test cricket

ఇంకెన్నాళ్లు ఈ తడబాటు

Updated By ManamTue, 08/07/2018 - 22:35
  • రెండో టెస్టులో పుంజుకుంటారా? పుజారాకు చోటు కల్పిస్తారా?

  • రేపటి నుంచి భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టు

లండన్: విదేశీ గడ్డపై భారత బ్యాట్స్‌మెన్ మరో సారి ఘోరవిఫలమై తొలి టెస్టును ఇంగ్లాండ్‌కు సమర్పించుకున్నారు. గెలవాల్సిన ఈజీ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ తడబాటుతో అందివచ్చిన బంగారు అవకాశాన్ని చేజేతుల దూరం చేసుకుంది టీమిండియా. ప్రతిసారి ఇలాంటి ఆటనే పునరావృతం చేస్తే ఎలా? ఈ సారి బౌలర్లు అ ద్భుతమైన ఆటతో ఆకట్టుకు న్నారు. కానీ, బ్యాట్స్‌మెన్ వారికి సహకరించకుండా చెతులెత్తేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్ప మిగ తా బ్యాట్స్‌మన్లకు ఏమ యింది. టెస్టు, పొట్టి ఫార్మాట్‌కు తేడాలు వారికి కనిపియట్లేదా?

image


టెస్టులో ఎంత ఎక్కువ సమయం క్రీజులో నిల్చుంటారో వారే హీరోలవుతారు. దీనిని కూడా బ్యాట్స్‌మెన్ అర్థం చేసుకోకపోవడం చాలా బాధకరమైన విషయం. బ్యా టింగ్ లైనప్‌లో భారత్‌కు ఎదురులేదని చెప్పుకోవడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బలమైన బ్యాటింగ్ దళం ఉట్టి దేశీయ పిచ్‌లపైనే అని భారత బ్యాట్స్‌మెన్ మరో సారి రుజువు చేసుకున్నారు. విదేశి గడ్డపై మరోసారి అదే తడబాటును చూడాల్సి వచ్చింది. ఒకే ఒక్కడు క్రీజులో నిల్చుండి తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధిస్తే.. మిగతా జట్టంతా కలిసి ఆ సింగిల్ బ్యాట్స్‌మన్ స్కోరును కూడా అందుకోలేక పోయారు. 

ఇక్కడ హీరోలు.. అక్కడ జీరోలు.. 
స్వదేశీ పిచ్‌లపై హీరోలు.. విదేశీ పిచ్‌లపై జీరోలు.. భారత క్రికెటర్ల గురించి ఎప్పట్నుంచో ఉన్న విమర్శ ఇది. ఐతే మధ్యలో ఈ విమర్శను తిప్పికొట్టేలా విదేశాల్లో సత్తా చాటారు కొందరు భారత బ్యాట్స్‌మెన్. సెహ్వాగ్, గంభీర్, ద్రవిడ్, సచిన్, లక్ష్మణ్, ధోనీలతో కూడిన బ్యాటింగ్ లైనప్ విదేశాల్లో నిలకడగా రాణించి.. బయట కూడా తాము హీరోలమే అని చాటింది. కానీ ఈ బ్యాటింగ్ లైనప్‌లోని ఒక్కొక్కరే భారత జట్టుకు దూరం కాగా.. తర్వాతి తరం బ్యాట్స్‌మెన్ మళ్లీ పాత బాటలోకి పయనిస్తున్నారు. స్వదేశీ పులులుగా మారుతున్నారు. గత కొన్నేళ్ల నుంచి భారత్ సొంతగడ్డపై తిరుగులేని ప్రదర్శన చేస్తోంది. కానీ కఠినమైన విదేశీ పర్యటనలకు వెళ్తే మాత్రం తేలిపోతోంది. కోహ్లీ మినహా ఎవ్వరిలోనూ నిలకడ లేదు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో కొందరు అప్పుడప్పుడూ అయినా ఆడుతున్నారు. కానీ ప్రస్తుత జట్టులో విదేశీ ఫాస్ట్ పిచ్‌లపై నిలకడగా విఫలమవుతున్న ఆటగాడు మాత్రం శిఖర్ ధావనే అని చెప్పాలి. 

