atlee

హిట్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రం..?

Updated By ManamWed, 07/18/2018 - 13:25

vijay, atleeసినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ఉన్న డిమాండ్ వేరు. ఆ కాంబినేషన్లో ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా..? అని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇలాంటి కాంబోలో విజయ్, అట్లీ జోడి ఒకటి. విజయ్‌తో అట్లీ తెరకెక్కించిన తెరి, మెర్సల్ మంచి విజయాన్ని సాధించడంతో ఈ కాంబోలో మరిన్ని చిత్రాలు రావాలని అభిమానులు భావిస్తున్నారు. అయితే వారి ఆశ తీరేలా ఇప్పుడో ఓ వార్త కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో సర్కార్ చిత్రంలో నటిస్తున్నాడు విజయ్. ఈ చిత్రం తరువాత అట్లీ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన కథకు ఇటీవలే విజయ్ ఓకే చెప్పాడని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే విజయ్ అభిమానుల సంతోషానికి అవధులుండవు.ఎన్టీఆర్‌, వైజ‌యంతి మూవీస్.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

Updated By ManamWed, 05/16/2018 - 15:51

ntrయంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి విజ‌యంగా నిలిచిన చిత్రం 'స్టూడెంట్ నెం.1'. ఆ సినిమాని వైజ‌యంతి మూవీస్ సంస్థ‌కి అనుబంధ సంస్థ అయిన స్వ‌ప్న సినిమా నిర్మించింది. ఆ త‌రువాత తార‌క్‌, వైజ‌యంతి మూవీస్ కాంబినేష‌న్‌లో 'కంత్రి', 'శ‌క్తి' చిత్రాలు వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే మ‌రో సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. 'రాజా రాణి', 'పోలీస్‌', 'అదిరింది' వంటి త‌మిళ అనువాద చిత్రాల‌తో తెలుగు వారికి చేరువైన యువ ద‌ర్శ‌కుడు అట్లీ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని తెలిసింది. 2019 ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవ‌కాశ‌ముంది. వైజ‌యంతి మూవీస్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఆ చిత్రం తెర‌పైకి రానుంది. అక్టోబ‌ర్ నుంచి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ పట్టాలెక్క‌నుంది. రామ్ చ‌ర‌ణ్ ఇందులో మ‌రో హీరోగా న‌టించ‌నున్నారు.హ్యాట్రిక్ డైరెక్ట‌ర్‌తో అఖిల్‌

Updated By ManamWed, 12/27/2017 - 22:59

akhilఅక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అఖిల్ న‌టించిన తాజా చిత్రం ‘హలో’. ఫ‌లితం మాటెలా ఉన్నా..ఈ సినిమాతో క్లాస్, ఫ్యామిలీ ప్రేక్షకులకి చేరువ‌య్యాడు అఖిల్. ఇప్పుడు తన మూడవ చిత్రాన్ని లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడీ యంగ్ హీరో. మూడో చిత్రంతో మాస్ ప్రేక్షకులకి చేరువ కావాల‌నుకుంటున్నాడు అఖిల్‌. అఖిల్ మూడో చిత్రం విష‌యంలో.. ఇంత‌కుముందు కొరటాల శివ, బోయపాటి శ్రీను, సుకుమార్ వంటి ప్ర‌ముఖ దర్శకుల పేర్లు వినిపించాయి. తాజాగా ఈ జాబితాలో మ‌రో దర్శకుని పేరు కూడా చేరిపోయింది. అత‌నే.. త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ.  'రాజా రాణి', 'తెరి', 'మెర్స‌ల్' (అదిరింది) చిత్రాల‌తో త‌మిళ‌నాట హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్నాడు అట్లీ. అఖిల్‌, అట్లీ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు జనవరి 10న వెల్లడ‌య్యే అవ‌కాశ‌ముంది.
 'అదిరింది' రివ్యూ

Updated By ManamThu, 11/09/2017 - 16:53

చిత్రంః అదిరింది
న‌టీన‌టులుః విజ‌య్ (త్రిపాత్రాభిన‌యం), నిత్యా మీన‌న్‌, స‌మంత‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ఎస్‌.జె.సూర్య‌, స‌త్య రాజ్‌, వ‌డివేలు, కోవై స‌ర‌ళ‌, రాజేంద్ర‌న్‌, స‌త్య‌న్ త‌దిత‌రులు
సంగీతంః ఎ.ఆర్‌.రెహ‌మాన్‌
సాహిత్యంః వివేక్‌
ఎడిటింగ్ః రూబ‌న్‌
స్క్రీన్ ప్లేః  విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌
ఛాయాగ్ర‌హ‌ణంః జి.కె. విష్ణు
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః అట్లీ
విడుద‌ల తేదిః న‌వంబ‌ర్ 9, 2017

