students

అమెరికాలో కాల్పులు.. 12మంది మృతి

Updated By ManamFri, 11/09/2018 - 08:56

Americaకాలిఫోర్నియా: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సంగీత హోరులో మునిగితేలిన యువతే లక్ష్యంగా నౌకాదళ మాజీ మెరీన్ ఉద్యోగి చేసిన కాల్పుల్లో 12మంది దుర్మరణం చెందారు. మరో 21మంది గాయపడ్డారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజిలెస్ శివార్లలో ఈ ఘటన జరిగింది. 

అక్కడ ఓ బార్‌లో కాలేజీ విద్యార్థుల కోసం వెడ్‌నెస్‌డే నైట్ పార్టీని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వందల మంది యువతీ యువకులు వెళ్లారు. యువతీ యువకులంతా ఉల్లాసంతా ఆడుతూ పాడుతూ ఉన్న సమయంలో నౌకాదళ మాజీ మెరీన్ ఉద్యోగి ఇయాన్ డేవిడ్ లాంగ్ బార్‌లోకి ప్రవేశించాడు. వచ్చీ రాగానే పొగ బాంబులు విసిరి గందరగోళం సృష్టించిన డేవిడ్.. ఆ వెంటనే పిస్తోలుతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఉలిక్కిపడ్డ యువత ఆర్తనాదాలు చేసుకుంటూ తలోదిక్కుకు పలుగురు తీశారు. ఈ క్రమంలో 10మంది చనిపోగా, కొంతమంది గాయపడ్డారు.

విషయం తెలియగానే రంగంలోకి దిగిన పోలీస్ బృందాలు బార్‌ను చుట్టుముట్టాయి. అనంతరం బార్‌లోకి వెళ్లిన ఓ పోలీస్ అధికారి రాన్‌పై డేవిడ్ కాల్పులు జరపగా.. తీవ్రగాయాలపాలైన ఆయన ఆసుపత్రిలో తుదిశ్వాసను విడిచాడు. ఆ తరువాత తనను తాను కాల్చుకొని మరణించాడు డేవిడ్. కాగా అమెరికా నౌకాదళంలోని ప్రతిష్టాత్మక మెరీన్ కోర్‌లో పనిచేసిన డేవిడ్, చిన్నపాటి నేరాలకు పాల్పడేవాడని, కానీ ఈ చర్యకు ఎలా పాల్పడ్డాడో కారణం కనుక్కుంటామని అధికారులు తెలిపారు. మరోవైపు డేవిడ్ ఇంట్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాగా పది రోజుల క్రితం అమెరికాలోని యూదుల ప్రార్థన స్థలంలో జరిపిన కాల్పుల్లో 11మంది మరణించిన విషయం తెలిసిందే.అరబిందో స్కూల్ బస్సుకు ప్రమాదం

Updated By ManamTue, 09/25/2018 - 17:25
  • 13మంది విద్యార్థులకు గాయాలు

  • ఇద్దరి పరిస్థితి విషమం

warangal school accident

వరంగల్ :  ఓ స్కూల్ బస్సును  ఆయిల్ ట్యాంకర్ వెనుక నుండి ఢీ కొన్న దుర్ఘటనలో 13మంది విద్యార్థులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ రురల్ జిల్లా వర్దన్న పేట తహశీల్ధార్ కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం అరబిందో స్కూల్ బస్సును, ఓ ఆయిల్ ట్యాంకర్ వెనక నుండి వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో  13మంది విద్యార్థులు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

