cricket

రోహిత్ సేనకు రిహార్సల్

Updated By ManamTue, 09/18/2018 - 01:11
  • స్టార్ స్పోర్ట్స్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం

cricketrదుబాయ్: పాకిస్థాన్‌తో అసలు సిసలైన పోరుకు ముందు టీమిండియా డ్రెస్ రిహార్సల్ (ప్రాక్టీస్ లాంటి) మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో మంగళవారం ఆడనుంది. బుధవారం చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాంకాంగ్‌తో మ్యాచ్ పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ఆకలి పుట్టించేలాంటింది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోయినప్పటికీ రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా నిర్ణీత ఓవర్ల ఫార్మాట్‌లో బలమైంది. హాంకాంగ్‌తో మ్యాచ్‌ను రోహిత్ సేన తేలిగ్గా తీసుకోకపోయినప్పటికీ ఇది పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. దుబాయ్‌లో 43 డిగ్రీల సెల్సీయస్‌తో ఎండలు మండిపోతున్నాయి. అయితే పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు సరైన కాంబినేషన్‌ను ఎంపిక చేసుకోవడమే లక్ష్యంగా ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన బరిలోకి దిగనుంది. పాకిస్థాన్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో హాంకాంగ్ జట్టు ఎనిమిది వికెట్లతో ఓటమిపాలైంది. ఏకపక్షంగా సాగిన ఆ మ్యాచ్‌లో హాంకాంగ్ 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఏదైన అద్భుతం జరిగితే తప్ప టీమిండియాపై హాంకాంగ్ జట్టు మెరుగైన ప్రతిభ కనబరచలేదు. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్‌తో.. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ వంటి ప్లేయర్స్‌తో టీమిండియా ఉత్సాహంగా ఉంది. గత కొన్నేళ్లుగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌పై అనేక సందేహాలు వస్తున్నాయి. అయితే ఈ టోర్నీలో ధోనీని ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దింపాలి అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరికే అవకాశముంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ధోనీని 5 లేదా 6 లేదా 7 స్థానాల్లో ఎందులో బరిలోకి దించాలన్న దానిపై స్పష్టత రానుంది. ఒకవేళ ధోనీ 7వ నంబర్ స్థానంలో బ్యాటింగ్‌కు దిగితే అతను డెత్ ఓవర్లలో మహ్మద్ ఆమిర్, ఉస్మాన్ ఖాన్, హసన్ అలీ బౌలింగ్‌లను ఎదుర్కోవాల్సి వుంటుంది. 5వ నంబర్ బ్యాట్స్‌మన్‌గా కేదార్ జాదవ్ లేదా మనీష్ పాండే బరిలోకి దిగే అవకాశముంది. ఒకవేళ తాను 6వ నంబర్ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలని ధోనీ భావిస్తే భారీ షాట్లు కొట్టే సామర్థ్యం ఉన్న హార్దిక్ పాండ్య 7వ నంబర్ స్థానంలో బరిలోకి దిగొచ్చు. గత కొద్ది కాలంగా టీమిండియాలో మిడిలార్డర్ సమస్య కొనసాగుతోంది. వచ్చే ఏడాది వరల్డ్ కప్‌కు ముందే ఈ సమస్యను పరిష్కరించు కోవాలని టీమిండియా భావిస్తోంది. కేఎల్ రాహుల్ 3వ నంబర్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగే అవకాశముంది. అయితే ఇంగ్లాండ్‌లో మాదిరిగా ఇక్కడ ఆమిర్, హసన్‌ల నుంచి ఇన్‌స్వీంగ్ బంతులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పాకిస్థాన్ ఎడమ చేతి బౌలర్ల నుంచి మన బ్యాట్స్‌మెన్ ఎటువంటి ఇబ్బందులనూ ఎదుర్కోకుండా ఉండేందుకు శ్రీలంకకు చెందిన ఎడమ చేతి స్పెషలిస్ట్‌ను బీసీసీఐ ఇప్పటికే నియమించింది. ఫ్లాట్ పిచ్‌లపై నెమ్మదిగా కదిలే వైట్ కూకబుర్రా బంతులను టీమిండియా బ్యాట్స్‌మెన్ కనీస ఫుట్‌వర్క్ ద్వారా ధీటుగా ఎదుర్కొనే అవకాశముంది. దుబాయ్ పిచ్‌లపై వివిధ రకాల లెంగ్త్, పేస్‌లను అంచనా వేసేందుకు ధావన్, రాహుల్, పాండ్యాలకు హాంకాంగ్‌తో మ్యాచ్ ఉపయోగపడ నుంది. మరోసారి భువనేశ్వర్- బుమ్రాలతో పాటు కుల్‌దీప్-చాహల్‌ల కాంబినేషన్లు బరిలోకి దిగనున్నాయి. 

