TTD

అష్టబంధన సమర్పణ

Updated By ManamWed, 08/15/2018 - 02:57
  • మూలమూర్తి.. ఇతర విగ్రహాలకూ.. ఆగమోక్తంగా జరిగిన కార్యక్రమం

  • 8 దిక్కుల్లో అష్టబంధనం సమర్పణ.. 12 ఏళ్లకు ఓసారి జరిగే మహాఘట్టం

  • తిరుమల పరిసరాలలో సరికొత్త శోభ.. ధ్వజస్తంభానికి బంగారు రావి ఆకులు

  • మరిన్ని సరికొత్త అలంకరణలు కూడా..నేడు పూర్ణాహుతి.. తిరుమంజనం

imageతిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణంలో భాగంగా మంగళవారం ఆగమోక్తంగా అష్టబం ధన సమర్పణ జరిగింది. ఉదయం 5.30 నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తిరిగి రాత్రి 7 నుంచి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. గర్భాలయంలోని శ్రీ వేంకటేశ్వర 
 స్వామివారి మూలమూర్తితోపాటు ఉప ఆలయాలైన శ్రీ గరుడాళ్వార్, పోటు తాయార్లు, శ్రీవరద రాజస్వామి, శ్రీ యోగ నరసింహస్వామి, శ్రీ విష్వక్సేన, శ్రీ భాష్యకార్లు, శ్రీవేణుగోపాల స్వామి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారి విగ్రహాలకు అష్టబంధన సమర్పణ జరిగింది. ఈ అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామి వారి పాదాల కింద, చుట్టుపక్కల తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో సమర్పించారు. దీంతో అష్టబంధన సమర్పణ నిర్విఘ్నంగా పూర్తయినట్లయింది.

12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహోత్కృష్ట ఘట్టానికి ప్రధానార్చకుడు వేణుగోపాల దీక్షితులు కంకణభట్టార్‌గా వ్యవహరించారు. ఇంతకుముందు 2006 సంవత్సరంలో జరిగిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం మళ్లీ ఇపుడు జరుగుతుండటంతో ఆలయం అంతా సరికొత్త శోభను సంతరించుకుంటోంది. మహాసంప్రో క్షణ సందర్భంగా ధ్వజస్తంభం మొదలుకొని ఆలయ పరిసరా లు మొత్తాన్ని పూర్తిగా పరిశుభ్రం చేస్తున్నారు. భక్తుల రాక అంతంతమాత్రంగానే ఉన్నా.. వచ్చిన కొద్దిమంది ఆలయానికి కొత్త కళ వచ్చిందని కనులారా వీక్షించి ఆనందిస్తున్నారు.మహాసంప్రోక్షణ ఆరంభం

Updated By ManamMon, 08/13/2018 - 04:58
  • 12 ఏళ్ల విరామం తర్వాత కార్యక్రమం.. 300 గ్రాముల బంగారంతో కూర్చ

  • దర్భల కూర్చకు బదులు బంగారం.. బంగారు కలశంతో పాటు ప్రతిష్ఠాపన

  • కలశంలోకి దేవతామూర్తుల ఆవాహన.. రోజూ 6 గంటల నుంచి హోమాలు

  • ఈ నెల 16 వరకు కార్యక్రమాలు

imageతిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 16వ తేదీన మహాసంప్రోక్షణతో ఇవి ముగియను న్నాయి. ఉదయం ఒక హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహ వచనం, పంచగవ్యారాధన, వాస్తు హోమం, రక్షాబంధనం చేపట్టారు. శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణలో వినియోగించే బంగారు కూర్చను టీటీడీ సిద్ధం చేసింది. 300 గ్రాముల బంగారంతో దీన్ని తయారుచేశారు. సాధారణంగా వైదిక కార్యక్రమాల్లో అర్చకులు దర్భలతో చేసిన కూర్చలను వినియోగిస్తారు. కూర్చలోకి మంత్రావాహన చేసి వైదిక క్రతువులకు దాన్ని ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ మాత్రం బంగారు కూర్చను వాడుతుండటం విశేషం. శ్రీవారి మూలమూర్తిని ఆవాహన చేసిన బంగారు కలశంతో పాటు ఈ బంగారు కూర్చను యాగశాలలో ప్రతిష్ఠిస్తామని తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు.