lorry hits school bus in warangal

 మందు బిళ్లలు వికటించి.. గిరిజన విద్యార్థినులకు అస్వస్థత

Updated By ManamWed, 09/05/2018 - 00:02
  • నలుగురికి అందుతున్న వైద్యం 

  • బాధితులకు మంత్రి సుజయ్ పరామర్శ

studentవిజయనగరం: జ్వరం బారిన పడకుండా ముందు జాగ్రత్తగా వేసుకున్న మందులు వారికి శాపంగా మారాయి. మందు బిళ్లలు వికటించడంతో 14 మంది గిరిజన విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం కొత్తవలస ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 14 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మలేరియా బారిన పడకుండా ఉండేందుకు విద్యార్థినులు వేసుకున్న క్లోరోక్లిన్ టాబ్లెట్స్ వికంటించాయి. దీంతో విద్యార్థులు  వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వారిని హుటాహుటిన సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. సకాలంలో వైద్యం అందించడంతో పదిమంది కోలుకున్నారు. మరో నలుగురికి ఇంకా చికిత్స కొనసాగుతుంది. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు మంగళవారం సాలూరులో పర్యటించి బాధితులను పరామర్శించారు. కొత్తవలస ఆశ్రమ పాఠశాలలో కొద్ది రోజులుగా ప్రబలుతున్న విష జ్వరాల కారణంగా కొంతమంది విద్యార్ధినులు జ్వరాల బారిన పడ్డారు. సోమవారం సాయంత్రం జ్వరంతో బాధపడుతున్న విద్యార్ధినులకు పాలు రొట్టె ఇచ్చిన అనంతరం హాస్టల్ సిబ్బంది మలేరియా ప్రివెన్షన్‌కు సంబంధించిన క్లోరోక్విన్ ట్లాబ్లెట్స్‌ను వేయించారు. టాబ్లెట్స్ వేసుకున్న కొద్ది సేపటికే అవి వికటించి విద్యార్థులంతా వాంతులు చేసుకున్నారు. వారిలో పద్నాలుగు మందికి సొమ్మసిల్లి పడిపోవడంతో వారిని సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. అయితే ఆస్పత్రిలో బెడ్స్ లేని కారణంగా బాధితులందరిని కూర్చోబెట్టి వైద్యులు స్లైన్ ఎక్కించారు. చికిత్స పొందిన వారిలో పది మంది కోలుకోగా వారిని తిరిగి హాస్టల్‌కు చేర్చారు. అలమండ పావని, మచ్చ ప్రమీల, చుక్క శ్రావణి, హేమలతలు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఐటీడీఏ పీవో డాక్టర్ లక్ష్మీశా విచారణకు ఆదేశించారు.
 ట్రిపుల్ ఐటీలో మత ప్రార్థనల కలకలం

Updated By ManamMon, 08/13/2018 - 13:22
AP IIIT Nuzvid

నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో మత ప్రార్థనలు కలకలం రేపుతున్నాయి. పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయంటూ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మత ప్రార్థనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ట్రిపుల్ ఐటీ ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు సమాచారం. దీనిపై వైస్ చాన్సులర్ విచారణకు ఆదేశాలు ఇచ్చారు.   ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఎస్వీయూలో కలకలం.. మరో మెడికో ఆత్మహత్య

Updated By ManamSun, 08/12/2018 - 20:19

Medico's suicide

తిరుపతి: ఎస్వీ యూనివర్శిటీలో వారం రోజుల క్రితం మెడికో శిల్ప ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే యూనివర్శిటీలో మరో ఘోరం చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న గీతిక అనే విద్యార్థిని ఆదివారం సాయంత్రం హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విద్యార్థినిది కడప జిల్లా అని తెలిసింది.

Medico Geethika suicide

వివరాల్లోకెళితే.. ఆదివారం సాయంత్రం ఆమె స్నేహితులు బయటికెళ్లి హాస్టల్‌కు వచ్చిన వాళ్లు తలుపు కొట్టినప్పటికీ గీతిక నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కంగారుపడ్డ తోటి విద్యార్థునులు వార్డన్‌కు సమాచారం అందివ్వగా వచ్చి తాళం పగలకొట్టిన వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. హుటాహుటిన గీతికను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనతో యూనివర్శిటీలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా వారం తిరగక మునుపే రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో అసలు క్యాంపస్‌లో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ ఇద్దరి ఆత్మహత్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. అయితే గీతిక ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణమేంటి? లైంగిక వేధింపులే కారణమా..? లేకుంటే తోటి విద్యార్థుల వేధింపులా..? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. విద్యార్థిని హాస్టల్ గదిలో ఎలాంటి సూసైట్ నోట్ లభించలేదు.

