sampath kumar

తెలంగాణ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు

Updated By ManamTue, 08/14/2018 - 15:31
high court
  • తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, లా సెక్రటరీకి నోటీసులు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురు అయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వాల రద్దు కేసుకు సంబంధించి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశించినా ఆ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని పునరుద్దరించకపోవడంతో  తెలంగాణ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర న్యాయశాఖ సెక్రటరీలకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది.

ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు పాటించనందుకు న్యాయమూర్తి శివశంకర్ ఫామ్ 1 జారీ చేస్తూ...  వచ్చే నెల 17వ తేదీన  తెలంగాణ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర న్యాయశాఖ సెక్రటరీ విచారణకు స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేశారు. అలాగే ఈ ఇద్దరు ఎమ్మెల్యేల జీతభత్యాలు, అసెంబ్లీ రిజిస్టర్ సమర్పించాలని ఆదేశాలు ఇచ్చారు. 

sampath-komatireddy

కాగా ఫిబ్రవరిలో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా.. అనుచితంగా ప్రవర్తించారంటూ  కోమటిరెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయడమే కాకుండా సభ నుంచి బహిష్కరిస్తూ శాసనసభ కార్యదర్శి  ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ వారిద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులను తప్పుబట్టడమే కాకుండా వాటిని రద్దు చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌లో తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కాలయాపన జరపడంతో వీరిద్దరూ మళ్లీ న్యాయస్థానం మెట్లు ఎక్కారు. 

అలాగే కోర్టు ఆదేశాల మేరకు కోమటిరెడ్డి, సంపత్ కుమార్‌కు గన్‌మెన్లను కేటాయించని రాష్ట్ర డీజీపీ, నల్గొండ జిల్లా ఎస్పీ, జోగులాంబ జిల్లా ఎస్పీలకు కూడా న్యాయస్థానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తదిపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 28కి వాయిదా వేసింది.



తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు సీరియస్

Updated By ManamFri, 07/27/2018 - 16:41

high court

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసన సభ్యత్వం రద్దు కేసులో కోర్టు ధిక్కరణపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని సూటిగా ప్రశ్నించింది.

వారం రోజుల్లో స్పష్టత ఇవ్వకపోతే అసెంబ్లీ కార్యదర్శి, మండలి సెక్రటరీలు నేరుగా కోర్టు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మీరు ప్రభుత్వ న్యాయవాదా లేక పార్టీ న్యాయవాదా అంటూ ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేసు తదుపరి విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా పడింది.



సంపత్, కోమటిరెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్

Updated By ManamTue, 06/12/2018 - 20:27

Court contempt petition, Sampath kumar, Komati reddy venkatareddy, High court, Telangana assembly speaker హైదరాబాద్‌: ఎమ్మెల్యేలుగా తమను కొనసాగించాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడం లేదని కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల్లో అసెంబ్లీలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఇద్దరి శాసనసభ సభ్యత్వాన్ని రద్దుచేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తమ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై గతంలో కోమటిరెడ్డి, సంపత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేస్తూ వారిద్దరినీ పదవీకాలం పూర్తయ్యే వరకూ యథాతథంగా ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది.

హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర శాసనసభా వ్యవహారాల కార్యదర్శి ఇద్దరూ పరిగణించలేదు. ఎమ్మెల్యేలుగా కాకుండా, రావాల్సిన మర్యాద, జీతభత్యాలను కూడా తమకు ఇవ్వడంలేదంటూ వారిద్దరిపైనా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది. 



కోమటిరెడ్డి, సంపత్‌లకు ఊరట

Updated By ManamMon, 06/04/2018 - 13:26

Komati Reddy, Sampath హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి, సంపత్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. వారిద్దరి సభ్యత్వ రద్దుపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చూస్తూ 12మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అప్పీలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే కోమటి రెడ్డి.. ఈ తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు అని అన్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయనకు రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై నమ్మకం లేదని పేర్కొన్నారు. ప్రజల్ని మోసం చేసినట్లు, న్యాయస్థానాలను మోసం చేస్తున్నారని, ఇప్పటికైనా కోర్టు తీర్పును అమలు చేస్తూ తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.



