tollywood

విమర్శలు తప్పడం లేదు

Updated By ManamSun, 11/18/2018 - 06:17

సినిమా తారలు తమ గ్లామర్‌ని కాపాడుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా హీరోయిన్లు ఎప్పటికప్పుడు తమ అందాలకు మెరుగులు దిద్దుకునే పనిలోనే ఉంటారు. ఈమధ్యకాలంలో బరువు తగ్గడం, పెరగడం చాలా సులువు అయిపోవడంతో హీరోయిన్లు సన్నబడేందుకు, జీరో సైజ్ తెచ్చుకునేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. అసలు విషయానికి వస్తే బొద్దుగా అసలైన తెలుగమ్మాయిలా ఉండే అంజలి కూడా అందరు హీరోయిన్ల బాటలోనే వెళ్తోంది.

a


ఈమధ్య కాస్త బరువు పెరగడంతో ఎంతో కష్టపడి 13 కిలోలు బరువు తగ్గి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె జీరో సైజ్ స్టిల్ చూసిన అభిమానులు ఆమెను అభినందించకపోగా విమర్శలు గుప్పిస్తున్నారు. సన్నబడిన అంజలిలో అప్పటి కళ లేదని, బొద్దుగా ఉంటేనే ముద్దుగా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో అంజలి ఎలా స్పందిస్తుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. యదార్థ ఘటనల ఆధారంగా..

Updated By ManamSun, 11/18/2018 - 05:49

సినిమా హాల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై అహితేజ బెల్లంకొండ, సురేష్‌వర్మ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘అక్షర’. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినీరంగ ప్రముఖులు, ఆత్మీయుల మద్య ఆహ్లాదంగా ప్రారంభమైంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ ఫేమ్ నందితాశ్వేత ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాకి క్లాప్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇవ్వగా, కెమెరా స్విచాన్ ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘరామ కృష్ణంరాజు చేసారు.

a


తొలి సన్నివేశానికి సుధీర్‌వర్మ దర్శకత్వం వహించారు. యంగ్ హీరోస్ కార్తీకేయ, విజయ్ రాహుల్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల స్క్రిప్ట్‌ని నిర్మాతలు, సురేష్ వర్మ, అహితేజ బెల్లంకొండకు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హీరోయిన్ నందితాశ్వేత మాట్లాడుతూ ‘‘కథ వినగానే ఎగ్జయిట్ అయ్యాను. నిర్మాతలు సురేష్‌వర్మ, అహితేజల కొత్త ఆలోచనలు నన్ను ఇంప్రెస్ చేసాయి. ఈ పాత్రకు నన్ను ఎంచుకున్నందుకు దర్శకుడు చిన్నికృష్ణగారికి చాలా థ్యాంక్స్’’ అన్నారు.

a


దర్శకుడు బి.చిన్నికృష్ణ మాట్లాడుతూ ‘‘ఈ కథను నమ్మి నాకు దర్శకుడుగా అవకాశం ఇచ్చిన నిర్మాతలు సురేష్, అహితేజలకు థ్యాంక్స్’’ అన్నారు. నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ ‘‘సినిమా కాన్సెప్ట్‌ని ఒక టీజర్‌గా రిలీజ్ చేసాం. దానికి మంచి స్పందన వచ్చింది. ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ వాస్తవాలను కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసుకున్నాం’’ అన్నారు. మరో నిర్మాత సురేష్ వర్మ మాట్లాడుతూ ‘‘సినిమా ప్రారంభం ముందే మా కాన్సెప్ట్‌ని ప్రేక్షకులకు అందించాలని కాన్సెప్ట్ టీజర్‌ని ప్లాన్ చేసాం. ఆ టీజర్ ఇండస్ట్రీ లోనూ, ఆడియన్స్‌లోనూ ‘అక్షర’ మీద స్పెషల్ ఇంట్రెస్ట్‌ని కలిగించింది’’ అన్నారు.రవితేజ అభిమాని ‘కొంటె కుర్రాడు’ 