adirindiవ్యాపారంలో ఎన్నో ర‌కాలుండొచ్చు. అయితే వైద్యం వ్యాపారం కాకూడ‌దు. అలా వైద్యాన్ని వ్యాపారంగా చూసే వారిపై ఓ తండ్రి, అత‌ని ఇద్ద‌రు కొడుకులు వేర్వేరుగా చేసే పోరాట‌మే 'అదిరింది' చిత్రం. త‌మిళంలో ఎన్నో వివాదాల మ‌ధ్య విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన 'మెర్స‌ల్' చిత్రానికి అనువాద రూపంగా వ‌చ్చిన 'అదిరింది'.. ఇక్క‌డ కూడా కొన్ని స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించి ఎట్ట‌కేల‌కు ఇవాళ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమాపై 'మ‌నం' అందిస్తున్న‌ స‌మీక్ష మీ కోసం..

క‌థ‌
ఉన్న‌త‌మైన వైద్యాన్ని అంద‌రికీ ఉచితంగా అందించాల‌నేది డా.భార్గ‌వ్ (విజ‌య్‌) క‌ల‌. ఐదు రూపాయిల‌కే వైద్యం అందిస్తూ.. మంచి పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించుకుంటాడు. త‌న‌ సేవ‌ల‌కుగానూ విదేశాల్లో ఉత్త‌మ మాన‌వ‌తావాదిగా పుర‌స్కారాన్ని కూడా అందుకుంటాడు. అదే స‌మ‌యంలో.. భార్గ‌వ్ పుర‌స్కార వేడుక‌కు వ‌చ్చిన డాక్ట‌ర్ అర్జున్ జకారియాని మ్యాజిక్ అనే సెట‌ప్‌తో మెజీషియ‌న్ విజ‌య్ (విజ‌య్‌).. డాక్ట‌ర్ అనుప‌ల్ల‌వి (కాజ‌ల్‌) ని పావుగా వాడుకుని హ‌త్య చేస్తాడు. అస‌లు ఈ హ‌త్య చేయ‌డానికి కార‌ణమేంటి?  విజ‌య్‌కి, భార్గ‌వ్ కి ఉన్న సంబంధ‌మేమిటి?  డాక్ట‌ర్ డేనియ‌ల్ ఆరోగ్య‌రాజ్ (ఎస్‌.జె.సూర్య‌) ఎవ‌రు? ద‌ళ‌ప‌తి విజ‌య భార్గ‌వ్ (విజ‌య్‌) క‌థేంటి?  అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌
క‌థ‌గా చూస్తే 'అదిరింది' ఓ సాధార‌ణ‌మైన క‌థాంశంతోనే తెర‌కెక్కింది. అయితే సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట్ అయ్యే అంశ‌మైన వైద్యం చుట్టూ తిరిగే క‌థ కావ‌డం.. దానికి తోడు కొన్ని బ‌ల‌మైన స‌న్నివేశాలు తోడు కావ‌డంతో 'అదిరింది' మంచి ప్ర‌య‌త్నమైంది. ద‌ర్శ‌కుడు అట్లీలో ఉన్న ప్ల‌స్ పాయింట్ ఏమిటంటే.. పాత క‌థ‌ల‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ ఎంచుకుంటున్నా.. వాటికి బ‌ల‌మైన స‌న్నివేశాల‌ను త‌యారు చేసుకోవ‌డం. అత‌ని గ‌త చిత్రాలు..'రాజా రాణి', 'పోలీస్' (విజ‌య్‌, స‌మంత‌) గ‌మనిస్తే ఈ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తుంది. 'అదిరింది' కూడా అందుకు మిన‌హాయింపు కాదు. క‌థపై కంటే స‌న్నివేశాల‌ను తీర్చిదిద్ద‌డంపైనే అట్లీ తీసుకునే శ్ర‌ద్ధ.. 'అదిరింది'లోనూ క‌నిపిస్తుంది. సినిమా ప్రారంభంలో దేశం గురించి విజ‌య్ మాట్లాడే సీన్ తో పాటు డా.అర్జున్ జ‌కారియాని చంపే మేజిక్ సీన్‌.. విజ‌య్ ని స‌మంత ఇంట‌ర్వ్యూ చేసే స‌న్నివేశం.. హాస్పిట‌ల్ సీన్‌.. ఫ్లాష్ బ్యాక్‌లో నిత్యా మీన‌న్ ఎమోష‌న‌ల్ సీన్స్‌.. క్లైమాక్స్ సీన్‌.. ఇలా కొన్ని సీన్స్ చాలా బాగా కుదిరాయి. అలాగే నిత్యా మీన‌న్‌, ఎస్‌.జె.సూర్య వంటి ఆర్టిస్టుల స‌హ‌కారం కూడా తోడ‌య్యింది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌రంగా చూస్తే..  'రాజా రాణి'లో ఆర్య‌ని న‌జ్రీయా 'బ్ర‌ద‌ర్' అంటూ పిలిస్తే..ఇందులో స‌మంత ఏమో విజ‌య్ని త‌మ్ముడు అంటూ పిలుస్తూ ఉంటుంది. ఆ స‌న్నివేశంలో కామెడీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. అలాగే రాజేంద్ర‌న్ సీన్ కూడా ఫ‌ర్లేద‌నిపిస్తుంది. 
 
