Actress Namitha

లేడీ డాన్ నమిత

Updated By ManamThu, 07/12/2018 - 01:40

imageవిభిన్న చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధ హస్తుడైన టి.రాజేందర్ చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఓ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘ఇన్నైయ కాదల్ డా’ అనే టైటిల్‌తో రూపొందే ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, ఛాయాగ్రహణ పర్యవేక్షణ, దర్శకత్వం బాధ్యతలను టి.రాజేందర్ చేపడుతున్నారు.

‘‘ఈ సినిమాలో నమిత లేడీ డాన్‌గా నటించనుంది. ఆమెతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తారు. అలాగే కొంతమంది కొత్తవారిని కూడా ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం. పూర్తి యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటి ట్రెండ్‌కి తగినట్టుగా సినిమాలో ప్రేమ తప్ప మరో అంశం కనిపించదు. ఇలాంటి సినిమాలో లేడీ డాన్ పాత్ర ప్రాధాన్యం ఏమిటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉషా రాజేందర్, సహాయ నిర్మాతగా ఫరూక్ పిక్చర్స్ టి.ఫరూక్ వ్యవహరిస్తున్నారు.



ఘనంగా నమిత వివాహం

Updated By ManamFri, 11/24/2017 - 11:57

Actress Namitha, Veerandra Chowdhary, Namitha-Veeru marriage, Sarath Kumar, Bigg Boss Tamil contestants తిరుపతి: ప్రముఖ నటి, అందాల తార నమిత వివాహం తిరుమల తిరుపతిలో ఘనంగా జరిగింది. తమిళ ద‌ర్శక నిర్మాత‌ వీరేంద్ర చౌదరిని నమిత ప్రేమ వివాహం చేసుకున్నారు. తిరుపతిలోని ఇస్కాన్ ఆలయంలో శుక్రవారం ఉదయం 5.30 నిమిషాలకు తెలుగు సంప్రదాయంలో ఈ జంట ఒక్కటైంది. గురువారం చెన్నైలోని నమిత నివాసంలో మెహందీ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలతో పాటు, తెలుగు, తమిళ సినీపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటులు హాజరయ్యారు. ‘మియా’ చిత్రంలో తనతో నటించిన వీరేంద్ర చౌదరి అలియాస్‌ వీరుతో గత రెండేళ్లుగా తాను ప్రేమలో ఉన్నానని, నవంబర్‌లో తాను పెళ్లిచేసుకోబోతున్నానంటూ గత నెలలోనే నమిత ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. నమిత వివాహానికి ప్రముఖ నటి రాధిక, శరత్‌కుమార్‌ హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు.
Actress Namitha, Veerandra Chowdhary, Namitha-Veeru marriage, Sarath Kumar, Bigg Boss Tamil contestants
2002లో ‘సొంతం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన నమిత.. టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్‌ హీరోగా నటించిన జెమినీ చిత్రంలో నటించింది. ఆ తరువాత ఒక రాజు ఒక రాణి, ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా చిత్రంలో తన అందాలను ఆరబోసింది. అలాగే నందమూరి బాలకృష్ణ చిత్రం సింహాలో కూడా ఐటమ్ సాంగ్‌లో అదరగొట్టిన నమిత తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్‌ షోలోనూ నమిత పాల్గొన్నారు. అనంతరం తెలుగులో ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్‌‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుని టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది.
(నమిత-వీరూల పెళ్లిసందడి.. ఫొటోగ్యాలరీ)





Related News