కళాకర్షణ
రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని మూలవర్లతోపాటు ఉప ఆలయాల్లోని imageదేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం) లోకి ఆవాహన చేశారు. శ్రీవారి మూలమూర్తికి తల, నుదురు, ముక్కు, నోరు, గొంతు, రెండు భుజాలు, హృదయం, నాభి, కటి, మోకాలు, పాదాల్లో 12 జీవస్థానాలు ఉంటాయి. ఒక్కో జీవస్థానానికి 4 కళల చొప్పున మొత్తం 48 కళలు ఉంటాయి. ఈ 48 కళలను కుంభంలోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతో పాటు శ్రీ భోగశ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు, శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీ చక్రత్తాళ్వార్, శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారు, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు. ఉప ఆలయాల్లోని జయవిజయులు, ధ్వజస్తంభం, శ్రీ విష్వక్సేనుడు, శ్రీగరుడాళ్వార్, ప్రసాదం పోటులోని అమ్మవారు, లడ్డూపోటులోని అమ్మవారు, శ్రీ భాష్యకారులు, శ్రీ యోగ నరసింహస్వామి, శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారి శక్తిని కూడా కుంభంలోకి ఆవాహనచేసి యాగశాలకు తీసుకెళతారు. మొత్తం 18 వేదికలపై కుంభాలను కొలువుదీరుస్తారు. యాగశాలలో ప్రతిరోజూ నిత్య కైంకర్యాలతో పాటు ఉదయం 6 గంటల నుంచి హోమాలు నిర్వహిస్తారు.అత్యవసర విచారణ అక్కర్లేదు

Updated By ManamFri, 08/10/2018 - 23:01
  • మహాసంప్రోక్షణ ప్రసారం కేసులో హైకోర్టు   

imageహైదరాబాద్: తిరుమలలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం నుంచి మహాసంప్రోక్షణ జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రసారం చేయాలనే ప్రజాహిత వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ చేయాలన్న పిటిషనర్ వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. శుక్రవారం ఈ పిల్ విచారణ జరగాల్సివుంది. అయితే న్యాయమూర్తి రామసుబ్రమణియన్ సెలవు పెట్టడంతో కేసు ప్రాధాన్యతను న్యాయమూర్తులు రమేష్‌రంగనాథన్, బాలయోగిలతో కూడిన డివిజన్ బెంచ్ ఎదుట పిటిషనర్ లాయర్ లేవనెత్తారు. విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు బెంచ్ ప్రకటించింది. సోమవారం అయినా తొలి కేసుగా విచారణ చేయాలని కోరగా అందుకు కూడా డివిజన్ బెంచ్ అనుమతి ఇవ్వలేదు.తిరుమల వెంకన్న సమాచారం

Updated By ManamFri, 08/10/2018 - 08:39

ttd

తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకన్న కొలువైన తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు 5 కంపార్ట్‌మెంట్లలో వేచి చూస్తున్నారు. సర్వదర్శనం, నడకదారి, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు ఉదయం 9 గంటలు నుంచి టైంస్లాట్ కింద టోకెన్లను జారీ చేయనున్నట్లు  టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. తిరుమలేశ్వరుడి ఉచిత దర్శనానికి 12 గంటలు, టైంస్లాట్, సర్వ, దివ్య దర్శనాలకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేశారు. కాగా గురువారం ఒక్కరోజే శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.26 కోట్ల ఆదాయం లభించింది.

ఇదిలా ఉంటే.. నేటి అర్థరాత్రి నుంచి శ్రీవారి టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం నేపథ్యంలో టోకెన్లను నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. రేపు మహాసంప్రోక్షణకు అంకురార్పణ జరుగనుంది. మహాసంప్రక్షణ సమయంలో భక్తులకు పరిమితి సంఖ్యలో మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుంది.

కాగా.. తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి 45 మంది ఉద్ధండ పండితులంతా ఇప్పుడిప్పుడే తిరుమలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే యాగశాలలో ఇటుకలు, ఎర్రమట్టితో 28 హోమగుండాలు నిర్మించి, వాటిని గోమయంతో అలికారు. 21 హోమ వేదికలు ఏర్పాటు అయ్యాయి. ఇక్కడి కరెంటు తీగలు, బల్బులు, సీసీ కెమెరాలను తొలగించి, వెలుతురు కోసం 1000 నెయ్యి దీపాలను ఏర్పాటు చేశారు.తిరుమల దర్శనాల్లో పలు మార్పులు.. 

Updated By ManamThu, 08/09/2018 - 20:13
  • ఆరు రోజుల పాటు ఆర్జిత సేవలు.. ప్రత్యేక దర్శనాలు రద్దు

Tirumala Temple, TTD, Lord venkateswara, Special visitsతిరుపతి: మహా సంప్రోక్షణ సందర్భంగా తిరుమల దర్శనాల్లో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) పలు మార్పులు చేసింది. తిరుమలలో ఆరు రోజుల పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేయనున్నారు. రేపటి (శనివారం) నుంచి సర్వ దర్శనం క్యూలైన్ మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఎల్లుండి నుంచి ఆగస్టు 16 వరకు పరిమిత సంఖ్యలోనే స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతించనున్నారు. తిరుమల శ్రీవారి సమాచారం

Updated By ManamThu, 08/09/2018 - 08:35

TTD

తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. సర్వదర్శనం కోసం 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. సర్వ, నడకదారి, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు ఉదయం 9 గంటల నుంచి టైంస్లాట్ కింద టోకెన్ల జారీ చేస్తామని టీటీడీ ఓ ప్రకనటలో తెలిపింది. కాగా.. స్వామి వారి ఉచిత దర్శనానికి 12 గంటలు, టైంస్లాట్, సర్వ, దివ్య దర్శనాలకు 3 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మాత్రం కేవలం రెండు గంటల సమయం మాత్రమే పడుతోంది. కాగా.. బుధవారం ఒక్కరోజు శ్రీవారి హుండీ ద్వారా రూ.2.87కోట్లు.
 
