team india captain

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

Updated By ManamWed, 10/24/2018 - 13:10
2nd ODI: India win the toss, elect to bat, in Visakhapatnam

విశాఖ : వెస్టిండీస్‌తో జరగనున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారమిక్కడ ఇండియా, వెస్టిండీస్‌ల మధ్య రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో సునాయాస విజయం సాధించడంతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.

దీంతో రెండో వన్డేలో గెలుపుపై ధీమాగా ఉన్న కోహ్లీ ...టాస్ గెలిచిన అనంతరం మాట్లాడుతూ..  పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించేలా ఉన్నదని, పైగా తమ బౌలింగ్ టార్గెట్‌ను డిఫెండ్ చేయగలిగేలా ఉందని అభిప్రాయపడ్డాడు. అలాగే టీమిండియా జట్టులో ఓ మార్పు జరిగింది.పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌కు చోటు దక్కింది.

ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో 81 పరుగులు చేస్తే వన్డేల్లో అతి వేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన వాడవుతాడు. అంతేకాకుండా ఈ విషయంలో దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను వెనక్కి నెట్టేస్తాడు. కోహ్లీ ఈ రికార్డును సాధిస్తాడని పోర్ట్ సిటీ అభిమానులు ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. ఈ ఘనతను సాధించేందుకు టెండూ ల్కర్ 259 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. అయితే కోహ్లీ 204వ ఇన్నింగ్స్‌లోనే సాధించే అవకాశముంది.ధ్యైర్యాన్ని కూడగట్టుకోవాలి

Updated By ManamSat, 07/21/2018 - 22:47
  • సహచరులకు మిథాలీ సూచన .. త్వరలో శ్రీలంక టూర్  

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ తుషార్ అరొథె తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో జట్టు mithaliసభ్యులందరూ వీలైనంత త్వరగా ధ్యైర్యాన్ని కూడగట్టుకోవాలని మిథాలీ రాజ్ సూచించింది. ఆసియా కప్‌లో పేలవ ప్రదర్శన, సీనియర్ సభ్యులతో సత్సంబంధాలు లేకపోవడం వంటి కారణాలతో తుషార్ రాజీనామా చేశారు. ‘వారం రోజుల్లో మేమందరం క్యాంప్‌లో కలవబోతున్నాం.

మొట్టమొదటి అంశమేంటంటే.. మేమందరం మళ్లీ ధ్యైర్యాన్ని కూడగట్టుకోవాలి. ఇటువంటి విషయాలు క్రీడాకారుల జీవితాల్లో మామూలే. కానీ ఎవరికి వారు ప్రాధాన్యతలను గుర్తించాలి. త్వరలోనే శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నాం. అంతేకాకుండా వరల్డ్ కప్‌కు కూడా సిద్ధపడాలి. కోచ్ వంటి విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టకూడదు’ అని మిథాలీ చెప్పింది. ఉన్నఫళంగా కోచ్‌ను తొలగించడం ఇదేమీ కొత్త కాదు. 2017లో ఐసీసీ వరల్డ్ కప్‌కు రెండు నెలల ముందు కోచ్ పూర్ణిమా రావ్‌ను కోచ్ పదవి నుంచి తొలగించారు. ఈ టోర్నీ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఓటమిపాలైంది. ‘నేను ఎక్కువగా చెప్పలేను. మేనేజ్‌మెంట్ నిర్ణయాల్లో బీసీసీఐదే ఏకైక అధికారం. అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో వాళ్లు మాత్రమే చెప్పగలరు. బోర్డ్ రూమ్‌లో జరిగిన ఆ సమావేశంలో ఏం జరిగిందో నేను చెప్పలేను. కానీ ఒక సీనియర్ ప్లేయర్‌గా కోచ్‌గా ఎవరున్నా అతనికి గానీ, ఆమెకు గానీ వ్యతిరేకిని మాత్రం కాదు. ఒక ప్లేయర్‌గా కోచ్ జట్టుకు సహాయపడాలని కోరుకుంటాను.

