టేషన్లలోనూ వైఫై సదుపాయాన్ని కల్పించబోతున్నామని తెలిపారు. రైల్వేల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి రైళ్లను కేవలం అరగంటలో శుభ్రపరిచి తదుపరి ప్రయాణానికి సిద్ధం చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రైల్వేల్లో సమయ పాలన, భద్రత తదితర అంశాలపై చర్చించారు.16నుంచి రైళ్ల రద్దు, దారి మళ్లింపు: డీసీఎం అశోక్ రావు

Updated By ManamWed, 11/08/2017 - 09:32

train, cancelation of trains in vizag, vishaka express, gouhathi expressవిశాఖపట్టణం: ఈ నెల 16 నుంచి ఖరగ్ పూర్ రైల్వేస్టేషన్ వద్ద ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ , యార్డు నిర్మాణ మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి 20 వరకు విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు, కొన్ని రైళ్ల షెడ్యూల్ మార్చినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం అశోక్ రావు తెలిపారు.  
16న (12664)తిరుచరాపల్లి -హౌరా ఎక్స్ప్రెస్
(22808)చెన్నై సెంట్రల్- సంత్రాగచ్చి ఎక్స్ప్రెస్
(22613) హల్దియా ఎక్స్ప్రెస్
17న (22873) విశాఖ ఎక్స్ప్రెస్, (18005) జగదల్ పూర్ సమలేశ్వరి ఎక్స్ప్రెస్
(07149) గౌహతి స్పెషల్ ఎక్స్ప్రెస్
(22807) చెన్నై సెంట్రల్ ఎక్స్ ప్రెస్ లను షెడ్యూల్ మార్చి నడపనున్నట్లు తెలిపారు.మరో 48 రైళ్లకు ‘సూపర్‌ఫాస్ట్’ బాదుడు

Updated By ManamMon, 11/06/2017 - 18:09

Railwayతన ఆదాయాన్ని పెంచుకునేందుకు రైల్వే శాఖ అడ్డమైన దారులన్నీ తొక్కుతోంది. తాజాగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం ద్వారా మరో 48 రైళ్లలో ప్రయాణం మరింత ప్రియం కానుంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ రైళ్లుగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఈ రైళ్లలో ఛార్జీలు పెంచారు. కేవలం గంటకు ఐదు కిలోమీటర్ల వేగాన్ని పెంచడం ద్వారా మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ రైళ్లుగా అప్‌గ్రేడ్ చేసి, ప్రయాణీలపై అదనపు భారం మోపుతున్నారు. 

మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్‌ఫాస్ట్ రైళ్లుగా అప్‌గ్రేడ్ చేసినా...సదరు రైలు సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుతుందని గ్యారెంటీ లేదు. ఇప్పటికే పొగమంచు కారణంగా ఉత్తరాదిలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పుడు సూపర్‌ఫాస్ట్ రైళ్లుగా అప్‌గ్రేడ్ అయిన రైళ్లలో ఛార్జీలు ఎక్కువగా చెల్లించి మరీ...ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది. 

సూపర్ ఫాస్ట్ రైళ్లుగా అప్‌గ్రేడ్ కావడంతో స్లీపర్ క్లాస్‌లో ప్రయాణానికి అదనంగా రూ.30లు, సెకండ్ క్లాస్ ఏసీలో రూ.45లు, ఫస్ట్ క్లాస్ ఏసీలో రూ.75లు చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా రైల్వే శాఖ దాదాపు రూ.70 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోనుంది. ఇప్పుడు అప్‌గ్రేడ్ అయిన 48 సూపర్ ఫాస్ట్ రైళ్లను కలుపుకుని, దేశంలోని మొత్తం సూపర్ ఫాస్ట్ రైళ్ల సంఖ్య 1,072కు చేరుకుంది. ‘బంగారం’ లాంటి రైళ్లు

Updated By ManamMon, 11/06/2017 - 14:12
  • రైల్వే స్వర్ణ్ ప్రాజెక్టు.. శతాబ్ది, రాజధాని ఆధునికీకరణ.. 30 రైళ్లలో 25 కోట్ల బడ్జెట్‌తో మెరుగైన సౌకర్యాలు

  • స్వర్ణ సౌకర్యాలు అందుకోబోతున్న తొలి రైలు కాఠ్‌గోదాం శతాబ్ది.. ఆకర్షణ, పరిశుభ్రత, ఉల్లాసమే ప్రధానం