Medico Geethika suicide 1కాగా.. శిల్ప ఆత్మహత్యతో గత కొద్దిరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఆత్మహత్య అనంతరం పరిణామాలు మారతాయని భావించినప్పటికీ ఫలితం లేకపోయింది. మరో విద్యార్థిని మరణించినట్లు తెలుసుకున్న ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్ హుటాహుటిన క్యాంపస్‌కు చేరుకుని అసలేం జరిగిందా? అని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వరుస ఘటనలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 

విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలివేనా?
మెడిసిన్ చదివే విద్యార్థులు చాలా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ప్రొఫెసర్లు మొదలుకుని సీనియర్ విద్యార్థుల వరకు వేధింపులు కూడా ఈ ఆత్మహత్యలకు కారణమే అని సమాచారం. రోజుకు 12 గంటల పాటు చదువుకోవడం, పనిచేయడం ఇలా ఎక్కువ శాతం విద్యార్థినిలపై ఒత్తిడి రావడంతో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని తోటి విద్యార్థులు చెబుతున్నారు. కాగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు స్వయంగా శిల్ప అనే మెడికే గవర్నర్‌కు రాసిన లేఖలో తేటతెల్లమైన సంగతి తెలిసిందే. అయితే మగ ప్రొఫెసర్లతో పాటు మహిళా ప్రొఫెసర్ల నుంచి కూడా వేధింపులు ఉంటాయని కొందరు మెడికోలు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందో లేక మిన్నకుండిపోతుందో వేచి చూడాల్సిందే.ఆరోపణలు అవాస్తవం: సంజయ్

Updated By ManamFri, 08/03/2018 - 13:09
dharmapuri sanjay condemns allegations

నిజామాబాద్  : తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను రాజ్యసభ సభ్యుడు డీఎస్ తనయుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఖండించారు.  తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. నర్సింగ్ విద్యార్థులతో నాకు ఎలాంటి సంబంధం లేదు.

శాంకరీ నర్సింగ్ కాలేజీని వేరేవారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆ కాలేజీలో ఎవరు చదువుతున్నారో కూడా నాకు తెలియదు.  ఆ కాలేజీ అడ్మిషన్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ కాలేజీలో ఎవరు చదువుతున్నారో కూడా తెలియదు.  ఎవరో కావాలనే ఆ విద్యార్థినులతో అలా చెప్పించారు.

నాకు కుటుంబం ఉంది. భార్యా పిల్లలు ఉన్నారు. నేను ఎవరితో సహజీవనం చేయడం లేదు. రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్ర పన్నారు.  పోలీసులకు సహకరిస్తా.’ అని తెలిపారు. కాగా ధర్మపురి సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ శాంకరీ నర్సింగ్ కాలేజీలో చదువుతున్న 11మంది నర్సింగ్ విద్యార్థులు నిన్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

చదవండి....

డీఎస్ తనయుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు

 కూలిన స్కూల్ గోడ.. ఇద్దరు చిన్నారుల మృతి

Updated By ManamThu, 08/02/2018 - 16:35

students హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో విషాదం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్‌లో గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పిల్లలంతా ఒకే తరగతికి చెందినవారు కాగా చనిపోయిన వారిని మహికృష్ణ(9), చందన(8)లుగా గుర్తించారు. చిన్నారులకు కరాటే నేర్పిస్తున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన చిన్నారులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న చిన్నారుల తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. అయితే ఈ సంఘటనపై ఇంకా స్కూల్ యాజమాన్యం స్పందించలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.స్కూల్ ఫీజు కట్టలేదని...దారుణం

Updated By ManamWed, 07/11/2018 - 13:50
Rabea Girls Public School

న్యూఢిల్లీ : స్కూల్ ఫీజు కట్టడం ఆలస్యం అయినందుకు యాజమాన్యం దారుణంగా వ్యవహరించింది. ఫీజు కట్టని విద్యార్థులను స్కూల్ భవనం బేస్‌మెంట్‌లో బంధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రయివేట్ స్కూల్‌లో ఈ నెల 9వ తేదీన సుమారు 60మంది కిండర్ గార్డెన్ విద్యార్థులను బేస్‌మెంట్‌లో సుమారు నాలుగు గంటల పాటు నిర్బంధించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.  