 అమ్మాయిలందరూ క్యాంప్‌కు వచ్చినప్పుడు ఒక అనుభవజ్ఞురాలిగా వాళ్లందరికీ దిశా నిర్దేశం చేస్తాను. అటువంటి సంఘటనలు కొన్నిసార్లు జట్టు మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి. ఎవ్వరూ వార్తా పత్రికలు చదవడం లేదని గానీ, ఎటువంటి ప్రశ్నలూ వేయడం లేదని గానీ చెప్పలేను. ఇది అన్ని చోట్లా ఉన్నదే. కానీ ఉన్నత స్థాయిలో పోటీ చేసేటప్పుడు మనకున్న వనరులలో ఉత్తమమైనదాన్ని ఉపయోగించుకోవాలి. మాది బలమైన జట్టే. కానీ ఉత్తమ వ్యూహాలు రచించుకోవాలి. ఎందుకంటే టీ20 అనేది చాలా ఫాస్ట్‌గా ఆడాల్సి వుంటుంది’ అని మిథాలీ వివరించింది.

 తదుపరి భారత మహిళల జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అంతకుముందు బెంగళూరులో 10 ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొననుంది. ‘శ్రీలంక పర్యటన మాకు చాలా ముఖ్యమైంది. వన్డేల ద్వారా పాయింట్లు వస్తాయి కాబట్టి ఈ పర్యటనలో గెలవడం కూడా చాలా ముఖ్యం. ఆసియా కప్‌లో ఓటమి తర్వాత కాస్త నిరుత్సాహాం చెందాం. కానీ ఐదు మ్యాచ్‌ల టీ20లో విజయం మాలో విశ్వాసాన్ని నింపింది. శ్రీలంక వన్డే సిరీస్‌లో గెలవడం ద్వారా వరల్డ్ కప్‌లో విశ్వాసంతో అడుగుపెడతాం’ అని మిథాలీ పేర్కొంది.ఆదుకున్న కోహ్లీ

Updated By ManamWed, 07/18/2018 - 00:32
  • 71 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్  

imageలీడ్స్: ఇంగ్లాండ్‌తో జరిగే చివరి వన్డేలో టీమిండియా విజయవకాశాలు ఫిఫ్టీ-ఫిఫ్టీగా ఉన్నాయి. కెప్టెన్ కోహ్లీ ఒక్కడే 71 పరుగులు చేసి ఆకట్టుకోగా, ధావన్ (44), ధోనీ (43) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్‌కు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ ఏకంగా 18 బంతులు ఆడి 2 పరుగులు చేసి విల్లే బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో భారత్ జట్టు 13పరుగులకే ఒక వికెట్‌ను చేజార్చుకుంది.

తర్వాత బ్యాటింగ్ దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి ఆచితూచి ఆడుతూ సమయం దొరికినప్పుడల్లా తనైదెన షాట్లతో ఆకట్టుకుంటూ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు  భారత్ జట్టుకు 17.4ఓవర్లో మరో షాక్ తగిలింది. అనవసరైమెన పరుగు కోసం ప్రయత్నించినా ధావన్(44)ను ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ రనౌట్ చేసాడు. అప్పటికి భారత్ 84 పరుగులు చేసి పటిష్టైమెన స్థితిలోనే ఉంది. రెండో వన్డేలో విఫలైవెున కె.ఎల్ రాహుల్‌కు విశ్రాంతినిచ్చి అతని స్థానంలోన జట్టులోకి వచ్చిన దినేష్ కార్తీక్ (21) పరుగులు చేసి రషీద్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.  కీలక సమయంలో వికెట్లు చేజారిపోతున్నా భారత్ కెప్టెన్ కోహ్లీ ఒత్తిడికి లోనవ్వకుండా తనైదెన ఆటతో 55 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

