england

ఇంగ్లాండ్ గెలుపు

Updated By ManamMon, 11/19/2018 - 00:54
  • శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్

imageశ్రీలంక: సొంతగడ్డపై శ్రీలంక జట్టుకి వరుసగా రెండో టెస్టులోనూ ఇంగ్లాండ్ చేతిలో పరాజయం ఎదురైంది. దీంతో మరో టెస్టు మ్యాచ్ ఉండగానే ఇంగ్లాండ్ జట్టు 2-0తో టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. ఆదివారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో 301 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక జట్టు అనూహ్యంగా 243 పరుగులకే కుప్పకూలిపోయింది. శనివారం ఒకానొక దశలో 220/5తో అలవోకగా గెలిచేలా కనిపించిన లంకేయులు.. మాథ్యూస్ (88) వికెట్ చేజారడంతో ఒత్తిడిలో పడ్డారు. ఒక ఎండ్‌లో డిక్వెల్లా (35) నిలకడగా ఆడినా.. పెరీరా (2), అఖిల ధనంజయ (8 నాటౌట్), లక్ష్మల్ (0), పుష్ప కుమార (1) ఆశించిన మేర ఆడలేకపోయారు. దీంతో శ్రీలంకకి ఇంగ్లాండ్ చేతిలో 57 పరుగుల తేడాతో వరుసగా రెండో ఓటమి తప్పలేదు. తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 211 పరుగుల తేడాతో గెలుపొందగా.. నామమాత్రమైన మూడో టెస్టు మ్యాచ్ శుక్రవారం ప్రారంభంకానుంది. గత బుధవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకి ఆలౌటైంది. అనంతరం శ్రీలంక టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేసి 46 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జో రూట్ (124) శతకం బాదడంతో అనూహ్యంగా ఇంగ్లాండ్ 346 పరుగులు చేయగలిగింది. దీంతో 301 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన లంక 243 పరుగులకే కుప్పకూలిపోయింది. మ్యాచ్‌లో కీలక శతకం బాదిన జో రూట్‌కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. 



ఇంగ్లాండ్ విజయం

Updated By ManamWed, 11/14/2018 - 00:58
  • ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్

englandగ్రాస్‌ఇస్‌లెట్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 7 వికెట్లతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్ బౌలింగ్ ధాటికి 9 వికెట్లకు 76 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటింగ్‌లో ఆయేషా రహ్మన్ (39) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇంగ్లాండ్ బౌలింగ్‌లో జోర్డాన్ 3 కీలక వికెట్లు దక్కించుకుంది. అనంతరం వర్షం కారణంగా ఇంగ్లాండ్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 64 పరుగులు కుదించారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 9.3 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో జాన్స్ (28 నాటౌట్) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా... బంగ్లాను బౌలింగ్‌లో దెబ్బకొట్టిన జోర్డాన్ వుమెన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అందుకుంది. 

లంక ఓటమి...
ఇక్కడ జరిగిన మరో మ్యాచ్‌లో సౌతాఫ్రికా మహిళల జట్టు చేతిలో శ్రీలంక జట్టు ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 99 పరుగులు చేసింది. తర్వాత 100 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు 18.3 ఓవర్లలో 3 వికెట్లకు లక్ష్యాన్ని చేధించింది. సఫారీ జట్లో కాప్ (38), కెప్టెన్ వాన్ నీకెర్‌క్ (33 నాటౌట్), ప్రిజ్ (16 నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించారు.



శ్రీలంక రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దు

Updated By ManamWed, 10/31/2018 - 01:59
  • ఇంగ్లాండ్ క్రికెటర్లకు బోర్డు హెచ్చరిక

englandకొలంబో: శ్రీలంకలో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు (ఈసీబీ) హెచ్చరికలు జారీ చేసింది. శ్రీలంక రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పుల్లో ఇంగ్లాండ్ క్రికెటర్లు ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని ఆ దేశ బోర్డు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ‘మేము విజిలెన్స్ చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీల సమావే శాలకు దూరంగా ఉంటున్నాం. మేము ఇక్కడ జరిగే రాజకీయ పరిస్థితులు గురించి తెలుసుకున్నాం’ అని ఇంగ్లాండ్ ప్రతినిధి డానీ రూబెన్ తెలిపారు. ఇప్పటీకే తీవ్ర ఉద్రిక్తతలు... సంక్షోభం నడుమ శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్సే సోమవారం బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. శ్రీలంకలో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టు లంకతో మొదటి టెస్టు గాలెలో నవంబర్ 6న ఆడనుంది. అయితే నవంబర్ 27న లంకతో ఇంగ్లాండ్ చివరి టెస్టు ముగియునుంది. అప్పటీవరకు ఇంగ్లాండ్ జట్టు లంకలోనే ఉండాలి. ఇప్పటీకే వన్డే సిరీస్, టీ20 సిరీస్ నెగ్గిన ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో కూడా విజయం సాధించాలని చూస్తోంది.



