alia bhatt

‘బ్రహ్మాస్త్ర’ మొదటి పార్ట్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్

Updated By ManamTue, 11/13/2018 - 13:04
Brahmastra

అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ప్రధానపాత్రలలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. కాగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర మొదటి భాగానికి విడుదల తేది ఖరారు అయ్యింది. క్రిస్మస్ కానుకగా వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్ర మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. కరణ్ జోహార్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.సరైనోడు దొరికాడట

Updated By ManamFri, 11/09/2018 - 05:14

బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ హీరో రణభీర్ కపూర్‌తో పీకల లోతుల్లో ప్రేమలో మునిగి ఉంది. ఇది వరకు రణభీర్ దీపికా, కత్రినాలతో ప్రేమాయణం నడిపినా పెళ్లి వరకు కొనసాగించలేకపోయారు. తాజాగా రణభీర్, అలియా మధ్య ప్రేమాయణం నడుస్తుంది. ఇటీవల ఓ షోలో అలియా మాట్లాడుతూ ‘‘నాకు సరైనోడు దొరికాడు.. నా పట్ల ప్రేమ, అభిమానం ఉన్నవాడే కాదు.. అందమైనవాడు కూడా. దర్శకులు చెప్పినట్లు నేను కెమెరా ముందు నటిస్తాను కానీ నిజ జీవితంలో నటించను. నటించాల్సిన అవసరం రాలేదు’ అంటూ చెపుకొచ్చింది. వీరిద్దరూ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాలీవుడ్‌లో వినపడుతున్నాయి. మరి రణభీర్, అలియా ప్రేమ పెళ్లి వరకు కొనసాగుతుందా? అంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.
 

image

 తాగితే అతడు మనిషి కాదు: నటి

Updated By ManamWed, 10/24/2018 - 13:05

Soni Razdanతాగితే అతడు మనిషి కాదంటూ బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్‌పై అలియా భట్ తల్లి, సీనియర్ నటి సోని రజ్దాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీటూ ఉద్యమంలో అలోక్ నాథ్ పేరు కూడా బయటికి రాగా.. అతడిపై వింటా నంథాతో పాటు పలువురు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో మాట్లాడిన సోని.. అతడితో నేను కలిసి పనిచేశాను. తాగితే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడు. అతడు నన్ను చూసే విధానం కూడా నాకు నచ్చేది కాదు అంటూ తెలిపింది.

ఇక చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు తనకు ఎలాంటి లైంగిక వేధింపులు ఎదురుకాలేదని, కానీ ఓ సినిమా షూటింగ్ సమయంలో ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేయబోయాడని.. అదృష్టం బావుండి అక్కడి నుంచి తప్పించుకున్నానని తెలిపింది. ఇప్పుడు అతడి పేరును బయటపెట్టాలనుకోవడం లేదని.. ఎందుకంటే అతడి తప్పు కారణంగా కుటుంబం మొత్తం బాధపడకూడదని సోని వెల్లడించింది.మా మ్యాజిక్‌ను వాళ్లు రీక్రియేట్ చేయలేరు: కాజోల్

Updated By ManamTue, 10/16/2018 - 15:09

Kuch Kuch Hota haiషారూక్ ఖాన్, కాజోల్, రాణి ముఖర్జీ, సల్మాన్ ఖాన్ ప్రధానపాత్రలలో 1998లో వచ్చిన ‘కుచ్ కుచ్ హోతా హై’ బాలీవుడ్‌లో ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా ఈ చిత్రం 20సంవత్సరాలను పూర్తి చేసుకోగా.. ఈ మూవీ సీక్వెల్‌పై ఇటీవల ఓ హింట్ ఇచ్చాడు దర్శకనిర్మాత కరణ్ జోహార్.

ఒకవేళ కుచ్ కుచ్ హోతా హై సీక్వెల్ చేయాల్సి వస్తే అందులో రణ్‌బీర్, అలియా, జాన్వీలను తీసుకుంటానని కరణ్ జోహార్ ప్రకటించాడు. ఇక ఇదే విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాజల్‌ను ప్రశ్నించగా.. ‘‘వాళ్లు బాగా చేస్తారని నమ్ముతా. కానీ మా మ్యాజిక్‌ను మాత్రం వాళ్లు రీక్రియేట్ చేయలేరు. అది అంత ఈజీ కాదు’’ అంటూ చెప్పుకొచ్చింది.

