karan johar

‘ధడక్’ ట్రైలర్.. అదరగొట్టిన జాన్వీ కపూర్

Updated By ManamMon, 06/11/2018 - 12:29

Dhadak శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కత్తర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ధడక్’. మరాఠీలో విజయవంతమైన ‘సైరాట్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కగా, ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. అందులో ఇషాన్, జాన్వీ కపూర్ జోడీ తమ అభినయంతో ఆకట్టుకున్నారు. ఇక ఈ చిత్రానికి శశాంక్ కైతాన్ దర్శకత్వం వహించగా.. అజయ్ అతుల్ సంగీతం అందించారు. కరణ్ జోహార్, హైరో జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

 జాన్వీ మూవీ ట్రైలర్ వచ్చేస్తోంది

Updated By ManamSun, 06/10/2018 - 13:56

dhadak అతిలోక సుందరి శ్రీదేవి జాన్వీ కపూర్ ‘ధడక్’ అనే చిత్రంలో నటిస్తోంది. షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కత్తర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరాఠీ సూపర్ హిట్ చిత్రం ‘సైరాట్’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. కాగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఈ నెల 11న మధ్యాహ్నం విడుదల కానుంది. దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చింది. ఇక జూలై 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 కొత్త స్టూడెంట్‌లు దొరికేశారు

Updated By ManamWed, 04/11/2018 - 12:27
students

వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, అలియా భట్‌లుగా కథా కథానాయకులుగా కరణ్ జోహార్ తెరకెక్కించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించనున్నారు. పునీత్ మల్హోత్రా తెరకెక్కించనున్న ఈ సినిమాలో హీరోగా టైగర్ ష్రాఫ్ నటించనున్నాడు.

ఇక ప్రముఖ నటుడు చుకీ పాండే తనయ అనన్య పాండే ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం కానుంది. అలాగే  మరో హీరోయిన్‌గా తారా సుటారియా ఈ ప్రాజెక్ట్‌లోకి న్యూ ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్.. వారి ఫస్ట్‌లుక్‌లను కూడా విడుదల చేసింది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తుండగా నవంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.'టెంప‌ర్' రీమేక్‌లో హీరోయిన్‌గా..

Updated By ManamTue, 03/20/2018 - 12:02

simbaయువ క‌థానాయ‌కుడు ఎన్టీఆర్ కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన‌ చిత్రాల‌లో 'టెంప‌ర్' ఒక‌టి. ఈ సినిమా.. తార‌క్‌లోని న‌టుడ్ని కొత్త కోణంలో చూపింది. అలాంటి 'టెంప‌ర్‌'.. ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి రోహిత్ శెట్టి ద‌ర్శ‌కుడు కాగా.. క‌ర‌ణ్ జోహార్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో క‌థానాయిక‌గా సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ ఎంపికైంది. ఇంత‌కుముందు ఈ పాత్ర కోసం.. అలియా భ‌ట్‌, జాన్వీ క‌పూర్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ త‌దిత‌రుల పేర్లు వినిపించాయి. ఇప్పుడు సారా అలీ ఖాన్ క‌న్‌ఫ‌ర్మ్ కావ‌డంతో ఈ వార్త‌ల‌కు తెర‌దించిన‌ట్ల‌య్యింది. సంగ్రామ్ భ‌లేరామ్ అనే పోలీస్ పాత్ర‌లో ర‌ణ్‌వీర్ సింగ్ న‌టిస్తున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 28న విడుద‌ల కానుంది.శ్రీ‌దేవి స్థానంలో మాధురీ దీక్షిత్‌?

Updated By ManamSun, 03/11/2018 - 21:50

srideviఅతిలోక సుందరి శ్రీదేవి అకాల మరణంతో ఆమెతో సినిమా చేయాలన్న కల తీరని కలగానే మిగిలిపోయిందని బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ వాపోయారు. గత అక్టోబరులో శ్రీదేవికి వినిపించిన కథ.. ఈ ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉండగా.. శ్రీదేవి మరణంతో ఆ ప్రాజ‌క్ట్‌కు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలు కూడా చేశారని బాలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాతో శ్రీదేవికి ఘనమైన నివాళి ఇవ్వడానికి పూనుకున్నారు కరణ్. అందుకే శ్రీదేవి కోసం డిజైన్ చేసిన పాత్రలో సీనియర్ నటి మాధురి దీక్షిత్‌ను ఎంపిక చేశారని సమాచారం.

కుటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సంజయ్ దత్‌కు భార్య పాత్రలో మాధురి కనిపించనున్నారు. అలియా భట్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్ ఇత‌ర‌ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. అయితే గతంలో “తల్లి పాత్రలు పోషించను” అని చెప్పిన మాధురి.. ఇప్పుడు ఈ సినిమాని కరణ్ జోహార్‌తో తనకున్న సాన్నిహిత్యం వలన ఒప్పుకోవచ్చనే వార్తలు బాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. అలాగే శ్రీదేవి లాంటి నటికోసం ఈ పాత్రలో నటించి.. ఆమెకు నివాళులర్పించాలని మాధురి భావిస్తుండడం కూడా ఒక కారణమని ఆమె సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.

