nara lokesh

వైసీపీ నేతలకు లోకేశ్ సవాల్

Updated By ManamFri, 06/15/2018 - 21:15

Nara Lokesh, Ysrcp leaders, AP jobsఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయంటూ ప్రశ్నిస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంత్రి నారా లోకేశ్‌ ట్విట్టర్‌ వేదికగా సవాల్ విసిరారు. లోక్‌సభలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పరిశ్రమల శాఖ ఇచ్చిన సమాధానాన్ని తన ట్వీట్‌తో జత చేసి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు 531 పరిశ్రమలు వచ్చాయని, రూ.1,29,661 కోట్లు పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ పరిశ్రమల ఫలితంగా 2,64,754 మంది స్థానిక యువతకు ఉద్యోగాలు వచ్చాయంటూ కేంద్ర పరిశ్రమల శాఖ సమాధానం ఇచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి పారిపోవద్దు అని సీఎం చంద్రబాబు పదే పదే విజ్ఞప్తి చేసేవారని లోకేశ్‌ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక బస్ ఏర్పాటుచేస్తుందని, పరిశ్రమల శాఖ మంత్రే స్వయంగా పరిశ్రమలు ఎక్కడ వచ్చాయో.. ఉద్యోగాలు ఎక్కడ కల్పించామో చూపించేందుకు సిద్ధంగా ఉన్నారని లోకేశ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో వైసీపీ నేతలు సిద్ధమా? అని లోకేశ్ సవాల్‌ విసిరారు.లోకేష్ తో అంబిక లక్ష్మీ నారాయణ భేటీ

Updated By ManamWed, 06/13/2018 - 12:47

lokesh, ambika హిందూపురం : అనంతపురం జిల్లా హిందూపురంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. హిందూపురం కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ అంబిక  లక్ష్మీ నారాయణ హస్తానికి హ్యాండ్ ఇచ్చి సైకిల్ ఎక్కేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ వార్తలకు ఊతం ఇచ్చేలా ఆయన బుధవారం సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ ను కలిశారు.  జిల్లా పర్యటనకు వస్తున్న లోకేష్ ను అంబిక లక్ష్మీ నారాయణ కోడికొండ సమీపంలో కలిసి, కొద్ది నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడారు.

కాగా అంబిక లక్ష్మీ నారాయణ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా హిందూపురం నుంచి పోటీ చేసినప్పటికీ టీడీపీ అభ్యర్థి అబ్దుల్ ఘనీ చేతిలో ఓటమి పాలయిన విషయం తెలిసిందే. అంతకు ముందు బెంగళూరు విమానాశ్రయం వద్ద మంత్రి లోకేష్ ను మంత్రి కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే బీకె పార్థసారథి, జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు తదితరులు కలిసి స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ ఇవాళ మడకశిరలో పర్యటించనున్నారు. అందులో భాగంగా కోడికొండ చెక్ పోస్టు చేరుకున్న  ఆయనకు  జిల్లా, నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు.జగన్‌కు ఆస్తులు ప్రకటించే దమ్ముందా?: నారా లోకేశ్

Updated By ManamWed, 06/06/2018 - 14:44

Ys jagan mohan reddy, guts to declaring assets, YSRCP, Nara lokesh అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జగన్ చేసిన ఆరోపణలను తీవ్ర స్థాయిలో ఆయన ఖండించారు. రాజకీయాల్లో ఆస్తులు ప్రకటించేది తమ కుటుంబం మాత్రమేనని, మీ ఆస్తులు ప్రకటించే దమ్ముందా? అని జగన్‌కు లోకేశ్ సవాల్ విసిరారు. నారా, వైఎస్ ఇంటి పేర్లకు చాలా వ్యత్సాసం ఉందని, తాము అభివృద్ధి మార్గం ఎంచుకుంటే, మీరు అవినీతి, అక్రమాల వైపు ఉంటారని ఎద్దేవా చేశారు. ‘‘ప్రియమైన ప్రతిపక్షనేత గారు.. హెరిటేజ్ సంస్థ 25ఏళ్ల శ్రమ ఫలితం.. సంస్థ ఎదుగుదల కోసం అమ్మ, బ్రాహ్మణి నిరంతరం కష్టపడుతున్నారు. హెరిటేజ్ విలువలతో ఎదిగిన సంస్థ కాబట్టే వైఎస్సార్ 20కి పైగా కేసులు పెట్టించినా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. ఎందుకంటే మేం విలువలతో కూడిన వ్యాపారాన్ని నిర్వహించాం’’ అని లోకేశ్ ట్వీట్లు చేశారు.వైసీపీ ఐసీయూలో ఉంటే.. బీజేపీ ఆక్సిజన్ అందిస్తోంది