Kuch Kuch Hota Hai Sequel


 శత్రువులు, మాజీలు అందరూ ఒకే ఫొటోలో

Updated By ManamThu, 09/27/2018 - 10:45
Bollywood Stars

మామూలుగా శత్రువులు, మాజీ లవర్లు ఒకరికొకరు ఎదురుపడితే పలకరించుకోవడమే కష్టమే. కానీ ఇక్కడ మాత్రం అందరూ కలిసిపోయారు. అంతేకాదు హుషారుగా ఎంజాయ్ చేస్తూ ఫొటోలకు పోజ్‌లు ఇచ్చారు. బాలీవుడ్ హీరోలు షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్, హీరోయిన్లు అలియా భట్, దీపికా దర్శకనిర్మాత కరణ్ జోహార్ వీరందరూ ఒకే చోట కలిశారు. ఇంకేముంది అల్లరి అల్లరి చేస్తూ ఫొటోలు తీసుకున్నారు. ఇలా వీరందరూ కలిసి ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా.. అందరినీ ఆకట్టుకుంటోంది.

కాగా షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్‌ల మధ్య ఒకప్పుడు విబేధాలు ఉండేవి. ఈ ఇద్దరు ఒకరి గురించి మరొకరు మాట్లడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. అలాంటిది రెండు సంవత్సరాల క్రితం దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కలిసిపోయి, తమ ఫ్రెండ్‌షిప్‌ను చాటుకున్నారు. అంతేకాదు ఆ తరువాత కూడా ఒకరికి మరొకరు మద్దతును తెలుపుకుంటూ కలిసిపోయారు. ఇక రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమలో పడకముందు దీపికా పదుకునే రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమాయణం కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే విబేధాల కారణంగా రణ్‌బీర్‌తో విడిపోయినప్పటికీ.. ఇటీవల ఈ ఇద్దరు ఓ చారిటీ కోసం కలిసి ర్యాంప్ వాక్ చేశారు. అంతేకాదు ఫొటోగ్రఫీ డే రోజు రణ్‌బీర్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసిన దీపికా.. తాము మంచి స్నేహితులమని చెప్పకనే చెప్పింది.‘బ్రహ్మాస్త్ర’ సెట్‌లో రాష్ట్రపతి

Updated By ManamThu, 09/06/2018 - 12:56

Brahmashtraఅమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌ ప్రధానపాత్రలో అయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతుంది. మరోవైపు బల్గేరియా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తాజాగా బ్రహ్మాస్త్ర సెట్‌లో సందడి చేశాడు. ఈ విషయాన్ని నిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫొటోలను పెట్టారు. కాగా ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కెమెరా అప్పియరెన్స్ ఇస్తుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

 భారీ తారాగణంతో కరణ్ ‘తక్త్’.. నటీనటులు వీరే

Updated By ManamThu, 08/09/2018 - 13:53

takhtబాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ తన దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ‘తక్త్’ అనే పేరుతో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో భారీ తారాగణం నటించనుంది. అందులో రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్, అనిల్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, భూమి పడ్నేకర్, జాన్వీ కపూర్‌లు నటించనున్నారు. దీనికి సంబంధించిన ఆయన అధికారిక ప్రకటనను ఇచ్చారు. ఈ చిత్రం ప్రేమ, యుద్ధానికి సంబంధించినది అని కరణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుండగా.. 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కరణ్ స్వీయ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. కాగా కరణ్ జోహార్ దర్శకత్వంలో చివరగా ‘యే దిల్ హై ముష్కిల్’ తెరకెక్కిన విషయం తెలిసిందే.నేను చాలా మారిపోయా: రణ్‌బీర్

Updated By ManamWed, 08/01/2018 - 17:13
Ranbir Kapoor

రణ్‌బీర్ కపూర్ చాలా మారిపోయాడట. నేను అప్పటిలా లేనని అతడు ఇటీవల చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంతకు ఏ విషయంలో అతడు మారిపోయాడని అనుకుంటున్నారా..? బంధాల విషయంలో. ప్రేమలో రణ్‌బీర్ నిజాయితీ ఉండడంటూ అతడితో బ్రేకప్‌ అయిన దీపికా, కత్రినా బహిరంగంగానే తెలిపారు. అయితే ఆ విషయంలో ఇప్పుడు తాను చాలా మారిపోయానని రణ్‌వీర్ తెలిపాడు. ప్రస్తుతం తాను బంధాలను చాలా విలువ ఇస్తానని తెలిపాడు.

