SHE Teams

కర్నూలులో రేవ్ పార్టీ కలకలం

Updated By ManamFri, 11/09/2018 - 14:40
  • ఎరువుల కంపెనీ ఏజెంట్లకు విందు

  • మద్యం తాగి మహిళలతో అశ్లీల నృత్యాలు

  • గతంలోనూ రేవ్‌పార్టీ.. పట్టుకున్న షీ టీమ్

Rave partyకర్నూలు క్రైమ్: ఇన్నాళ్లూ హైదరాబాద్, బెంగుళూరు, తదితర మెట్రో నగరాలకే పరిమితమైన రేవ్ పార్టీలు కర్నూలుకు కూడా చేరుకుంటున్నాయి. నగరం నడిబొడ్డున బుధవారం జరిగిన రేవ్ పార్టీ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక శరీన్ నగర సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఎరువుల కంపెనీ ఒకటి తమ డీలర్లకు విందు ఏర్పాటు చేసింది.

నిర్ణీత సమయానికి అమ్మకాలు బాగా జరపడంతో.. ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలను తీసుకువచ్చి విందులో చుక్క, ముక్కతో పాటు మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ ఎంజాయ్ చేశారు. మద్యం తాగిన కొంతమందికి కిక్కు ఎక్కి నృత్యం చేస్తున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో గొడవ మొదలైంది.

దాంతో రేవ్ పార్టీని అర్ధాంతరంగా ముగించారు. గతంలో కూడా రాజవిహార్ సెంటర్లోని ఒక హోటల్లో ఫర్టిలైజర్ డీలర్లు రేవ్ పార్టీ ఏర్పాటు చేసి షీటీం పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. అప్పట్లో డీలర్లతో పాటు ఒక సీఐ కూడా అడ్డంగా దొరికిపోయి సస్పెండయ్యారు. ఆ ఘటన మరువకముందే నగరంలో మరో రేవ్‌పార్టీకి తెరతీయడం కల్లోలం రేపుతుంది.



'షీ టీమ్స్‌ వల్ల వేధింపులు తగ్గాయి'

Updated By ManamThu, 11/16/2017 - 12:04
  • తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి

 Naini Narshimha Reddy, Home Minister of Telangana, SHE Teams, Woman Harrashments, reduce crime rateహైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై వేధింపుల ఘటనలు చాలావరకూ తగ్గాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. రాష్ట్రంలో షీ టీమ్‌లు ఎంతో చురుగ్గా పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నాయిని మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా నగర బస్టాండ్‌, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో 200 వరకు షీ టీమ్స్ తమ విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. షీ టీమ్‌లతో మహిళలపై వేధింపులు తగ్గుముఖం పట్టాయన్నారు. అదేవిధంగా ఆకతాయిల నుంచి మహిళలు ఆత్మరక్షణ కోసం తమను తాము కాపాడుకునేందుకు వివిధ అంశాలపై శిక్షణ కూడా అందిస్తున్నట్లు నాయిని తెలిపారు.





Related News