ఇదిలా ఉంటే.. గురువారం అర్థరాత్రి నుంచి శ్రీవారి టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనున్నట్లు తెలిపింది. కాగా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం నేపథ్యంలో టోకెన్లను నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 11న మహాసంప్రోక్షణకు అంకురార్పణ జరుగనుంది. కాగా మహాసంప్రోక్షణ విషయమై అప్పట్లో పెద్ద గొడవ జరగడంతో చివరికి వెనక్కి తగ్గిన టీటీడీ పరిమితి సంఖ్యలో భక్తులను దర్శానికి అనుమతిస్తారు.శ్రీవారిని దర్శించుకున్న కేటీఆర్ కుటుంబం

Updated By ManamThu, 08/02/2018 - 10:40

minister ktr family visits tirumala temple for balaji darshan

తిరుపతి: తెలంగాణ మంత్రి కేటీఆర్ కుటుంబీకులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం కేటీఆర్ భార్య శైలిమ, కొడుకు హిమన్షు, కూతురు అలేఖ్య స్వామివారిని దర్శించుకుని.. అనంతరం మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తిరుమల జేఈవో శ్రీనివాసరాజు కేటీఆర్ కొడుకు హిమన్షును స్వామివారి పట్టువస్ర్తాలతో సత్కరించి.. స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. స్వామివారి దర్శనం కోసం బుధవారం రాత్రే తిరుమలకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.

minister ktr family visits tirumala temple for balaji darshanతిరుమల శ్రీవారి సమాచారం

Updated By ManamThu, 08/02/2018 - 09:05

Lord Tirumala Venkanna Devotees Info

తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న ఉచిత దర్శనానికి 20 గంటలు, సర్వ, నడకదారి, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల్లోపు దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టనుంది. 

ఇదిలా ఉంటే.. బుధవారం ఒక్కరోజే 65,546 మంది భక్తులు దర్శించుకోగా.. 22,363 మంది తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.21కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. కాగా ఇవాళ సాయంత్రం నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా..

Updated By ManamWed, 08/01/2018 - 10:21

Ysrcp MLA Roja on TTD Samprokshanam

తిరుపతి: మహాసంప్రోక్షణ సమయంలో తిరుమల వెంకన్న ఆలయం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భక్తుల ఆగ్రహావేశాలకు వెనక్కి తగ్గిన టీటీడీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ వ్యవహారంపై అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై పలు ఆరోపణలు సైతం చేయడం జరిగింది.

తాజాగా మరోసారి రోజా మాట్లాడుతూ.. మహాసంప్రోక్షణ సమయంలో భక్తులను అనుమతించాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సంప్రోక్షణ సమయంలో దర్శనాలను నిలిపివేయాలని చెప్పిన పాలకమండలి సభ్యులను సస్పెండ్ చేయాలని రోజా డిమాండ్ చేశారు.తిరుమల వెంకన్న సమాచారం

Updated By ManamWed, 08/01/2018 - 08:37

ttd lord inforamation

తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధిలో భక్తుల రద్దీగా ఎక్కువగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వదర్శనానికి 10 గంటలు, ఉచిత దర్శనానికి 20 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటలు సమయం పట్టనుంది. కాగా మంగళవారం ఒక్కరోజే స్వామివారిని 73,711 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 24,003 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.57 కోట్లుగా ఉంది.

ఇదిలా ఉంటే.. ఆగస్టు నెలలో శ్రీవారి ఆలయంలో పలు పర్వదినాల సందర్భంగా విశేష ఉత్సవాలను నిర్వహించనున్నారు. 
ఆగస్టు 7న సర్వ ఏకాదశి
11న శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు అంకురార్పణ
12నుంచి 16 వరకు  అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు.
ఆగస్టు 16న గరుడ పంచమి
19న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి
20న పవిత్రోత్సవాలకు అంకురార్పణ
21 నుంచి 23 వరకు పవిత్రోత్సవాలు
22న మతత్రయ ఏకాదశి
26న శ్రావణ పౌర్ణమి, శ్రీహయగ్రీవ జయంతి
27న శ్రీవిఖనస జయంతి
ని ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

Related News