Updated By ManamMon, 05/28/2018 - 16:40

lokesh అమరావతి: 2019 ఎన్నికల్లో బీజేపీనే తమ ప్రధాన ప్రత్యర్థి అని, వైసీపీకి రాష్ట్రంలో అంత సీన్ లేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మహానాడులో మాట్లాడిన ఆయన.. వైసీపీ ఐసీయూలో ఉంటే, బీజేపీ ఆక్సిజన్ అందిస్తోందని వ్యాఖ్యానించారు. వైసీపీకి ఓటేస్తే, బీజేపీకి ఓటేసినట్లేనని.. బీజేపీ సొంతంగా ఏమీ చేయలేకనే, కొత్త యాక్టర్లను, కుల సంఘాలను రంగంలోకి దించిందని పేర్కొన్నారు.

ఇక ఉద్దానంకు ఏమీ చేయలేదని పవన్ విమర్శలు చేస్తున్నారని, అయితే ఉద్దానం కోసం ఇప్పటికీ ఎంతో చేశాం, ఇంకా చేస్తూనే ఉంటామని నారా లోకేశ్ తెలిపారు. తాతకు, తండ్రికి చెడ్డ పేరు తెచ్చేలా ఎప్పుడూ వ్యవహరించనని, తనపై వచ్చిన ఆరోపణలకు రుజువులు చూపాలని అన్నారు. టీడీపీ సర్కారు వేసిన రోడ్లపైనే ప్రతిపక్షాలు నడుస్తున్నాయని అయినా అర్థం పర్థం లేని విమర్శలు చేస్తారని అన్నారు. ఇక వెంకన్నను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని, ఆయన జోలికి వస్తే బతికింది లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నారా లోకేశ్.

 అంతా మీరే చేశారు

Updated By ManamFri, 04/20/2018 - 08:33

pawan kalyan  ‘‘మీరు గెలవడానికి మీకు మద్దతిస్తే మీరు నాకు ఇచ్చిన ఫలితం నా తల్లిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయించడం. ఇన్ని చేయిస్తున్న మిమ్మల్ని నేను ఎలా నమ్మాలి’’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు కురిపించారు. చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్.. మీరు చేస్తున్న ధర్మ పోరాట దీక్షలో పాల్గొనవల్సిందిగా కిమిడి కళా వెంకట్రావు నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని.. కానీ మీరు, మీ అబ్బాయి, అతని స్నేహితులు చేయూతనిచ్చిన చేయిని వెనకమాలుగా మీ మీడియా శక్తుల ద్వారా చంపివేస్తుంటారు, మిమ్మల్ని ఎలా నమ్మటం అంటూ ట్వీట్ చేశారు.

