imran khan

పాక్ ఎన్నికల ర్యాలీలో ఆత్మాహుతి దాడి

Updated By ManamWed, 07/11/2018 - 11:52
  • పెషావర్ ఆత్మాహుతి దాడిలో 20మంది మృతి

Peshawar suicide attack

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ఎన్నికల ప్రచారంలో దాడులు జరగవచ్చన్న నేషనల్‌ కౌంటర్‌ టెర్రరిజం అథారిటీ (నాక్టా) హెచ్చరికలు నిజమయ్యాయి. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో నిన్న జరిగిన ఆత్మాహుతి దాడి 20 మంది మృతి చెందగా, సుమారు 30మందికిపైగా గాయపడ్డడారు. కాగా పెషావర్‌లో అవామీ నేషనల్‌ పార్టీ (ఏఎన్‌పీ) ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ర్యాలీలో పాల్గొన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.

కాగా మృతుల్లో ఏఎన్‌పీ అభ్యర్థి హరూన్‌ బిలౌర్‌ ఉన్నారు. పాకిస్తాన్‌లో ఈ నెల 25న సార్వత్రిక ఎన్నికల జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల బరిలో హరూన్‌ కూడా ఉన్నారు. ఆయన ప్రసంగం ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే ఆత్మాహుతి దాడి జరిగింది. కాగా ఈ దాడికి తామే బాధ్యులమని  పాక్ తాలిబాన్లు ప్రకటించారు. 

మరోవైపు ఈ దాడి ఘటనను పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌​ చీఫ్‌, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్రంగా ఖండించారు. అన్ని రాజకీయ పార్టీల నేతలకు భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇమ్రాన్ ట్వీట్ చేశారు. అలాగే ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న జాబితాలో ఇమ్రాన్‌‌తో పాటు అవామీ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు అఫ్సన్‌దర్‌ వలి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్‌ సయీద్‌ కుమారుడు కూడా ఉన్నారు.ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఇమ్రాన్ ఖాన్

Updated By ManamTue, 07/10/2018 - 12:40
Imran khan

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఇ–ఇన్సాఫ్‌ ఛైర్మన్‌, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఉగ్రవాదులు హిట్ లిస్టులో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పాక్  నేషనల్ కౌంటర్ టెర్రరిజం అధారిటీ (ఎన్ఏసీటీఏ) వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు దేశంలోని పలువురు రాజకీయ నాయకులపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. జూలై 25న పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార సమయంలో ఈ దాడులు జరగవచ్చని తెలిపింది.

ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఇమ్రాన్ ఖాన్, అవామీ నేషనల్ పార్టీ అధ్యక్షుడు అఫ్ఫ్సిండార్ వాలి అఫ్సన్‌దయార్ వాలి, ఖౌమి వాతన్ పార్టీ నేత, అత్తాబ్ అహ్మద్ ఖాన్ షెర్పావో, జామైత్ ఉలేమా ఇ ఇస్లాం-ఫజల్ నేత అక్రమ్ దుర్రానీ, ఏఎన్పీ నేత అమీర్ హైదర్ హొతీ తదితరులు ఉన్నట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. కాగా వచ్చే నెల జరుగబోయే ఎన్నికలలో ఇమ్రాన్ ఖాన్ నాలుగు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.

అలాగే లష్కర్-ఇ-తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు  తల్హా సయీద్ 'అల్లాహో అక్బర్‌ తెహ్రీక్‌' పేరుతో పాక్ ఎన్నికల బరిలో దిగిన విషయం తెలిసిందే.  తల్హా సయీద్‌తో పాటు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్‌ఎన్‌) సీనియర్ నాయకులు కూడా ఈ హిట్ లిస్టులో ఉన్నారు.

