image

వీసీఐసీకి పూర్తి సహకారం కావాలి

Updated By ManamFri, 07/20/2018 - 00:31
 • ఏడీబీ ఉపాధ్యక్షునికి సీఎస్ విజ్ఞప్తి 

imageఅమరావతి: విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక నడవా(ఇండస్ట్రీయల్ కారిడార్)ను త్వరగా ఏర్పాటు చేయడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)పూర్తి సహకారం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. వీసీఐసీ ప్రాజెక్టు ప్రగతి అంశంపై ఏడీబీ ఉపాధ్యక్షుడు వెన్నాయ్ ఝాంగ్ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా ఏర్పాటుకు ఏడీబీ రూ.5,544 కోట్లు రుణ సాయం అందిస్తోంది. ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నం, మచిలీపట్నం, దొనకొండ, శ్రీకాళహస్తి-ఏర్పేడుల్లో నాలుగు పారిశ్రామిక క్లస్టర్‌లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేశారు. ఇప్పటికే ఏడీబీ రూ.537 కోట్లు విడుదల చేసింది. కాగా, వీసీఐసీలో గుర్తించిన నాలుగు ఇండస్ట్రీయల్ క్లస్టర్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏడీబీ ఉపాధ్యక్షుడు వెన్కాయ్ ఝాంగ్ మాట్లాడుతూ విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్లో పనుల పురోగతిని స్వయంగా తెలుసుకునేందుకు తమ బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంతో పాటు చెన్నైలో కూడా పర్యటించనుందన్నారు. ఈ భేటీలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్, పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్ధ జైన్, ఏడీబీ  కంట్రీ డైరెక్టర్ కెనిచి యొకయామా, ఏడీబీ ప్రతినిధులు చెన్ చెన్, అఖిర మాట్స్ కునాగ, పుష్కర్ శ్రీవాస్తవ, కవితా అయ్యంగార్, రాజేశ్ కుమార్ డెల్ తదితరులు పాల్గొన్నారు.ఆ ఎంపీలు ఎటువైపు?

Updated By ManamFri, 07/20/2018 - 00:31
 • పార్టీ మారిన వారి వైఖరిపై ఉత్కంఠ
 • నేడు లోక్‌సభలో అవిశ్వాసంపై ఓటింగ్

imageవిజయవాడ: టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో శుక్రవారం చర్చ, ఓటింగ్ జరగనుంది. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని పలు పార్టీలను టీడీపీ కోరింది. కొన్ని పార్టీలు మద్దతు ప్రకటించగా, మరికొన్ని పార్టీలు వ్యతిరేకించనున్నట్టు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎంపీలు ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ ఏర్పడింది. వైసీపీ లోక్‌సభ సభ్యుల రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. కాగా ఆ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి టీడీపీ గూటికి చేరారు. వైసీపీని వీడిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత తటస్థంగా ఉండగా, ఖమ్మం నుంచి వైసీపీ తరఫున గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. లోక్‌సభలో ఓటింగ్ సందర్భంగా వీరు ఎటువైపు మొగ్గు చూపుతారన్నదానిపై ఆసక్తి నెలకొంది. కాగా అవిశ్వాసానికి వ్యతిరేకంగానే గీత, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓటేస్తారంటూ చర్చ జరుగుతోంది. ఇక టీడీపీ నుంచి గెలిచిన ఎంపీ మల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలు మారిన ఎంపీల వైఖరేంటన్నది శుక్రవారం తేలనుంది. 
 కాగ్నిజెంట్‌కు టాటా ఎలక్ట్రిక్ వాహనాలు