train image representationalన్యూఢిల్లీ, నవంబరు 6: రైల్వే ‘బంగారు’ సొబగులు అద్దుకుంటోంది. టాయిలెట్ల నుంచి వైఫై దాకా రైళ్లు ఇక ఆధునికీకరణ దిశగా దూసుకుపోతున్నాయి. అయితే, అన్ని రైళ్లకు కాదు సుమా! ప్రీమియం క్లాస్ రైళ్లు అయిన శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లలోనే ఆ ‘బంగారు’ మార్పులు కనిపించనున్నాయి. ఇప్పటిదాకా రైళ్లంటే ఆలస్యానికి, అపరిశుభ్రతకు, అసౌకర్యానికి మారుపేరుగానే ఉండేవి. ఆ పరిస్థితిని మార్చేందుకు రైల్వే ‘స్వర్ణ్’ అనే ప్రాజెక్టును చేపట్టింది. ఆ ప్రాజెక్టులో భాగంగా 15 శతాబ్ది, 15 రాజధాని రైళ్లలో మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు సంకల్పించింది. సురేశ్ ప్రభు రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రూ.25 కోట్ల బడ్జెట్‌తో 30 రైళ్లను ఈ విధంగా ఆధునికీకరించేందుకు స్వర్ణ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా ప్రయాణికుల భద్రతకు సీసీటీవీల ఏర్పాటు సహా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బందినీ పెంచబోతున్నారు. అంతేగాకుండా కాఠ్‌గోదాం శతాబ్దిని పూర్తిగా రూపురేఖలు మార్చేందుకు ఉత్తర రైల్వే నడుం బిగించింది. ఆకర్షణ (కనువిందు చేసే రూపు), పరిశుభ్రత, ఉల్లాసం వంటి మూడు అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. బోగీ లోపల పూర్తిగా వినైల్ పాలిమర్లతో నిర్మించనున్నారు. చూడగానే ఆకర్షణీయంగా కనిపించేందుకు బోగీ ఆవల యాంటీ గ్రఫిటీ కోటింగ్ వేస్తారు. టాయిలెట్లలో డస్ట్‌బిన్ల ఏర్పాటు, వ్యక్తిగత సీట్ కవర్లు, దుర్గంధం వస్తే దానికంతట అదే సుగంధం వెదజల్లేలా చేసే వ్యవస్థ, పరిశుభ్రత నియంత్రణ వ్యవస్థలు తదితర సౌకర్యాలను ఆయా రైళ్లలో కల్పించనున్నారు. ఇక, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లలో వాడి పారేసే తలగడల కవర్లను ఇస్తారు. ప్రయాణికులు ఉల్లాసభరితంగా గడపడం కోసం హెచ్‌డీ స్ట్రీమింగ్‌కు వైఫై హాట్‌స్పాట్లను ఏర్పాటు చేయనున్నారు. కాగా, రైల్వేకి సంబంధించినంత వరకు ఇదే తొలి స్వర్ణ రైలు అని, రైల్వే కల్పిస్తున్న సౌకర్యాలను తెలుసుకుని సహకరించాలని రైల్వే సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.  రైలు నడుపుతూ మూర్ఛతో కిందకు పడిపోయిన డ్రైవర్

Updated By ManamTue, 10/03/2017 - 19:34

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత్తాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. రైలు నడుపుతున్న డ్రైవర్‌కు మూర్ఛ వచ్చింది. దీంతో ఆ డ్రైవర్ కదులుతున్న రైలులో నుంచి కిందకు పడిపోయాడు. అయితే ఈలోపు డ్రైవర్ చాకచక్యంగా డెడ్‌మ్యాన్స్ స్విచ్ ఆన్ చేయడంతో రైలు ఆగిపోయింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ డెడ్‌మ్యాన్స్ స్విచ్‌ను నొక్కితే రైలు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ప్రయాణికులకు చైన్ ఎలాగో, డ్రైవర్‌‌కు ఈ స్విచ్ అలా అని చెప్పవచ్చు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించకపోయి ఉంటే పెను ప్రమాదం సంభవించేది. ఈ ఘటన వల్ల రెండు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కోల్‌కత్తాకు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న దైన్హట్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ రైలు హౌరా స్టేషన్ నుంచి కత్వాకు వెళ్లాల్సి ఉంది. రైలు డ్రైవర్ హల్దర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఉన్నట్టుండి రైలు ఆగిపోవడంతో ప్రయాణికులకు ఏం అర్థం కాలేదు. సిగ్నల్ పడి ఉంటుందని ప్రయాణికులు భావించారు. కానీ బోగీలోని కొందరు ప్రయాణికులు డ్రైవర్‌ను గమనించి.. సెక్యూరిటీ సిబ్బందికి సమాచారమందించారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హల్దర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. రైలు హౌరా స్టేషన్ నుంచి బయల్దేరిన సమయంలో హల్దర్ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. హల్దర్‌కు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ తరహా ఘటనలు జరగడం ఇవాళ కొత్తేమీ కాదు. గత జులైలో యూపీ సోనాపూర్ లోకల్ ట్రైన్ పట్టాల పైనుంచి పక్కనున్న ప్లాట్‌ఫాం స్లాబ్‌పైకి వెళ్లింది. వెంటనే అప్రమత్తమవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పని ఒత్తిడి కారణంగానే ఈ ఘటన జరిగినట్లు విచారణలో తేలింది.ఆన్‌లైన్‌లో రైల్వే రిజర్వేషన్లకు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ డెబిట్ కార్డులు చెల్లవు

Updated By ManamSun, 09/24/2017 - 19:36

న్యూఢిల్లీ: డెబిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్ రైల్వే టికెట్ల బుకింగ్ విధానాన్ని రైల్వే శాఖ మరింత కఠినతరం చేసింది. పలు బ్యాంకులను డెబిట్ కార్డ్ పేమెంట్ గేట్‌వే నుంచి తొలగించింది. ఇందులో ఎస్‌బీఐ, ఐసీఐసీపై బ్యాంకులు కూడా ఉండటం గమనార్హం. ఆయా బ్యాంకులు వినియోగదారుల నుంచి వసూలు చేసే కన్వీనియన్స్ ఫీజులో వాటా ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే అధికారులు తెలిపారు.

సాధారణంగా ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించినందుకు గాను ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ రూ.20 మేర కన్వీనియన్స్ ఫీజు వసూలు చేసేది. అయితే, పెద్ద నోట్ల రద్దు తరవాత ఈ ఫీజు తీసుకోవటం లేదు. అయితే బ్యాంకులు వసూలు చేస్తున్న కన్వీనియన్స్ ఫీజులో తమకూ కొంత వాటా దక్కుతుందని భావించినా అవి నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Related News