ఎన్ఏసీటీఏ హెచ్చరికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలకు పాక్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని ప్యానెల్ చీఫ్ రెహ్మాన్ మాలిక్ డిమాండ్ చేశారు. కాగా కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో కరాచీలో ఇమ్రాన్ ఖాన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మరణించినట్లు పుకార్లు వెలువడిన విషయం తెలిసిందే.పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ‘హ్యాట్రిక్’

Updated By ManamMon, 02/19/2018 - 20:29

మూడోసారి పెళ్లికొడుకాయనే!
పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ‘హ్యాట్రిక్’
ఆధ్యాత్మిక గురువు బుష్రాతో వివాహం

imran khanలాహోర్, ఫిబ్రవరి 19: వదంతులకు తెరపడింది. ఆయన ముచ్చటగా మూడోసారి పెళ్లి కొడుకయ్యారు. ఈ సారి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ (65) మూడో పెళ్లి చేసుకున్నారు. తన ఆధ్మాత్మిక గురువు బుష్రా మనేకా (40)ను ఆయన మనువాడారు. ఆదివారం లాహోర్‌లోని బుష్రా సోదరుడి ఇంట్లో వీరిద్దరి వివాహం జరిగింది. ఈ విషయాన్ని పీటీఐ అధికార ప్రతినిధి పవాద్ చౌదరి అధికారికంగా వెల్లడించారు. త్వరలో సన్నిహితులకు ఇమ్రాన్ విందు ఇవ్వనున్నట్లు చెప్పారు. పీటీఐ సెంట్రల్  ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ముఫ్తీ ముహమ్మద్ సయీద్ వారి నిఖా జరిపించారు. పీటీఐ పార్టీకి చెందిన మీడియా విభాగం వారి పెళ్లి ఫొటోలను విడుదల చేసింది. క్రికెటర్‌గా పాకిస్థాన్‌లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఇమ్రాన్‌కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లయ్యాయి. తొలుత 1995లో ఆయన బ్రిటిష్ జర్నలిస్టు జెమీమా గోల్డ్‌స్మిత్‌ను పెళ్లాడారు. జెమీమాకు ఇద్దరు కుమారులు. తొమ్మిదేళ్ల తర్వాత ఇమ్రాన్-జెమీమాల బంధం విడిపోయింది. దీంతో ఆయన 2015లో ఓ టీవీ యాంకర్ రేహమ్ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే పట్టుమని 10 నెలలైనా గడవకముందే ఆమెతో బంధాన్ని తెంచుకున్నారు. ఆ తరువాత ఒంటరిగా ఉన్న ఇమ్రాన్.. తాజాగా బుష్రాను పెళ్లి చేసుకున్నాడు. కాగా, గత ఏడాది నుంచే బుష్రాను ఆధ్యాత్మిక సలహాల కోసం ఇమ్రాన్ కలుస్తున్నారు. ఆమె తన పార్టీకి సంబంధించి పలు అంశాల్లో చెప్పిన జోష్యం నిజం కావడంతో ఆయన బుష్రాకు దగ్గరయ్యారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో ఆమె తన భర్త నుంచి గతేదాడి చివరిలో విడాకులు తీసుకున్నారు. దీంతో ఇమ్రాన్-బుష్రా పెళ్లి జరిగిపోయిందంటూ జనవరి 1 నుంచే వార్తలు మొదలయ్యాయి. వాటిని మొదట్లో ఖండించిన ఇమ్రాన్.. ఆ తరువాత ఆమెతో ప్రేమలో ఉన్నానని, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. ముఖ్యంగా బుష్రాకు గతంతో వివాహమై ఉండడంతో పాటు ఆమెకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. దీంతో ఆమె తన పిల్లలతో సంప్రదింపులు జరిపి ఒక నిర్ణయానికి రావాలని కోరినట్లు చెప్పారు. అయినా వదంతులు కొనసాగడంతో ఇటీవల పార్టీ నేతల నుంచి ఆయనపై ఒత్తిడి పెరిగింది. పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని కోరారు. ఈ క్రమంలో బుష్రాను ఆదివారం ఇమ్రాన్ మూడో పెళ్లి చేసుకుని, ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించారు.అవును వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు

Updated By ManamMon, 02/19/2018 - 08:58

Imran Khan లాహోర్: మాజీ క్రికెటర్‌, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ మూడో వివాహం చేసుకున్నారు. ఆధ్మాత్మిక గురువు బుష్రా మనేకాను ఆయన వివాహం చేసుకున్నారు. ఆదివారం లాహోర్‌లోని బుష్రా మనేకా సోదరుడి ఇంట్లో వీరిద్దరి వివాహం జరిగింది.  ఈ విషయాన్ని పీటీఐ అధికార ప్రతినిధి పవాద్‌ చౌదరి అధికారికంగా వెల్లడించారు.

