dhadak

మొదటిసారి ఇలా వచ్చా.. చాలా భయంగా ఉంది

Updated By ManamThu, 08/02/2018 - 11:30

Jhanvi Kapoorఅతిలోక సుందరి శ్రీదేవి తనయగా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రం ‘ధడక్‌’తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది జాన్వీ కపూర్. ఈ చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న జాన్వీ కపూర్‌కు ఇప్పుడు అవకాశాలు క్యూ కడుతున్నాయి.

ఇదిలా ఉంటే ఇటీవల ముంబయిలో జరిగిన ‘వోగ్’ అవార్డ్స్‌ వేడుకకు జాన్వి కూడా వెళ్లింది. ఇంతకుముందు ఇలాంటి వేడుకలకు ఎక్కువగా తన తల్లిదండ్రులతో వచ్చే జాన్వీ, ఈ సారి ఒంటరిగా వచ్చింది. ఈ సందర్భంగా తన అనుభవాలను ఆమె మీడియాకు తెలిపింది. ‘అవార్డ్స్‌ షోకి ఓ నటిగా హాజరైనందుకు చాలా ప్రత్యేకంగా, సంతోషంగా ఉంది. మరోపక్క బాధగానూ ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా నా తల్లిదండ్రుల చెయ్యి పట్టుకుని వెళ్లడం నాకు అలవాటు. కానీ ఇప్పుడు ఎవరి చెయ్యి పట్టుకోవాలో తెలీడం లేదు. భయంగా ఉంది’ అంటూ జాన్వీ తెలిపింది.టాలీవుడ్‌లోకి రానున్న జాన్వీ

Updated By ManamWed, 07/25/2018 - 13:30

Jhanvi ‘ధడక్’ చిత్రంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతిలోకసుందరి తనయ జాన్వీ కపూర్.. మొదటి చిత్రంలోనే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. దీంతో ఈమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతుండగా.. త్వరలో జాన్వీని టాలీవుడ్‌కు రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో శ్రీదేవి భర్త బోని కపూర్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే శ్రీదేవి బ్రతికి ఉన్నప్పుడే జాన్వీని టాలీవుడ్‌లో పరిచయం చేసేందుకు ఇక్కడ దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే అప్పుడు జాన్వీ చదువుకుంటుండగా.. ఆమె టాలీవుడ్ అరంగేట్రంపై శ్రీదేవి అంతగా ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు ధడక్‌తో జాన్వీకి వచ్చిన క్రేజ్ దృష్ట్యా ఆమెను టాలీవుడ్‌లో పరిచయం చేసేందుకు బోని ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓ స్టార్ హీరోతో జాన్వీని హీరోయిన్‌గా పరిచయం చేసే పనిలో దిల్ రాజు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.‘ధడక్’ ట్రైలర్.. అదరగొట్టిన జాన్వీ కపూర్

Updated By ManamMon, 06/11/2018 - 12:29

Dhadak శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కత్తర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ధడక్’. మరాఠీలో విజయవంతమైన ‘సైరాట్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కగా, ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. అందులో ఇషాన్, జాన్వీ కపూర్ జోడీ తమ అభినయంతో ఆకట్టుకున్నారు. ఇక ఈ చిత్రానికి శశాంక్ కైతాన్ దర్శకత్వం వహించగా.. అజయ్ అతుల్ సంగీతం అందించారు. కరణ్ జోహార్, హైరో జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

 సారీ జాన్వీ: అర్జున్ కపూర్

Updated By ManamMon, 06/11/2018 - 10:32

arjun  అతిలోక సుందరి శ్రీదేవి మరణం తరువాత ఆమె పిల్లలైన జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు అన్నయ్య బాధ్యతలను తీసుకున్నాడు బోని కపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్. ఈ క్రమంలో వారికి మద్దతుగా ఉంటూ వారిపై విమర్శలు చేసే వారిని తిప్పి కొడుతున్నాడు. అయితే తాజాగా ఓ విషయంలో జాన్వీకి సారీ చెప్పాడు అర్జున్. 