మాకు ప్రాణ హాని ఉంది

Updated By ManamThu, 05/24/2018 - 14:52

Komati Reddy, Sampath Kumar హైదరాబాద్: తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి వెంకట రెడ్డి, సంపత్‌ కుమార్‌లు రాష్ట్ర డీజీపీని కోరారు. గురువారం డీజీపీని కలిసిన ఈ ఇద్దరు.. హైకోర్టు తమను ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని తీర్పును ఇచ్చిందని, అలాగే ఉప సంహరించిన గన్‌మెన్లను తిరిగి ఇవ్వాలని డీజీపీని కోరారు. అలాగే కోర్టు తీర్పు తరువాత సంబరాలు జరుపుకున్న తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే అక్రమ కేసులు ఆపకపోతే జంతర్ మంతర్ వద్ద రెండు, మూడు రోజుల్లో ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు.


 



దీక్షకు దిగిన కోమటిరెడ్డి, సంపత్

Updated By ManamTue, 03/13/2018 - 19:33
komatireddy venkat reddy

హైదరాబాద్: తమ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌లు 48 గంటల దీక్ష చేపట్టారు. గాంధీభవన్ వేదికగా ప్రజాస్వామిక -పరిరక్షణ దీక్ష పేరిట ఈ దీక్షకు మంగళవారం సాయంత్రం శ్రీకారం చుట్టారు. గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు 48 గంటల పాటు వారు దీక్ష కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు ప్రకటించారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ...ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు.

Read Related Article: అఖిలపక్షానికి వీడియోలు చూపండి..

Read Related Article:స్వామిగౌడ్‌కు కొనసాగుతున్న చికిత్స

తెలంగాణ అసెంబ్లీలో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ దాడి ఘటనకు సంబంధించి 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు పూర్తిగా సభ నుంచి సస్పెండ్ చేయడం తెలిసిందే. జానారెడ్డితో పాటు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ, పద్మావతి, టి.రామ్మోహన్‌రెడ్డి, డి.మాదవరెడ్డి, వంశీచంద్‌లపై సస్పెన్షన్‌ వేటు వేయగా...కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసన సభ్యత్వాలు రద్దు చేశారు.



కోమటిరెడ్డి, సంపత్ 48 గం.ల దీక్ష

Updated By ManamTue, 03/13/2018 - 16:45
komatireddy venkat reddy

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ దాడి ఘటనకు సంబంధించి 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు పూర్తిగా సభ నుంచి సస్పెండ్ చేశారు. జానారెడ్డితో పాటు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ, పద్మావతి, టి.రామ్మోహన్‌రెడ్డి, డి.మాదవరెడ్డి, వంశీచంద్‌లపై సస్పెన్షన్‌ వేటు వేశారు. అలాగే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాలు రద్దు చేశారు. తమ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయడాన్ని ఖండిస్తూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌లు 48 గంటల దీక్ష చేపట్టనున్నారు. గాంధీభవన్ వేదికగా ప్రజాస్వామిక -పరిరక్షణ దీక్ష పేరిట ఈ దీక్షకు దిగనున్నారు. మంగళవారం సాయంత్రం 5గంటలకు దీక్ష ప్రారంభించనున్నారు. 



తెలంగాణలో మళ్లీ మొదలైన రాజకీయ వేడి

Updated By ManamWed, 11/29/2017 - 18:00

sampath kumarప్రధాని మోదీ, ఇవాంక ట్రంప్‌ల హైదరాబాద్ టూర్ హడావుడి ముగియనుండడంతో తెలంగాణలో రాజకీయ కాక మళ్లీ మొదలయ్యింది. రాజకీయంగా వచ్చే వారం రోజుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో ప్రారంభం, డబ్ల్యూఈఎస్ సదస్సుకు దూరంగా గత రెండ్రోజులుగా హస్తినలో మకాం వేసిన హరీష్ రావు రాజకీయ అంశాలపైనే ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. 