‘‘మీ ప్రభుత్వం రావడానికి అండగా మీకు నిలబడినందుకు మీరు మాకిచ్చిన ప్రతిఫలం- ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌ని వేదికగా చేసుకొని, మీ కొడుకు అతని స్నేహితులు అధ్వర్యంలో గత ఆరు నెలలుగా మీ మీడియా సంస్థలైన టీవీ9, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, ఇతర కొన్ని చానెల్స్ తదితర సోషల్ మీడియా ద్వారా నా మీద, నా కుటుంబం మీద, నన్ను అభిమానించే వారి మీద నిరవధిక మీడియా అత్యాచారం జరిపారు, జరిపిస్తున్నారు. దాంట్లో భాగంగా గత కొద్ది రోజులుగా(పది కోట్లు డబ్బు ఖర్చు పెట్టి మరి)నాకు సంబంధం లేని విషయాల్లోకి లాగా నన్ను, నాకు జన్మనిచ్చిన తల్లిని నడిరోడ్డులో అసభ్యంగా పచ్చి బూతు తిట్టించి, దానిని పదే పదే ప్రసారం చేసి, డిబేట్లు పెట్టి, దానిని మీ పార్టీ వ్యక్తులు సర్క్యులేషన్‌లో పెట్టి.. ఇప్పుడు మీ పిలుపుని ఎలా తీసుకోవాలి చెప్పండి..? వర్మ అనే ఒక దర్శకుడు, శ్రీ సిటీ ఓనర్(టీవీ9ఓనర్) అయిన శ్రీనివాస్(10కోట్లు ఇచ్చిన వ్యక్తి), టీవీ9 రవి ప్రకాశ్(మీడియా డిజైన్)-వీరు ముగ్గురు ద్వారా మీ అబ్బాయి లోకేశ్, అతని స్నేహితుడైన రాజేశ్ కిలారు కలిసి చేయిస్తున్నది మీకు తెలియదు అంటే నమ్మమంటారా..?’’ అంటూ ప్రశ్నించారు. అలాగే ‘‘ఈ ఛానెల్స్ అన్ని ప్రత్యేకహోదా కంటే ఎక్కువ వ్యభిచారం చట్టబద్ధత గురించే ప్రసారం చేస్తున్నారు. ఇంతకు మీ ప్రియారిటీ ఏంటి సర్’’ చంద్రబాబును ప్రశ్నించారు పవన్ కల్యాణ్.దేశానికే ఏపీ ఆదర్శం

Updated By ManamTue, 04/10/2018 - 23:15
  • ‘ఉపాధి హామీ’లో నంబర్ 1గా నిలవాలి.. రూ. 10 వేల కోట్లతో పనులకు ప్రణాళిక

  • త్వరలో 791 ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ.. అధికారులతో సమీక్షలో మంత్రి లోకేశ్ 

lokeshఅమరావతి: ఉపాధి హామీ పథకం అమల్లో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ ఏడాది అనుకున్న లక్ష్యాల కన్నా ఎక్కువగా ఈ పథకం కింద రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మంగళవారం సచివాలయంలో గ్రామీణాభివృద్ధి, పంచాయుతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష నిర్వహించారు. గత పాలకుల హయాంలో మెటీరియల్ కాంపోనెంట్ రూపంలో వచ్చిన రూ. 3200 కోట్లు వెనక్కి వెళ్లిపోయాయని గుర్తుచేశారు. ఇప్పుడు పక్కా ప్రణాళికతో అన్ని గ్రామాల్లో మౌలికవసతులు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో 21.53 కోట్ల పనిదినాలు పూర్తి చేసి, స్వల్ప తేడాతో రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ఈ ఏడాది దేశంలోనే ఏపీ అగ్రస్థానం సాధించడమే లక్ష్యంగా అధికారులంతా పనిచేయాలని కోరారు. 1,63,825 పంట కుంటలు తవ్వి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచామని.. ఈ ఏడాది గత రికార్డులను అధిగమించాలని ఆదేశించారు. ఈ సంవత్సరం ప్రారంభించిన 6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. అన్ని గ్రామాల్లో అభివృద్ధి సమానంగా జరగాలని కోరారు. ఈ సంవత్సరం ఉపాధిహామీ పథకంలో భాగంగా 20 లక్షల కన్నా తక్కువ ఖర్చు చేసిన గ్రామాలు ఉండకూడద న్నారు. వేసవిలో ఉపాధి హామీ వేతనదారులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 791 ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను లోకేశ్ ఆదేశించారు. ఈ వర్క్ షాప్‌లో ప్రిన్సిపల్ సెక్రెటరీ జవహర్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ రంజిత్ బాషా, ఉపాధిహామీ పథకం అడిషనల్ క మిషనర్ బాలసుబ్రహ్మణ్యం, పంచాయతీ రాజ్, గ్రామీణా భివృద్ధి శాఖ అధికారులు, పీడీలు పాల్గొన్నారు.బాబు లోకేశ్‌కు అన్ని 'అ' శాఖలు ఇచ్చారు

Updated By ManamTue, 04/03/2018 - 14:59

Vijaya Sai Reddy న్యూఢిల్లీ: నారా లోకేశ్‌కు చంద్రబాబు అన్ని 'అ' శాఖలు ఇచ్చారని.. అందులో అన్యాయం, అక్రమం, అవినీతి ఉన్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మాట్లాడిన ఆయన.. మమ్మల్ని విమర్శించడం కాదు, ముందు మీపై వచ్చిన ఆరోపణలు బదులివ్వండి అంటూ అన్నారు.