టెస్టుల్లో ధావన్ విఫలం..
ఒక్క ఇంగ్లాండ్‌లో మాత్రమే కాదు.. ఫాస్ట్ పిచ్‌లున్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల్లో అతడి రికార్డు పేలవం. ఇంగ్లాండ్‌తో కలిపి ఈ నాలుగు దేశాల్లో ధావన్ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఫ్లాట్ పిచ్‌లకు నెలవైన ఉపఖండంలో మాత్రం పరుగుల వరద పారించేస్తాడు. సెహ్వాగ్ లాగా దూకుడుగా ఆడి మ్యాచ్ ఫలితాలు మార్చేస్తాడని, ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్ అని అతడికి విదేశాల్లోనూ మళ్లీ మళ్లీ అవకాశాలిస్తున్నట్లుంది. వన్డేల వరకు ఫాస్ట్ పిచ్‌లపై అయినా ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడేస్తాడు కానీ.. టెస్టుల్లో నిలిచి ఆడమంటేనే కష్టం. ఇక జట్టులో మరో ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్ లేకపోవడం కూడా ధావన్‌కు కలిసొస్తోంది. ఆరంభంలో కుడి, ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ ఉంటే బాగుంటుందన్న ఆలోచనను కూడా దృష్టిలో ఉంచుకుని ధావన్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశాలు కల్పిస్తోంది. 

కానీ వరుసగా విఫలమవుతున్నపుడు ఏ వాటం అయితే ఏంటి అని మాజీలు విమర్శిస్తున్నారు. ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటి వరకు 3 టెస్టులు, 6 ఇన్నింగ్స్‌లు ఆడిన శిఖర్ ధావన్ 20.33 సగటుతో 122 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు (37) ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఇవీ గత ఇంగ్లాండ్ పర్యటనలో ధావన్ గణాంకాలు. ఈసారి సిరీస్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడిస్తే.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను డకౌటయ్యాడు. 

అయినా సరే.. ధావన్‌కే భారత సెలక్టర్లు ముగ్గు చూపారు. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ధావన్ ఆడలేడని సౌరభ్ గంగూలీ సహా కొందరు మాజీలు అతడిపై వ్యతిరేకత ప్రదర్శించినా సరే.. అతడికే అవకాశమి చ్చారు. ధావన్ అదే పాత కథను పునరావృతం చేస్తూ మరోసారి విఫలమయ్యాడు. మ్యాచ్‌లో తన పాత బలహీనతనే మరోసారి బయట పెట్టుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో మిగతా బ్యాట్స్‌మెన్ కూడా విఫలమైనా సరే.. పేలవ రికార్డున్న ధావన్‌ను ఆడించి మూల్యం చెల్లించుకోవడం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు మురళీ విజయ్, కేఎల్ రాహుల్, అంజిక్య రహానే, దినేశ్ కార్తిక్ కూడా మొదటి టెస్టులో ఘోరంగా విఫలమ య్యారు. రెండు ఇన్నింగ్స్‌లలో ధావన్ (26;13), మురళీ విజయ్ (20;6), రాహుల్ (4;13), రహానె (15;2), కార్తిక్ (0;20) పరుగులు మాత్రమే చేశారు.ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా

Updated By ManamSat, 07/28/2018 - 00:42
  • ఆకట్టుకున్న ఉమేష్ , ఇషాంత్

rahulక్లెమ్‌ఫోర్డ్: ఎస్సెక్స్ జట్టుతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా పూర్తిగా విఫలమైంది. బ్యాటింగ్‌లో కాస్తోకూస్తో ఫర్వాలేదనిపించినా భారత్ జట్టు బౌలింగ్‌లో ఎస్సెక్స్ జట్టు వికెట్లు తీయడానికి కాస్త ఇబ్బంది పడింది. ఓవర్‌నైట్ స్కోర్ 237/5తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఎస్సెక్స్ జట్టు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. క్రీజులో ఉన్నా వాల్టర్ స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ హాఫ్ సెంచరీ నమోదు చేసాడు. మరో బ్యాట్స్‌మన్ ఫోస్టర్ తన వంతు పాత్రను పోషించాడు. 42 పరుగలు చేసిన ఫోస్టర్ ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన కోల్స్ యాదవ్ బౌలింగ్‌లో ధావన్‌కి క్యాచ్  ఇచ్చి ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన నిజార్‌తో కలిసి వాల్టర్ నెమ్మదిగా ఆడుతూ 
వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. 84.2 ఓవర్లలో 336 పరుగల వద్ద వాల్టర్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో రహానే కి క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం నిజార్ (29 నాటౌట్), ఖుషీ (14 నాటౌట్) 26 పరుగులు భాగస్వామ్యం చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసారు. భారత్ బౌలింగ్‌లో ఉమేష్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మ 3, ఠాకూర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 4 పరుగుల వద్దే మొదటి వికెట్‌ను కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినా ధావన్ ఈ ఇన్నింగ్స్‌లోనైనా ఆడతాడు అనుకుంటే 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. బాగానే సిద్ధపడ్డా అన్నా పుజారా 23 పరుగులకే చోప్రాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్  సెంచరీతో ఆకట్టుకున్న కెఎల్ రాహుల్ (25 బ్యాటింగ్) రహానే (19 బ్యాటింగ్)తో కలిసి మరో వికెట్ పడకుండా ఆడారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ స్కోరు 89/2 ఉన్నప్పుడు ఇరు జట్ల కెప్టెన్లు అంగీకరించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.10వేల పరుగుల క్లబ్‌కు చేరువలో ధోనీ