పాకిస్థాన్ విషయానికొస్తే.. భారత ఇద్దరు మణికట్టు స్పిన్నర్ల మాయా జాలం గురించి సర్ఫరాజ్ ఖాన్ బృందానికి తెలీదు. ఎందుకంటే ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో వీరిద్దరు లేరు. ఫఖర్ జమాన్, బాబర్ ఆజామ్ పాక్ బ్యాటింగ్ లైనప్‌లో కీలక ఆటగాళ్లు, ఇంజమామ్ ఉల్ హక్ మేనల్లుడు ఇమామ్ ఉల్ మక్ స్థిరంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్ లైనప్‌లో ఉన్న ఏకైన సీనియర్ ఆటగాడు ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్. స్లో పిచ్‌లపై మిడిల్ ఓవర్లలో అద్భుతమైన బ్యాటింగ్ చేయగల సత్తా ఇతనికుంది. వెన్నెముక గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు దూరమైన భువనేశ్వర్‌కు హాంకాంగ్‌తో మ్యాచ్ మంచి ప్రాక్టీస్‌ను ఇవ్వనుంది. ఇండియా-ఎ, సౌతా ఫ్రికా-ఎ మ్యాచ్‌తో భువనేశ్వర్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు స్టేడి యం క్రిక్కిరిసే అవకాశముంది. మంగళవారం హాం కాంగ్‌తో మ్యాచ్‌కు కూడా అక్కడి భారత్ అభిమా నులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి రానున్నారు. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే,  కేదార్ జాదవ్, ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్, దినేష్ కార్తీక్, ఖలీల్ అహ్మద్. హాంకాంగ్: అన్షుమన్ రథ్ (కెప్టెన్), ఐజాజ్ ఖాన్, బాబర్ హయత్, కామెరూన్ మెక్‌ఆల్సన్, క్రిస్టఫర్ కార్టర్, ఎహ్‌సాన్ ఖాన్, ఎహ్‌సాన్ నవా జ్, అర్షద్ మహ్మద్, కించిత్ షా, నదీమ్ అహ్మ ద్, రాగ్ కపూర్, స్కాట్ మెక్‌కెన్నీ, తన్వీర్ అహ్మద్, తన్వీర్ అఫ్జల్, వకాస్ ఖాన్, అఫ్తాబ్ హుస్సేన్. 



ఇంగ్లాండ్ పర్యటనపై... రవిశాస్త్రితో సీఓఏ చర్చ? 

Updated By ManamSun, 09/09/2018 - 23:01

imageన్యూఢిల్లీ: ఇంగ్లాండ్‌లో టీమిండియా పేలవ ప్రదర్శనపై కోచ్ రవిశాస్త్రితో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) చర్చించే అవకాశముంది. ఆతిథ్య జట్టు చేతిలో టీమిం డియా వన్డే, టెస్టు సిరీస్‌లను కోల్పోయింది. అయితే చివరి, ఐదో టెస్టు తర్వాత టీమిండియా ప్రతిభపై సీఓఏ ఓ అంచనాకు రానుంది. ‘ఈ నెల 11న ముంబైలో సీఓఏ సమావేశం ఉంది. కొత్త రాజ్యాంగాన్ని అమలు చేయడంపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే ఇంగ్లాండ్‌లో టీమిండి యా ప్రతిభ కూడా చర్చకు వచ్చే అవకాశముంది. టీమిం డియా ప్రతిభపై రవిశాస్త్రిని పిలిచి ముఖాముఖీగా మాట్లాడొచ్చు లేదా రాతపూర్వక నివేదిక కోర వచ్చు. ఈ సమయంలో క్రికెట్ సలహా సంఘం (సీఏసీ) పనిచేయదు. మళ్లీ ఎన్నికలు జరిగేంత వరకు సీఓఏనే ఇంచార్జ్‌గా పనిచేస్తుంది. టీమిండియా ప్రతిభపై సీఓఏ ఓ అంచనాకు వచ్చే అవకాశముంది’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

