internet

14 ఏళ్ల‌లోపు వారిపై సోష‌ల్ నెట్‌వ‌ర్క్ ఆంక్ష‌లు

Updated By ManamMon, 08/13/2018 - 20:23

Russia Imposes New Fines on Internet Providers
రష్యా:
14 ఏళ్ల‌లోపు బాల‌ల్లో సామాజిక మాధ్య‌మాల దుష్ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకు ర‌ష్యా ప్ర‌భుత్వం ప‌లు ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తోంది. ఈ నిబంధ‌న‌ల‌ను అధిగ‌మించే ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌పైనా భారీగా జ‌రిమానా విధిస్తోంది. అవ‌తలి వ్య‌క్తి ఎవ‌రో ఏమిటో తెలియ‌కుండా మాధ్య‌మాల్లో ఎవ‌రికి ప‌డితే వారికి ఖాతాల‌ను క్రియేట్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించే నెట్ ప్రొవైడ‌ర్ల‌కు 3ల‌క్ష‌ల రూబుళ్ల వ‌ర‌కు ఫైన్ జ‌రిమానా విధిస్తోంది. సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌లో ప్ర‌తి ఒక్క‌రూ ఒకే ఒక్క ఖాతాను అదీ కూడా త‌మ సొంత పేరు లేదా ఇంటి పేరుతో మాత్ర‌మే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 

అలా చేయ‌ని ప‌క్షంలో.. ఆ సైట్ య‌జ‌మానికి 3 ల‌క్ష‌ల రూబుళ్ల వ‌ర‌కు ఫైన్ వేస్తారు. వినియోగ‌దారుడికి కూడా 5వేల రూబుళ్ల జ‌రిమానా ఉంటుంది. 18 ఏళ్ల‌లోపు వారికైతే నిషేధిత సమాచారం పంచుకునే గ్రూపులో స‌భ్యుడిగా చేరే అవ‌కాశం లేదు. ఒక వేళ చేరితే అందుకు త‌గిన శిక్ష‌లుంటాయి. వారు 2వేల రూబుళ్లు స‌మ‌ర్పించుకోవాల్సి ఉంటుంది. మైన‌ర్ల‌కు వ‌స్తువులు అమ్మే సోష‌ల్ నెట్ వ‌ర్క్‌ల‌కు కూడా జ‌రిమానాలుంటాయి. దీంతోపాటు ధూమ‌పానం వంటి ప్ర‌క‌న‌ట‌ల‌ను కూడా వారికి చూపించ‌రాదు. ప‌నిలో ప‌నిగా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను కూడా ఈ నిషేధ జాబితాలో చేర్చింది ర‌ష్యా ప్ర‌భుత్వం. ఆఫీసు వేళ‌ల్లో సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌ల‌లో గ‌డప‌డ‌టాన్ని కూడా సీరియ‌స్‌గా తీసుకుంటుంది.ఎఫ్‌బీలో ఫేక్ న్యూస్‌కు ఫుల్‌స్టాప్..

Updated By ManamThu, 07/19/2018 - 19:49

Facebook will prioritize removing fake news that incites violence

  • రెచ్చగొట్టే వార్తలపై నిషేధం

  • 24 గంటల్లోనే మారిన నిర్ణయం

  • విమర్శలకు జడిసిన జుకెర్‌బర్గ్

న్యూయార్క్: ఫేస్‌బుక్‌లో అబద్ధపు వార్తలను, యూజర్లను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని తొలగించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. సంస్థ ఫ్లాట్‌ఫాంపై వీటికి చోటులేకుండా చూస్తామని పేర్కొంది. తప్పుడు వార్తలు, వదంతుల ప్రచారంతో ప్రజలు భయాందోళనకు లోనై, మూకుమ్మడిగా దాడులకు పాల్పడుతున్న ఘటనల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. దేశవ్యాప్తం గా పలుచోట్ల జరిగిన ఈ దాడులలో పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సోషల్ మీడియానే కారణమని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రముఖ సామాజిక మాధ్యమాలలో వదంతుల ప్రచారాన్ని కట్టడి చేయాలన్న డిమాండ్‌లు పెరిగాయి. భారత ప్రభుత్వం కూడా ఫేస్‌బుక్ గ్రూపునకు చెందిన వాట్సప్‌నకు గతంలోనే ఓ లేఖ రాసింది. 

అయితే.. సోషల్‌మీడియాలో పెట్టే పోస్టులు ఆయా వ్యక్తుల అభిప్రాయాలని.. దాడుల పేరుతో వాటిని తొలగించడం తీవ్రమైన చర్యే అవుతుందని ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఫేక్‌న్యూస్ అనే సందేహం వచ్చినపుడు సదరు వార్తల తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. అంతేకానీ మొత్తంగా పోస్ట్‌ను తొలగించడమంటే ఖాతాదారుల అభిప్రాయాలను అగౌరవ పరచడమేనని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

జుకర్‌బర్గ్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే మొదలైన ట్రోలింగ్ తాజాగా మరో ప్రకటన విడుదల చేసే వరకూ ఆగలేదు. సర్వత్రా వెల్లివెత్తుతున్న విమర్శల నేపథ్యంలో ఫేస్‌బుక్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఎఫ్‌బీలో తప్పుడు, హింసను ప్రేరేపించే వార్తల ప్రచారంపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. కల్లోలాన్ని ప్రోత్సహించే వార్తలపై నిషేధంతో పాటు ఇంటర్నెట్‌లోని వివిధ ఫొటోలను మార్ప్ చేసి పోస్ట్ చేయడాన్నీ అడ్డుకోనున్నట్లు వివరించింది. మరోవైపు తన అనుబంధ సంస్థ వాట్సప్‌లో వదంతులు, పుకార్ల వ్యాప్తిని అడ్డుకోవడానికి మెరుగైన చర్యలు తీసుకుంటున్న విషయాన్నీ ఆయన గుర్తుచేశారు.నెట్ న్యూట్రాలిటీకే సై!