Updated By ManamThu, 07/19/2018 - 23:35

imageహైదరాబాద్: ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌కు టిగోర్ ఎలక్ట్రిక్ వాహనాలను సరఫరా చేసే ఆర్డరు దక్కినట్లు టాటా మోటార్స్ ఇటీవల తెలిపింది. హైదరాబాద్‌లోని కాగ్నిజెంట్ క్యాంపస్‌లో పర్యావరణహితమైన వాహనాలను వాడే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాగ్నిజెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలను సరఫరా చేసేందుకు అ గ్రగామి మొబిలిటి సొల్యూషన్స్ కంపెనీ అయిన వోలేర్ కార్‌తో పొత్తుకుదిరినట్లు టాటా మోటార్స్ తెలిపింది. కేత్ర స్థాయిలో కార్ల శ్రేణి నిర్యహణ విలువలు జోడించిన ఇంటి గ్రేటెడ్ సొల్యూషన్‌ను  కాగ్నిజెంట్‌కు అందించనున్నట్లు టాటా మోటా ర్స్ తెలిపింది.  ఇందులో భాగంగా ఇటీవల కాగ్నిజెంట్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో 10 ఎలక్ట్రిక్ వాహనాలను టాటా బృందం కాగ్నిజెంట్‌కు అందించింది. టిగోర్ వాహనాల నిర్వహణ, చార్జింగ్ స్టేషన్‌లను నెలకొల్పడం, మౌలిక వసతులు, ఆర్థిక వనరుల అవసరాలకు టాటా గ్రూపులోని ఇతర కంపెనీలతో కలిసి పని చేయనున్నట్లు టాటా మోటార్స్ అధ్యక్షులు శైలేశ్ చంద్ర తెలిపారు. ఎలక్ట్రిక్ మొబిలిటీకి సంబంధించి భారత ప్రభుత్వ ఆశయ సాధనకు అనుకూలంగా టాటా మోటార్స్ పని చేస్తుందని ఆయన అన్నారు. ఈ ఆశయ సాధనలో భాగంగా కాగ్నిజెంట్‌తో భాగస్వామ్యం మాకెంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. శక్తి వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, తిరిగి పొందలేని వనరులను కాపాడుకోవడం వంటి అంశాలు పర్వావరణ పరిరక్షణలో ముఖ్యమైనవని కాగ్నిజెంట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామకుమార్ రామమూర్తి అన్నారు.  ఈ దిశగా టాటా మోటార్స్‌తో కలిసి పర్యావరణ హిత వాహనాలను వాడనున్న సంస్థ కాగ్నిజెంట్ మొదటిది కావడం తమకెంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
 క్షణికోద్రేకంలో.. స్మార్ట్‌ఫోన్ కోసం హత్య 

Updated By ManamTue, 07/17/2018 - 01:07
 • ఇంటర్ విద్యార్థిపై స్నేహితుడి ఘాతుకం

 • లాంగ్‌డ్రైవ్‌కు పిలిచి చంపేశాడు.. పెట్రోల్ పోసి కాల్చేశాడు

imageహైదరాబాద్: స్మార్ట్‌ఫోన్‌పై ఆశ తొటి స్నేహితుడి ప్రాణాన్ని తీసేలా చేసింది. హైదరాబాద్‌లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ పోలీస్టేషన్ పరిధిలో అదృశ్యమైన విద్యార్థి మృతదేహంగా ఆదిభట్లలో లభ్యమైంది. తన మిత్రుడు ప్రేమ్ కుమార్ వద్ద ఖరీదైన, తనకు నచ్చిన సెల్‌ఫోన్‌పై కన్నేసిన సాగర్ అనే యువకుడు ఈ దారు ణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. రామంతాపూర్‌లోని ఓ ప్రైవేటు కళాశాల లో ప్రేమ్ కుమార్ ఇంటర్ రెండో సంవత్సరం చదువు తున్నాడు. అతడి తల్లిదండ్రులు నాటకాలు వేస్తూ.. మిగతా సమయాల్లో దర్జీ పని చేస్తారు. ప్రేమ్ కుమార్ వద్ద ఖరీదైన సెల్‌ఫోన్ ఉండటంతో.. అతని స్నేహితు డు సాగర్ దానిపై కన్నేశాడు. ఎలాగైనా దాన్ని దక్కిం చుకోవాలని ప్రేమ్ కుమార్ హత్యకు కుట్రపన్నాడు. ఈ నెల 13న లాంగ్ డ్రైవ్‌కు వెళ్దాం రమ్మంటూ ప్రేమ్‌ను తీసుకుని వెళ్లాడు. రాత్రయినా ప్రేమ్ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అతడి తండ్రి శంకర్ ఉప్పల్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించగా.. బస్తీలో సాగర్ అనే యువకుడితో ప్రేమ్ వెళ్లినట్టు నిర్థారణకు వచ్చారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్యచేసినట్లు అంగీకరించాడు. ఆదిభట్ల ప్రాంతంలో హత్య చేసి ఘట్‌కేసర్ వద్ద ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ తీసుకొని మృతదేహన్ని కాల్చివేసినట్లుగా సాగర్ ఒప్పుకొన్నాడు. నిందితుడిని తీసుకోని ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకొని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.అవిశ్వాసానికి మద్దతివ్వండి