Rabea Girls Public School కాగా ఈ ఘటనపై స్కూల్ హెడ్ మాస్టర్ ఫరా దిబా మాట్లాడుతూ.. ‘బేస్‌మెంట్‌ పిల్లలు ఆడుకుంటున్నారు. వారితో పాటు ఇద్దరు టీచర్లు కూడా ఉన్నారు. సాధారణంగా పిల్లల్ని గ్రౌండ్‌ ఫ్లోర్ లోనే ఆడిస్తాం అయితే అక్కడ ఫ్యాన్ రిపేర్ రావడంతో ఇక్కడ ఉంచాం. అంతేకానీ ఫీజు చెల్లించలేదని చిన్నారులను నిర్భందించినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవం’ అని చెప్పుకొచ్చారు. ఐసెట్‌లో అబ్బాయిల హవా

Updated By ManamThu, 06/14/2018 - 00:37
  • హైదరాబాదీకి ఫస్ట్ ర్యాంక్.. 164తో ముందున్న సత్య ఆదిత్య 

  • టాప్‌టెన్‌లో ఒకే ఒక్క అమ్మాయి.. మిగతా 9 ర్యాంకులూ అబ్బాయిలకే

  • 90.25 ఉత్తీర్ణత శాతం నమోదు.. 15 రోజుల్లో కౌన్సెలింగ్ 

studentsహైదరాబాద్: తెలంగాణ ఐసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విద్యా మండలి కార్యాలయంలో ఫలితాలను విడు దల చేశారు. టీఎస్‌ఐసెట్‌లో మొత్తం 90.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిం చారు. ఈ సంవత్సరం ఈ పరీక్షకు 55,191 మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్షకు హాజరవ్వ గా.. 49,812 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 15 రోజుల్లో ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. టీఎస్ ఐసెట్‌కు పురుషులు 29139 మంది, మహిళలు 26051 మంది, ఒకట్రాన్స్‌జెండర్స్ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో పురుషులు 26381(90.54 శాతం) మంది, 23430( 89.94 శాతం) మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ అర్హత సాధించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 14 రీజనల్ కేంద్రాల్లో 67 సెంటర్లలో 23, 24 తేదీల్లో టీఎస్‌ఐసెట్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. వెబ్‌కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

టాప్‌టెన్ ర్యాంకర్స్ వీరే..
హైదరాబాద్ విజయనగర్ కాలనీకి చెందిన సత్య ఆదిత్య తాటి 164.28882 మార్కులతో ప్రథమ ర్యాంకును సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ డీడీ కాలనీకి చెందిన యల్చూరి సాయిసందీప్ 163 మార్కులతో రెండో ర్యాంకు, మేడ్చల్ జిల్లా గాంధీనగర్ చక్రిపురానికి చెందిన గాదె నవీన్‌కుమార్ 162 మార్కులతో మూడో ర్యాంకు, ఖమ్మం జిల్లా అర్బన్ ప్రాంతానికి చెందిన సీమకూర్తి లక్ష్మీసరస్వతి 161 మార్కులతో నాలుగో ర్యాంకును సాధించారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా జంగమగుంట్ల గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌రెడ్డి పిదప 159 మార్కులతో ఐదో ర్యాంకు, మహారాష్ట్ర థానే వెస్ట్‌కు చెందిన రోహన్ జోషి 157 మార్కులతో ఆరో ర్యాంకు, జగిత్యాల జిల్లా కలానగర్‌కు చెందిన అలేటి ఫధ్వీతేజ 154 మార్కులతో ఏడో ర్యాంకు, ఎల్బీనగర్‌కు చెందిన గుబ్బ రంజిత్‌కుమార్ 153 మార్కులతో ఎనిమిదో ర్యాంకు, రంగారెడ్డి జిల్లా నాగోల్‌కు చెందిన డి.అవినాష్ 153 మార్కులతో తొమ్మిదో ర్యాంకు, రంగారెడ్డి జిల్లా గుర్రంగూడకు చెందిన కౌత్వారపు వెంకటకౌషిక్ 152 మార్కులతో పదో ర్యాంకును సాధించారు.

