double bed room

ల్యాండ్‌పూలింగ్‌తో డబుల్ కల సాకారం

Updated By ManamFri, 11/09/2018 - 01:46

imageహైదరాబాద్ లాంటి మహానగరాల్లో ప్రభుత్వ అవసరాలకు భూమి సేకరించడం అంటే తలకు మించిన భారం. అందులోనూ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల లాంటి అతి భారీ ప్రాజెక్టుల విషయమైతే అసలు చెప్పనే అక్కర్లేదు. వాటికి చాలా ఎక్కువ స్థలం కావాల్సి ఉంటుంది. ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం తలపెట్టినపుడు భవన నిర్మాణ అనుమతులు, సాంకేతిక అనుమతులు, కాంట్రాక్టర్లను సమకూర్చడం, వనరుల సమీకర ణ.. ఇలా చాలా ఉంటాయి. వీటన్నింటికంటే అతి పెద్ద సమస్య భూసమీకరణ. అసలు ప్రాజెక్టు ఎక్కడ మొదలుపెట్టాలో నిర్ణయించుకోవాలన్నా కూడా భూమి అత్యంత ప్రాధాన్యమైన అంశం అవుతుంది.

జంట నగరాల పరిధిలో మొత్తం దాదాపు లక్ష ఇళ్ల వరకు నిర్మించాలని భావించారు. వాటన్నింటినీ బహుళimage అంతస్థుల అపార్టుమెంట్ల రూపంలో కట్టాలనుకున్నా కూడా ఎంత లేదన్నా కనీసం 600 ఎకరాల భూమి అవసరం అవుతుంది. గట్టిగా 200-300 గజాలలో ఇళ్లు కట్టుకుందామన్నా కూడా స్థలాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రస్తుత కాలంలో ఏకంగా అంత పెద్ద మొత్తంలో భూమిని సేకరించడం అంటే నిజంగా తలకు మించిన భారమే అవుతుంది. అయితే, ఈ పథకం మొత్తానికి ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా జీహెచ్‌ఎంసీని నియమించడంతో.. మొత్తం నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా సర్వే చేయించారు.

జిల్లాల యంత్రాంగంతో కూడా పూర్తిస్థాయిలో సమన్వయం చేసుకుంటూ ఎక్కడెక్కడ భూములు అందుబాటుల ఉన్నాయో చూడటం మొదలుపెట్టారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో కూడా సమన్వయం చేసుకుంటూ.. తమ పని నిర్విఘ్నంగా సాగేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. బడుగులకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం తలపెడుతుండటంతో ఆ విషయాన్ని సమగ్రంగా వివరించి.. ఎట్టకేలకు గుర్తించిన బహిరంగ స్థలాలను అందరి నుంచి సేకరించగలిగారు. అంతేకాదు, ప్రస్తుతం నగరంలో ఉన్న 36 మురికివాడలలో నివసిస్తున్న వారికి కూడా పూర్తిస్థాయిలో నచ్చజెప్పి, అక్కడే వారు ఉంటున్న ప్రదేశంలోనే వారికి గౌరవప్రదంగా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి, తొలి ప్రాధాన్యంగా అక్కడ ఉండేవారికే ఇస్తామని చెప్పడం ద్వారా.. ఆ స్థలాలను సైతం సేకరించగలిగారు. మొత్తమ్మీద నగరం, చుట్టుపక్కల ప్రాంతాలలో అంతా కలిపి 109 ప్రాంతాలలో 600 ఎకరాల భూమిని డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ల్యాండ్‌పూలింగ్ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ సమీకరించగలిగింది. దాంతో అంతటి బృహత్తరమైన ప్రాజెక్టు కూడా సాకారం అయ్యేందుకు వీలుపడింది. ‘డబుల్’కు వర్షపు పోటు

Updated By ManamTue, 08/14/2018 - 02:12
  • కురుస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇండ్లు

