world record

దుబాయ్ దీపావళి

Updated By ManamWed, 11/07/2018 - 05:11

imageదుబైలో మొట్టమొదటి సారి 10 రోజుల పాటు దీపావళి పండుగను అధికారికంగా జరుపుతున్నారు.  దుబైలోని మన కాన్సులేట్ జనరల్ సహకారంతో కని వినీ ఎరుగని రీతిలో అక్కడి ప్రభుత్వం దివాలీ జరుపుతుండడం విశేషం. దీంతో ఈ ఏడాది దీపావళి పండుగను తాము మాతృదేశానికి వె ళ్లి జరుపుకోలేకపోయామనే బాధ తప్పిందని ఇక్కడి భారతీయులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

గిన్నిస్ రికార్డ్

దుబై వాటర్ ఫ్రంట్ ప్రొమెనేడ్, దుబై ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆధ్వర్యంలో దీపావళి కాంతులీనింది. యూఏఈలో మెగా ఈవెంటుగా దీపావళి సెలబ్రేట్ చేస్తుండడంతో మనవారు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యేందుకు పెద్దఎత్తున దుబై వెళ్లారు. ఓవైపు బాలీవుడ్ హంగామా మరోవైపు దివాలీ స్వీట్లు.. ఇక టపాసుల సందడి మధ్య దుబై సరికొత్తగా కనిపిస్తోంది. ఈనెల ఒకటవ తేదీన ప్రారంభమైన వేడుకలు రాత్రయిందంటే అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి. ఈనెల 10వ తేదీ వరకూ సాగే ‘ఫైర్ క్రాకర్స్ షో’ అదరగొడుతోంది. అత్యధికులు ఎల్‌ఈడీ లైట్లు వెలిగించే కార్యక్రమంలో పాల్గొంటుండడంతో ఇది సరికొత్త గిన్నిస్ బుక్ ఆఫ్ వల్డ్ రికార్డ్ సృష్టించనుంది కూడా.  

image


దుబై పోలీస్ బ్యాండ్ మన జాతీయగీతం ఆలపించడం ఈ ఉత్సవాల్లో హైలైట్‌గా నిలిచింది. దుబై బేస్డ్‌గా ఉన్న ఎమిరేట్స్ విమాన సంస్థ కూడా ఈ ఉత్సవాల్లో పాలుపంచుకుని దివాలీకి కొత్త సొబగులు అద్దే ప్రయత్నం చేసి ప్రయాణికులను ఆశ్చర్యపరిచింది. భారతీయ సంప్రదాయ రుచులను పంచుతూ ఎమిరేట్స్ ఉద్యోగులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.

image


ఇక ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఈ వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతూ, ట్రెండింగ్ అవుతున్నాయి. భారత్-యుఏఈ మధ్య సాంస్కృతిక సంబంధాల మెరుగుదలతో పాటు టూరిజం అభివృద్ధికి కూడా దీపావళి అతిపెద్ద ఈవెంట్‌గా తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడికి వచ్చిన విదేశీ టూరిస్టులు ఓవైపు దుబై అందాలు, మరోవైపు ఆద్యంతం భారతీయతను ఆస్వాదిస్తూ, హ్యాపీగా షికార్లు చేస్తున్నారు. 
 

image

 20 బంతుల్లో.. శతక్కొట్టాడు..

Updated By ManamSat, 03/24/2018 - 20:52

imageకోల్‌కతా: టీమిండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కోల్‌కతాలో ఈ రోజు జరిగిన క్లబ్ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. బంతులు పగిలేనా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 20 బంతుల్లోనే సెంచరీ చేసి అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. జేసీ ముఖర్జీ ట్రోఫీలో భాగంగా మోహన్ బగాన్-బీఎన్ఆర్ రిక్రియేషన్ క్లబ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో వృద్ధిమాన్ శివతాండవం ఆడాడు. 20 బంతుల్లో 14 సిక్సర్లు, 4 ఫోర్లతో 102 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.