Updated By ManamMon, 07/16/2018 - 01:49
 • ఎన్డీయే సర్కారుపై పోరుకు సపోర్టు చేయండి.. టీఆర్‌ఎస్ ఎంపీలకు ఆంధ్రప్రదేశ్ ఎంపీల వినతి 

 • పార్టీలో చర్చించి నిర్ణయిస్తామన్న కే. కేశవరావు.. విభజన హామీలను అమలు చేయాల్సిందే 

 • ఇరు రాష్ట్రాలకూ సంబంధించిన అంశమిది.. టీఆర్‌ఎస్ సానుకూలంగా స్పందించిందన్న సుజనా 

imageహైదరాబాద్: విభజన చట్టం హమీలపై ఉమ్మడిగా పోరాడుదామని ఏపీకి చెందిన పలువురు ఎంపీలు టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు కేకేను కోరారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శ్రీరామ్ మాల్యాద్రిలు హైదరాబాద్‌లో ఆదివారం టీఆర్‌ఎస్ ఎంపీలను కలిశారు. ఈ సందర్భంగా వారు ఎపీకి జరిగిన అన్యాయం గురించి వివరించారు. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీయే సర్కారుపై అవిశ్వాసం పెడతామన్నారు. దీనికి మద్దతివ్వాలంటూ టీఆర్‌ఎస్ ఎంపీలు కె.కేశవరావు (కేకే), జితేందర్ రెడ్డిలకు విన్నవించారు. అప్పటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన వాగ్దానాలు పక్కగా అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సహకరించాలని కోరారు. విభజన హమీలను రెండు తెలుగు రాష్ట్రాలు పోరాడి సాధించుకుందామని సూచించారు. అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి అన్యాయం జరిగిన నేపథ్యంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తమ మద్దతు కావాలని టీడీపీ ఎంపీలు కోరారని ఆయన చెప్పారు. ఈ విషయంపై పార్టీలో చర్చించి...తాము కూడా ఆలోచించాక తమ నిర్ణయం చెబుతామని, విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని, ఇది రెండు రాష్ట్రాలకూ సంబంధించిన అంశమని అన్నారు. తెలంగాణకు కూడా సమస్యలు ఉన్నాయని...విభజన హామీలు అమలు చేయకపోవటం వల్ల మా పాలనకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయని. మీరు పెడితే మేము ఆలోచించి మా నిర్ణయం చెప్తామన్నారు. తాము పెట్టే అవిశ్వాసానికి మద్దతునివ్వాలంటూ పలు పార్టీల ఎంపీలను కలుస్తున్నట్లు ఏపీ టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. డబుల్స్ విజేతలు మైక్ బ్రయన్, జాక్‌సోక్

Updated By ManamSun, 07/15/2018 - 22:48
 • వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్-2018

imageవింబుల్డన్: వింబుల్డన్ టోర్నీలో పురుషులడబుల్స్ విభాగంలో  బ్రయన్ ద్వయం 17వ గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ని కైవసం చేసుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో బ్రయన్-సోక్ (అవెురికా) జంట 6-3, 6-7 (7), 6-3, 5-7, 7-5తో క్లాసెన్ (ద క్షిణాఫ్రికా)- వైుకేల్ వేన్స్ (న్యూజిలాండ్) ద్వయాన్ని చిత్తుచేసి డబుల్స్ టైటిల్‌ను సాధించారు. డబుల్స్ ఎప్పుడు తన తమ్ముడుతో ఆడే బ్రయన్ మొదటి సారి బాబ్ లేకుండా టైటిల్ సాధించాడు. గాయం కారణంగా బాబ్ ఈ టోర్నీలో పాల్గొనలేదు. ‘ ఈ టైటిల్‌ను నేను బాబ్‌కు అంకితమిస్తున్నాను. బాబ్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ చూసే ఉంటాడు’ అని బ్రయన్ అన్నాడు. సోక్‌కు ఇది రెండో వింబుల్డన్ టైటిల్. మొదటి సారి 2014లో బ్రయన్ జంటను ఓడించి వింబుల్డన్ టైటిల్ గెలుపొందాడు. రూట్ అజేయ సెంచరీ