Updated By ManamSun, 11/18/2018 - 02:09

aశ్రీరామరక్ష ఫిలిమ్స్, స్మైలింగ్ డ్రీమ్స్ సంస్థలు సంయుక్తంగా సాగర్ యమ్ యన్ వి, వెన్నెల విహర్ హీరో  హీరోయిన్లుగా,  సాగర్ యమ్ యన్ వి దర్శకత్వంలో ఏనుగుతల దేవదాసు, సైధూల్ బాథరాజ్ (సిద్దు) నిర్మిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘కొంటె కుర్రాడు’. ఓ లోఫర్ గాడి ప్రేమ కథ ట్యాగ్ లైన్. ఇటీవలే రాజ్ కందుకూరి ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించారు. హీరో రవితేజ అమర్ అక్బర్ ఆంటోని చిత్రం విడుదల సందర్భంగా ఓ ప్రత్యేక పాటను ఈ చిత్ర యూనిట్ రవితేజకు డెడికేట్ చేశారు.

ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మా హీరో, దర్శకుడు సాగర్  రవితేజకి వీరాభిమాని. శుక్రవారం రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా విడుదల సందర్భంగా మా చిత్ర సంగీత దర్శకుడు  యస్ ఏ అరమాన్ రచించిన, ప్రముఖ గాయకుడు రాంకి ఆలపించిన ఒక స్పెషల్ సాంగ్‌ని మాస్ మహా రాజ్‌కి డెడికేట్ చేస్తూ, కూకట్‌పల్లి వసంతనగర్‌లో అరుణ ప్రియ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వృద్ధుల మధ్య విడుదల చేశాం. సాగర్  ఈ సినిమాని చాలా బాగా తీర్చిదిద్దుతున్నారు. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తాం’’ అన్నారు. మాస్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తీస్తొన్న ఈ సినిమాలో తాను రవితేజగారి అభిమానిగా కనిపిస్తానని, సస్పెన్స్ లవ్‌తో ఎవరూ ఊహించని విధంగా క్లైమాక్స్ ఉంటుందని,  మరో హీరోయిన్ నెక్స్‌ట్ షెడ్యూల్‌లో జాయిన్ అవుతుందని హీరో, దర్శకుడు సాగర్ తెలిపారు. రామ్‌చరణ్ ఆట.. పాట

Updated By ManamSat, 11/17/2018 - 01:37

ramరామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్‌కి వస్తున్న రెస్పాన్స్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసిందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ సాంగ్‌ను ప్రముఖ హీరోయిన్‌తో చేద్దామని భావించిన చిత్ర యూనిట్ చివరి క్షణంలో మనసు మార్చుకుంది.

నవంబర్ 19 నుంచి రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ చేస్తున్న భారీ మల్టీస్టారర్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ సాంగ్‌ను హీరో రామ్‌చరణ్, హీరోయిన్ కియారా అద్వానీలతోనే చేద్దామని డిసైడ్ అయ్యారు. ‘మామ మియా..’ అంటూ సాగే ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో శోభి మాస్టర్ నేతృత్వంలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.నటన ఆడియో ఆవిష్కరణ

Updated By ManamWed, 11/14/2018 - 00:13

imageభవిరిశెట్టి వీరాంజనేయులు, రాజ్యలక్ష్మీ సమర్పణ.. గురుచరణ్ నిర్మాణ సారథ్యంలో కుభేర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై మహిధర్, శ్రావ్యారావు హీరో హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘నటన’. భారతీబాబు పెనుపాత్రుని దర్శకత్వంలో కుభేర ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభు ప్రవీణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. శివాజీరాజా, భానుచందర్ ఆడియో సీడీలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు భారతీబాబు పెనుపాత్రుని మాట్లాడుతూ ‘‘నిర్మాత ప్రసాద్‌గారికి కథ చెప్పాను. ఆయన నచ్చింది. నన్నే డైరెక్ట్ చేయమన్నారు. అలా నేను డైరెక్టర్ అయ్యాను. లీడ్ క్యారెక్టర్స్ కోసం వెతుకుతున్నప్పుడు నిర్మాతగారే భానుచందర్‌గారి పేరును సజెస్ట్ చేశారు. మేం ఆయన్ని కలవగానే ఆయన సినిమా చేయడానికి అంగీకరించినందుకు థాంక్స్’’ అన్నారు.