శతకం దిశగా సాగుతున్న కోహ్లీ (71) ప్రయాణం 30.1 ఓవర్లో రసీద్ బౌలింగ్‌లో ముగిసి 4 వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌కోహ్లీ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. తక్కువ ఇన్నింగ్స్(49)లు ఆడి 3,000 పరుగులు సాధించిన కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. వెంటనే బ్యాటింగ్ దిగిన సురేష్ రైనా (1) రషీద్ ఓవర్లోనే చివరి బంతికి రూట్‌కి క్యాచ్ ఇచ్చి 5వికెట్‌గా పెవిలియన్ చేరాడు. వరుసగా రెండు కీలక వికెట్లు కొల్పొయిన ఒత్తిడిలో ఉన్న భారత్ జట్టును ధోనీ, హర్ధిక్ పాండ్య ఆదుకోవాలని చూసారు. కాస్త నిలకడగా ఆడిన పాండ్య 21 బంతుల్లో 21 పరుగులు చేసి 38.2ఓవర్లో హుడ్ బౌలింగ్‌లో బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి భారత్ స్కోర్ 194/6.  దీంతో ఒకానొక దశలో 300 స్కోర్ చేసేల్లా కనిపించిన భారత్ జట్టు 250 పరుగులు చేసిన ఘనమే అనిపించింది.

 ఒక్కైవెపు రెండో వన్డేలో స్లోగా ఆడి భారత్ ఓటమికి కారణం అయ్యాడు అనే విమర్శలు వచ్చిన ధోనీ (43)పరుగులతో ఆకట్టుకున్నాడు. విల్లే బౌలింగ్‌లో కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్‌గా ధోనీ వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన శార్ధుల్ ఠాకూర్  (22 నాటౌట్, 2 సిక్స్‌లు) చివరిలో బ్యాట్  ఝుళిపించడంతో భారత్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 256 పరుగులు చేసింది. 8 వికె ట్‌గా ఇన్నింగ్స్ చివరి బంతికి భువనేశ్వర్ (21) బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.10వేల పరుగుల క్లబ్‌కు చేరువలో ధోనీ

Updated By ManamWed, 07/11/2018 - 23:30

imageటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో అదురైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకొనేందుకు ధోనీ ఇంకా 33 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్ల్లాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో ధోనీ ఈ రికార్డును సాధించే అవకాశం ఉంది. శుక్రవారం నాట్టింగ్‌హామ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది.

ఈ మ్యాచ్‌లో ధోనీ 33 పరుగులు చేస్తే.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ తర్వాత 10వేల పరుగుల క్లబ్‌లో చేరిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలుస్తాడు. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ఈ క్లబ్‌లో చేరిన 12వ క్రికెటర్‌గా ధోనీ ఘనత సాధించే అవకాశం ఉంది. ఈ క్లబ్‌లో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నారు. సచిన్ ఆడిన అన్ని వన్డేల్లో 18,426 పరుగులు చేశారు. ఆ తర్వాత 14,234 పరుగులతో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కార, 13,704 పరుగులతో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నారు.కోహ్లి డబుల్ సెంచరీ.. భారత్ 610/6 డిక్లేర్డ్‌

Updated By ManamSun, 11/26/2017 - 16:49
  • 384 పరుగుల ఆధిక్యంలో టీమిండియా.. లంక బౌలర్లు విలవిల

  • సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. మూడో రోజూ భారత్‌దే ఆధిపత్యం

  • ముగిసిన మూడోరోజు ఆట.. శ్రీలంక రెండో ఇన్సింగ్స్ స్కోరు: 21/1

Virat Kohli, Rohit Sharma, India vs Sri Lanka 2017-18 (3221), India Team (1939), team india captain (3763) Double Centuryనాగ్‌పుర్‌: శ్రీలంకతో రెండో టెస్టు మ్యాచ్‌ మూడో రోజూ భారత్‌ ఆధిపత్యం కొనసాగించింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 176.1 ఓవర్లు ఆడిన భారత్‌ 610/6 వద్ద డిక్లేర్‌ చేసింది. భారత్‌కు 384 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇన్నింగ్స్‌ 177వ ఓవర్‌ తొలి బంతికి మూడు పరుగుల సాధించి రోహిత్‌ శర్మ శతకం పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి (213), పుజారా(143), మురళీ విజయ్‌(128) అద్భుతంగా రాణించారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 610/6 వద్ద డిక్లేర్‌ ఇచ్చి శ్రీలంకను రెండో ఇన్నింగ్స్‌కు ఆహ్వానించాడు. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. సమరా విక్రమా ఆదిలోనే (0) చేతులేత్తేయగా కరుణరత్నె (11), తిరుమన్నె (9) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీసుకున్నాడు. దీంతో శ్రీలంక 384 పరుగుల వెనుకంజలో ఉంది. 

