tpcc

తొలిసారి టీపీసీసీ క్రమశిక్షణ చర్యలు

Updated By ManamWed, 06/13/2018 - 16:15
 • పార్టీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్‌పై టీపీసీసీ వేటు

TPCC Sacks Konagala Mahesh As Media Coordinatorహైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ మొదటి సారి క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్‌పై వేటు వేసింది. పార్టీలో అనేక ఫిర్యాదులు రావడంతో కొనగాల మహేష్‌ను అధికార ప్రతినిధి, మీడియా కన్వీనర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు తెలంగాణ పీసీసీ బుధవారం ప్రకటించింది. కాగా,  బీజేపీకే చెందిన ఆది శ్రీనివాస్ హస్తం కండువా కప్పుకోవడంతో వేములవాడ నియోజకవర్గంలో అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ఆది శ్రీనివాస్  చేరికను వ్యతిరేకిస్తూ వేములవాడ నియోజకవర్గంలో  కొనగాల మహేష్ ఓ గ్రూప్‌గా ఏర్పడి రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో మహేష్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు అందటంతో అతడిపై చర్యలు తీసుకుంది.రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

Updated By ManamFri, 05/18/2018 - 01:37
 • ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది.. ‘కర్ణాటకం’పై మండిపడ్డ టీపీసీసీ

 • ప్రభుత్వ ఏర్పాటుకు ముందే కుట్ర.. బీజేపీ తీరుపై కాంగ్రెస్ నేతల విమర్శ

 • ప్రధాని మోదీ అధికార దుర్వినియోగం.. దీనిపై సీఎం కేసీఆర్ స్పందనలేదేం?

 • గాంధీభవన్‌లో కుంతియా బృందం 

హైదరాబాద్: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజారీటీ సాధించకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటూ బీజేపీకి anjankumarగవర్నర్ ఆహ్వానం పలకడాన్ని టీపీసీసీ తప్పుబట్టింది. గవర్నర్ చర్య రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ రామచంద్ర కుంతియా విమర్శించారు. కర్ణాటక పరిణామాలకు నిరసనగా ఈ నెల 18న దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ నెల 17న ప్రమాణ స్వీకారం చేస్తామంటూ యడ్యూరప్ప ముందే ప్రకటించడాన్ని గమనిస్తే ఇందులో బీజేపీ కుట్ర దాగుందని ఆరోపించారు. మెజారిటీ వచ్చినా.. రాకున్నా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ ముందే నిర్ణయించుకుని అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు అర్థమవుతోందని కుంతియా విమర్శించారు. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైందని జానారెడ్డి విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధికార దుర్వినియోగంపై ప్రతిఒక్కరూ స్పందించాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందని షబ్బీర్ అలీ విమర్శించారు. తమ ఎమ్మెల్యేలకు బీజేపీ వంద కోట్లు ఇవ్వజూపిందని కుమారస్వామి వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా కూడా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. మెజారీటీ లేకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడమంటే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, రాజకీయ బేరసారాలకు అవకాశం ఇవ్వడమేనని మల్లు రవి మండిపడ్డారు.

కర్ణాటకలో పరిణామాలకు నిరసనగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు 18న అన్ని జిల్లాకేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు congressచేపట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా ఉదయం 11 గంటలకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కాగా, కర్ణాటకలో బీజేపీ తీరు రాజ్యాంగ విరుద్ధమని శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష ఉప నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. గోవా, మణిపూర్, మేఘాలయలలో మోజారిటీ సీట్లు గెలుచుకుని, అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ను కాదని, పొత్తుల కుంపటితో మెజారిటీ చూపించిన బీజేపీకి అవకాశం ఇచ్చి.. కర్ణాటకలో మాత్రం అందుకు విరుద్ధంగా చేయడం రాజ్యాంగ విలువలకు తిలోదకాలివ్వడమేనని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీ వైఖరిని కేసీఆర్ ఇంత వరకు ఎందుకు ఖండించలేదని పొంగులేటి ప్రశ్నించారు. ఈమేరకు గురువారంనాడు గాంధీభవన్‌లో కుంతియాతో పాటు సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ మల్లురవి విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు పార్టీ కార్యకర్తలు గాంధీభవన్ నుంచి నిరసన ప్రదర్శన నిర్వహించారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు అంజన్ కుమార్ యాదవ్‌తో పాటు పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
 కేసీఆర్‌వి చిల్లర రాజకీయాలు

Updated By ManamSun, 04/29/2018 - 02:02
 • వ్యక్తిగత విమర్శలు తగవు.. ఆయనది విలాసవంతమైన జీవితం