టీమిండియా విజయలక్ష్యం 245..

Updated By ManamSun, 09/02/2018 - 16:26

4th Test, India tour, Ireland, England, Southamptonసౌతాంప్టన్‌: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న నాల్గో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 271 పరుగుల వద్ద ఆలౌటైంది. 260/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆదివారం నాల్గో రోజు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. రెండో ఇ‍న్నింగ్స్‌లో 11 పరుగులు మాత్రమే చేసింది. వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. బ్రాడ్‌ డకౌట్‌ కాగా, కరాన్‌(46) రనౌట్‌గా పెవిలియన్ బాట పట్టారు.

తద్వారా భారత్‌కు 245 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 273 పరుగులు చేయగా, ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. నాల్గో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ మహ్మద్‌ షమీ నాలుగు వికెట్లు సాధించాడు. షమీ వేసిన 92 ఓవర్‌ ఆఖరి బంతికి స్టువర్ట్‌ బ్రాడ్‌ చేతులేత్తేశాడు. 



మూడో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం

Updated By ManamWed, 08/22/2018 - 16:13

Indiaనాంటింగ్‌హోమ్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. గత రెండు మ్యాచ్‌లో విఫలమై విమర్శల పాలైన టీమిండియా.. మూడో టెస్ట్‌లో 203 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఐదో రోజు ఆట ప్రారంభమైన పది నిమిషాల్లోనే టెస్ట్‌ను ముగించారు భారత ఆటగాళ్లు. ఈ గెలుపులో ఐదు వికెట్లు తీసి బుమ్రా కీలక పాత్ర పోషించగా.. ఇషాంత్ 2, అశ్విన్, షమీ, పాండ్యా తలో వికెట్‌ను తీశారు. దీంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఇంగ్లండ్ ముందంజలో ఉంది. కాగా 2007 తరువాత ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌ గెలవడం ఇదే తొలిసారి.



చిత్తుగా ఓడిన టీమిండియా

Updated By ManamSun, 08/12/2018 - 23:01
  • 159 పరుగులతో ఇన్నింగ్స్ ఓటమి.. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు 

imageలండన్: ఇంగ్లాండ్-భారత్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 159 పరుగులతో ఇన్నింగ్స్ ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి  107 పరుగులకే కుప్పకూలిన భారత్ జట్టు రెండో ఇన్నింగ్ ్సలో 130 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 357/6తో నాల్గొ రోజు ఆటని ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు  మొదటి ఇన్నింగ్స్‌లో 88.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 396 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది. అప్పటీకే ఇంగ్లాండ్ జట్టు 289 పరుగుల అధిక్యంలో ఉంది.  ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ అజేయంగా 137 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరో ప్లేయర్ బెయిర్‌స్టో 93 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. టీమిండియా బౌలింగ్‌లో షమీ 3 కీలక వికెట్లు ద క్కించుకున్నాడు.

షమీతో పాటు మరో బౌలర్ పాండ్య మూడు వికెట్లు తీశాడు. మొదటి టెస్టులో రాణించిన ఇషాంత్ శర్మ కేవలం ఒక వికెట్ మాత్రమే తీసి నిరాశపరిచాడు. వన్డేల్లో ఇంగ్లాండ్ బ్యాట్‌వెున్‌కు చుక్కలు చూపెట్టిన కుల్‌దీప్ యాదవ్ టెస్టులో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అ నంతరం బ్యాటింగ్ దిగిన భారత్ ఓపెనర్లు మురళీ విజయ్, కెఎల్ రాహుల్‌తో టీమిండియా పతనం మొదైలెంది. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినా విజయ్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా పరుగులు నమోదు చేయుకుండానే అండర్సన్ బౌలింగ్‌లో కీపర్ బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ 0 పరుగుల కే ఒక వికెట్ కోల్పోయింది. త ర్వాత బ్యాటింగ్‌కు వచ్చి న పుజారాతో కలిసి మరో ఓ పెనర్ రాహుల్ ధీటుగా ఆడే ప్ర యత్నం చేశాడు. 6.1 ఓవర్‌లో అండర్సన్ అద్భుతైమెన బంతి వేసి రాహుల్ (10)ని కూడా పెవిలియున్‌కి పంపాడు. క్రీజులోకి వచ్చిన రహానేతో కలిసి పుజారా ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు

. మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో  అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. అప్పటీకి భారత్ 17/ 2తో ఉంది. లంచ్ తర్వాత బ్యా టిం గ్‌కి వచ్చిన భారత్ జట్టు  18.5 ఓవర్‌లో రహానే (13) బ్రాడ్ బౌ లింగ్‌లో జెన్నింగ్స్‌కి క్యాచ్ ఔటయ్యాడు. దీంతో భారత్ 35 పరుగులకే 3 కీలక వికెట్లు నష్టపోయింది. అనంతరం బ్యాటిం గ్‌కి దిగిన కెప్టెన్ కోహ్లీ, పుజారాతో కలిసి మరో వికెట్ పడకుండా ఆడే ప్రయత్నం చేశాడు. ఒకనొక దశలో నిలకడగా ఆడుతున్న పుజారా (17) బ్రాడ్ బౌలింగ్‌లో 50 పరుగుల వద్ద క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం కోహ్లీ (17), దినేష్ కార్తీక్ (0) బ్రాడ్ బౌలింగ్ పెవిలియన్ చేరారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేయడంతో టీమిండియా 130 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 2-0తో ముందంజలో ఉంది.



తొలిటెస్టులో భారత్ పరాజయం

Updated By ManamSat, 08/04/2018 - 17:36
  • లక్ష్య ఛేదనలో 162 పరుగులకే కోహ్లీసేన ఆలౌట్

  • బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు.. 1-0తో ఆధిక్యంలో ఇంగ్లండ్ 

1st Test, India tour of Ireland, England, Birminghamబర్మింగ్‌హోమ్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 194 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన కోహ్లీసేన.. రెండో ఇన్నింగ్స్‌లో 54.2 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయి పరాజయం పాలైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మినహా ఏ ఒక్కరూ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో టీమిండియా తొలి టెస్టులో పరాజయాన్ని మూటగట్టుకుంది. దాంతో ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌ను 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు మురళీ విజయ్ (6) ఎల్బీడబ్ల్యూగా చేతులేత్తేయగా, శిఖర్ ధావన్ (13) పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన కేఎల్ రాహుల్ కూడా (13) బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. బరిలోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (93 బంతుల్లో 4 ఫోర్లు; 51) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 

విరాట్ ఒంటరి పోరాటం.. 
తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన విరాట్ రెండో ఇన్నింగ్స్‌లో ఒంటరి పోరాటం కొనసాగింది. ఇంగ్లండ్ బౌలర్ల బంతులను చిత్తు చేసి బౌండరీలు దాటించిన కోహ్లీ.. ఒకదశలో ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేయడంతో బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మిగతా బ్యాట్స్‌మన్లలో హార్దీక్ పాండ్యా (33) మినహా అందరూ పేలవ ప్రదర్శనతో స్వల్ప స్కోరుకే ఒకరితరువాత మరొకరు పెవిలియన్ బాటపట్టారు. ఇంగ్లండ్ బౌలర్లు సొంతగడ్డపై విజృంభించి తొలిటెస్టులో భారత్‌ పతనాన్ని శాసించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ ఒక్కడే ఏకంగా నాలుగు వికెట్లు తీసుకోగా, ఆండర్సన్, జే బోర్డు చెరో రెండు వికెట్లు, కరన్, రషీద్ తలో వికెట్ తీసుకున్నారు.

తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకు ఆలౌట్ కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకే ఆలౌటైంది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ 180 పరుగులకు ఆలౌటై పర్యాటక జట్టు భారత్‌కు సవాల్ విసిరింది. 



287 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆలౌట్

Updated By ManamThu, 08/02/2018 - 16:24

India vs englandబర్గింగ్ హామ్: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా ఇంగ్లండ్‌ మొదటి ఇన‍్నింగ్స్‌లో 287 పరుగుల వద్ద ఆలౌటైంది. 285/9 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లండ్‌.. రెండు పరుగులు మాత్రమే చేసి చివరి వికెట్‌ను కోల్పోయింది. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆఖరి వికెట్‌ను మహ్మద్‌ షమీ సాధించాడు. ఇక భారత బౌలర్లలో అశ్విన్‌ నాలుగు వికెట్లు సాధించగా, షమీ మూడు వికెట్లతో మెరిశాడు. ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మలకు తలో వికెట్‌ దక్కింది. ప్రస్తుతం భారత ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తున్నారు.



టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

Updated By ManamWed, 08/01/2018 - 15:24
team india

లండన్ : టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచింది. దీంతో కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా జట్టులో ఓ మార్పు జరిగింది. చటేశ్వర పుజారాకు రెస్ట్ లభించింది. కాగా టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

అయితే టీమిండియా ఇంట్లోనే పులి, బయట పిల్లి అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీని చెరిపేసుకోవాలని కోహ్లీ సేన ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు ఇంగ్లాండ్‌కు ఇది 1000వ టెస్టు కావడంతో ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. 

టీమిండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్,  అజింక్య రహానే, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్, కరుణ్ నాయర్, హార్దిక్ పాండ్య, ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా. 

ఇంగ్లాండ్: జో రూట్ (కెప్టెన్), అలస్టైర్ కుక్, కీటన్ జెన్నింగ్స్, జాన్నీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, డేవిడ్ మలన్, మొయీన్ అలీ, ఆదిల్ రషీద్, జమీ పోర్టర్, సామ్ కుర్రన్, జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్. 



భార‌త్ గెల‌వ‌కపోతేనే ఆశ్చ‌ర్యం!

Updated By ManamWed, 08/01/2018 - 15:01

kohliఇంగ్లండ్‌తో బుధ‌వారం నుంచి మొద‌లైన టెస్టు సిరీస్‌లో భార‌త్ గెల‌వ‌క‌పోతేనే ఆశ్చ‌ర్య‌పోవాల్సి వ‌స్తుంద‌ని.. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండ‌ర్ షేన్ వాట్స‌న్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఓపెనింగ్ నుంచి తుది వ‌ర‌కు భార‌త జ‌ట్టులో స్థానం కోసం తీవ్ర‌మైన పోటీనెల‌కొంద‌ని. అద్భుత‌మైన సామ‌ర్థ్య‌మున్న ఆట‌గాళ్లు కూడా రిజ‌ర్వ్ బెంచ్‌లో వేచి చూడాల్సి వ‌స్తోంద‌న్నాడు. ఈ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జ‌ట్ల‌లో క‌నిపించ‌డం లేద‌న్నాడు. ఇలాంటి సామ‌ర్థ్య‌మున్న జ‌ట్టుదే ఎప్ప‌టికీ విజ‌య‌మని వ్య‌క్తిగ‌త ప‌నుల‌పై భార‌త్ ప‌ర్య‌ట‌నకు వ‌చ్చిన సంద‌ర్భంగా వాట్స‌న్ పేర్కొన్నాడు. 

‘ఇంగ్లండ్ కొంత‌కాలంగా వ‌న్డేల్లో దూసుకుపోతున్న‌ప్ప‌టికీ.. టెస్టు సిరీస్‌ల‌లో స‌రైన స‌త్తా చూలేదు. ఇది విరాట్ కోహ్లీ, భార‌త జ‌ట్టుకు గొప్ప సిరీస్ కాబోతోంద‌ని నేను భావిస్తున్నాను. ఈ సిరీస్‌లో భార‌త్ గెలిస్తే.. నేను ఆశ్చ‌ర్య‌పోలేను. ఇంగ్లండ్‌లో రాణించేందుకు అవ‌స‌ర‌మైన నైపుణ్యం భార‌త జ‌ట్టులో పుష్క‌లంగా ఉన్నాయి.

భారత జట్టుకు శిఖర్ ధావన్, చటేశ్వర్ పుజారా, మురళీ విజయ్, కేెఎల్ రాహుల్ వంటి వారు ఓపెనింగ్, వన్‌డౌన్ స్థానాల కోసం తీవ్రంగా పోటీప‌డుతున్నారు. వీరంతా అద్భుత‌మైన సామ‌ర్థ్య‌మున్న ఆట‌గాళ్లే.అందుకే భార‌త్ ఓడిపోతేనే ఆశ్చ‌ర్య‌పోవాల్సి వ‌స్తుంది’ అని వాట్సన్ పేర్కొన్నాడు. భార‌త ప‌ర్య‌ట‌నుకు వ‌చ్చిన వాట్స‌న్ ఈ ఏడాది చెన్నైసూప‌ర్ కింగ్స్ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. 

కాగా తొలి వన్డేలో టాస్ గెలిచిన  ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.





Related News