ysrcp

వైఎస్సార్ సీపీలో తెగని ‘సెంట్రల్’ రగడ

Updated By ManamThu, 09/20/2018 - 15:58
  • వంగవీటి రాధాతో వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి భేటీ

vangaveeti radha

విజయవాడ : బెజవాడ ‘సెంట్రల్’ సీటుపై పట్టుబట్టి... అలకబూనిన వంగవీటి రాధాను బుజ్జగించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. సెంట్రల్ సీటుపై ఇటు పార్టీ కానీ, అటు వంగవీటి రాధా కానీ మెట్టు దిగటం లేదు. దీంతో సయోధ్య కుదిర్చేందుకు అధిష్టానం దూతగా ఆ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి రంగంలోకి దిగారు. ఆయన గురువారం వంగవీటి రాధాతో భేటీ అయ్యారు.

విజయవాడ సెంట్రల్ సీటు మార్పు, తూర్పు నియోజకవర్గంలో పోటీ చేయమనడానికి గల కారణాలను పార్థసారధి ఈ సందర్భంగా వంగవీటి రాధాకు వివరించినట్లు సమాచారం. అయితే వంగవీటి రాధా మాత్రం బెజవాడ్ సెంట్రల్ సీటు విషయంలో తనకు రెండో ఆలోచన లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రాధాకు పార్థసారధి సూచించినట్లు భోగట్టా.ఇంతటి దారుణమైన నివేదిక వస్తుందనుకోలేదు

Updated By ManamWed, 09/19/2018 - 15:21

Vasireddy Padmaఅమరావతి: మూడేళ్ల తరువాత ఇంతటి ధౌర్భాగ్యమైన వివేదిక వస్తుందనుకోలేదని సోమయాజులు రిపోర్ట్‌పై వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చంద్రబాబు ఏ వ్యవస్థ నైనా ఎలా ప్రలోభ పెట్టగలరో ఈ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుందని ఆమె అన్నారు. పుష్కర స్నానంకు ముహూర్తం ఫిక్స్ చేసింది చంద్రబాబునే అయితే ఆయనను కాపాడే విధంగా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇక ఆ రోజు తొక్కిసలాట జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ మీడియాతో చెప్పారని.. ఇన్ని ఆధారాలు ఉన్నా చంద్రబాబుకి ఎలాంటి సంబంధం లేదని రిపోర్ట్ ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. కేవలం ప్రచార యావ కోసమే చంద్రబాబు 30 మందిని హత్య చేశారని, కానీ ప్రజలకు ఉన్న పిచ్చి నమ్మకమే ఆ తొక్కిసలాటకు కారణమని సోమయాజులు కమిషన్ అనడం అర్ధరహితమని ఆమె ఫైర్ అయ్యారు. ప్రజల డబ్బుతో పనిచేస్తున్న కమిషన్ నిజాయితీగా రిపోర్ట్ ఇవ్వాలి కానీ.. ఇలా ఇవ్వకూడదంటూ ఆమె మండిపడ్డారు.వైఎస్సార్ సీపీకి అందరూ కావాలి...

Updated By ManamWed, 09/19/2018 - 15:02
malladi vishnu-jagan

విజయవాడ : వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ... మల్లాది విష్ణు ధన్యవాదాలు తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ... ‘ఈ నెల 22వ తేదీ నుంచి ‘రావాలి జగన్ కావాలి జగన్’ క్యాంపెయిన్ ప్రారంభించబోతున్నాం.

రాష్ట్రంలో వైఎస్సార్ పాలన రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. కో ఆర్డినేటర్‌గా ఉన్నా లేకపోయినా పార్టీ సిద్ధాంతానికి లోబడి నడుచుకుంటా. వైఎస్సార్ సీపీకి అందరూ కావాలి. అందరికీ న్యాయం చేసేందుకు పార్టీ సిద్ధంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో పార్టీలో అందరిని కలుపుకుని ముందుకు వెళతా. నాపై ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా పాజిటివ్‌గా తీసుకుంటా.’ అని తెలిపారు.బెజవాడ ‘సెంట్రల్’పై స్పందించిన వైఎస్సార్ సీపీ

Updated By ManamTue, 09/18/2018 - 16:00
  • పార్టీలో వంగవీటి రాధాకి అన్యాయం జరగదు

  • వంగవీటి కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ దూరం చేసుకోదు

ambati rambabu

విజయవాడ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు స్పందించింది. వంగవీటి కుటుంబానికి వైఎస్సార్ సీపీలో అన్యాయం జరగదని, తగిన గౌరవం గుర్తింపు ఉంటాయని స్పష్టం చేసింది. వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మంగళవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ...‘ వంగవీటి రాధాకి అన్యాయం చేయాలి అన్న ఆలోచన మా పార్టీకి లేదు. ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గెలిచారు.