Updated By ManamSun, 07/15/2018 - 00:52
 • మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్‌కు 3 వికెట్లు

imageలండన్: టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ టాపార్డర్ బ్యాట్స్‌మన్ జో రూట్ అజేయ సెంచరీ చేశాడు. ఈ సిరీస్‌లో మణికట్టు స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొన్న ఆటగాడు రూట్ ఒక్కడే. రూట్ సెంచరీ, మోర్గాన్, విల్లే అర్ధ సెంచరీలు చేయడంతో ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ టాపార్డర్ బ్యాట్స్‌మన్ జో రూట్ తన అజేయ సెంచరీతో మొత్తం మ్యాచ్ పరిస్థితినే మార్చేశాడు. ఆరంభంలో ఇంగ్లాండ్ జట్టు దూకుడుగా ఆడింది. ఆ తర్వాత టీమిండియా పట్టు సాధించినట్టు కనిపించినప్పటికీ మోర్గాన్, విల్లే అర్ధ సెంచరీలు చేయడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేయగలిగింది. ఓపెనర్లు జాసన్ రాయ్, బెయిర్‌స్టో కలిసి తొలి వికెట్‌కు 69 పరుగులతో శుభారంభాన్నిచ్చారు. మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో అవుట్ కావడంతో ఇంగ్లాండ్ తొలి వికెట్ పడింది. మరికాసేపటికే కుల్‌దీప్ బౌలింగ్‌లోనే జాసన్ రాయ్ కూడా వెనుదిరిగాడు. అయితే తర్వాత జో రూట్, మోర్గాన్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 103 పరుగుల కీలక, భారీ భాగస్వామ్యాన్ని అందించారు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న మోర్గాన్.. కుల్‌దీప్‌కే వికెట్ ఇచ్చాడు. తర్వాత వచ్చిన స్టోక్స్, బట్లర్, మొయిన్ అలీ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. కానీ చివరిగా వచ్చిన విల్లీ.. రూట్‌తో కలిసి ఇంగ్లాండ్ స్కోరును 300 దాటించి.. అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచాడు. గిరిజన విద్యార్థులు చదువాలె

Updated By ManamSat, 07/14/2018 - 01:18
 • విద్యా సంస్థల్లో సరిపడ టీచర్లు.. విద్యా, శిక్షణ సంస్థల మ్యాపింగ్

