jeevan reddy

కల్వకుంట్ల వంశంలోనే అబద్ధాలు

Updated By ManamFri, 11/09/2018 - 01:21
  • కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి  

imageజగిత్యాల: కల్వకుంట్ల వంశంలోనే అబద్ధాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత టి. జీవన్‌రెడ్డి విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో మహాకూటమి గెలుపు ఖాయమని ఆయన అన్నారు. జగిత్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ వంశంలో ఏ ఒక్కరిలోనూ మాట మీద నిలబడే వ్యక్తిత్వం, నిజాయితీ లేవని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జీవన్‌రెడ్డి పోటీలో ఉంటే కేటీఆర్, కవితకు ఎందుకంత భయమని అడిగారు. కేసీఆర్ కంటే కడియం శ్రీహరే బెటరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలకు సీఎం ఆశ ఉండటం తప్పా? అని ప్రశ్నించారు. సీఎం వాళ్లకు మాత్రమే సొంతమా అని ప్రశ్నించారు. మా కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లంతా సీఎం పదవికి అర్హులేనని చెప్పారు. అదే కాంగ్రెస్ గొప్పదనమని కొనియాడారు. టీఆర్‌ఎస్‌లో కేసీఆర్, కేటీఆర్ మాత్రమే సీఎంలు కావాలని కలలు కంటున్నారని ఆయన దెప్పిపొడిచారు. మహాకూటమి అభ్యర్థులు ఖరారు అయిన తర్వాత ప్రచారం జోరందుకుంటుందని ఆయన అన్నారు. అభ్యర్థులు ఖరారు కాకముందే టీఆర్‌ఎస్ నాయకుల్లో గుబులు మొదలయ్యిందన్నారు.  మోదీతో కేసీఆర్ కుమ్మక్కు

Updated By ManamMon, 10/08/2018 - 23:11
  • టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, జీవన్‌రెడ్డి   

imageజగిత్యాల: ప్రధాని మోదీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని రమణ విమర్శించారు. సోమవారం జగిత్యాలలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి  మహాకూటమి ప్రచారంలో భాగంగా వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఒకే వేదికపైకి పంచుకున్నారు. దేశం అంతా అట్టుడికించిన  ప్రధాని మోదీ రఫెల్ స్కాం గురించి  కేసీఆర్ పల్లెత్తు మాట కూడా మాట్లాలేదంటే వారి ఐక్యత ఎలాంటిదో అర్థమవుతుందన్నారు. కేసీఆర్ పాలన అంతమే తమ ధ్యేయమని రమణ అన్నారు. కేసీఆర్ తన రాజకీయ లబ్దికోసం 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దుచేశారని రమణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే

Updated By ManamThu, 08/23/2018 - 02:27
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

Jeevan-Reddyజగిత్యాల/పెద్దపల్లి: ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి  తెలిపారు. బుధవారం జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందస్తుకు వెళ్తే ఏ పార్టీకి మెజార్టీ రాదని, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్, చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓడిపోయారన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ పాలనలో నిర్వహించిన సర్వేలన్నీ బూటకమేనని, ప్రతి సర్వేలో 50 సీట్లు మించలేదని, కేసీఆర్ పాలనలో ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

కేసులకు భయపడే మోదీతో దోస్తీ: పొన్నం
సీబీఐ కేసుల కారణంగానే ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ దోస్తీ చేస్తున్నాడని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ విమర్శించారు. అందుకే కేసీఆర్‌ను ఎక్కడ కూడా పల్లెత్తు మాట అనడం లేదన్నారు. రాఫెల్ కుంభకోణంపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదు? అని పొన్నం సూటి ప్రశ్న సంధించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ, టీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గుతోందని పొన్నం జోస్యం చెప్పారు.సీఎం స్ఫూర్తితో ఎన్నారై హరితహారం

Updated By ManamSun, 07/29/2018 - 02:00
  • 8 వేల మొక్కలు నాటిన వైనం

  • దొండపాడుకు పచ్చని చెట్ల సొబగు

  • ఏహెచ్‌ఆర్ ఫౌండేషన్ అప్పిరెడ్డి సారథ్యం

Jeevan Reddyహైదరాబాద్: టీఆర్‌ఎస్ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని కాంగ్రెస్ శాసన సభా పక్ష ఉప నాయకుడు  జీవన్ రెడ్డి  ఆరోపించారు. గ్రామాలకు కేంద్ర నిధులు తప్ప రాష్ట్ర నిధులు రావడంలేదని శనివారం నాడు అసెంబ్లీలోని మీడియా హాల్‌లో విలేకరుల సమావేశంలో ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎంతో గొప్పగా చెప్పిన ‘మన ఊరు మన ప్రణాళిక’ పట్టాలెక్కలేదని, ‘గ్రామ జ్యోతి’ కార్యక్రమం వెలగక ముందే ఆరిపోయిందని విమర్శించారు. ఉపాధి హామీ, 14వ ఆర్థిక సంఘం నుంచి మాత్రమే నిధులు వస్తున్నాయని , రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయ కూడా రావడంలేదన్నారు.  కోర్టులో కేసు పేరుతో కుట్రపూరితంగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించడంలేదని జీవన్ రెడ్డి ఆరోపించారు. 2016లోనే సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులను తొలగించి, బీసీ జనాభా గణన చేయాలని తీర్పు ఇచ్చిందన్నారు. బీసీల మీద ప్రేమ ఉంటే కోర్టు తీర్పు వచ్చిన వెంటనే జన గణన చేసి ఉండేవారన్నారు. 2017లో బీసీ గురుకుల విద్యా సంస్థలను 2018లో ప్రారంభిస్తామని అని అన్నారని, ఇప్పుడు 2019-20 అంటున్నారని, ముఖ్యమంత్రికి తన ప్రకటనపై తనకే నమ్మకంలేనట్లు ఉందని జీవన్ రెడ్డి అన్నారు.  సర్పంచ్‌లను ఎన్నికల వరకు కొనసాగించాలని ఆయన కోరారు. ఎంబీసీ కార్పోరేషన్‌కు వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామన్న కేసీఆర్ వెయ్యి రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.  సమ్మె చేస్తున్న పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులకు ఐదు వేలు కనీస వేతనం ఇస్తామని జీవో ఇచ్చి అమలు చేయడంలేదన్నారు. పారిశుద్ధ్య కార్మికుల్లో 99 శాతం మంది దళితులేనని, వారికి ఇచ్చేందుకు 180 కోట్లు లేవా అని ప్రశ్నించారు.'ఆ వ్యతిరేకతోనే టీఆర్ఎస్ ఆగమాగం అవుతోంది'