 సమావేశం జరిగితే సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయాన్ని కూడా సీఓఏ కోరే అవకాశముంది. గత మూడు దశాబ్దాలుగా ఇంట గానీ, బయట గానీ జరిగిన సిరీస్‌ల తర్వాత టీమ్ మేనేజర్ నివేదిక ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. కానీ కోచ్ ఎన్నడూ నివేదిక ఇవ్వలేదు. అయితే మేనేజర్‌కు జట్టు ప్రతిభకు సంబం ధం లేదని.. మేనేజర్ నివేదిక తప్పనిసరి కాద నే వాదనలు కూడా వినిపిస్తు న్నాయి. ‘జట్టు ప్రతిభకు సంబం దించి మేనేజర్ ఆలోచనలు సరైనవి కావు. మేనేజర్ సునీల్ సుబ్రమణ్యం విధులు పూర్తిగా అడ్మినిస్ట్రేటిక్‌కు సంబంధించినవి. జట్టు ప్రతిభకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. వసతి, కోరిన తిండి, ప్రయాణ సౌకర్యాలు, ప్రాక్టీస్ కండిషన్స్ వంటి వాటికి సంబంధించినవి. కనుక క్రికెట్‌కు సంబంధించిన ఫీడ్ బ్యాక్ శాస్త్రి లేదా కోహ్లీ లేదా ఎమ్మెస్కే ఇవ్వాల్సివుంటుంది’ అని ఆ అధికారి వివరించారు.

 గ్రెగ్ చాపెల్ వెళ్లిపోయిన తర్వాత విదేశీ సిరీస్‌ల గురించి బీసీసీఐకి ఏ ఒక్క భారత కోచ్ కూడా రాతపూర్వక సమీక్ష నివేదిక ఇవ్వలేదు. కోచ్ లేదా కెప్టెన్‌తో బోర్డు కార్యదర్శి లేదా అధ్యక్షుడు చర్చించేవారు. అటువంటి బాధ్యత తీసుకునేందుకు తాత్కాలిక అధ్య క్షుడు సీకే ఖన్నా సిద్ధంగా లేరు. మరోవైపు తాత్కాలిక కార్యదర్శి అమి తాబ్ చైదరి అధికారాలను సీఓఏ తగ్గించింది. అయితే గాయాలకు గురైన క్రికెటర్ల పరిస్థితి గురించి ఫిజియో పాట్రిక్ ఫర్హార్ట్‌ను సీఓఏ అడగనుండటం ఆసక్తికరంగా మారింది. వెన్నునొప్పి ఉన్నప్పటికీ మూడో వన్డేలో భువనేశ్వర్ కుమార్‌ను ఎందుకు ఆడించారు? సౌతాప్టంన్ టెస్టుకు రవిచంద్రన్ అశ్విన్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడా? అని సీఓఏ ప్రశ్నించ నుంది. అయితే వారికి గాయం తిర గదోడిందని అధికారులు చెప్పారు.



క్రికెట్‌కు ఆర్పీ సింగ్ గుడ్‌బై

Updated By ManamWed, 09/05/2018 - 13:58
Ex-Indian pacer RP Singh bids adieu to cricket

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ రుద్ర ప్రతాప్ సింగ్ (ఆర్పీ సింగ్) రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు అతడు తన ట్విట్టర్‌ అకౌంట్‌లో అధికారికంగా (మంగళవారం) వెల్లడించాడు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఆర్పీ సింగ్ 2005లో జింబాబ్వేపై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇక 2016లో ఐపీఎల్ మ్యాచ్‌ తర్వాత నుంచి అతడు క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు.

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం బాధాకరమే అని అయినా తప్పదని ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు. సరిగ్గా ఇదే రోజు సెప్టెంబర్ 4, 2005లో తొలిసారి భారత జట్టు జెర్సీ ధరించా. క్రికెట్ నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఇచ్చింది. మళ్లీ ఇదే రోజు క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నా అని తెలిపాడు. ఈ మేరకు తన క్రికెట్ ప్రయాణంలోని అనుభూతులను గుర్తు చేసుకున్నాడు. టీమిండియాకు 14 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన ఆర్పీ సింగ్ 3.98 సగటుతో 40 వికెట్లు తీశాడు. 