 • వారి కుటుంబం రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోంది

 • ప్రాణాలకు తెగించి సైన్యంలో పని చేశాను

 • ప్రజాధనం వృధా చేస్తే చూస్తూ ఊరుకోం

 • ఇక్కడే ఏం చేయలేదు.. కేంద్రంలో ఏం చేస్తారు

 • ఎంపీ సీట్లే రావు.. ఇక ఫ్రంట్ ఎక్కడ?: ఉత్తమ్ కుమార్ రెడ్డి

uttamహైదరాబాద్ (మనం ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర మాటలకు, చిల్లర రాజకీయాలకు పరిమితం అవుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్లీనరీలో తనపైనా, కాంగ్రెస్ పార్టీపైనా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలపై ఆయన స్పందించారు. శనివారం గాంధీ భవన్‌లో ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు, ఇతర ఉద్యమకారులపైనా, వ్యవస్థలపైనా సీఎం కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, ఇది సహించ రానిదన్నారు. తానే గొప్పోడు అనే రీతిలో పోజులు కొడుతున్నారని విమర్శించారు.  తాను పదహారేళ్ల వయ స్సులోనే ప్రాణాలకు తెగించి సైన్యంలో చేరానని, యుద్ధ విమానాలు నడిపించానని, నిస్వార్ధంగా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. తనకు పిల్లలు లేరని, వేరే కుటుంబం కూడా లేదని పూర్తిగా ప్రజాసేవ లోనే తాను, తన భార్య ఉన్నామన్నారు. ఉద్యమ సమ యంలో తన పిల్లలు అమెరికాలో ఉన్నారని, వారికి ఇక్క డ రాజకీయాలపై ఆసక్తి లేదని కేసీఆర్ చెప్పారని, మరి వారి పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారో, ఏ హోదాల్లో ఉన్నారో తెలంగాణ సమాజం గమనించాలన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ మీద పడి బరితెగించి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్లాగా తాను క్యారెక్టర్‌లేని పనులు చేసి తాను రాజకీయాల్లో రాలేదని ఉత్తమ్ ఘటుగా స్పందించారు. తెలంగాణ ముసుగులో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుందన్నారు.

సోనియా దయ వల్లే సీఎం అయ్యారు..
సీఎం కేసీఆర్ సిగ్గూశరం లేకుండా మాట్లాడుతున్నారని, సోనియా దయ వల్లే తెలంగాణ వచ్చిందని, సోనియా వల్లే ఆయన సీఎం అయ్యారన్న విషయం గుర్తుంచుకోవాలని ఉత్తమ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు బడ్జెట్ల రూపంలో 6 లక్షల 75 వేల కోట్లు పెట్టారు. మరో 2 లక్షల కోట్లు అప్పు తీసుకు వచ్చారు. రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనం కలిగిందా అని ఉత్తమ్ ప్రశ్నించారు. కేసీఆర్‌ను తెలంగాణను సర్వనాశనం చేస్తున్నారు. ఆయన ఘనకార్యం వల్ల ప్రతి పౌరుడుపై సగటున రూ. 63 వేల  అప్పు ఉందన్నారు. కేసీఆర్ ప్రజల సొమ్ము తెగ తిని ఒళ్లు బలిసి మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, సొంత నియోజకవర్గానికి చెందిన బీసి విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నా కనీసం పరామర్శించలేదని విమర్శించారు. తెలంగాణ వ్యవసాయం దేశానికే ఆదర్శమని చెప్పుకోవడానికి సిగ్గుండాలన్నారు. దేశంలో అత్యధికంగా రైతులు తెలంగాణలోనే ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రతీసారి కొత్త విషయాలు చెప్పి ప్రజలను మోసం చేయడం పరిపాటిగా మారిందని, అందుకే ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ఎంపీ సీట్లే రావు, ఇక ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడిది, ఆయన తీస్మార్ ఖానా అని ఎద్దేవా చేశారు. దేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిందే కాంగ్రెస్ అని, దేశాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామని అన్నారు. చైనాతో పోల్చడానికి కేసీఆర్ తెలివి ఉండాలన్నారు. ఆ దేశ పరిస్థితులకు, మనకు ఎంతో తేడా ఉందన్నారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాని దేశంలో ఏం చేస్తారని ఉత్తమ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలేదు, ప్రశ్నిస్తే అణగదొక్కుతున్నారు. మీడియాను సైతం బెదిరించి అదుపు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్లీనరీ జరుపుకున్న సందర్భంగా కేసీఆర్ తన అసమర్ధతకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. 