న‌టీన‌టులు - సాంకేతిక నిపుణుల ప‌నితీరు
విజ‌య్ చేసిన మూడు పాత్ర‌లు వేటిక‌వే విభిన్నంగా ఉన్నాయి. అయితే.. చాలా చోట్ల అత‌ని న‌ట‌న అంత ఇంప్రెసివ్‌గా లేద‌నే చెప్పాలి. కాక‌పోతే ఎమోష‌న‌ల్ సీన్స్ బాగా చేశాడు. క‌థానాయిక‌ల్లో నిత్యా మీన‌న్ కి మాత్ర‌మే మంచి పాత్ర ద‌క్కింది. మంచి పనులు చేసే భ‌ర్త‌కి స‌హ‌కారం అందించే పాత్ర‌లో నిత్యా న‌ట‌న మెప్పిస్తుంది. అలాగే చ‌నిపోయేట‌ప్పుడు ఇచ్చే ఎక్స్‌ప్రెష‌న్స్‌ బాగున్నాయి. త‌న పాత్ర‌కి మ‌రెవ‌రో డ‌బ్బింగ్ చెప్ప‌డం మాత్రం ఒక విధంగా మైన‌స్ అనే చెప్పాలి. ఇక డాక్ట‌ర్ అనుప‌ల్లవిగా కాజ‌ల్ పాత్ర చేయ‌డానికి ఏమీ లేదు. కాక‌పోతే.. మేజీషియ‌న్ విజ‌య్ ఆప‌రేష‌న్‌లో పావుగా ఉండ‌డం త‌ప్ప‌. ఇక స‌మంత చేసిన తార‌ పాత్ర కొంత‌వ‌ర‌కు ఫ‌ర్వాలేదు. అయితే చిన్మ‌యి కాకుండా మ‌రొక‌రు డ‌బ్బింగ్ చెప్ప‌డం వ‌ల్ల కొంత ఇంప్రెష‌న్ త‌గ్గిన‌ట్ల‌య్యింది. ఇక ప్ర‌తినాయ‌కుడుగా ఎస్‌.జె.సూర్య చేసిన డాక్ట‌ర్ డేనియ‌ల్ ఆరోగ్య రాజ్ పాత్ర ఆక‌ట్టుకుంటుంది. 'స్పైడ‌ర్' త‌రువాత మ‌రోసారి విల‌న్ గా మెప్పించాడు సూర్య‌. స‌త్య‌రాజ్‌, వ‌డివేలు, కోవై స‌ర‌ళ త‌దిత‌రులు త‌మ ప‌రిధి మేర మెప్పించారు. 


సాంకేతికంగా సినిమా బాగుంది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతంలో రెండు పాట‌లు బాగున్నాయి. విజ‌య్‌, కాజ‌ల్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే 'మాయో'తో పాటు విజ‌య్‌, స‌మంత పై చిత్రీక‌రించిన 'నీవ‌ల్లే' పాట‌లు పిక్చ‌రైజేష‌న్ ప‌రంగా బాగున్నాయి. ఇక రెహ‌మాన్ నేప‌థ్య సంగీతం సినిమాని నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. జి.కె.విష్ణు ఛాయాగ్రహ‌ణం బాగుంది. ఎడిటింగ్ విష‌యానికి వ‌స్తే.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌కి కొన్ని చోట్ల క‌త్తెర ప‌డి ఉంటే సినిమాకి వ‌చ్చే న‌ష్ట‌మేమి లేదు. అలాగే త‌మిళ నేటివిటిని హైలైట్ చేసే సీన్స్‌ని కూడా ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. అదేవిధంగా రెండు పాట‌ల‌ని కూడా తొల‌గించ‌వ‌చ్చు.