అయితే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు గతేడాది నుంచే వార్తలు వస్తున్నాయి. వాటిని మొదట్లో ఖండించిన ఇమ్రాన్.. ఆ తరువాత ఆమెతో ప్రేమలో ఉన్నానని, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని అన్నారు.  ఈ నేపథ్యంలో తాజాగా బుష్రాను మూడో పెళ్లి చేసుకున్నారు. అయితే క్రికెటర్‌గా పాకిస్థాన్‌లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్న ఇమ్రాన్, తొలుత బ్రిటిష్‌ జర్నలిస్టు జెమీమాను పెళ్లాడారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయి మరో జర్నలిస్ట్ రేహమ్‌ను(2015లో) రెండోపెళ్లి చేసుకున్నారు. అయితే పట్టుమని 10 నెలలైనా గడవకముందే ఆమెతో బంధాన్ని తెంచుకున్నాడు. ఆ తరువాత కొంతకాలంగా ఆయన ఒంటరిగా ఉన్న ఇమ్రాన్.. తాజాగా బుష్రాను పెళ్లి చేసుకున్నాడు. కాగా 40ఏళ్ల వయసున్న బుష్రాకు ఇది రెండో వివాహం కాగా.. ఇప్పటికే ఆమెకు ఐదుగురు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

Imran Khan

 ఇమ్రాన్‌కు పాక్ అసెంబ్లీ ఖండన

Updated By ManamThu, 01/18/2018 - 15:17

imran khanఇస్లామాబాద్: పాక్ పార్లమెంటుపై పాకిస్థాన్ టెహ్రికీ ఇన్సాఫ్(పీటీఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్, అవామీ ముస్లీం లీగ్ చీఫ్ షేక్ రషీద్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ దేశ నేషనల్ అసెంబ్లీ తీర్మానం చేసింది. లాహోర్‌లో బుధవారం జరిగిన ప్రభుత్వ వ్యతిరేక సభలో ఆ దేశ పార్లమెంటుపై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటు పడిన తర్వాత కూడా తిరిగి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు పార్లమెంటు అనుమతించడంపై అభ్యంతరం చెబుతూ ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షేక్ రహీద్ కూడా పార్లమెంటు తీరును తప్పుబడుతూ ఘాటు విమర్శలు చేయడంతో పాటు నేషనల్ అసెంబ్లీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

వీరి వ్యాఖ్యలను ఖండిస్తూ పాక్ నేషనల్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. నేషనల్ అసెంబ్లీలో సభ్యులై ఉండి కూడా ఇమ్రాన్ ఖాన్, రషీద్‌లు పార్లమెంటు సర్వాధికారాలను ప్రశ్నించేలా వ్యాఖ్యలు చేశారని ఖండించారు. పార్లమెంటు ప్రతిష్టకు భంగం కలిగించేలా వారి ఆరోపణలు ఉన్నాయని అభ్యంతరం చెప్పారు. పాక్ రహస్యాలను భారత్‌కు అమ్మలేదు కదా

Updated By ManamWed, 01/10/2018 - 13:24

Imran Khanఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ మీడియాపై ఫైర్ అయ్యారు. ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి చేసుకుంటారంటూ ఇటీవల పాక్‌లో విస్తృతంగా వార్తలు రాగా.. దానిపై స్పందించిన ఆయన ఎందుకింతలా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తానేం పాక్ రహస్యాలను భారత్‌కు అమ్మలేదు కదా, లేకపోతే ఈ దేశ సొమ్మును కూడా తానేంద దోచుకోలేదు కదా అంటూ ఆయన ప్రశ్నించారు.