ఆసియా కప్‌కు టీమిండియా ఎంపిక

Updated By ManamSat, 09/01/2018 - 13:21
  • విరాట్ కోహ్లీకి రెస్ట్... తాత్కాలిక కెప్టెన్‌గా రోహిత్ శర్మ

virat kohli-rohit sharma

ముంబై : ఈ నెలలో జరగబోయే ఆసియా కప్‌కు టీమిండియా జట్టు ఖరారు అయింది. తీవ్ర పని ఒత్తిడిలో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇవ్వగా,  తాత్కాలిక కెప్టెన్‌గా రోహిత్ శర్మను సెలెక్టర్లు శనివారం ఎంపిక చేయడం జరిగింది. అలాగే జట్టులోకి  బౌలింగ్‌లో గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్, జాదవ్‌‌తో పాటు అంబటి రాయుడు కు చోటు లభించింది. 

ప్రస్తుతం  అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా మరో పదిహేను రోజుల్లో ఆసియా కప్‌కు సిద్ధమవుతోంది. వరుస మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడు. అంతేకాకుండా బ్యాటింగ్ భారం అంతా అతడిపైనే ఆధారపడి ఉంది. మరోవైపు రెండో టెస్ట్ మ్యాచ్‌లో వెన్ను నొప్పితో బాధపడ్డాడుకూడా. కాగా సెప్టెంబ్ 15నుంచి ఆసియా కప్ ...యూఏఈలో జరగనున్నాయి. 

జట్టు వివరాలు :
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ థావన్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్, కుల్దీప్ యాదవ్, హార్థిక పాండ్యా, చాహల్, అక్షయ్ పటేల్, బూమ్రా, శార్థూల్ ఠాకుర్, ఖలీల్ అహ్మద్.



100 బంతుల ఫార్మాట్ నాకొద్దు

Updated By ManamWed, 08/29/2018 - 22:58
  • టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ  

imageలండన్: టెస్ట్ క్రికెట్‌ను కాపాడాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు విజ్ఞప్తి చేశాడు. క్రికెట్‌లో మరో కొత్త ఫార్మాట్‌ను స్వాగతించలేనని, అందులో భాగస్వామిని కాలేనని స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) 100 బాల్ ఫార్మాట్‌కు తెరతీసిన నేపథ్యంలో విజ్డెన్ క్రికెట్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ ఇలా వ్యాఖ్యానించాడు. వాణిజ్య అంశాలు క్రికెట్‌ను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నేను ఆవేశంతో మాట్లాడటం లేదు, కానీ కొన్ని సార్లు విపరీతమైన క్రికెట్ ఆడటంతో విసుగు వస్తుందన్నాడు.

వాణిజ్య అంశాలు ఆటను దెబ్బతీయడం బాధను కలిగిస్తోంది. ప్రస్తుతం నాకు ఎలాంటి కొత్త ఫార్మాట్ ఆడాలని లేదు. ఈసీబీలాంటి బోర్డు కొత్త ఫార్మాట్‌ను తెరపైకి తెస్తుండటం ఆసక్తి రేపుతున్నా నాకు మాత్రం ఈ కొత్త ఫార్మాట్‌పై ఆసక్తి లేదు. ఆ ఫార్మాట్‌ను లాంచ్ చేయబోయే జట్టులో నేను ఉండను. ఓ టెస్ట్ ప్లేయర్‌గా ఏ కొత్త ఫార్మాట్‌కు మారాలని అనుకోవడం లేదు. నేను ఐపీఎల్ ఆడటాని, బీబీఎల్ చూడటాన్ని ఆస్వాదిస్తాను. అన్నీ లీగ్‌లకు మద్దతిస్తాను కానీ ఇలాంటి ప్రయోగాలకు కాదు.’ అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ బోర్డులు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని టెస్టు క్రికెట్‌ను కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. నేడు భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య నాల్గొవ టెస్టు ప్రారంభం కానుంది.