ఇక మాట‌ల విష‌యానికి వ‌స్తే.. 'నాయ‌కుడు అంటే ఆషామాషీ కాదు.. ఒక త‌రం పెట్టుకునే నమ్మ‌కం', 'మా చేతులు ఎప్పుడూ కిందే ఉంటాయి అనుకోకు.. ఏదో ఒక రోజు ఆకాశాన్ని అందుకుంటాయి', 'ఒక మంచి ప‌ని చేస్తే ఒక‌టే తిరిగొస్తుంది.. అదే చెడు చేస్తే రెండుగా తిరిగొస్తాయి', 'వాడు పంచ్ ఇచ్చాక పంచ్ డైలాగ్ చెపుతాడు', 'చ‌చ్చిబ్ర‌త‌క‌డం నాకేం కొత్త కాదు బ్రో', 'ఒక నిజాన్ని చంపితే అది రెండుగా నిన్ను వెంటాడుతుంది', 'ప్ర‌జ‌ల్లో ఉండే ఆ భ‌య‌మే ప్రైవేట్ హాస్పిట‌ల్స్‌కి ఇన్వెస్ట్‌మెంట్‌', 'వ్యాపారంలో ఎన్నో ర‌కాలుండొచ్చు.. అయితే వైద్యం వ్యాపారం కాకూడ‌దు' వంటి డైలాగులు బాగున్నాయి. అలాగే విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ అందించిన స్క్రీన్‌ప్లే బాగుంది. క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన 'విచిత్ర సోద‌రులు' సినిమాలోని పాయింట్ ఆధారంగానే ఈ సినిమా రూపొందింద‌ని చెప్పాలి. కాక‌పోతే.. అక్క‌డ మెజీషియ‌న్ పాత్ర మరుగుజ్జు అయితే ఇక్క‌డ నార్మ‌ల్ గా ఉంటుంది. అంతే తేడా. అలాగే అక్క‌డ మెసేజ్ ఉండ‌దు. ఇక్క‌డ ఉంటుంది. వైద్య నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు కొన్ని.. 'గ‌ణేష్‌', 'ఠాగూర్' సినిమాల‌ను గుర్తుకు తీసుకువ‌స్తాయి. ఓవ‌రాల్‌గా అట్లీ డైరెక్ష‌న్ ఫ‌ర్వాలేదు.

ప్ల‌స్ పాయింట్స్‌
వైద్య నేప‌థ్యంలోని క‌థాంశం
నిత్యా మీన‌న్‌, ఎస్‌.జె.సూర్య న‌ట‌న‌
ఎ.ఆర్‌.రెహ‌మాన్ నేప‌థ్య సంగీతం
కొన్ని స‌న్నివేశాలు

మైన‌స్ పాయింట్స్‌
చాలా చోట్ల త‌మిళ నేటివిటి ఉండ‌డం
ఫ్లాష్ బ్యాక్ లోని కొన్ని సీన్స్‌
సినిమా నిడివి
ఎడిటింగ్‌
జి.ఎస్‌.టిపై డైలాగ్‌లు మ్యూట్ చేయడం

చివ‌ర‌గా.. క‌మ‌ర్షియ‌ల్‌ మెసేజ్ 'అదిరింది'
రేటింగ్: 3/5రికార్డు కొట్టిన 'మెర్స‌ల్‌'

Updated By ManamFri, 09/22/2017 - 13:34

త‌మిళ క‌థానాయ‌కుడు విజ‌య్ త్రిపాత్రాభిన‌యంలో రూపొందిన త‌మిళ చిత్రం 'మెర్స‌ల్‌'. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యా మీన‌న్‌, స‌మంత హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి 'రాజా రాణి' ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగులో ఈ సినిమా 'అదిరింది' పేరుతో విడుద‌ల కానుంది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించిన ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానుంది. 
ఇదిలా ఉంటే.. ద‌ర్శ‌కుడు అట్లీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నిన్న సాయంత్రం 6 గంట‌ల‌కు 'మెర్స‌ల్' త‌మిళ వెర్ష‌న్ టీజ‌ర్ విడుద‌లైంది. క‌ట్ చేస్తే.. ఇప్ప‌టికే 10 మిలియ‌న్లకి పైగా వ్యూస్‌ని పూర్తిచేసుకుంది. ఈ విష‌యంపై ద‌ర్శ‌కుడు, న‌టుడు ఎస్‌.జె.సూర్య ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ.. 'మెర్స‌ల్' 10 మిలియ‌న్ల వ్యూస్‌ని దాటేసింది. ఇదొక ప్ర‌పంచ రికార్డ్ అంటూ చెప్పుకొచ్చారు. టీజ‌ర్ లాగే సినిమా కూడా రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి.'అదిరింది' ఆ సినిమాకి న్యూ వెర్ష‌నా?