ఇక లోపాయికారి ఒప్పందం చేసుకునే నేర్పరితనం తనకు లేదని, హోదాపై ఎవరు డ్రామాలాడుతున్నారో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. పోలవరం, రాజధాని, విదేశీ పర్యటనలు, కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నామని.. మొత్తం 10 అంశాలపై చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే పవన్ చేసిన ఆరోపణలకు చంద్రబాబు, లోకేశ్‌లే సమాధానం చెప్పాలని విజయసాయి రెడ్డి అన్నారు.అన్ని అవార్డులు ఎలా వచ్చాయి..?

Updated By ManamSat, 03/24/2018 - 16:46

Lokesh అమరావతి: ఉపాధి హామీ నిధుల్లో అవినీతి జరిగిందని అనడం అవాస్తవమని.. అవినీతి జరిగితే 20 అవార్డులు ఎందుకు వస్తాయని మంత్రి లోకేశ్ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ మంత్రిత్వ శాఖలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు.

వాటర్ ట్యాంకర్ల విషయంలో అవినీతి జరిగే ప్రసక్తే లేదని.. రోజుకు 15గంటలు కష్టపడుతున్నామని.. దానికి సంబంధించిన ప్రతి విషయం డ్యాష్ బోర్డులో ఉంటుందని స్పష్టం చేశారు. అయినా ప్రతి చిన్నవిషయానికి అవినీతి అనొద్దని.. తాను అవినీతి చేసినట్లుగా అంటుంటే బాధగా ఉందని చెప్పారు.అమిత్‌ షాకు అవగాహన లేదు: నారా లోకేశ్

Updated By ManamSat, 03/24/2018 - 12:33

Lokesh, AMith Shah అమరావతి: రాష్ట్ర సమస్యలపై అమిత్‌షాకు పూర్తి అవగాహన లేదని.. ఆయన రాసిన లేఖలోనే ఆ విషయం స్పష్టంగా అర్థమౌతుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబుకు అమిత్‌షా రాసిన లేఖపై స్పందించిన లోకేశ్.. ఇంతవరకు జరిగిన పనులకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఎప్పటికప్పుడు కేంద్రానికి అందించామని చెప్పారు.

అయితే యుటిలైజేషన్ సర్టిఫికెట్‌కి ప్రత్యేకహోదాకు సంబంధం ఏంటని.. ప్రత్యేక హోదా సహా మిగిలిన 18 హామీలు నెరవేర్చడానికి యుటిలైజేషన్ ఏం అవసరమంటూ ప్రశ్నించారు. ఎన్టీఏ నుంచి బయటకు రావాలని ఆవేశంగా నిర్ణయం తీసుకున్నారని అమిత్‌షా అంటున్నారని, అయితే ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఎన్నో సార్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని.. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలను త్వరలో అమిత్‌షాకు లేఖలో రాస్తామని వివరించారు.నారాయణ ఫస్ట్.. లోకేశ్ సెకండ్

Updated By ManamTue, 02/06/2018 - 08:50

Lokesh, Narayanaఅమరావతి: పనితీరు ఆధారంగా మంత్రులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ర్యాంకులను ప్రకటించారు. మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫినెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. పలువురు మంత్రుల పనితీరుపై కితాబిచ్చారు. ఈ సందర్భంగా వారికి ర్యాంకులను ఇచ్చారు.

అందులో నారాయణ తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో నారా లోకేశ్, మూడవ స్థానంలో సుజయకృష్ణ రంగారావు ఉన్నారు. కాగా చివరి రెండు స్థానాల్లో మంత్రులు ఆదినారాయణ రెడ్డి, గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఇప్పటినుంచైనా మంత్రులంతా తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని.. పనితీరు బాగాలేకుంటే మాత్రం పదవి నుంచి తొలగించేందుకు సిద్ధమని హెచ్చరించారు.

Related News