విషయంలోకి వెళ్తే.. జాన్వీ హీరోయిన్‌గా నటించిన ‘దఢక్’ చిత్ర ట్రైలర్ సోమవారం విడుదల కానుంది. అయితే షూటింగ్‌లో బిజీగా ఉండటం వలన అర్జున్ ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో జాన్వీని ఉద్దేశించి ఓ పోస్ట్ చేశాడు అర్జున్. ‘‘ఈ రోజు నువ్వు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఈ రోజు నువ్వు నటించిన దఢక్ చిత్ర ట్రైలర్ విడుదల అవ్వబోతోంది. ఈ సమయంలో నేను ముంబైలో లేనందుకు సారీ. కానీ ఎప్పటికీ నీ పక్క నేనుంటా, బాధపడకు. నువ్వు కష్టపడుతూ, నిజాయితీగా  పనిచేస్తే ఈ పరిశ్రమ చాలా అద్భుతంగా ఉంటుంది. అందరి అభిప్రాయాల, సలహాలు తీసుకుంటూ నీకు నచ్చినట్లుగా ఒక మార్గాన్ని ఏర్పరుచుకో. ఈ పరిశ్రమలోని పిచ్చికి నువ్వు రెడీగా ఉన్నావని అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. నా స్నేహితులైన కరణ్ జోహార్, శశాంక్‌లు నిన్ను, ఇషాన్‌ను మోడ్రన్ రోమియో, జూలియట్‌గా చూపిస్తారని భావిస్తున్నా’’ అంటూ కామెంట్ పెట్టి వారి ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశాడు.జాన్వీ మూవీ ట్రైలర్ వచ్చేస్తోంది

Updated By ManamSun, 06/10/2018 - 13:56

dhadak అతిలోక సుందరి శ్రీదేవి జాన్వీ కపూర్ ‘ధడక్’ అనే చిత్రంలో నటిస్తోంది. షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కత్తర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరాఠీ సూపర్ హిట్ చిత్రం ‘సైరాట్’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. కాగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఈ నెల 11న మధ్యాహ్నం విడుదల కానుంది. దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చింది. ఇక జూలై 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 వాయిదా ప‌డిన శ్రీ‌దేవి కూతురి సినిమా

Updated By ManamSat, 01/20/2018 - 17:09

dhadakఅతిలోక సుంద‌రి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ క‌పూర్ 'ధ‌డ‌క్' అనే బాలీవుడ్ మూవీతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మరాఠీలో ఘ‌న‌ విజ‌యం సాధించిన  'సైరాట్‌' చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో షాహిద్ క‌పూర్ స‌వ‌తి సోద‌రుడు ఇషాన్ ఖ‌ట్ట‌ర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. శ‌శాంక్ ఖైతాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అగ్ర‌వ‌ర్ణానికి చెందిన అమ్మాయి, నిమ్న కులానికి చెందిన అబ్బాయిల మ‌ధ్య  చిగురించిన‌ ప్రేమ‌.. ఆ త‌రువాత చోటుచేసుకున్న‌ ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇదిలా ఉంటే.. తొలుత ఈ సినిమాని జులై 6న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన చిత్ర బృందం.. తాజాగా విడుద‌ల తేదిని జులై 20గా ప్ర‌క‌టించింది. 'టెంప‌ర్' రీమేక్‌లో జాన్వి?

Updated By ManamThu, 11/16/2017 - 12:21

janhvi2015లో విడుద‌లైన ఎన్టీఆర్ 'టెంప‌ర్' మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. తాజాగా 'గోల్ మాల్ ఎగైన్‌'తో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న రోహిత్ శెట్టి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ర‌ణ్ వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌గా శ్రీ‌దేవి కూతురు జాన్వి క‌పూర్ ఎంపికైంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక వార్త వెలువ‌డాల్సి ఉంది. ప్ర‌స్తుతం జాన్వి.. మ‌రాఠీ హిట్ చిత్రం 'సైరట్' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న 'ధ‌డ‌క్‌'లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్లు విడుద‌ల చేశారు. వీటికి మంచి స్పంద‌న వ‌చ్చింది. శ్రీ‌దేవి కూతురు సినిమా.. ఫ‌స్ట్‌లుక్ వ‌చ్చింది

Updated By ManamWed, 11/15/2017 - 17:32

dhadakఅతిలోక సుంద‌రి శ్రీ‌దేవి కూతురు జాన్వి బాలీవుడ్ ఎంట్రీపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. ఎట్ట‌కేల‌కు ఆ విష‌యంపై క్లారిటీ వ‌చ్చేసింది. జాన్వి తొలి చిత్రం 'ధ‌డ‌క్' పేరుతో తెర‌కెక్కుతోంది. జీ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడక్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో షాహిద్ క‌పూర్ సోద‌రుడు ఇషాన్ ఖ‌ట్ట‌ర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. 'బ‌ద్రినాథ్ కి దుల్హానియా', 'హ‌మ్టీ శ‌ర్మ‌కి దుల్హానియా' చిత్రాల‌ను తెర‌కెక్కించిన శ‌శాంక్ కైత‌న్ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది జులై 6న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై క‌ర‌ణ్ జోహార్ ప‌రిచ‌యం చేసిన అలియా భ‌ట్ లాగే జాన్వి కూడా స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటుందో లేదో చూడాలి. ఇక శ్రీ‌దేవి కూతురిగా ఆమెపై ఎలాంటి అంచ‌నాలుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌రాఠీలో విజ‌యం సాధించిన 'సైర‌ట్' ఆధారంగా ఈ సినిమా రూపొంద‌నుంద‌ని బాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

Related News