ఇదిలా ఉంటే..  ‘2 స్టేట్స్’ దర్శకుడు అభిషేక్ వర్మన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ‘షిద్ధత్” అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు.శ్రీ‌దేవితో చేయాల్సిన సినిమా ఆగిపోయిన‌ట్టేనా?

Updated By ManamTue, 03/06/2018 - 16:01

srideviత‌న ఆల్‌టైమ్ ఫేవ‌రేట్ హీరోయిన్ శ్రీదేవితో సినిమా చేయాలన్నది తన కల అని.. అది నెర‌వేరేలోపే ఆమె దూర‌మ‌య్యార‌ని అంటున్నారు ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌. అంతేగాకుండా ఆమె చ‌నిపోయారంటే ఇంకా న‌మ్మ‌లేక‌పోతున్నాన‌ని అంటున్నారు స‌ద‌రు ద‌ర్శ‌క‌నిర్మాత‌. ఇంత‌కీ ఆయ‌నెవ‌రంటే.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్, డైరెక్ట‌ర్‌ క‌ర‌ణ్ జోహార్. బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఈ స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్ట‌ర్‌.. తాజాగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్రీదేవితో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆల్ ఇండియా సూప‌ర్ స్టార్ శ్రీ‌దేవితో సినిమా చేయాలన్నది తన కల అని ఆయ‌న పేర్కొన్నారు.

srideviత‌న‌కు ఎన్నాళ్ళ‌గానో ప‌రిచ‌య‌మున్న శ్రీదేవి.. తన కూతురు జాన్వి లాంచింగ్ ప్రాజెక్ట్ మీరే చేయాల‌ని ఆ బాధ్య‌త‌ల‌ను కరణ్ జోహార్ చేతిలోనే పెట్టారట‌. అయితే జాన్వి లాంచింగ్ గురించి ప్రస్తావించిన వారం తర్వాత.. శ్రీదేవిని కలిసారు కరణ్. అదే సంద‌ర్భంలో ఆమెతో ఓ సినిమా చేయాలని ఉందని తన మనసులో మాటను బయట పెట్టారు. అందుకు ఆమె కూడా సుముఖంగా ఉండడంతో.. వెంటనే కథను సిద్ధం చేసుకుని.. శ్రీదేవిని కలిసి కథ వినిపించడం.. ఆమె ఓకే చెప్పడం అంతా చకచకా జరిగిపోయాయ‌ట‌. గత అక్టోబర్‌లోనే ఈ సినిమా చేయబోతున్నట్లు శ్రీదేవి సంతకం కూడా చేశారని కరణ్ చెబుతున్నారు.

srideviతన నిర్మాణంలో, అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో శ్రీదేవి ప్ర‌ధాన పాత్ర‌ధారిగా ఓ సినిమా ఓకే అయిపోయింద‌ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. ఇందులో సంజయ్ దత్ భార్య పాత్ర‌లో శ్రీ‌దేవి.. యువ జంట‌గా వరుణ్ ధావన్, అలియా భట్ న‌టించ‌డానికి ఏర్పాట్లు జ‌రిగాయ‌ని ఆయ‌న తెలిపారు. ఇక ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్ళడమే ఆలస్యం అనుకున్న తరుణంలో శ్రీదేవి ఆకస్మికమరణంతో తన కల కలగానే మిగిలిపోయిందని వాపోతున్నారు కరణ్ జోహార్. కనీసం జాన్వీ తొలి సినిమానైనా చేసే అదృష్టం తనకు దక్కిందని కరణ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి త‌న అభిమాన న‌టితో సినిమా చేసే అవ‌కాశం క‌ర‌ణ్‌కు ద‌క్కినట్టే ద‌క్కి శాశ్వ‌తంగా చేజార‌డం బాధాక‌ర‌మైన విష‌య‌మే అంటున్నారు బాలీవుడ్ జ‌నాలు.

మ‌రి శ్రీ‌దేవితో అనుకున్న ఆ సినిమాని క‌ర‌ణ్ మ‌రెవ‌రితోనైనా రూపొందిస్తారా లేక‌ పూర్తిగా ఆపేస్తారా అనేది ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.వాయిదా ప‌డిన శ్రీ‌దేవి కూతురి సినిమా

