Prime Minister Narendra Modi

ప్రధాని సహా 1.5మిలియన్ల మంది డేటాబేస్ చోరీ

Updated By ManamSat, 07/21/2018 - 08:59

Hack సింగపూర్: సింగపూర్‌లో అతిపెద్ద సైబర్ దాడి జరిగింది. ప్రధాని లీ హెచ్సీన్ లూంగ్ సహా ప్రభుత్వం వద్ద ఉన్న 1.5 మిలియన్ల మంది హెల్త్ డేటా బేస్‌ను సైబర్ దొంగలు చోరీ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం ధ్రువీకరించింది. ఇది పెద్ద సైబర్ దాడి అని ప్రభుత్వం పేర్కొంది. ఓ ప్రణాళిక ప్రకారం డేటాను తస్కరించారని, డేటా చోరీపై సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ దర్యాప్తును ప్రారంభించిందని ప్రభుత్వం తెలిపింది. ఇది సాధారణ హ్యాకర్ల పనో, క్రిమినల్ గ్యాంగ్ పనో కాదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మే 2015 నుంచి ఈ ఏడాది జూలై వరకు ఆసుపత్రులను సందర్శించిన 1.5 మిలియన్ల మందికి చెందిన డేటాను హ్యాకర్లు చోరీ చేశారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే సైబర్ సెక్యూరిటీ విషయంలో కట్టుదిట్టమైన భద్రత కలిగిన దేశంపై ఈ దాడి జరగడం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది.



సోదర సోదరీమణులారా...

Updated By ManamTue, 11/28/2017 - 13:59
  • తెలుగులో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. హైదరాబాద్ మహోన్నత నగరమని ప్రశంస

PM Narendra Modi Speaks in Telugu At Begumpet Airportహైదరాబాద్, నవంబరు 28: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీ.. అక్కడే బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. సమావేశంలో కాసేపు ప్రసంగించిన ఆయన.. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించి ఆకట్టుకున్నారు. ‘సోదర సోదరీమణులారా... తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు...’ అంటూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌కు వస్తే తనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తుకొస్తారన్న ఆయన.. హైదరాబాద్‌ను దేశంలో కలపడం కోసం సర్దార్ పటేల్ ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణ విమోచనం కోసం ఎంతో మంది అమరులయ్యారని, వారందరికీ జోహార్లని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్ ఓ మహోన్నతమైన నగరమని, హైదరాబాద్‌కు రావడం ఎంతో ఆనందంగా ఉందని మోదీ అన్నారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. 





Related News