విరాట్ ఐదో డబుల్ సెంచరీ..
Virat Kohli, Rohit Sharma, India vs Sri Lanka 2017-18 (3221), India Team (1939), team india captain (3763) Double Centuryఅద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న పరుగుల వీరుడు కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డులు బ్రేక్‌ చేశాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 312/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన పుజారా, కోహ్లిలు లంక బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ మూడో వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక రెండో రోజు ఆటలో మురళి విజయ్‌, పుజారాలు తలో సెంచరీ నమోదు చేయగా, మూడో రోజున కోహ్లి 130 బంతుల్లో సెంచరీ పూర్తి చేయడం విశేషం. విధ్వంసకర బ్యాటింగ్‌తో విజృంభించిన కోహ్లి ఆదివారం ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల సునామీ సృష్టించాడు.

ప్రత్యర్థి లంక బౌలర్లను పసికూనలుగా చేసి ఆకలితో ఉన్న పులిలా బ్యాట్‌ను విదిల్చాడు. ఉదయం నుంచి నిలకడగా ఆడుతూ తనదైన శైలిలో విజృంభించి లంక బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో (267 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్‌లు; 213)తో డబుల్‌ సెంచరీ సాధించాడు. టెస్టు కెరీర్‌లో కోహ్లికి ఐదో డబుల్ సెంచరీ కాగా, టెస్టుల్లో విరాట్‌కు ఇది 19వ సెంచరీ.  శ్రీలంకతో రెండో టెస్టు మూడో రోజు ఆటలో విరాట్‌ అత్యంత ఆకర్షణగా నిలిచాడు. పుజారాతో 183 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లి తర్వాత రోహిత్‌ శర్మతోనూ 150కి పైగా పరుగులు జోడించాడు. 

పాంటింగ్‌ రికార్డు బ్రేక్‌.. 
టెస్టు కెరీర్‌లో ఏడోసారి 150కి పైగా పరుగులు సాధించాడు. దిల్రువాన్‌ వేసిన 140వ ఓవర్‌రెండో బంతిని సిక్సర్‌గా మలచడంతో విరాట్‌ 150 పరుగుల మార్క్‌ దాటాడు. తద్వారా అంతకుముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్‌ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాదిలో కోహ్లికి పదో సెంచరీ కాగా, అత్యధికంగా 9 సెంచరీలు, గ్రేమ్‌ స్మిత్‌ 9 సెంచరీలు సాధించిన వారి సరసన నిలిచాడు. అన్ని ఫార్మట్లలో కలిపి 50 సెంచరీలు సాధించిన కోహ్లి మరో శతకం సాధించాడు. మూడు రోజు ఆటలో 130 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్‌లో 19వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. సమయం లేదు మిత్రమా!

Updated By ManamThu, 11/23/2017 - 23:32
  • దక్షిణాఫ్రికా టూర్‌కు 2 రోజులే గ్యాప్

  • ఎలా సన్నద్ధం కావాలి: విరాట్ కోహ్లీ

  • బీసీసీఐ తీరుపై పరోక్షంగా అసంతృప్తి

virat kohilyవైుదానంలోనూ, విమర్శకులకు బదులు చెప్పడంలోనూ దూకుడు వైఖరి ప్రదర్శించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తొలిసారిగా బీసీసీఐపై అసంతృప్త గళం విప్పాడు. బోర్డు పేరును నేరుగా ప్రస్తావించకున్నా.. తీరికలేని షెడ్యూల్‌తో వరుసగా సిరీస్‌లు ఖరారు చేయుడాన్ని తప్పుపట్టాడు. కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు సన్నద్ధం కావడానికి తగిన సమయం ఏదంటూ కోహ్లీ ప్రశ్నించాడు. శ్రీలంకతో సిరీస్‌తో ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లడానికి కేవలం రెండు రోజులే సమయం ఉందంటూ పెదవి విరిచాడు. వచ్చే నెల 24న లంకతో సిరీస్ ముగియునుండగా, 27న భారత జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది. 

Related News