rave party

కర్నూలులో రేవ్ పార్టీ కలకలం

Updated By ManamFri, 11/09/2018 - 14:40
  • ఎరువుల కంపెనీ ఏజెంట్లకు విందు

  • మద్యం తాగి మహిళలతో అశ్లీల నృత్యాలు

  • గతంలోనూ రేవ్‌పార్టీ.. పట్టుకున్న షీ టీమ్

Rave partyకర్నూలు క్రైమ్: ఇన్నాళ్లూ హైదరాబాద్, బెంగుళూరు, తదితర మెట్రో నగరాలకే పరిమితమైన రేవ్ పార్టీలు కర్నూలుకు కూడా చేరుకుంటున్నాయి. నగరం నడిబొడ్డున బుధవారం జరిగిన రేవ్ పార్టీ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక శరీన్ నగర సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఎరువుల కంపెనీ ఒకటి తమ డీలర్లకు విందు ఏర్పాటు చేసింది.

నిర్ణీత సమయానికి అమ్మకాలు బాగా జరపడంతో.. ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలను తీసుకువచ్చి విందులో చుక్క, ముక్కతో పాటు మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ ఎంజాయ్ చేశారు. మద్యం తాగిన కొంతమందికి కిక్కు ఎక్కి నృత్యం చేస్తున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో గొడవ మొదలైంది.

దాంతో రేవ్ పార్టీని అర్ధాంతరంగా ముగించారు. గతంలో కూడా రాజవిహార్ సెంటర్లోని ఒక హోటల్లో ఫర్టిలైజర్ డీలర్లు రేవ్ పార్టీ ఏర్పాటు చేసి షీటీం పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. అప్పట్లో డీలర్లతో పాటు ఒక సీఐ కూడా అడ్డంగా దొరికిపోయి సస్పెండయ్యారు. ఆ ఘటన మరువకముందే నగరంలో మరో రేవ్‌పార్టీకి తెరతీయడం కల్లోలం రేపుతుంది.రంపచోడవరంలో రేవ్ పార్టీ.. 28మంది అరెస్ట్

Updated By ManamSat, 09/08/2018 - 11:58

Rave Partyరంపచోడవరం: మొన్నటివరకు కేవలం నగరాలకు పరిమితమైన రేవ్ పార్టీల సంస్కృతి పల్లెలకు విస్తరిస్తోంది. మద్యం మత్తులో విశృంఖల కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కొందరు. అర్ధరాత్రి వరకు తాగితందనాలాడుతూ అనైతిక చర్యలకు దిగుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం దేవరాతిగూడెం వద్ద ఏవన్‌ రిసార్ట్‌లో రేవ్ పార్టీ నిర్వహించారు. అయితే దీనిపై ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ఈ క్రమంలో ఏడుగురు మహిళలు, 20 మంది పురుషులు సహా నిర్వాహకుడు రమణ మహర్షిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనాస్థలం నుంచి ఐదు కార్లతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయిలతో అర్ధనగ్న డ్యాన్స్‌లు

Updated By ManamWed, 12/13/2017 - 19:09

partyహైదరాబాద్: నగర శివార్లలోని రిసార్ట్స్, ఫాంహౌస్‌లపై నిఘా తగ్గడంతో మరోసారి విలాస పురుషులు రెచ్చిపోయారు. పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫాం హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. బర్త్‌డే పార్టీ పేరుతో ముగ్గురు అమ్మాయిలను తీసుకొచ్చి అర్ధ నగ్నంగా డ్యాన్స్‌లు చేయిస్తూ.. మద్యం సేవిస్తూ విలాస పురుషులు నానా హంగామా చేశారు. ఆ పార్టీలో ఉన్న కొందరు యువకులు డ్యాన్స్ చేస్తున్న యువతులపై పడి అసభ్యంగా ప్రవర్తించారు. ఆ యువతులు ఆర్గనైజర్‌తో కలిసి పారిపోతుండగా పోలీసులు వారిని పట్టుకుని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం 13 మంది యువకులు, ముగ్గురు యువతులు పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. ఆ 13మంది యువకుల్లో ముగ్గురు పోలీసులకు చిక్కారు. మిగిలిన 10మంది యువకులు పరారీలో ఉన్నారు. ముగ్గురు యువతులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూమ్స్ బయట తాగి పడేసిన మద్యం సీసాలు కనిపించాయి. న్యూ ఇయర్‌ సమీపిస్తున్న వేళ ఇలాంటి రేవ్ పార్టీలు జోరందుకుంటున్న నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు.

Related News