censor board

‘సాక్ష్యం’కు సెన్సార్ ఇబ్బందులు

Updated By ManamSat, 07/21/2018 - 12:59

Saakshaym బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా శ్రీవాస్ తెరకెక్కించిన చిత్రం ‘సాక్ష్యం’. ఈ నెల 27న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ నేపథ్యంలో సెన్సార్ సర్టిఫికేట్‌ కోసం సభ్యుల ముందుకు చిత్రాన్ని తీసుకెళ్లింది చిత్ర యూనిట్. అయితే సెన్సార్ సభ్యులు మాత్రం సినిమాను సెన్సార్ ఇచ్చేందుకు నిరాకరించారట.

కథానుగుణంగా ఈ చిత్రంలో కొన్ని బ్రతికిఉన్న పక్షులు, జంతువులను వాడారట. అయితే అందుకు సంబంధించిన అనుమతులు(ఎన్‌ఓసీలు) తీసుకోలేదట. దీంతో సెన్సార్ చేసేందుకు అధికారులు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడిప్పుడు ఎన్‌ఓసీలు తీసుకురావడం కష్టంతో చాలా కష్టంతో కూడుకున్న పని. దీంతో ఈ మూవీ మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.



షకీల చిత్రానికి సెన్సార్ నో.. రిక్వెస్ట్ చేసిన ‘శీలవతి’

Updated By ManamWed, 06/13/2018 - 14:46

Shakilaషకీల ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘శీలవతి’. కొన్ని కారణాల వలన చాలా రోజులుగా వాయిదా పడుస్తూ వస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ మూవీకి సెన్సార్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. సినిమా పేరు మార్చాలంటూ సెన్సార్ చేయకుండానే వారు వెనక్కి పంపారు. పేరు మార్చితే కాని సినిమాకు సెన్సార్ చేయమని వారు చెప్పారు. దీంతో షకీల ఆవేదన వ్యక్తం చేసింది.

సినిమా చూడకుండానే టైటిల్ మార్చమని చెప్పడం కరెక్ట్ కాదని, శీలవతి పేరుతో చాలా వరకు ప్రమోషన్ చేశామని, ఇలాంటి పరిస్థితుల్లో టైటిల్‌ను మార్చలేం అంటూ ఓ వీడియోను విడుదల చేసింది. ఇప్పటికే సినిమా విడుదల ఆలస్యం అయ్యిందని, దీనిపై సెన్సార్ సభ్యులు ఆలోచించాలని ఆమె కోరింది. మరి ఆమె అభ్యర్థనపై సెన్సార్ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా ఈ చిత్రం షకీలకు 250వ చిత్రం కావడం విశేషం.



సెన్సార్ బోర్డు ఆఫీస్ వద్ద హై సెక్యూరిటీ

Updated By ManamFri, 01/12/2018 - 13:09
padmavat

ముంబైలోని సెన్సార్ బోర్డు కార్యాలయం ఎదుట అదనపు భద్రతా బలగాలను మోహరించారు. సంజయ్ లీలా బన్సాలీ వివాదాస్పద చిత్రం ‘పద్మావత్’కు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వడం పట్ల కర్ణిసేన మండిపడుతోంది. దీనికి నిరసనగా సెన్సార్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు కర్ణిసేన ప్రకటించింది. దీంతో అక్కడ అదనపు బలగాలను మోహరించారు. ఆందోళన చేపట్టేందుకు సెన్సార్ బోర్డు కార్యాలయం వద్దకు చేరుకున్న ఆందోళనకారులను అరెస్టు చేశారు. ‘పద్మావత్’ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వడం పట్ల నిరసనకారులు మండిపడుతున్నారు. సెన్సార్ బోర్డుకు, పద్మావత్ చిత్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్రిటీషు కాలంలో ఏర్పడిన సెన్సార్ బోర్డుకు ఎలా పనిచేయాలో తెలియదంటూ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ ధ్వజమెత్తారు. సెన్సార్ బోర్డు ఛైర్మన్ పదవికి ప్రసూన్ జోషి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాదిన్నర కాలంగా తాము శాంతియుత పంథాలో నిరసన తెలియజేస్తున్నామని, ఇక మరో ఆందోళన బాటను ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోందన్నారు. 





Related News