చిత్తుగా ఓడిన టీమిండియా

Updated By ManamSun, 08/12/2018 - 23:01
  • 159 పరుగులతో ఇన్నింగ్స్ ఓటమి.. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు 

imageలండన్: ఇంగ్లాండ్-భారత్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 159 పరుగులతో ఇన్నింగ్స్ ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి  107 పరుగులకే కుప్పకూలిన భారత్ జట్టు రెండో ఇన్నింగ్ ్సలో 130 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 357/6తో నాల్గొ రోజు ఆటని ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు  మొదటి ఇన్నింగ్స్‌లో 88.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 396 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది. అప్పటీకే ఇంగ్లాండ్ జట్టు 289 పరుగుల అధిక్యంలో ఉంది.  ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ అజేయంగా 137 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరో ప్లేయర్ బెయిర్‌స్టో 93 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. టీమిండియా బౌలింగ్‌లో షమీ 3 కీలక వికెట్లు ద క్కించుకున్నాడు.

షమీతో పాటు మరో బౌలర్ పాండ్య మూడు వికెట్లు తీశాడు. మొదటి టెస్టులో రాణించిన ఇషాంత్ శర్మ కేవలం ఒక వికెట్ మాత్రమే తీసి నిరాశపరిచాడు. వన్డేల్లో ఇంగ్లాండ్ బ్యాట్‌వెున్‌కు చుక్కలు చూపెట్టిన కుల్‌దీప్ యాదవ్ టెస్టులో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అ నంతరం బ్యాటింగ్ దిగిన భారత్ ఓపెనర్లు మురళీ విజయ్, కెఎల్ రాహుల్‌తో టీమిండియా పతనం మొదైలెంది. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినా విజయ్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా పరుగులు నమోదు చేయుకుండానే అండర్సన్ బౌలింగ్‌లో కీపర్ బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ 0 పరుగుల కే ఒక వికెట్ కోల్పోయింది. త ర్వాత బ్యాటింగ్‌కు వచ్చి న పుజారాతో కలిసి మరో ఓ పెనర్ రాహుల్ ధీటుగా ఆడే ప్ర యత్నం చేశాడు. 6.1 ఓవర్‌లో అండర్సన్ అద్భుతైమెన బంతి వేసి రాహుల్ (10)ని కూడా పెవిలియున్‌కి పంపాడు. క్రీజులోకి వచ్చిన రహానేతో కలిసి పుజారా ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు

. మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో  అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. అప్పటీకి భారత్ 17/ 2తో ఉంది. లంచ్ తర్వాత బ్యా టిం గ్‌కి వచ్చిన భారత్ జట్టు  18.5 ఓవర్‌లో రహానే (13) బ్రాడ్ బౌ లింగ్‌లో జెన్నింగ్స్‌కి క్యాచ్ ఔటయ్యాడు. దీంతో భారత్ 35 పరుగులకే 3 కీలక వికెట్లు నష్టపోయింది. అనంతరం బ్యాటిం గ్‌కి దిగిన కెప్టెన్ కోహ్లీ, పుజారాతో కలిసి మరో వికెట్ పడకుండా ఆడే ప్రయత్నం చేశాడు. ఒకనొక దశలో నిలకడగా ఆడుతున్న పుజారా (17) బ్రాడ్ బౌలింగ్‌లో 50 పరుగుల వద్ద క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం కోహ్లీ (17), దినేష్ కార్తీక్ (0) బ్రాడ్ బౌలింగ్ పెవిలియన్ చేరారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేయడంతో టీమిండియా 130 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 2-0తో ముందంజలో ఉంది.



వరుణుడి అడ్డంకి

Updated By ManamSat, 08/11/2018 - 00:38
  •  రెండో రోజూ ఆటంకం  ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు

imageలార్డ్స్: తొలి రోజు ఒక్క బంతి కూడా వేయకుండా అడ్డుపడిన వరు ణుడు రెండో రోజు కూడా అటంకం కలిగించాడు. గురువారం కురిసిన వర్షం వల్ల టాస్ పడలేదు. కానీ శుక్రవారం మ్యాచ్ ప్రారంభానికి ఎటు వంటి ఆటంకం లేకపోవడంతో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిం డియాను ఆరంభంలోనే ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ దెబ్బ తీశాడు. తొలి ఓవర్లో టీమిండియా ఇంకా పరుగులు ఖాతా ప్రారం భించక ముందే ఐదో బంతికి మురళీ విజయ్ (0) డకౌటయ్యాడు. తర్వాత చెటేశ్వర్ పుజారా బ్యాటింగ్‌కు దిగాడు. మరో ఆరు ఓవర్ల తర్వాత తొలి బంతికి కేఎల్ రాహుల్ (8) కూడా అవుటయ్యాడు. దీంతో 6.3 ఓవర్లలోనే టీమిండియా ఓపెనర్లను కోల్పోయింది. ఈ సమయంలో వర్షం అంత రాయం కలిగించింది. ఆట నిలిచిపోయే సమయానికి విరాట్ కోహ్లీ, పుజా రా ఒక్కో పరుగుతో క్రీజులో ఉన్నారు. ఆకాశం మేఘావృతమై ఉన్న సమ యంలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను దారుణంగా ప్రారంభించింది. వాతావరణ సూచనలు తెలుసుకునే ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్లో ఆండర్సన్ వేసిన నాలుగు స్వింగ్ బాల్స్‌ను విజయ్ బాగానే వదిలేశాడు. కానీ ఐదు బంతిని కాస్త ఆలస్యంగా ఫ్లిక్ షాట్ ఆడబోయిన విజయ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఎండ్‌లో ఉన్న రాహుల్.. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. రెండు ఫోర్లు కూడా కొట్టాడు. కానీ ఆండర్సన్ బౌలింగ్‌లో తికమకపడ్డాడు. ఏడో ఓవర్లో ఆండర్సన్ వేసిన బంతిని రాహుల్ డిఫెన్స్ ఆడబోయాడు. కానీ బంతి అతడి బ్యాట్ అంచును తాకి నేరుగా వికెట్ కీపర్ చేతిలోకి వెళ్లింది. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్‌కు రెండు మార్పులు చేసింది. బెన్ స్టోక్స్ బదులు క్రిస్ వోక్స్‌ను, డేవిడ్ మలన్ స్థానంలో 20 ఏళ్ల ఒల్లీ పోప్‌ను తుది జట్టులోకి తీసుకుంది. దీంతో పోప్ టెస్టుల్లో అరంగేట్రం చేసినట్టయింది. మరోవైపు టీమిండియా కూడా జట్టులో రెండు మార్పులు చేసింది. ఉమేష్ యాదవ్ స్థానంలో అదనంగా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ వచ్చాడు. కాగా తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఘోరంగా విఫలమైన ఓపెనర్ శిఖర్ ధావన్‌ను పక్కన పెట్టి అతని స్థానంలో చెటేశ్వర్ పుజారాకు అవకాశమిచ్చింది. అయితే వర్షం కాస్త తెరపి ఇచ్చిన తర్వాత ఆట ప్రారంభమైంది. 9వ ఓవర్లో మూడో బంతికి పుజారా రనౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా 15 పరుగులు వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 13వ ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 30/3 పరుగులు చేసింది.



భారత్ అండర్-19 గెలుపు

Updated By ManamTue, 08/07/2018 - 22:21
  • శ్రీలంకతో నాలుగో వన్డే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్  

imageమోరాతువా: శ్రీలంక అండర్-19తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ అండర్-19 జట్టు ఘనవిజయం సాధించిం ది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం లంకతో జరిగిన నాలుగో వన్డేలో భారత్ జట్టు ఏకం గా 135 పరుగులతో గెలుపొంది 2-2తో సమంగా నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు బ్యాట్స్‌మన్లు శుభారంభాన్ని అందించారు. ఓపెనర్ పడిక్కల్ 71 పరుగులతో బ్యాట్ ఝుళిపించగా, మరో బ్యాట్స్‌మన్ జు యల్ 60 పరుగులతో లంక బౌలర్లుకు చుక్కలు చూపించాడు.

వీరికి తోడు రాథోడ్ 56 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 278 పరుగులను చేయగలిగింది. లంక బౌలింగ్‌లో లక్షన్, మెండీస్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నా రు. అనంతరం 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు భారత బౌలర్ల ధాటికి 37.2 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయం పొందింది. లంక బ్యాటింగ్‌లో ప్రణవితనా ఒక్కడే 45 పరుగులు చేసాడు. మిగిలిన బ్యాట్ ్సమెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరుకున్నారు. భారత బౌలింగ్ లో బాదోనీ, త్యాగి చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మ్యాచ్ శుక్రవారం జరగనుంది.