ఈ విజృంభణతో సాహా ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్‌ బగాన్‌ జట్టు బీఎన్‌ఆర్‌ రీక్రియేషన్‌ క్లబ్‌పై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బీఎన్‌ఆర్‌ 152 లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన మోహన్‌ బగాన్‌ సాహా, కెప్టెన్‌ సుబ్‌హోమయ్‌(43 22 బంతుల్లో)లు దాటిగా ఆడటంతో వికెట్‌ నష్ట పోకుండా కేవలం 7 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ మ్యాచ్‌ అనంతరం సాహా మాట్లాడుతూ.. ‘ఇది రికార్డో కాదో కూడా నాకు తెలియదు. ఐపీఎల్‌ను దృష్టిలో ఉంచుకోని ప్రత్యేకమైన్‌ షాట్స్‌ ఆడటానికి ప్రయత్నించా. ప్రతి బంతి నా బ్యాట్‌ మధ్యలో తగిలిందని భావించి హిట్టింగ్‌ చేశానని’ తెలిపాడు. ఇక వన్డే, టీ20ల్లో అవకాశంపై స్పందిస్తూ.. అది సెలక్టర్ల నిర్ణయమని, అవకాశం వచ్చేలా ఆడటమే నా బాధ్యత అని చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్‌ ఐపీఎల్‌లో సాహా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున బరిలోకి దిగుతు‍న్న విషయం తెలిసిందే.వరల్డ్ రికార్డ్ 'ఆమె' పేరుతో

Updated By ManamWed, 03/14/2018 - 01:30

imageబ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలన్న సంకల్పం వరల్డ్ రికార్డ్ సృష్టించింది. 2400 మంది మహిళలు ఒక చోట చేరి, వీరంతా చేపట్టిన మానవహారంలో భాగంగా మహిళా సాధికారితపై కూడా అవగాహన కల్పించేలా సాగడం విశేషం. వీరంతా సందేశాన్ని ఇస్తూనే సరికొత్త వరల్డ్ రికార్డ్ సృష్టించారు.

గుజరాత్‌లోని వదోదరలో ఓవైపు ఐసీసీ వుమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ imageసాగుతుంటే మరోవైపు లంచ్ బ్రేక్‌లో మానవహారం చేసిన సందడి ఇండియా-ఆస్ట్రేలియా వుమెన్స్ క్రికెట్ మ్యాచ్‌లో హైలైట్‌గా సాగింది. రిలయన్స్ స్టేడియంలో మానవహారం ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. బరోడా క్రికెట్ అసోసియేషన్ సహకారంతో సాగిన మానవహారం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడంతో ఇందులో పాల్గొన్న మొత్తం 2416 మంది మహిళలు ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు.  ‘చక్ దే ఇండియా’తో పాటు పలు ఫోక్ డ్యాన్స్‌లను బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే చేస్తుంటే గుజరాతీ మహిళలు చేతిలో చేయి వేసి, మనకోసం మనం అంటూ సాగిన తీరు కెమెరాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది.భారత ఆర్మీ సరికొత్త వరల్డ్ రికార్డ్

Updated By ManamSat, 11/25/2017 - 20:41
indian army

భారత ఆర్మీ జవాన్లు సరికొత్త వరల్డ్ రికార్డ్ సృష్టించారు. 500 సీసీల ఒకే ఒక్క రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై ఏకంగా 58 మంది జవాన్లు ప్రయాణం చేశారు. 1.2 కిలో మీటర్ల దూరం పాటు ప్రయాణించి అరుదైన రికార్డు నెలకొల్పారు. బెంగుళూరు శివారులోని ఎలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఈ ఫీటుకు వేదికయ్యింది. ఆర్మీ సర్వీస్ కార్ప్స్‌ విభాగానికి చెందిన జవాన్లు ఈ ఘనతను సాధించారు. 2010 నుంచి ఇప్పటి వరకు 56 మంది రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై ప్రయాణం చేయడమే వరల్డ్ రికార్డుగా ఉంటూ వచ్చింది. 

Related News