Updated By ManamThu, 09/21/2017 - 18:54

విజ‌య్ త్రిపాత్రాభిన‌యంలో 'రాజా రాణి' ఫేమ్ అట్లీ రూపొందించిన త‌మిళ చిత్రం 'మెర్స‌ల్‌'. తెలుగులో 'అదిరింది' పేరుతో ఈ సినిమా విడుద‌ల కానుంది. స‌మంత‌, కాజ‌ల్‌, నిత్యా మీన‌న్ హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాకి ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందిస్తున్నారు. దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమా విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఇవాళ ఈ చిత్రం త‌మిళ వెర్ష‌న్ టీజ‌ర్‌ విడుద‌ల‌య్యింది. మూడు పాత్ర‌ల్లో విజ‌య్ అద‌ర‌గొట్టేశాడు. అయితే ట్రైల‌ర్ చూసిన వాళ్లంతా ఒక‌టే మాట అంటున్నారు.

అదేమిటంటే.. క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన 'అపూర్వ స‌గోద‌ర‌గ‌ళ్' (విచిత్ర సోద‌రులు)కి న్యూ వెర్ష‌న్‌లా ఉంద‌ని. తెలుగులోనూ మంచి హిట్ అయిన ఆ సినిమాకి ఇళ‌య‌రాజా సంగీతం హైలెట్‌గా నిలిచింది. 'విచిత్ర సోద‌రులు'లో మ‌రుగుజ్జు పాత్ర ఉంటే.. ఈ సినిమాలో అలాంటిదేమీ టీజ‌ర్‌లో క‌నిపించ‌లేదు. అయితే ఓ పాత్ర మేజిషియ‌న్ కావ‌డం గ‌మ‌నార్హం. సినిమా విడుద‌ల‌య్యాక ఇది ఆ సినిమాకి న్యూ వెర్ష‌నా కాదా అనే దానిపై ఒక క్లారిటీ వ‌స్తుంది.

 అట్లీకి పాత సినిమాల‌ను కొత్త‌గా రూపొందించ‌డం ఇదే కొత్త కాదు. త‌న తొలి చిత్రం 'రాజా రాణి'ని మ‌ణిర‌త్నం 'మౌన‌రాగం'కి న్యూ వెర్ష‌న్‌లా తెర‌కెక్కిస్తే.. గ‌త చిత్రం 'తెరి' (పోలీస్‌)ని విజ‌య్‌కాంత్ 'స‌త్రియ‌న్' (క్ష‌త్రియుడు)కి న్యూ వెర్ష‌న్‌లా తెర‌కెక్కించాడు. అన్న‌ట్లు.. ఇవాళ అట్లీ బ‌ర్త్‌డే. అందుకే ఈ టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర బృందం. న్యూ వెర్ష‌న్‌ల‌తో అట్లీ హ్యాట్రిక్ కొడ‌తాడా?  లేదా? తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. అన్న‌ట్లు.. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నా టీజ‌ర్ లో ఎక్క‌డా వారిని చూపించ‌క‌పోవ‌డం విశేషం.రేపు 'మెర్స‌ల్' టీజ‌ర్‌

Updated By ManamWed, 09/20/2017 - 12:05

'తెరి' (తెలుగులో 'పోలీస్‌') వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత క‌థానాయ‌కుడు విజ‌య్‌, క‌థానాయిక స‌మంత‌, ద‌ర్శ‌కుడు అట్లీ కాంబినేష‌న్ వ‌స్తున్న చిత్రం 'మెర్స‌ల్‌'. తెలుగులో 'అదిరింది' పేరుతో ఈ సినిమా విడుద‌ల కానుంది. విజ‌య్ త్రిపాత్రాభిన‌యం చేసిన ఈ చిత్రంలో స‌మంత‌తో పాటు కాజ‌ల్‌, నిత్యా మీన‌న్ కూడా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించిన ఈ చిత్రంలోని త‌మిళ వెర్ష‌న్‌ పాట‌లు ఇటీవ‌లే విడుద‌ల‌య్యాయి. పాట‌ల‌కు మంచి స్పంద‌న ల‌భించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజ‌ర్‌ని రేపు సాయంత్రం 6 గంట‌ల‌కి విడుద‌ల చేయ‌నున్నారు. దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానున్న 'మెర్స‌ల్' పై త‌మిళ నాట  భారీ అంచ‌నాలే ఉన్నాయి. 

Related News