  • కారేపల్లి మండలంలో మునిగిన ఇండ్ల్లు

  • చెరువు లోతట్టు ప్రాంతాల్లో నిర్మాణాలు

  • బయటపడిన అవినీతి

imageఖమ్మం: డబుల్ బెడ్‌రూం ఇళ్లకు వర్షపు పోటు తగిలింది. చెరువు లోతట్టు ప్రాంతాల్లో నిర్మించడం,  నాసీరకంగా పనులు చేపట్టడం, వాగు సమీపంలో నిర్మించడం వల్ల ఈ పరిస్థితి ఎదుైరెంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కారేపల్లి, కల్లూరు, ఖమ్మం రూరల్ మండలాల్లోని లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మిగతా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ప్రస్తుతం లేకున్నా, భవిష్యత్తులో ముప్పు వాటిల్లే అవకాశాలు లేకపోలేదు.ఖమ్మం జిల్లాలో నియోజకవర్గానికి 400 చొప్పున డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించారు. ఖమ్మం కార్పొరేషన్‌లో గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటించిన సందర్భంలో అక్కడి పరిస్థితులను గమనించి ఖమ్మం నియోజకవర్గానికి 2400 ఇళ్లను కేటాయించారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ుకుమార్ అభ్యర్ధన మేరకు ఆ నియోజకవర్గానికి మరో ఐదువేల ఇళ్లను మంజూరు చేశారు.

ప్రస్తుతం అన్నీ ప్రాంతాల్లోనూ నిర్మాణాలు సాగుతున్నాయి. కొన్ని చోట్ల ప్రారంభం అయ్యాయి. కారేపల్లి మండలం పేరేపల్లి గ్రామంలో నిర్మించిన రెండు పడకగదుల ఇళ్లు వరద ముంపులో చికుకున్నాయి. ఇక్కడ 20 ఇళ్లను నిర్మించారు. గత ఏడాది జూన్‌లో ఈ ఇళ్లను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆ గ్రామంలో ఇళ్లు నిర్మించేటప్పుడే స్థలం ఎంపికపై వివాదం ఏర్పడింది. ఈ స్థలంలో గతంలో స్మశానం ఉండేది. ఈ ఇళ్లకు సమీపంలో బుగ్గవాగు ప్రవహిస్తుంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బుగ్గవాగులో భారీ వరద నీరు చేరి ఇళ్లకు పోటెత్తాయి. దీంతో లబ్ధిదారులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కల్లూరు మండలం  బత్తులపల్లి గ్రామంలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కురుస్తున్నాయి. నాసీరకంగా నిర్మించడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక టవీరయ్య ఆ ఇళ్లను సోమవారం పరిశీలించారు. ఇళ్లు స్లాబ్‌లు కురుస్తున్న తీరును పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కాంట్రాక్టర్ అవినీతి వల్లనే ఇళ్లు నాసీరకంగా నిర్మాణం అయ్యాయని పేర్కొన్నారు.

ప్రమాదంలో మరికొన్ని ఇళ్లు
ప్రభుత్వం ఇచ్చేది తక్కువ, ఖర్చు అయ్యేది ఎక్కువ కావడంతో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాసీరకం పనులు చేపట్టారనే విమర్శలు ఉన్నాయి. గతంలో కురిసిన బారీ వర్షానికి కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలో ఇళ్లు కూలిపోయాయి. కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామంలో పునాది స్థాయిలోనే పిల్లర్స్ పడిపోయాయి. ఈ ఘటనలు కాంట్రాక్టర్ల అవినీతికి, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచాయి. ఇదే తరహాలో అన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామంలో నిర్మించిన ఇళ్లు  చెరువు లోతట్టు ప్రాంతంలో ఉన్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్సాలు మరో మూడు రోజుల పాటు సాగితే అక్కడి చెరువు నిండి ఈ ఇళ్లల్లోకి నీళ్లు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఆనందభాష్పాలు రాల్చిన ఎమ్మెల్యే

Updated By ManamFri, 11/24/2017 - 17:49

mlaదేవరకద్ర: పేదల సొంతింటి కల తీర్చడంతో సంతోషానికి గురైన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆనందభాష్పాలు రాల్చారు. తాను దత్తత తీసుకున్న నిజలపూర్‌లో జరిగిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహ ప్రవేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే భావోద్వేగానికి లోనైయ్యారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల గృహ ప్రవేశం సందర్భంగా నిజలాపూర్ లో పండగ వాతావరణం కనిపించింది. శుభ గడియలో లబ్ధిదారులు డబుల్ బెడ్ రూం ఇళ్లల్లోకి గృహ ప్రవేశం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తొలి సారిగా పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. కొత్త ఇళ్లలను చూస్తూ మురిసిపోయారు. కొత్త ఇంటిలోకి అడుగుపెట్టిన క్షణాల్లో నిజలాపూర్ మహిళలు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఆనందభాష్పాలు రాల్చారు. 

Related News