ఇదంతా మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ప్రైవేట్‌ మీడియా చేస్తున్న కుట్ర అని.. గత కొన్నాళ్లుగా వారు ఇదే పనిపెట్టుకున్నారని దుయ్యబట్టారు. అయినా తానేం భయపడబోనని చెప్పారు. 'షరీఫ్‌ నాకు 40 ఏళ్లుగా తెలుసు. వారి నీచమైన జీవితాలేమిటో కూడా నాకు బాగా తెలుసు. కానీ వారిలాగా నేను దిగజారి ఆరోపించను.. ప్రచారం చేయను' అంటూ ఇమ్రాన్ ట్వీట్ చేశారు.ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నాడా..?

Updated By ManamSat, 01/06/2018 - 14:54

Imran Khanకరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పీటీఐ(పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్) పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌ మూడో పెళ్లి చేసుకున్నారా? తన స్నేహితురాలితో ఆయన రహస్య వివాహం చేసుకున్నారా? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. జనవరి 1న ఈ వివాహం జరిగినట్లు అక్కడి పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అంతేకాదు ఈ కార్యక్రమంలో ఖాన్ అంతరంగికులు కూడా పాల్గొన్నట్లు తెలిపాయి.

అయితే ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు ఖండించారు. పనిగట్టుకొని కొందరు ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని.. ఆయన ధ్యాస అంతా ఎన్నికల మీదనే ఉందని, ఒకవేళ ఎవరైనా నచ్చితే వారిని ఎన్నికల తరువాతే పెళ్లి చేసుకుంటారని అంటున్నారు. కాగా1995లో బ్రిటిషన్‌ జర్నలిస్టు జెమీమాను పెళ్లాడిన ఇమ్రాన్.. ఆమెతో విడాకుల తరువాత 2015లో మరో జర్నలిస్ట్ రేహమ్‌ను రెండోపెళ్లి చేసుకున్నారు. అయితే అదే సంవత్సరంలోనే ఈ ఇద్దరు విడిపోగా.. అప్పటినుంచి పార్టీపైనే మొత్తం ధ్యాసను పెట్టారు ఇమ్రాన్ ఖాన్.కిక్ బాక్స‌ర్ గా అల్లు అర్జున్‌?

Updated By ManamSat, 11/18/2017 - 20:03

bunnyప్రస్తుతం భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో బయోపిక్స్ టైమ్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్రీడలకు సంబంధించి కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. చాలా వరకు హిట్ ని సొంతం చేసుకున్నాయి కూడా. ఇదే కోవలో ఓ కిక్ బాక్సర్ జీవితం ఆధారంగా.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ స్పోర్ట్ బేస్‌డ్ మూవీ చేయ‌బోతున్నార‌ని సమాచారం. ఈ సినిమాకి హనురెడ్డి అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నాడు. కిక్ బాక్సర్ అంటే గుర్తొచ్చే పేరు ఇమ్రాన్ ఖాన్. 13 సంవత్సరాల వయసులో జూనియర్ ఛాంపియన్ గా అవతరించిన ఇమ్రాన్.. రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు. ఇప్పుడు ఈ ఛాంపియన్ కథనే బన్నీ చేయబోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఛాంపియన్ కథకి యాక్షన్, సెంటిమెంట్స్, సీన్స్ ని జోడించి.. ఒక సినిమాకి కావాల్సిన కమర్షియల్ ఎలెమెంట్స్ తో సినిమాను తీయబోతున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ క‌థ‌నాల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది. అసలే ప్రతీ సినిమాకి తన బాడీ లాంగ్వేజ్ ని మార్చుకునే బన్నీ ఈ సినిమాకి ఇంకెంత కఠోర పరిశ్రమ చేయబోతున్నారో చూడాలి. ప్రస్తుతం ‘నా పేరు సూర్య’తో బిజీగా ఉన్న బన్నీ.. ఆ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఈ కిక్ బాక్సర్ సినిమా చేయ‌నున్నార‌ని తెలిసింది.

 

Related News