నిర్మాత కుభేర ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా గురించి విడుదల తర్వాత ప్రేక్షకులు మాట్లాడితే బావుంటుందని నా అభిప్రాయం. సినిమాలో నాలుగు పాటలు అద్భుతంగా వచ్చాయి. సినిమా తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు. ఎం.ఎం.శ్రీలేఖ మాట్లాడుతూ ‘‘సినిమాలో ఓ సాంగ్‌ను కంపోజ్ చేసి పాట పాడాను. మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.

భానుచందర్ మాట్లాడు తూ  ‘‘చాలా కాలం తర్వాత తెలుగులో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఎం.ఎం.శ్రీలేఖగారు పాటను చక్కగా పాడారు. సినిమాకు ఆ పాట హైలైట్ అవుతుంది. మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్ భారతీబాబు ఈ సినిమాను అద్భుతంగా మలిచారు. ప్రసాద్‌గారు సినిమాను చక్కగా నిర్మించారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కాశీవిశ్వనాథ్, గురుచరణ్, రఘు, హీరో మహిధర్, హీరోయిన్ శ్రావ్యారావు తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ‘ఏడ తానున్నాడో’ ఫస్ట్ లుక్ 

Updated By ManamFri, 11/09/2018 - 23:43

imageఅభిరామ్, కోమలి ప్రసాద్ జంటగా నటిస్తున్న ‘ఏడ తానున్నాడో’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి విడుదల చేసారు.. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దొండపాటి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.. చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తుండగా ఎ.శ్రీకాంత్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. తనిష్క మల్టీ విజన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గుజ్జ యుగంధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.యన్.టి.ఆర్‌లో స్వీటీ

Updated By ManamFri, 11/09/2018 - 03:14

imageదివంగత మాజీ ముఖ్య మంత్రి ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో జనవరి 9న ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ విడుదలవుతుంటే జనవరి 24న ‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ విడుదలవుతుంది. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ వేల్యూ రోజు రోజుకీ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ వరుసలో అనుష్క కూడా చేరింది. ఎన్టీఆర్‌తో నటించిన పలువురు హీరోయిన్స్ పాత్రల్లో నేటి తరం కథానాయికలు రకుల్ ప్రీత్ సింగ్, షాలిని పాండే తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో స్వీటీ అనుష్క కూడా చేరనుందని సమాచారం. వివరాల్లోకెళ్తే.. స్వర్గీయ ఎన్టీఆర్‌తో అప్పట్లో బి.సరోజా దేవి కలిసి నటించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు బయోపిక్ పార్ట్ వన్‌లో బి.సరోజా దేవి పాత్రలో అనుష్క నటించనుంది. త్వరలోనే అనుష్క షూటింగ్‌లో పాల్గొంటుంది. దానికి బాలయ్య ఒప్పుకుంటారా?