 •  గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో

 • చదువుతున్న 2 లక్షల మంది.. వారికి నాణ్యమెన విద్య అందాలి

 • 16,479 మందికి స్వయం ఉపాధి.. దీనికి రూ.205 కోట్లు కేటాయింపు

 • గిరిజన సంక్షేమ శాఖపై సీఎస్ సమీక్ష

imageహైదరాబాద్: గిరిజన విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించాలని, అందుకోసమే గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న విద్యాసంస్థలు, ట్రైనింగ్ కేంద్రాల స్పేషియల్ మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యకలాపాలను ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్‌హర్ దత్ మహేష్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా చౌంగ్తు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. సమాజంలో వెనుకబడిన గిరిజన ప్రజలకు మేలు చేసేలా అధికారులు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చే యాలన్నారు. విద్య, వైద్య సౌకర్యాలతోపాటు ఆర్థికంగా సామాజికంగా ఎదిగేలా కృషి చేయాలని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న వివిధ విద్యా సంస్థల ద్వారా 2 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని, వీరికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గిరిజన ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీల మధ్య సినర్జీ ఉండేలా చూడాలన్నారు. ప్రతి విద్యా సంస్థలో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు ఉండేలా చూడాలన్నారు. 2018-19 విద్యా సంవత్సరానికిగానూ ఉత్తమ పాఠశాలల్లో 6 వేల మందికి ప్రవేశాలు క ల్పించాలని నిర్ణయించామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించే ట్రైబల్ మ్యూజియానికి మరింత ప్రాచుర్యం కల్పించి ఎక్కువ మంది సందర్శించేలా చూడాలన్నారు. రాష్ట్రంలో 16,479 మందికి స్వయం ఉపాధి కల్పించేందుకు రూ. 205 కోట్లతో ఆర్థిక సహాయం అందించడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. నైపుణ్య అభివృద్ధి కేంద్రాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గిరిజన శాఖ ద్వారా శిక్షణ పొందిన అనంతరం వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన వారి నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించాలని ఆయన అధికారులకు సూచించారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ద్వారా గిరిజనుల్లో ఉన్న నైపుణ్యాలను గుర్తించి వారిలో ఉన్న ప్రతిభను మెరుగుపరచి, ఆర్థికంగా మరింత మేలు జరిగేలా చూడాలన్నారు. ఫ్రీ ఎక్సామినేషన్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా గిరిజన విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా మెరుగైన శిక్షణ అందిం చాలన్నారు. గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా 2,28,175 గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా రూ.150 కోట్లతో 3,400 మందికి ఈ ఆర్థిక సంవత్సరంలో సహాయం అందించాలని నిర్ణయించామన్నారు. ఎస్టీ, ఎస్డీఎఫ్ నిధుల వ్యయాన్ని వేగవంతం చేయాలన్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూములకు సంబంధించి రైతు బంధు చెక్కుల పంపిణీని పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా, గిరిజన అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, వన్ దన్ వికాస కేంద్రాల ఏర్పాటు, అటవీ ఉత్పత్తులకు మరింత మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ట్రైఫెడ్ ఎండీకి వివరించారు. గిరిజన మహిళా గ్రూపుల ద్వారా వారి ఉత్పత్తులకు దేశ వ్యాప్తంగా మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతోపాటు మంచి ధర లభించేలా చూడడం, ఆర్థిక సహాయం, శిక్షణ తదితర అంశాలపై చర్చించారు. గిరిజన ఉత్పత్తులు, వారి కళలకు మంచి ప్రాచుర్యం లభించడానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి తీసుకోవాల్సిన చర్చలపై సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల మేలు కోసం చేపట్టే కార్యక్రమాలను తెలిపారు.సంగీతానికి భాషతో సంబంధం లేదు