సఫారీ జట్టు విజయం

Updated By ManamMon, 07/30/2018 - 00:20
  • 5వికెట్లతో గెలిచిన సౌతాఫ్రికా

  • శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్  

imageదంబుల్లా: శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలైమెన సౌతాఫ్రికా జట్టు వన్డే సిరీస్‌లో పుంజుకుంది. లంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి వన్డేలో సఫారీ జట్టు 5 వికెట్లతో విజయం సాధించింది. దీంతో సఫారీ జట్టు 1-0తో ముందంజలో ఉంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక జట్టు సౌతాఫ్రికా బౌలర్ల్ ధాటికి 34.3 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటైంది. లంక జట్టులో పెరీరా ఒక్కడే 49 పరుగులతో టాప్ స్కోర ర్‌గా నిలిచాడు.

 సఫారీ జట్టులో రబాడ, షంషి, చెరో 4 వికెట్లు తీయగా, ఎంగిడి ఒక వికెట్ దక్కించుకున్నాడు. దీంతో లంక జట్టు 193 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు 31 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది. సఫారీ జట్టులో డుమీనీ అజేయంగా 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. డికాక్ (47 పరుగులు), డుప్లెసిస్(47 పరుగులు) చేసి ఆకట్టుకున్నారు. లంక బౌలింగ్‌లో ధనుంజయ 3 వికెట్లు, లక్మల్, సన్‌దకన్ చెరో వికెట్ తీసారు. బౌలింగ్‌లో 4 కీలక వికెట్లు తీసి లంక ను దెబ్బ కొట్టిన షంషికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ రెండు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం జరగనుంది.



త్వరలోనే బ్యాట్‌ పట్టి ఆడేస్తా..

Updated By ManamSun, 07/22/2018 - 10:52
Kedar Jadhav

మరో రెండు వారాల్లో బ్యాట్‌ పట్టేస్తా అంటున్నాడు ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌. ఈ ఏడాది ఐపీఎల్‌లో కేదార్‌ జాదవ్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. టోర్నీలో భాగంగా ముంబయి ఇండియన్స్‌ తో ఆడిన తొలిమ్యాచ్‌లో గాయపడ్డాడు. దీంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత వైద్యుల సలహా మేరకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అనుకున్న దానికంటే త్వరగానే కోలుకుంటున్నానని, రెండు,మూడు వారాల్లో బ్యాట్‌ పట్టుకుని ఆడేస్తానని ధీమాగా చెబుతున్నాడు.

‘బాగానే  కోలుకుంటున్నాను. రెండు మూడు వారాల్లో ఫిట్‌ గా తయారై క్రికెట్‌ ఆడటం మొదలుపెడతాను. బ్యాట్‌ పట్టుకుని ఆడేందుకు ప్రయత్నిస్తున్నాను కానీ వర్షం వల్ల సరిగా ఆడలేకపోతున్నాను. అనుకున్నదానికంటే వేగంగా కోలుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నాను. ఇదే గాయంతో గతంలో రెండుసార్లు గాయపడ్డాను. మొదటిసారి ధర్మశాలలో శ్రీలంకతో మ్యాచ్‌లో గాయపడ్డాను. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో, తర్వాత ఐపీఎల్‌లో. తరచూ అదే గాయం బాధిస్తోండటంతో ఫియోలు, డాక్టర్లు శస్త్రచికిత్స చేయించుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో  మెల్‌బోర్న్‌ వెళ్లి ఆపరేషన్‌ చేయించుకున్నాను. ఈ మూడు నెలలు నాకు ఎంతో కఠినంగా గడిచాయి. 

కానీ, ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌ ఎంత అవసరమో తెలిసివచ్చింది. గాయాలు ఆటలో భాగం. దానికి ఏం చేయలేం. రెండు మూడు నెలల్లో మాత్రం పూర్తిస్థాయిలో బ్యాట్‌ పట్టి ఆడేస్తా’ అని కేదార్‌ తెలిపాడు. నాకు ఎప్పుడు కోహ్లీ మద్దతు ఉంటుంది. ఇప్పుడనే కాదు నేను మొదటిసారి జట్టులో చేరినప్పటి నుంచి కోహ్లీ నాకు ఎంతో మద్దతుగా నిలిచాడు. నేను మొదటిసారి టీమిండియాకు ఎంపికైనపుడు కోహ్లీ నాకు బ్లాక్‌ బెర్రీ ఫోన్‌ కానుకగా ఇచ్చాడు. కెప్టెన్‌గా కోహ్లీ యువ ఆటగాళ్లను ఎప్పుడూ ప్రోత్సహిస్తాడు అని జాదవ్‌ తెలిపాడు.





Related News