ప్రాజెక్టులకు అడ్డుపడలేదు..
తాము కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ఏనాడు అడ్డుపడలేదని, కేసీఆర్ అడ్డుగోలు దోపిడీని మాత్రమే ప్రశ్నించామని ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రాజెక్టు పేరు మార్చి వ్యయాన్ని 35 వేల కోట్ల నుంచి 87 వేల కోట్లకు పెంచడం ఒక్కటే కేసీఆర్ ఘనత అని విమర్శిం చారు. తాము ప్రాణహిత, చేవెళ్ల్ల గురిం చి మాత్రమే ప్రస్తావించామని స్పష్టం చేశారు. ఉత్తమ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తే తాము సహించబోమని శాసన మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ హెచ్చరించారు. ఫెడరల్ ఫ్రంట్ పెట్టి దేశాన్ని ఉద్ధరిస్తామని చెబుతున్న కేసీఆర్‌కు దమ్మూ, ధైర్యం ఉంటే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి సమావేశం పెట్టాలని  షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో ఉండి భూకంపం సృష్టిస్తే, ఎన్నో ఏండ్లుగా సుందరంగా నిర్మించుకున్న నగరం ధ్వంసం చేయడం ఎందుకని వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు. కేసీఆర్ ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ల విషయం ప్లీనరీలో ఎందుకు ప్రస్తావించేదని ప్రశ్నించారు.

అలా ఏనాడూ చెప్పలేదు.. 
ప్రగతి భవన్‌లో 500 గదులు ఉన్నాయని తాను ఏనాడు చెప్పలేదని, చెప్పదానిపై వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్‌లా అత్యంత విలువైన స్థలంలో 60 కోట్లు పెట్టి విలాసవంతమైన భవనం నిర్మించుకోలేదన్నారు. అప్పటికే కొత్తగానే నిర్మించిన సీఎం క్యాంప్ ఆఫీస్, నివాస భవనం ఉన్నప్పటికీ ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై తాము ప్రశ్నిస్తే తప్పా అన్నారు. కేసీఆర్ తన భవనాన్ని లక్ష చదరపు అడుగుల్లో నిర్మించుకోలేదా? బెడ్ రూమ్‌లకు, బాత్ రూమ్‌లకు కూడా బుల్లెట్ ఫ్రూప్ అద్దాలు బిగించారా? లేదా? సమాధానం చెప్పాలన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి, చివరకు ప్రధాన మంత్రి నివాసం కూడా ఇంత విలాసవంతంగా లేదన్నారు. కేసీఆర్ ఉపయోగిస్తున్న కార్లు సైతం అత్యంత ఖరీదైనవని అన్నారు. కేరళకు పెండ్లికి, బెంగాల్‌లో సొంత రాజకీయ పనులకు, పనికి రాని చైనా ట్రిప్‌కు ప్రైవేట్ జెట్ విమానాన్ని ఉపయోగించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అని ఉత్తమ్ విమర్శించారు. ముఖ్యమంత్రిగా అన్నింటికి జవాబుదారీతనంగా ఉండాలని, ఇది ఆయన అబ్బసొత్తుకాదన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ప్రకటించిన సాయం ఇచ్చేందుకు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి, పేదల విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేందుకు కేసీఆర్ వద్ద పైసలు లేవుకాని, వందల కోట్ల ప్రజాధనాన్ని విలాసాలకు ఖర్చు చేయడానికి ఎలా వచ్చాయని ఉత్తమ్ ప్రశ్నించారు. ప్రగతి భవన్‌లోకి సామాన్యులకు ప్రవేశంలేదని, చివరకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు కూడా అనుమతి ఉండదన్నారు.  ప్రగతి భవన్‌లో కేసీఆర్ బ్రోకర్లు, దోపిడీదారులు, కాంట్రాక్టర్లు, కేసీఆర్ మనుషులకు మాత్రమే ప్రవేశం ఉందన్నారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు పని చేసిన, దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు సైతం నిత్యం ప్రజలను కలుసుకుని వారి కష్టాలు తెలుసుకుంటారని, నాలుగు సంవత్సరాలుగా కేసీఆర్ సామాన్యులను కలుసుకోలేదన్నారు.ఇదేనా స్పందన ..? కోమటిరెడ్డి, సంపత్ ఆగ్రహం!