అక్కడే ఆయన గెలుస్తారు అని అధిష్టానం భావించింది. లేదా మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి ఆప్షన్ ఇచ్చింది. మా పార్టీ అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంది. రంగా అభిమానులు పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలి. గెలుపు, ఓటముల లెక్క ప్రకారమే సీట్ల కేటాయింపు జరిగింది’ అని అన్నారు. కాగా విజయవాడ సెంట్రల్ సీటుకు సంబంధించి గతంలోనే యలమంచిలి రవికి  వైఎస్సార్ సీపీ హామీ ఇచ్చింది. అయితే వంగవీటి రాధా బెజవాడ సెంట్రల్ సీటు కోసం పట్టుబడుతున్న విషయం తెలిసిందే. 

చంద్రబాబువి నీచ రాజకీయాలు..
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.  ఓటుకు నోటు కేసు తర్వాత రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఆయన ఒక్కసారి అయినా మాట్లాడారా అని సూటిగా ప్రశ్నించారు. ప్రధాని మోదీతో కలిసి ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదని అన్నారు.

హోదా కోసం కర్నూలు జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. చంద్రబాబుకు మహారాష్ట్ర కోర్టు నోటీసులు ఇస్తే ఏపీలో ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్‌పై నానా హడావుడి చేశారని అన్నారు.రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ ఎమ్మెల్యేకు షాక్

Updated By ManamTue, 09/18/2018 - 12:25

Roja, Bode Prasadఅమరావతి: సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్యపదజాలంతో దూషించినందుకు గానూ టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. వారు పట్టించుకోకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

అయితే ఈ ఏడాది జూలైలో జరిగిన ఓ కార్యక్రమంలో బోడే ప్రసాద్ మాట్లాడుతూ.. తనపై రోజా చేస్తున్న పిచ్చి విమర్శలను ప్రజలు నమ్మరని అన్నారు. అంతటితో ఆగకుండా అదే రోజాను తాను ఓ వ్యభిచారి, బ్రోతల్ హౌస్ నడుపుతుందని అంటే కచ్చితంగా నమ్మేస్తారని అసభ్యంగా మాట్లాడారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడిన విషయం తెలిసిందే.వైఎస్సార్ సీపీలో బెజవాడ ‘సెంట్రల్’ రగడ

Updated By ManamMon, 09/17/2018 - 15:11
  • వంగవీటి రాధాకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత

  • పెట్రోల్ బాటిల్స్‌తో కార్యకర్తల హల్‌చల్

  • వారించి ఆగ్రహం వ్యక్తం చేసిన రాధాకృష్ణ

vijayawada politics may take new turn

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బెజవాడ ‘సెంట్రల్’ టికెట్ వివాదం తారాస్థాయికి చేరింది. సీటు కేటాయింపు విషయంలో అసంతృప్తిగా ఉన్న వంగవీటి రాధా .... ఓ దశలో పార్టీకి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ఉదయం అనుచరులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలతో చర్చలు జరిపారు. మరోవైపు రాధాకృష్ణకు సంఘీభావంగా ఆయన సోదరుడు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ పార్టీకి రాజీనామా చేశారు.

మరోవైపు వంగవీటి రాధాకృష్ణ నివాసం వద్ద  సోమవారం కార్యకర్తలు  పెట్రోల్ బాటిళ్లతో హల్‌చల్ చేశారు.  వైఎస్సార్ సీపీ తరఫున విజయవాడ తూర్పు టికె‌ట్‌‌ను వంగవీటి రాధాకృష్ణకు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఓ దశలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే ఆ కార్యకర్తలను వారించిన వంగవీటి రాధాకృష్ణ, ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ నుంచి పార్టీ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరును వైఎస్సార్‌సీపీ పరిశీలిస్తోంది. ఒకవేళ ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖంగా లేకపోతే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలనుకుంటోంది. అయితే సీటు కేటాయింపుపై ఏర్పడ్డ అసంతృప్తి నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణ పార్టీకి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు ఏర్పడ్డాయి.  

తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయనకు ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం నేతలు బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం నిర్ణయం వెలువడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వంగవీటి రాధాకృష్ణ తన అనుచరుల వద్ద స్పష్ఠం చేసినట్లు సమాచారం. వంగవీటి రాధాకృష్ణ  2004లో విజయవాడ తూర్పు నుంచే ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించిన విషయం తెలిసిందే.వైసీపీకి వంగవీటి శ్రీనివాస ప్రసాద్ రాజీనామా

Updated By ManamMon, 09/17/2018 - 11:20

Srinivasa Prasadవిజయవాడ: బెజవాడ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్న వేళ.. ఆ ఇంటి నుంచి శ్రీనివాస్ ప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైసీపీ కార్యాలయానికి ఫ్యాక్స్ చేశారు. 

అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. జగన్ వైఖరిని నిరసిస్తూ.. పార్టీకి, పదవులకు రాజీనామా చేశానని తెలిపారు. కష్టపడుతున్న వారికి పార్టీలో గుర్తింపు లభించడం లేదన్న ఆవేదనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం శ్రీనివాస ప్రసాద్ ఉయ్యూరు కౌన్సిలర్‌గా, వైసీపీ జిల్లా ఫ్లోర్ లీడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మరోవైపు విజయవాడ సెంట్రల్ నుంచి పోటీకి తనకు హామీ ఇవ్వలేదని వంగవీటి రాధా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వైసీపీకి మరో షాక్.. టీడీపీలోకి మరో కీలక నేత

Updated By ManamWed, 09/12/2018 - 08:56

Sunil అమరావతి: వైసీపీ మరో షాక్ తగిలింది. కాకినేత కీలక నేత చెలమలశెట్టి సునీల్ వైసీపీని వీడనున్నారు. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న సునీల్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. దీనికి సంబంధించి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన సునీల్, టీడీపీలో చేరనున్నతెలిపారు. వచ్చే నెల రెండో వారంలో చంద్రబాబు సమక్షంలో సునీల్ టీడీపీ కండువాను కప్పుకోనున్నారని తెలుస్తోంది. అయితే ఎన్నికలు దగ్గరపడుతుండగా.. టీడీపీలోకి వలసలు పెరుగుతున్న విషయం తెలిసిందే.259వ రోజు యాత్రను కొనసాగిస్తున్న జగన్

Updated By ManamMon, 09/10/2018 - 11:58

Jagan Mohan Reddyవిశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 259వ రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా సోమవారం ఉదయం విశాఖపట్నం నియోజకవర్గంలోని తాటిచెట్లపాలెం నుంచి పాదయాత్రను ప్రారంభించారు జగన్. అక్కడి నుంచి అక్కయ్యపాలెం, దొండపర్తి జంక్షన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, వాల్తేరు మీదుగా జగన్ తన పాదయాత్రను కొనసాగించనున్నారు. వాల్తేరులో బ్రాహ్మణుల ఆత్మీయ సదస్సులో జగన్ పాల్గొననున్నారు. కాగా యాత్రలో అక్కడి ప్రజలతో మమేకమౌతున్న జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.టీడీపీలోకి వైసీపీ మరో కీలక నేత..?

Updated By ManamMon, 09/10/2018 - 08:57

neelakantamఅమరావతి: తెలంగాణలో ఎన్నికల వేడి ఇప్పటికే ప్రారంభం కాగా.. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలోనూ అన్ని పార్టీలు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఒక పార్టీలో నుంచి మరో పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే, వైకాపా కీలక నేత మీసాల నీలకంఠంనాయుడు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుతో నీలకంఠం నాయుడు ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలిసింది.

కాగా వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నీలకంఠంనాయుడు 2014కు ముందు ఆ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి అసెంబ్లీ టికెట్‌ ఆశించగా.. ఆయనకు దగ్గలేదు. దీంతో తాజాగా టీడీపీలోకి వచ్చేందుకు నీలకంఠం నాయుడు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

Related News