Updated By ManamWed, 07/11/2018 - 23:34
  •  ట్రాయ్ సిఫారసులకు ఆమోదం .కొన్నింటికి మినహాయింపులు.. 

  • ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు.. అందరికీ సమానంగా నెట్: కేంద్రం

net-nuetralityన్యూఢిల్లీ: ఇంటర్నెట్ సమానత్వనికే (నెట్ న్యూట్రాలిటీ) కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ మేరకు ట్రాయ్ ప్రతిపాదించిన సిఫారసులను ఆమోదించింది.  ఇందుకు సంబంధించి కొత్త నిబంధనలకు ఆమోదం తెలిపింది. నెట్ న్యూట్రాలిటీకే కేంద్రం అంగీకరించినందున.. ఇకపై టెలికం కంపెనీలు ఇంటర్నెట్ వాడకందార్లందరికీ ఒకేరకమైన వేగం(స్పీడ్), డౌన్‌లోడింగ్ సామర్థ్యంతో సేవలందించాల్సి ఉంటుంది.

కొందరికి వేగంగా, మరికొందరికి మందకొడిగా.. కొందరికి అపరిమితంగా, మరి కొందరికి పరిమితంగా, ఒకే వెబ్‌సైట్లో కొన్ని అంశాలు తొందరగా, మరికొన్ని ఆలస్యంగా తెరుచుకోవడం లాంటివి ఇకపై ఉండదు. ఒకవేళ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కొత్త నిబంధనల ప్రకారం టెలికం కంపెనీలకు, మొబైల్ కంపెనీలకు. ఇంటర్నెట్ ప్రొవైడర్లు భారీగా జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే.. ఇందుకు విరుద్ధంగా ఏవైనా కంపెనీలు లేదా సంస్థలు ఆయా సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటర్నెట సేవలు అందించడంలో ఒకరికి  ఒకరికి ఎక్కువ, వేరొకరికి తక్కువ ప్రాధాన్యం లభించేలా చేయకూడదు. అయితే కొన్ని అటానమస్ సంస్థలు, టెలీమెడిసిన్ వంటి వాటికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఈ సంస్థల అవసరాల నేపథ్యంలో సాధారణం కన్నా వాటికి ఎక్కువ వేగంతో సేవలు అందించొచ్చు. బుధవారం జరిగిన టెలికం కమిషన్ సమావేశంలో ‘నెట్ న్యూట్రాలిటీ’కి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నామని, ఇది తక్షణమే అమలులోకి వస్తుందని కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ వెల్లడించారు. వచ్చే డిసెంబర్‌లోగా ఇంటింటికీ ఇంటర్నెట్

Updated By ManamWed, 12/06/2017 - 23:21
  • కేబుల్ పనులు వేగవంతం చేయండి

  • అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం

  • గడువులోగా ‘మిషన్ భగీరథ’ పూర్తి

  • క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష

ktr, ts minister, internetహైదరాబాద్, డిసెంబరు 6: వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. బుధవారం పరిశ్రమల శాఖతోపాటు ఐటీ శాఖలో చేపట్టిన పలు ప్రాజెక్టుల పైన మంత్రి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పరిశ్రమలు, టీఎస్ ఐఐసీ, ఐటీ శాఖాధికారులు పాల్గొన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తవుతుందన్న నేపథ్యంలో ఇంటింటికీ ఇంటర్నెట్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. దీనికి అవసర మైన నిధులపైన మంత్రి ప్రత్యేకంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ కింద అందిస్తున్న ఆర్థిక సహాయంతో పాటు, రాష్ట్ర  ప్రభుత్వం తరఫున అందించాల్సిన ఆర్థిక సాయాన్ని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ కు విజయా బ్యాంక్ రూ.561 కోట్ల రుణాన్ని అందించే పత్రాలను బ్యాంకు డీజీఎం సత్యనారాయణ రాజు మంత్రికి అందించారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందించడంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి తెలిపారు. ఈ మార్పులను ప్రపంచానికి చూపేందుకు మహేశ్వరం మండలంలోని నాలుగు గ్రామాల్లో చేపడుతున్న టెక్నాలజీ డెమాస్ట్రేషన్ నెట్‌వర్క్ జనవరి మొదటివారంలో పూర్తవుతుందని అధికారులు మంత్రికి తెలియజేశారు. తెలంగాణలో ఇంటింటికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒనగూరే ప్రయోజనాలను ఈ నెట్‌వర్క్ తెలియజేస్తుంది. ప్రయోగాత్మ కంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో 10 ప్రముఖ కంపెనీలు పాలుపంచు కుంటున్నాయి. అనంతరం.. హైదరాబాద్ ఫార్మా సిటీ భూసేకరణ, అనుమతుల ప్రక్రియపై ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పర్యావరణ అనుమతులు వస్తాయని అధికారులు మంత్రి కేటీ రామారావుకు తెలిపారు. టీఎస్ ఐఐసీ చేపట్టిన పలు ఇతర ప్రాజెక్టులు, పార్కుల నిర్మాణ పురోగతి వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. టీహబ్ -2, ఇమేజ్ టవర్, టీ వర్క్స్ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. టీ వర్క్స్ భవనం తాలుకు డిజైన్లను సిద్ధం చేయాలని, వచ్చే ఏడాది మే చివరి వారానికి టీ వర్క్స్ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌తోపాటు శాఖ అధికారులు పాల్గొన్నారు.

Related News