Updated By ManamFri, 07/13/2018 - 01:40

imageబహుముఖ ప్రజ్ఞాశాలి అయిన యజ్ఞరామన్ తాను నేర్చిన విద్యను పదిమందికీ పంచాలనే మహోన్నతమైన ఉద్దేశ్యంతో ప్రమయాస్‌ను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా కూచపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీతం వంటి పలు రకాల కళలను నేర్పిస్తున్నారు. వింగ్ కమాండర్ యజ్ఞరామన్ తో మనం మిసిమి ముచ్చట్లు.....
ప్ర. మీరు తమిళనాడుకు చెందిన వారు కదా?  తెలుగు ఏలా నేర్చుకున్నారు? సంగీతం వైపు మక్కువ ఎలా కలిగింది?
జ. నా పేరు వింగ్ కమాండర్ మీంజు యజ్ఞా రామన్. మధురై దగ్గర కరటుపట్టిలో 1968 లో జన్మించాను. నాన్నగారు మహాదేవన్ అయ్యార్, అమ్మ గోమతి శాంతి మహాదేవన్. మా తల్లిదండ్రులకు ఐదుగురం సంతానం, అందరం అబ్బాయిలమే. నేను వారిలో రెండోవాడిని. చదువంతా మధురై దగ్గరిలోని మీంజులోనే కొనసాగింది. కానీ చిన్నతనం నుంచే తెలుగు భాష అంటే ఇష్టం, అభిమానం ఉండేది. తమిళనాడులో తెలుగు ప్రాచుర్యం లేనప్పటికీ, మా స్కూల్లో తెలుగు సెక్షన్ ఉంది. చదవడం, రాయడం రాకపోయినా వింటూ ఆనంద పడేవాడిని.  తెలుగు భోదించే టీచర్ మా ఇంటి దగ్గరే ఉండేవారు. ఆమెను అత్త అని పిలిచేవాడిని. తనతో ఉండడం వలన తెలుగుపైన మరీంత ఇష్టం, ప్రేమ పెరిగింది. తెలుగు అనేది ఒక అందమైన భాష, మనిషిని మనస్సును తెలుగు పదాలు ఆకట్టుకుంటాయి. అంతటి అద్భుతమైనది తెలుగు భాష. ఒక మహాకవి అతను తమిళీయన్ అయినప్పటికీ సంగీతానికి అతి సరళమైన భాష తెలుగు అని, దీనిలో మాత్రమే సంపూర్ణ సంగీత స్వరాలను చూపించగలమని, 4,500 యేళ్ల క్రితమే గుర్తించాడు. మొదట గురువు అంటే మాత్రం మా అమ్మగారే. తను కూడా గాయకురాలు, కానీ సంగీతానికి సంబంధించిన బేసిక్స్ రాజలక్ష్మీ, కళ్యాణి నారాయణ స్వామి గారి దగ్గర నేర్చుకున్నాను.  తంబరంలో కళ్యాణి గారి గురుకులంలో సంగీతం నేర్చుకోవడానికి  చేరాను. తంబరం వి. సుందరేశన్ అయ్యర్ దగ్గర నేర్చుకున్నాను. చిన్నప్పుడు 6వ తరగతిలో పాఠశాల పోటీల్లో  హార్మోనియం పట్టుకుని పాడాను. మీంజూలో రామానుజ చారీ గారు తెలుగు నేర్పించేవారు. తను మమ్మల్ని పొందేరిలో విశ్వేందు పరిషత్ అనే పోటీలు నిర్వహిస్తే తీసుకుళ్ళాడు. 1990లో ఉద్యోగంలో చేరాను. ఆ సమయంలో వెస్ట్రాన్, కర్ణాటిక్ , మ్యాజిక్ నేర్చుకోవడం జరిగింది. అంతకు ముందు నేను నార్త్  ఈస్ట్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎయిర్ ఫోర్స్‌లో అవా ఘోష్ గారితో పాటు హిందుస్తానే, నజీల్‌గీలే, శ్యామ్ సంగీతం వంటివి నేర్చుకున్నాను. అవా ఘోష్ గారు మహా పండితుడు. సైనిక్ పాఠశాల  భువనేశ్వర్‌లో నేను ఉద్యోగరీత్య రిజిస్టార్‌గా వెళ్ళాను. ఆ పాఠశాల వారికి  ప్రత్యేకమైన గీతం లేదు. పాఠశాలకంటూ ఒక గీతం ఉండాలని హిందీలో నేనే స్వయంగా కంపోజ్ చేశాను.  

ప్ర.  ఫ్లూట్ మీరే తయారు చేసుకొని వాయిస్తారట నిజమేనా? 
జ.   అవును,  వెదురు ఫ్లూట్ నాకు నేనే తయారు చేసుకుని వాయించాను. 20 యేళ్ళ క్రితం యూటుబ్ పై ఆశక్తి లేని కాలంలో మొదట  పివిసి పైపుని ఫ్లూట్‌లాగా తయారు చేశాను. అంత మంచిగా రాలేదు. మెల్లగా నాకునేనే స్వతహాగా 10 వరకు తయారు చేసి వాయిస్తే శబ్దం సరిగ్గా రాకపోయెది. 10 దాకా చేసి దాని లోని మెళకువలు తెలుసుకుని 2000 సంవత్సరంలో వెదురుతో ఫ్లూట్ తయారు చేయడం నేర్చుకుని, దానితోనే ప్రదర్శన ఇచ్చాను. ఇదేకాదు తబలా, ఘటం, కుంజీర, వీణా, కీబోర్ట్, హార్మోనియం ఏదైన వాయిస్తాను. వాయించడంలో నా గొప్పంటూ ఏమీలేదు. ఇదంతా కూడా నాకు సరస్వతీ కటాక్షం అనే భావిస్తాను. 