Updated By ManamWed, 07/11/2018 - 23:30

imageటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో అదురైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకొనేందుకు ధోనీ ఇంకా 33 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్ల్లాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో ధోనీ ఈ రికార్డును సాధించే అవకాశం ఉంది. శుక్రవారం నాట్టింగ్‌హామ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది.

ఈ మ్యాచ్‌లో ధోనీ 33 పరుగులు చేస్తే.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ తర్వాత 10వేల పరుగుల క్లబ్‌లో చేరిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలుస్తాడు. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ఈ క్లబ్‌లో చేరిన 12వ క్రికెటర్‌గా ధోనీ ఘనత సాధించే అవకాశం ఉంది. ఈ క్లబ్‌లో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నారు. సచిన్ ఆడిన అన్ని వన్డేల్లో 18,426 పరుగులు చేశారు. ఆ తర్వాత 14,234 పరుగులతో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కార, 13,704 పరుగులతో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నారు.కోహ్లీని అధిగమించిన పుజారా!

Updated By ManamTue, 11/28/2017 - 20:04

pujaraదుబాయ్: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో రాణిస్తున్న టీమిండియా బ్యాట్స్‌మన్ పుజారా కెప్టెన్‌ విరాట్ కోహ్లీపై పై చేయి సాధించాడు. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాకింగ్స్‌లో పుజారా తన కెరీర్‌లోనే అత్యుత్తమమైన రెండో స్థానంలో నిలవగా...విరాట్ కోహ్లీ ఐదో ర్యాంకులో ఉన్నాడు. ప్రస్తుతం పుజారా ఖాతాలో 888 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. పుజారా-కోహ్లీ మధ్య ఉన్న నాలుగు ర్యాంకుల మధ్య 11 పాయింట్లు అంతరమే ఉంది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పుజారా 143 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అదే మ్యాచ్లో డబుల్ సెంచరీ బాదిన కెప్టెన్ కోహ్లీ 60 పాయింట్లు అదనంగా పొంది 877 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. లోకేష్ రాహుల్ 9వ ర్యాంకులో నిలుస్తున్నాడు. 

Test Ranks

యాషెస్ సిరీస్ తొలి టెస్టులో 141 పరుగులతో అజేయంగా నిలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 941 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. టెస్టు చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన వారిలో ఐదో స్థానంలో ఉన్న పీటర్ మే (941)తో సమంగా నిలిచాడు. సర్ డాన్ బ్రాడ్మన్ (961) అందరి కన్నా ముందున్నాడు. 

అటు ఐసీసీ టెస్ట్ బౌలింగ్ విభాగంలో 880 పాయింట్లతో రవీంద్ర జడేజా రెండు, 849 పాయింట్లతో రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానంలో ఉన్నారు.

icc test bowler rankingsటెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సౌతాఫ్రికా క్రికెటర్ డుమ్నీ

Updated By ManamSat, 09/16/2017 - 17:35

దక్షిణాఫ్రికా క్రికెటర్ జెపి డుమ్నీ సంచలన ప్రకటన చేశాడు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేశాడు. ఇక నుంచి తాను పూర్తిగా వన్డే, టీ20 ఫార్మాట్లపై దృష్టి సారించనున్నట్లు డుమ్నీ తెలిపాడు. తన దేశం తరపున 46 టెస్ట్ మ్యాచ్‌లలో ఆడటం సంతృప్తినిచ్చిందని డుమ్నీ చెప్పాడు. గత 16సంవత్సరాలుగా తన దేశం తరపున ఆడటం గర్వంగా ఉందన్నాడు. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌లో ఆడటం వల్ల తానెంతో నేర్చుకున్నానని చెప్పాడు. 

Related News