Updated By ManamSat, 01/20/2018 - 17:09

dhadakఅతిలోక సుంద‌రి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ క‌పూర్ 'ధ‌డ‌క్' అనే బాలీవుడ్ మూవీతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మరాఠీలో ఘ‌న‌ విజ‌యం సాధించిన  'సైరాట్‌' చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో షాహిద్ క‌పూర్ స‌వ‌తి సోద‌రుడు ఇషాన్ ఖ‌ట్ట‌ర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. శ‌శాంక్ ఖైతాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అగ్ర‌వ‌ర్ణానికి చెందిన అమ్మాయి, నిమ్న కులానికి చెందిన అబ్బాయిల మ‌ధ్య  చిగురించిన‌ ప్రేమ‌.. ఆ త‌రువాత చోటుచేసుకున్న‌ ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇదిలా ఉంటే.. తొలుత ఈ సినిమాని జులై 6న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన చిత్ర బృందం.. తాజాగా విడుద‌ల తేదిని జులై 20గా ప్ర‌క‌టించింది. అతిథులకు అతడు విషం పెడతాడు

Updated By ManamSat, 01/13/2018 - 07:42

Kangana, Karanసెలబ్రిటీల మధ్య వచ్చే విభేదాలు, చిన్న చిన్న వాగ్వాదాలు సగటు ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంటాయి. కొంతమంది ఆ గొడవని సీరియల్‌గా మార్చేస్తుంటారు. అంతమనేది లేకుండా రోజుల తరబడి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కంగనా రనౌత్, కరణ్ జోహార్‌ల పరిస్థితి కూడా అలాగే తయారైంది. 2017లో ఓ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన కరణ్.. కంగనాను ఆ షోకి ఆహ్వానించాడు. అప్పుడు కరణ్ గురించి మాట్లాడుతూ ‘నీకు బంధుప్రీతి చాలా ఎక్కువ’ అని చెప్పింది. ఆ మాట ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. కొంతకాలం వీరి వ్యవహారం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇది సద్దువుణిగింది అనుకుంటుండగానే మరో కార్యక్రమంలో కలుసుకున్నారు కంగనా, కరణ్. ‘కరణ్ ఇంటికి వచ్చిన అతిథులకు విషం పెడతాడు’ అంటూ మరోసారి తన వ్యాఖ్యలతో కరణ్‌ను రెచ్చగొట్టింది. కానీ, కరణ్ మాత్రం ఆమె మాటలు విని నవ్వుకున్నాడు తప్ప స్పందించలేదు. కరణ్ విషయంలో కంగనా వ్యవహార శైలి చూస్తుంటే మనసులో ఏదో పెట్టుకొని అతనిపై ఇలా విరుచుకుపడుతోందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. హిస్టారికల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సల్మాన్

Updated By ManamSat, 12/23/2017 - 14:59

Akshay Kumar, Salman Khan, Karan Joharఒకవైపు హీరోగా దూసుకుపోతూనే మరోవైపు ప్రొడ్యూసర్‌గా పలు చిత్రాలను నిర్మించారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఈ నేపథ్యంలో ఆ మధ్యన అక్షయ్ కుమార్‌ హీరోగా కరణ్ జోహార్‌తో కలిసి హిస్టారికల్ ప్రాజెక్ట్ 'కేసరి'ని నిర్మించేందుకు సల్మాన్ సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుంచి సల్మాన్ బయటకు వచ్చారు.

ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం 'పాడ్ మ్యాన్' సినిమా ప్రమోషన్లలో ఉన్న అక్షయ్ మాట్లాడుతూ 'కేసరి' నుంచి సల్మాన్ తప్పుకున్నారని తెలిపారు. తాను కరణ్ జోహార్ కలిసే ఆ హిస్టారికల్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. 'సారఘరి' యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా, 'పాడ్ మ్యాన్' రిలీజ్ అయ్యాక ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు అక్షయ్ ప్రకటించారు. ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.శ్రీ‌దేవి కూతురు సినిమా.. ఫ‌స్ట్‌లుక్ వ‌చ్చింది

Updated By ManamWed, 11/15/2017 - 17:32

dhadakఅతిలోక సుంద‌రి శ్రీ‌దేవి కూతురు జాన్వి బాలీవుడ్ ఎంట్రీపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. ఎట్ట‌కేల‌కు ఆ విష‌యంపై క్లారిటీ వ‌చ్చేసింది. జాన్వి తొలి చిత్రం 'ధ‌డ‌క్' పేరుతో తెర‌కెక్కుతోంది. జీ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడక్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో షాహిద్ క‌పూర్ సోద‌రుడు ఇషాన్ ఖ‌ట్ట‌ర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. 'బ‌ద్రినాథ్ కి దుల్హానియా', 'హ‌మ్టీ శ‌ర్మ‌కి దుల్హానియా' చిత్రాల‌ను తెర‌కెక్కించిన శ‌శాంక్ కైత‌న్ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది జులై 6న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై క‌ర‌ణ్ జోహార్ ప‌రిచ‌యం చేసిన అలియా భ‌ట్ లాగే జాన్వి కూడా స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటుందో లేదో చూడాలి. ఇక శ్రీ‌దేవి కూతురిగా ఆమెపై ఎలాంటి అంచ‌నాలుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌రాఠీలో విజ‌యం సాధించిన 'సైర‌ట్' ఆధారంగా ఈ సినిమా రూపొంద‌నుంద‌ని బాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

Related News