ఢిల్లీ టూర్‌లో ఉన్న మంత్రి హరీష్ రావును అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతప్ కుమార్ కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడి  తెలంగాణ భవన్‌లో వీరిద్దరు సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. గత కొంతకాలంగా సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌ తీర్థంపుచ్చుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వీరిద్దరు ఢిల్లీలో భేటీ కావడం ఈ ఊహాగానాలకు బలం చేకేర్చేలా ఉంది. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీ బలంపుంజుకున్నట్లు స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.  కాంగ్రెస్ నేతల నైతిక స్థైరాన్ని దెబ్బతీసే ప్లాన్‌తోనే సంపత్ కుమార్‌ను టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. 

అయితే తాను కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరుతానన్న ప్రసారంలో వాస్తవం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. అయితే ఏఐసీసీ పెద్దలను కలిసేందుకు తాను ఢిల్లీ వచ్చానని, తెలంగాణ భవన్‌లో బస చేస్తున్న మంత్రి హరీశ్ రావును మర్యాదపూర్వకంగానే కలిసినట్లు చెప్పుకొచ్చారు.  టీఆర్ఎస్‌లో చేరే ఉద్దేశం తనకు లేదన్నారు. 



మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు ముక్కలాట

Updated By ManamMon, 11/13/2017 - 13:25

revanth nagamతెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇటీవల టీడీపీని వీడి కాంగ్రెస్ తీర్థంపుచ్చుకోవడంతో పాత మహబూబ్‌నగర్ జిల్లాలో రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. కోడంగల్‌లో రేవంత్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసే వ్యూహాలకు టీఆర్ఎస్ అధిష్టానం పదునుపెడుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు కొడంగల్‌లో పర్యటించి, అక్కడ ఉన్న రేవంత్ అనుచరులను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇక ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఈ వ్యవహారాన్నిసీరియస్ గా తీసుకుని కొడంగల్ బాధ్యతలను మంత్రి హరీష్ రావుకు అప్పగించారని ప్రచారం జరుగుతోంది.  ఉప ఎన్నిక వస్తే రేవంత్ ను ఓడగొట్టడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగా హరీష్ రావు మెదక్, కరీంనగర్ ప్రాంతాల నుంచి తన అనుచరులు కొందరిని కొడంగల్ పంపించి అక్కడ రాజకీయాలు, సమస్యలు తదితర అంశాపై విషయ సేకరణ చేయిస్తున్నారని సమాచారం. 

ఇదిలా ఉండగా మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత నాగం జనార్దనరెడ్డి పార్టీ మారే అవకాశాలు ఉన్నాయన్న కథనాలు వినిపిస్తున్నాయి. పార్టీ మార్పు విషయంలో జనార్దన రెడ్డి ఓ నిర్దిష్ట మైన అబిప్రాయానికి రాలేకపోతున్నా, ఆయన సన్నిహితులు కొందరు నాగం పార్టీ మారక తప్పదని భావిస్తున్నారు. నాగంకు బిజెపిలో పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదని అంటున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేసే పరిస్థితి బిజెపిలో లేదని భావిస్తున్నారు. అలాగే బిజెపిలో కొనసాగితే రాజకీయంగా పెద్దగా భవిష్యత్తు ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.  ఈ నేపద్యంలో నాగం కూడా కాంగ్రెస్ గూటికి చేరక తప్పదని కధనాలు వస్తున్నాయి. రాహుల్ గాందీ మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో నాగం కాంగ్రెస్ లో చేరవచ్చన్న ప్రచారం కూడా ఉంది. 

అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దళిత సామాజిక వర్గానికి చెందిన సంపత్‌ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ జోరుకు చెక్ పెట్టాలన్న యోచనలో టీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. డీకే అరుణతో సంపత్ కుమార్‌కు పొసగడం లేదని, దీంతో ఆయన మళ్లీ టిక్కెట్ వస్తుందో? రాదో? అన్న అనుమానంతో కారెక్కడం మంచిదన్న యోచన చేస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 
 





Related News