జిల్లాల వారీగా ఫలితాల వివరాలు..
టీఎస్‌ఐసెట్‌ను మొత్తం 14 రీజనల్ కేంద్రాల్లో 67 సెంటర్లలో నిర్వహించారు. హైదరాబాద్ రీజనల్‌లోని ఐదు కేంద్రాల్లో 6797 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 6221 మంది ఉత్తీర్ణులయ్యారు. కరీంనగర్‌లో 4909 మందికి 4253 మంది, ఖమ్మంలో 2498 మందికి 2179, కోదాడ(నల్లగొండ జిల్లా)లో 1216 మంది పరీక్ష రాస్తే.. 1084 మంది, మహబూబ్‌నగర్‌లో 738 మందికి 655 మంది, మెదక్, నర్సాపూర్(సిద్ధిపేట జిల్లా)లో 931 మందికి 819 మంది, రంగారెడ్డిలో 28224 మందికి 25800 మంది, సంగారెడ్డిలో 2028 మందికి 1824 మంది, వరంగల్‌లో 5677 మంది పరీక్షకు హాజరైతే.. 4955 మంది, నిజామాబాద్‌లో 721 మందికి 646 మంది, కర్నూల్‌లో 565 మందికి 522, తిరుపతిలో 205 మందికి 198, విజయవాడలో 437 మందికి 422 మంది, విశాఖపట్నంలో 245 మందికి 234 మంది విద్యార్థులు టీఎస్‌ఐసెట్‌లో ఉత్తీర్ణులయ్యారు.

యూనివర్సిటీ రీజియన్ల వారీగా..
టీఎస్‌ఐసెట్ ఫలితాల్లో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 51656 మంది పరీక్షకు హాజరైతే.. 46532 మంది క్వాలిఫై అయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 737 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే.. 694 మంది, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 789 మందికి 720 మంది, మిగతా యూనివర్సిటీల పరిధిలో 2009 మంది పరీక్ష రాస్తే.. 1866 మంది అర్హత సాధించారు.

ఫలితాల్లో అబ్బాయిలదే అధిక్యం..
టీఎస్ ఐసెట్ ఫలితాలు అబ్బాయిలు అధిక్యాన్ని ప్రదర్శించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 89.94 శాతం కాగా, అబ్బాయిలు 90.54 శాతం ఉత్తీర్ణతను కనబరిచారు. మొదటి 20 ర్యాంకుల్లో 17 ర్యాంకులు అబ్బాయిలవే కావడం గమనార్హం. ఇదిలావుంటే.. టాప్ టెన్ ర్యాంకుల్లో ఒకే ఒక్క మహిళ ర్యాంకును సాధించగా, మిగతా తొమ్మిది ర్యాంకులు పురుషులే దక్కించుకున్నారు. టాప్-20 ర్యాంకుల్లో చూస్తే.. కేవలం ముగ్గురు మాత్రమే మహిళలు ర్యాంకులు సాధించడం గమనార్హం.సప్లిమెంటరీలో ఒకే ఒక్కడు!

Updated By ManamWed, 06/13/2018 - 23:55
  • టెన్త్ సోషల్ పరీక్షలో ఒక విద్యార్థికి 12 మంది అధికారుల పర్యవేక్షణ

studentపత్తికొండ: ఒకరు పరీక్ష హాలులో ఇన్విజలేటర్.. ప్రశ్న పత్రాల పర్యవేక్షణకు ఓ అధికారి.. వాటిని పరీక్ష గది వరకు తెచ్చేందుకు ఓ అటెండర్.. పరీక్ష హాలు వద్ద రక్షణగా పోలీసులు.. మాస్‌కాపీయింగ్ జరగకుండా స్క్వాడ్‌లు.. సెంటర్ సూపరింటెండెంట్.. డిపార్ట్‌మెంట్ ఆఫీసర్.. ఇలా 12 మంది అధికారుల పర్యవేక్షణలో జరిగిన పరీక్ష అది... ఇంత పకడ్బందీ ఏర్పాటు బాగానే ఉన్నా.. అక్కడ పరీక్ష రాసింది మాత్రం ఒకే ఒక్కడు! ఈ వింత పరిస్థితి కర్నూలు జిల్లా పత్తికొండలో చోటుచేసుకుంది. గత వారం నుంచి జరుగుతున్న పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా బుధవారం సోషల్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే పత్తికొండ పరీక్ష కేంద్రంలో దామోదర్ అనే ఒకే ఒక్క విద్యార్థి హాజరయ్యాడు. దీంతో ఆ పరీక్షకు మొత్తం 12 మంది తప్పక విధులు నిర్వహించాల్సి వచ్చింది.

Related News