ప్ర. ఏ పాటకు రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకున్నారు? ఇటు సంగీతం కచేరీలు అటు ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం ఎలా నిర్వహించగలుగుతున్నారు?
జ. ఒకసారి రాష్ట్ర స్థాయిలో వేంకటేశ్వర సుప్రభాతంపై పోటీలు పెట్టారు.  తరుచూ మా అమ్మగారు పాడుతూ ఉండేవారు కాబట్టి నాకు కూడా కంఠస్థం. అదే సుప్రభాతం ఆ రోజు పోటీల్లో పాల్గొని పాడాను. అప్పుడే రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో అవార్డు అందుకున్నాను. మెల్లగా పాటల పోటీల్లో, సంగీత పోటీల్లో వ్యాస రచన పోటీ ల్లో పాల్లొనడం జరిగింది. నేను సర్వింగ్ ఆఫిసర్ కాబట్టి మేము పెద్దగా సన్మానాలు, బిరుదులు అలాంటివి స్వీకరించకూడదు. సకల కళా వల్లభ అని మా ఎయిర్‌లో అందరూ పిలుచుకుంటారు. నాకు ఉద్యోగరీత్యా ప్రెసిడెంట్ ఆఫి ఇండియా ఇచ్చిన ర్యాంక్ వింగ్ కమాం డర్. అదే నాకు పెద్ద పురస్కారంగా భావిస్తాను.  1998 ప్రెసిడెంట్ శ్రీ కె. ఆర్ నారాయణ డాని చేతుల మీదుగా బెస్ట్ ఆల్ రౌండర్‌గా హైదరాబాద్ దుండిగర్‌లో బహుకరించారు. ఇక ఎయిర్ ఫోర్స్ 2000, 2001,2002లో మహోత్సవ్ పేరుతో వారం రోజులు ఎయిర్ ఫోర్స్ వారికి, వారి కుటుంబీకుల కళాల కోసం కాన్నివల్ అయ్యేది. ఉద్యోగంలో కూడా అంతా నా అభిరుచిని ఆదరించడం నాకు ఆనందకరం.

ప్ర. ప్రమయాస్ గురించి చెప్పండి?
జ. కళలకు మన దేశంలో తక్కువ ఏమీలేదు. కానీ వాటిని నేర్చుకునేందుకు మన పిల్లలకు ఎంత వరకూ ప్రోత్సాహం ఇస్తున్నామనేదే ముఖ్యం. ఇప్పటి పిల్లలను చదువుకోమని ప్రోత్సహించినంతగా కళలను నేర్చుకోమని అనడంలేదు. పైగా వారికి ఏ కళను ఎంచుకోవాలి? ఎక్కడ నేర్చుకోవలనే దానిమీద సరైన అవగాహన కూడా తక్కువే. అందుకే నాకు సాధ్యమైనంతలో ఉత్సాహవంతులను ప్రోత్సహిస్తున్నాను.కుప్పకూలిన లంక

Updated By ManamFri, 07/13/2018 - 00:26
 • 158 పరుగులతో అజేయంగా నిలిచిన కరుణరతె్న

imageగాలే: శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి  బ్యాటింగ్ ఎంచుకున్న లంక జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకే ఆలౌ టైంది. లంక జట్టులో కరుణరతెన ఒక్కడే (158 నాటౌట్)పరుగులతో రాణించాడు. మిగతా బ్యాట్స్‌మన్ అంతా చేతులైతేయడంతో లంక జట్టు 78.4 ఓవర్లలో 287 పరుగులు చేసి కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలింగ్‌లో రబాడ నాలుగు వికెట్లు, సామ్‌సి 3 వికెట్లు తీసారు. పిలాండర్, స్టెయిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. తర్వాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు 4 ఓవర్లలో 4 పరుగులకే మార్కరమ్ (0) వికెట్‌ను కొల్పోయింది.

సంక్షిప్త స్కోర్లు: శ్రీలంక మొదటి ఇన్నింగ్స్: 78.4 ఓవర్లలో 287 -10, ఎక్స్‌ట్రాలు 12, ( కరణరతె్న 158 నాటౌట్). 
సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్: 4 ఓవర్లలో 4-1 (ఎల్గర్ 4 బ్యాటింగ్, మహరాజా 0 బ్యాటింగ్).

Related News