ప్రస్తుతం రణ్‌బీర్, అలియాతో ప్రేమలో ఉండగా.. ఆమె గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రేమలో పడటం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. కొత్త మనిషి, కొత్త ఆలోచనలు అవన్నీ మనల్ని చాలా ఆనందపరుస్తుంటాయి. గతంలో అపరిపక్వత వల్లన నా గర్ల్‌ఫ్రెండ్స్‌ను మోసం చేశా. కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయా’’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రణ్‌బీర్ మాటలను ఎంత వరకు నమ్మాలో అర్థం కావడం లేదని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.రణ్‌బీర్‌ నాకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికాడు

Updated By ManamWed, 07/25/2018 - 14:42

Ranbir, deepikaరణ్‌వీర్ సింగ్‌తో ప్రేమాయణం కొనసాగించక మునుపు దీపికా పదుకొనే, రణ్‌బీర్ కపూర్‌లు కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేసి, మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తరువాత ఒకరి గురించి మరొకరు మాట్లాడేందుకు కూడా వీరు ఇష్టపడలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దీపికా పదుకునే రణ్‌బీర్ పేరు చెప్పకుండా.. తన పాత రిలేషన్‌ ఎందుకు చెడిందో చెప్పింది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్‌పై ఘాటు కామెంట్లు చేసింది దీపికా.

‘‘రిలేషన్‌లో ఉన్నప్పుడు నేను ఎవరినీ మోసం చేయలేదు. కానీ అతడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి నా నమ్మకాన్ని వమ్ముచేశాడు. ఆ సమయంలో రెండో చాన్స్ ఇవ్వాలంటూ చాలా ప్రాధేయపడ్డాడు. కానీ మరోసారి ఫూల్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే అతడికి దూరమయ్యాను. అతడి నుంచి విడిపోయిన తరువాత చాలా కుమిలిపోయా. ఆ తరువాత ఆ విషాదం నుంచి నెమ్మదిగా బయటపడ్డా’’ అంటూ రణ్‌బీర్ గురించి చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అయితే దీపికాతో బ్రేకప్ తరువాత రణ్‌బీర్, కత్రినాను ప్రేమించాడు. వీరి రిలేషన్ కూడా మూడు రోజుల ముచ్చటగానే నిలిచింది. విడిపోయిన సమయంలో కత్రినా కూడా రణ్‌బీర్‌పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం అలియాతో రణ్‌బీర్ ప్రేమలో ఉన్నాడు.ఆ ఊరి వెలుగులకు అలియానే కారణం

Updated By ManamMon, 07/16/2018 - 09:30

alia మండ్య: కర్ణాటకలోని మండ్య జిల్లాలో కిక్కేరి అనే గ్రామంలో 40 ఇళ్లకు వెలుగులు రావడానికి బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కారణమైంది. విద్యుత్ సౌకర్యం లేని పేదలకు ఉచితంగా సోలార్ విద్యుత్ ఉపకరణాలు అందించేందుకు బెంగళూరులోని ఓ సంస్థ ముందడుగు వేసింది. ఈ క్రమంలో దీనికి సహకరించాలంటూ సంస్థ ప్రతినిధులు ఇటీవల అలియాను కలిసి, కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన అలియాభ్ తన దుస్తులను వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును సంస్థకు అందించింది. ఆ డబ్బుతో మండ్య జిల్లా కిక్కెరి గ్రామంలోని 40మంది పేదలకు సోలార్ విద్యుత్ ఉపకరణాలను అందించారు సంస్థ ప్రతినిధులు. ఈ సందర్భంగా వారు అలియాకు ధన్యవాదాలు తెలిపారు.

Related News