Updated By ManamSat, 03/24/2018 - 14:58

Jeevan reddy, TRS govt, NDA govt, Narendra modi హైదరాబాద్: ఎన్టీఏ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగమాగం అవుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో సీఎం కేసీఆర్ పావులా మారారని మండిపడ్డారు. నాలుగేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వానికి టీఆర్ఎస్ అనేకసార్లు మద్దతు తెలిపిందని అన్నారు. కేసీఆర్ శికండి పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. గిరిజన రిజర్వేషన్ బిల్లుపై కేంద్రంపై తప్పుబడుతూ టీఆర్ఎస్ దోబూచులాడుతోందని దుయ్యబట్టారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రావాల్సిన హక్కులను కాలరాస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్ మద్దతు తెలిపి తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో టీఆర్ఎస్ నేతలు స్పీకర్ ఎదుట ప్లకార్డులు పెట్టి నిరసన తెలుపడం.. రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.టీఆర్ఎస్ కంటే టీడీపీ నయం..

Updated By ManamTue, 02/27/2018 - 13:09

jeevan reddyహైదరాబాద్: జైరాం రమేష్‌పై మంత్రులు హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి చేసిన విమర్శలను తెలంగాణ సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి తిప్పికొట్టారు. విభజన హామీలు అమలు చేయమని జైరాం రమేశ్ కేంద్రాన్ని అడిగితే తప్పేంటన్నారు. విభజన చట్ట హామీలపై టిఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఈ విషయంలో పార్లమెంట్‌లో ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు సాధించలేదన్నారు. 

కేంద్రంలోని బీజేపీ సర్కారుతో టీఆర్ఎస్ మిత్రపక్షం కాని మిత్రపక్షంలా వ్యవహరిస్తోందన్నారు. ఓ రకంగా టీఆర్ఎస్ కంటే ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన టీడీపీయే కాస్త నయమన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా కేంద్రాన్ని ఏనాడైనా టీఆర్ఎస్ విభేదించిందా? అని ప్రశ్నించారు. చివరకు టీడీపీ కూడా ట్రిపుల్ తలాఖ్‌ను విభేదించిందని గుర్తుచేశారు. సీబీఐ కేసులకు భయపడే కేంద్రంతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

ఏ ఒక్క హామీని కూడా టీఆర్ఎస్ నెరవేర్చలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ప్రజలే బొందపెడుతారని దుయ్యబట్టారు. నాలుగు సంవత్సరాల్లో టీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. జై తెలంగాణ నుంచి జై ఆంధ్రకు వరకు టీఆర్ఎస్ స్ఫూర్తి పోయిందని ఎద్దేవా చేశారు.నిజమైన ఉద్యమ ద్రోహులు టీఆర్ఎస్సే అన్నారు.
 కేసీఆర్ సర్కార్‌కు చెంపపెట్టు

Updated By ManamThu, 12/28/2017 - 20:12

jeevan reddyహైదరాబాద్: ఓయూలో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని కాంగ్రెస్ సీఎల్పీ నేత జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. జాతీయి స్థాయిలో పేరుగాంచిన శాస్త్రవేత్తలు 105 సైన్స్ కాంగ్రెస్‌లో పేర్లు నమోదు చేసుకున్నారని గుర్తు చేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఏర్పాట్లు చేసిన తర్వాత శాంతి భద్రతల కారణాలతో సైన్స్ కాంగ్రెస్‌ను చేజార్చుకున్నారు. ఇది సర్కార్‌కు చెంప పెట్టులాంటిదని..దీంతో ఓయూ ప్రతిష్ట కూడా దెబ్బతింటుందన్నారు. ఓయూలో సీఎం అడుగుపెడితే విద్యార్ధుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే సైన్స్ కాంగ్రెస్ నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో పరిపాలన ఎలావుందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. కేసీఆర్ నైతికంగా సీఎంగా కొనసాగే హక్కులేదని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యలు నివారించండి

Updated By ManamWed, 11/22/2017 - 14:32

Jeevan Reddyహైదరాబాద్: రైతుల ఆత్మహత్యలపై టీఆర్ఎస్ సర్కార్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో మాట్లాడిన ఆయన...తెలంగాణ రైతాంగ పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. భారీ వర్షాల కారణంగా పత్తి, వరి పంట నష్టపోయిన రైతుల వివరాలను తెప్పించుకుని కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల సూచనను పరిగణలోకి తీసుకుంటే సర్కార్ తలొగ్గినట్లు భావించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాల సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటకు ప్రకృతి వైపరీత్యాల కింద నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 


గతంలో పంట నష్టం వివరాల నివేదిక కేంద్రానికి  సకాలంలో పంపకపోవడంతో ఇన్పుట్ సబ్సిడీ పొందలేకపోయామన్నారు. రైతులను పట్టించుకునే వాళ్ళే కరువయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంటే సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. 

Related News