Updated By ManamMon, 03/26/2018 - 14:21

Cong Leaders Komati reddy , Sampath Fires On PCC

హైదరాబాద్: పీసీసీపై కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభ్యత్వం రద్దు విషయంలో పీసీసీ స్పందన దారుణం అని వారిద్దరూ చెప్పుకొచ్చారు. అసలు ఇంత పెద్ద ఇష్యూని ఎందుకు వాడుకోలేకపోతోంది? అని ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆదివారం నుంచి న్యూ ఢిల్లీలో కోమటిరెడ్డి, సంపత్ మకాం వేశారు. కాంగ్రెస్ సీనియర్లు కొప్పుల రాజు, కుంతియాలతో వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసేందుకు కోమటిరెడ్డి, సంపత్‌లు యత్నించారు. అకారణంగా సస్పెండ్ చేస్తే పీసీసీ స్పందన ఇదా?.. ఎన్నికల ముందు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని అధిష్టానానికి ఫిర్యాదుచేయనున్నారు.ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం

Updated By ManamFri, 03/09/2018 - 20:20
 • ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం

 • ముఖ్యమంత్రి కేసీఆర్ మోసకారి

 • టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్

 • న్యాయవ్యవస్థపై నమ్మకం పోతోంది

 • అసమానతలే విప్లవాలకు ఆవిర్భావం: భట్టి

 • కాంగ్రెస్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం

uthamహైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసకారి.. దళిత వ్యతిరేకి అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో దళితులపై అణిచివేత కొనసాగుతోందని, అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి జయలక్ష్మి గార్డెన్‌లో జరిగిన కాంగ్రెస్ రాష్ట్ర ప్లీనరీలో ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదిగ, మాల కులాలకు సంబంధించి ఒక్కరికీ రాష్ట్ర మంత్రివర్గంలో చోటులేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎస్సీ అన్న హామీ నీటిమూటగా మారిందని మండిపడ్డారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యను కేసీఆర్ అహంకారంతో తొలగించటం అన్యాయమన్నారు. రాష్ట్రపతి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన మీరాకుమార్ కలిసేందుకు ప్రయత్నిస్తే కేసీఆర్ కనీసం స్పందించలేదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న ఇసుక మాఫియాకు కేసీఆర్, కేటీఆర్ అండదండలున్నాయని ఆరోపించారు. ఆ ప్రాంతంలోని ఇసుక రీచ్‌లలో ఎక్కువశాతం వారి బంధువుల ఆధీనంలోనే ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజల డబ్బును తిని కండకావరంతో కేసీఆర్, కేటీఆర్ ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నేరెళ్ల ఘటనలో పోలీసులు ప్రైవేటు సైన్యంలా వ్యవహరించారన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టులు, ఇతరత్రా వాటి కోసం బలవంతపు భూసేకరణ చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూపంపిణీపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఉత్తమ్ ఆందోళన వ్యక్తంచేశారు. చివరకు న్యాయవ్యవస్థపైనా నమ్మకం పోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. నేరెళ్ల ఘటన కేసు మూడు నెలలు అయినా విచారణకు రాలేదన్నారు. దళిత వాడల్లో ‘దళితుల కోసం కాంగ్రెస్’ పేర పార్టీ ఆధ్వర్యంలో త్వరలో కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు మీడియా సహకరించని దుస్థితి ఏర్పడిందన్నారు. మీడియాను కేసీఆర్ నియంత్రిస్తున్నారని ఆరోపించారు.

మోదీ, కేసీఆర్ మెజీషియన్లు: కుంతియా
పీఎం మోదీ, సీఎం కేసీఆర్ మెజీషియన్లంటూ ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి రామచంద్ర కుంతియా విమర్శించారు. మాయమాటలతో kunthiyaవారు ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నారన్నారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. బస్సుయాత్రతో టీఆర్‌ఎస్‌కు భయం పట్టుకుందన్నారు. కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకు మోదీ సూచనతోనే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటున్నారని విమర్శించారు. 

అసమానతలు, అవమానాలతోనే.. భట్టి
అసమానతలు, అవమానాలతోనే విప్లవాలు పుట్టుకొస్తాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో అసమానతలతో పాటు దళితులు అవమానాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అంబేద్కర్ పేరుందని భావించి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును చంపేసిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో, రైతాంగ సాయుధ పోరాటంలో నాడు దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలే కీలకంగా ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆయా వర్గాల పట్ల చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి అందని ద్రాక్షగానే మారిందని, డబుల్ బెడ్‌రూం జాడలేదని, రుణాలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను నిర్వీర్యంచేసే విధంగా సీఎం కేసీఆర్ వ్యవహరి స్తుండటం విచారకరమన్నారు. నాలుగేండ్ల కాలంలో సబ్‌ప్లాన్ ప్రకారం రూ.40 వేల కోట్ల నిధులు రావాల్సి ఉన్నప్పటికీ కేవలం రూ.4 నుంచి 5 వేల కోట్లతో ప్రభుత్వం సరిపెట్టుకుందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో దళితులు అవమానాలకు గురవుతున్నారన్నారు. దళితులు ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వావలంభన సాధించే దిశగా కాంగ్రెస్  కృషి చేస్తుందని తెలిపారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో లక్ష మందితో దళిత సేన ఏర్పాటు చేస్తున్నట్టు ఆ విభాగంజాతీయ కన్వీనర్ కొప్పుల రాజు తెలిపారు. దళితులకు న్యాయం చేసేది కాంగ్రెస్ మాత్రమేనన్నా రు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలంతా ఐక్యంగా కృషిచేయాలని పిలుపునిచ్చారుకాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు

Updated By ManamWed, 02/14/2018 - 16:22
sravan dasoju

హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ దాసోజు తీవ్రంగా స్పందించారు. ఈ కథనాల్లో వాస్తవం లేదని స్పష్టంచేశారు. తన ప్రతిష్టను, విశ్వసనీయతను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందని...అందుకే పార్టీ వీడుతున్నట్లు శ్రవణ్ దాసోజు ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీనిపై ఆయన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరో తన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసి పోస్టింగ్ పెట్టారని ఫిర్యాదు చేశారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్న వారికి త్వరలోనే బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో శ్రవణ్ ఎదుగుతున్నారని..అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రవణ్ వెంట సీసీఎస్‌కు వెళ్లిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ పేర్కొన్నారు.హైదరాబాద్ మెట్రో క్రెడిట్ మాదే?

Updated By ManamSat, 11/25/2017 - 14:56

hyderabad Metroహైద‌రాబాద్ మెట్రో రైల్ క్రెడిట్ ఎవరిది? తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఈ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారు క్రెడిట్ తమదేనంటున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రతిపాదించి, డిజైన్లను రూపొందించి మంజూరు చేసి, ప‌నులను ముందుకు తీసుకుపోయింది గ‌త కాంగ్రెస్ ప్రభుత్వమే అంటున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మెట్రో రైల్ ప్రాజెక్టు హైద‌రాబాద్‌కు రావ‌డానికి ప్రధాని న‌రేంద్ర మోడీ కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ల పాత్ర కానీ ఏమి లేదన్నారు.  ఇప్పుడు మెట్రో రైలు ప్రారంభించ‌డం ద్వారా ఈ ఘ‌న‌త అంతా త‌మ‌దేన‌ని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 

metroవాస్తవానికి కేసిఆర్ గ‌తంలో చేసిన అలైన్‌మెంట్ మార్పు ప్రతిపాద‌న‌ల‌తో మూడేళ్ళ పాటు మెట్రో రైలు ప్రాజెక్టు జాప్యం జ‌రిగిందని, దీని ద్వారా రూ.3,500 కోట్ల అద‌న‌పు భారం ప‌డిందని ఆరోపించారు. చివ‌ర‌కు కేసిఆర్ అధికారంలోకి వ‌చ్చాక గ‌త కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అలైన్‌మెంట్ ప్రకారమే ప‌నులు చేశారని గుర్తుచేశారు. కేసిఆర్ అధికారంలోకి వ‌చ్చాక ఒక్క కి.మీ కూడా అద‌నంగా చేప‌ట్టలేదన్నారు. పాత బ‌స్తీలో ప‌నులు ఇంకా మొద‌లే కాలేదని విమర్శించారు. మెట్రో రైల్ ప్రాజెక్టుపై సమగ్ర అంశాల‌తో 26వ తేదీ ఆదివారం , మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఇందిరాభ‌వన్‌లో ప‌వ‌ర్  పాయింట్‌ ప్రెసెంటేష‌న్‌, చ‌ర్చ ఉందని...దీనికి పార్టీ శ్రేణులు తప్పక హాజరుకావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. బీసీలను మోసం చేస్తున్న కేసీఆర్

Updated By ManamMon, 11/13/2017 - 17:55

mallu battiకేసీఆర్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. గొర్రెలు, బర్రెలు చేపలు అంటూ వారిని మోసం చేస్తూ..అవేవో కొత్త పథకాలుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గాంధీభవన్‌లో జరిగిన ఓబీసీ సమావేశంలో మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ బీసీ ఫలాలు వేరే వాళ్ళు అనుభవించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీసీలకు సబ్ ప్లాన్ అమలైతేనే సమస్యలు తీరతాయన్నారు. త్వరలో అన్ని గ్రామ స్ధాయిలో ఓబీసీ కమిటీలు వేయాలని పార్టీకి సూచించారు. బీసీలందరిని కాంగ్రెస్ వైపు తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిత్తరంజన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.

Related News