Updated By ManamSun, 10/28/2018 - 08:33

imageనందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’, ‘యన్.టి.ఆర్ మహానాయకుడు’. ఈ చిత్రానికి రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. బాలీవుడ్ నటీనటులతోపాటు కొంతమంది తెలుగు హీరోలు కూడా నటిస్తు న్నారు. జనవరిలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. దీంతో దర్శకుడు క్రిష్ సినిమా ప్రమోషన్‌ను పెంచారు. యన్.టి.రామారావు బయోపిక్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌తో వాయిస్ ఓవర్ చెప్పించాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ విషయాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్ళారు క్రిష్. అయితే బాలయ్య ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే సినిమాకి బాగా ప్లస్ అవుతుందనేది యూనిట్ ఆలోచన. ఈ చిత్రంలో విద్యాబాలన్, రానా, కల్యాణ్ రామ్, మంజిమమోహన్, సచిన్ ఖేడేకర్, జిస్సేన్ గుప్తా తదితరులు నటిస్తున్నారు. జనవరి 9న ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ జనవరి 24న ‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ విడుదల కానున్నాయి.రెండింటికీ తేడా ఉంది

Updated By ManamWed, 10/24/2018 - 00:01

imageనేను చైల్డ్ ఆర్టిస్ట్‌గా హిందీ సినిమాల్లో నటించాను. చదువు ముఖ్యమని భావించి గ్యాప్ తీసుకుని మాస్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. తర్వాత హిందీ సీరియల్స్‌లో నటించాను. తెలుగులో మాత్రం అనుకోకుండానే అవకాశం వచ్చింది. కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను’’ అన్నారు చాందిని భగ్వనాని. ఈమె కథానాయికగా నటించిన చిత్రం ‘రథం’. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో రాజ్ ధారపనేని నిర్మించారు. ఈ నెల 26న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చాందినీ మాట్లాడుతూ ‘‘సీరియల్స్.. సినిమాల్లో పనిచేయడం చాలా తేడా ఉంటుంది.

అయితే ఓ నటిగా ప్రతి ప్లాట్‌ఫాంను ఎంజాయ్ చేస్తున్నాను. ‘రథం’ కంప్లీట్ లవ్ స్టోరీ. డాక్టర్ కోర్సు చదివే అమ్మాయి పాత్రలో కనపడతాను. డాన్స్ అంటే కూడా ఈ అమ్మాయికి ఇష్టం. బాధ్యత లేకుండా ఉండే ఒక తండ్రిని చూసి తన తల్లి పడే ఇబ్బందుల వల్ల ఆ అమ్మాయికి మగవాళ్ళంటే అంత సాఫ్ట్ కార్నర్ ఉండదు. దాంతో తన జీవితంలో వేరే మగవాడు ఎంటర్ అయితే జీవితం ఏ విధంగా మారుతుందో అని భయపడుతూ ఉంటుంది. ఇలాంటి పాత్ర చేయడాన్ని ఎంజాయ్ చేశాను. తెలుగు విషయంలో నాకు టీమ్ సపోర్ట్ దొరికింది. డైలాగ్స్ హిందీలో రాసుకుని చదివి యాక్ట్ చేశాను. హిందీలో డబ్ అయిన తెలుగు సినిమాలను చూస్తుంటాను. హీరోల్లో నాని, నాగచైతన్యలంటే ఇష్టం. సమంత, రకుల్, పూజాహెగ్డే ఇష్టమైన హీరోయిన్స్. ప్రస్తుతం తెలుగులో ‘దిక్సూచి’ నటించాను. అవకాశాల కోసం వెయిటింగ్’’ అన్నారు.  
 బెల్లంకొండ హీరోతో...

Updated By ManamWed, 10/24/2018 - 00:01

imageఅభిషేక్ అగర్వాల్, అనీల్ సుంకర కాంబినే షన్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తేజ దర్శకుడు. కాజల్ అగర్వాల్, మన్నార్ చోప్రా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజాగా బెల్లం కొండ సాయి శ్రీనివాస్‌తో అభిషేక్ అగర్వాల్ సిని మా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి రమేశ్ వర్మ దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రీకరణంతా విదేశాల్లోనే జరుగుతుంది. ఈ చిత్రాన్ని టాప్ టెక్నీషియన్స్‌తో నిర్మించడానికి చర్చలు జరుపుతున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించబోయే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.
 

Related News