savitri

మెల్‌బోర్న్ అవార్డును సొంతం చేసుకున్న ‘మహానటి’

Updated By ManamMon, 08/13/2018 - 11:49
Mahanati

అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’కి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఆస్ట్రేలియాలో జరిగిన ‘ద ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌’లో ‘మహానటి’ చిత్రానికి ఈక్వాలిటీ ఇన్ సినిమా అవార్డు వచ్చింది. 

అవార్డు గ్రహీతలు వీరే

బెస్ట్ ఇండియన్ ఫిల్మ్: లవ్ సోనియా
బెస్ట్ ఇండియన్ ఫిల్మ్(స్పెషల్ మెన్షన్): గాలి గులియాన్
ఈక్వాలిటీ ఇన్ సినిమా: మహానటి
డైవర్సిటీ అవార్డు: ఫ్రిదా పింటో
ఉత్తమ నటుడు: మనోజ్ బాజ్‌పేయి (గాలి గులియాన్)
ఉత్తమ నటి: రాణి ముఖర్జీ(హిచ్కీ)
ఉత్తమ చిత్రం: సంజు
ఉత్తమ దర్శకుడు: రాజ్ కుమార్ హిరానీ(సంజు)
ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్(సంజు), రిచా చద్దా(లవ్ సోనియా)
వాంగ్వార్డ్ అవార్డ్: రణ్‌బీర్ కపూర్(సంజు)
ఎక్సలెన్స్ ఇన్ సినిమా: రాణి ముఖర్జీ.‘మహానటి’ సావిత్రి డబ్బింగ్‌ను చూశారా..?

Updated By ManamSun, 05/20/2018 - 13:12

Savitri సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. ఈ చిత్రంలో సావిత్రి పాత్రకు తన నటనతో ప్రాణం పోసింది కీర్తి సురేశ్. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో అయితే కీర్తి, సావిత్రిని గుర్తుచేసింది పలువురు విమర్శకులు ప్రశంసలు కురిపించారు. కాగా ఈ చిత్రం కోసం కీర్తి సురేశ్ చెప్పిన డబ్బింగ్‌కు సంబంధించిన వీడియోను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ వీడియోలో కూడా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మరోసారి అందరినీ ఆకట్టుకుంటోంది కీర్తి సురేశ్. ఇదిలా ఉంటే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 ఎన్టీఆర్, ఏఎన్నార్‌కు షాకిచ్చిన సావిత్రి

Updated By ManamThu, 05/17/2018 - 21:55

savitriతెలుగు సినీ పరిశ్రమకు మ‌హాన‌టులు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళ లాంటివారు. అటువంటి మహానటులు సైతం వారి సినిమాల్లో అల‌నాటి మేటి న‌టి సావిత్రి ఉండాల‌ని నిర్మాతలను డిమాండ్ చేసారంటే.. సావిత్రి నటనా ప్రతిభ ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ ఇద్ద‌రు హీరోల‌తో సమానంగా అప్పట్లో పారితోషికాన్ని అందుకున్న లేడీ సూపర్ స్టార్ మహానటి సావిత్రి.. రెండు సందర్భాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లను సైతం ఆశ్చర్యానికి గురి చేశార‌ట‌.

కాస్త ఆ వివరాల్లోకి వెళితే.. 1977 సంవ‌త్స‌రంలో ఆంధ్రప్రదేశ్‌లోని దివిసీమలో జరిగిన ప్రకృతి వైపరీత్యానికి  తెలుగు సినీ పరిశ్రమ స్పందించింది. ఆ వైపరీత్యానికి బాధితులైన వారిని ఆదుకోవడానికి ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో పాటు సావిత్రి కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ కొంతమంది అభిమానులు ఎన్టీఆర్‌ను పూలమాలతో సత్కరిస్తే.. ఆ మాలను వేలం పాటలో రూ.10,000కు సొంతం చేసుకున్నారు సావిత్రి. దానికి షాక్ అయిన‌ ఎన్టీఆర్ “కేవ‌లం ఒక పూలదండ‌ కోసం డబ్బులను ఎందుక‌లా దుబారాగా ఖర్చు చేస్తావ్?” అని హెచ్చరించారట. దానికి బదులుగా ఆమె, “ఇది అందరికీ మాలే కాని నాకు మాత్రం వెల కట్టలేని వస్తువు. అదీగాక ఈ రూపంలో ఈ బాధితులకు సాయం చేసినందుకు ఆనందంగా కూడా ఉంది” అని బదులిచ్చారట.

మరొక సందర్భంలో చెన్నైలో ఒక ఇంటిని కట్టుకున్న ఏఎన్నార్, తన పాత ఇంటిని అమ్మకానికి పెడితే.. ఒక బ్లాంక్ చెక్కుతో ఆ ఇంటి విలువను రాసుకోమని చెప్పారట సావిత్రి. దీంతో.. ఏఎన్నార్ షాక్‌కు గుర‌వ‌డ‌మే కాకుండా త‌న‌ ఈగో కూడా హ‌ర్ట‌య్యింద‌ట‌. తన అభిమాన నటుడి ఇంటిని వెల కట్టడం తన వల్ల కాదన్న‌దే ఆమె భావన కావ‌డంతో.. అలా చేశార‌ట‌. ఆమె ఉద్దేశం ఏదైనా.. ఆమె ఎంచుకున్న మార్గం మాత్రం సరైనది కాదని అప్పట్లో కొంతమంది అభిప్రాయ‌ప‌డ్డారు.

ఏదేమైనా.. ఈ రెండు సందర్భాలను ‘మహానటి’ సినిమాలో చూపించి ఉంటే మ‌రింత‌ బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు.నాన్న పాత్రను తప్పుగా చూపారు: జెమినీ గణేషన్ కుమార్తె

Updated By ManamThu, 05/17/2018 - 09:38

kamala  సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో తన తండ్రి పాత్రను తప్పుగా చూపించారని జెమినీ గణేషన్ మొదటి భార్య కుమార్తె, ప్రముఖ వైద్యురాలు కమలా సెల్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సావిత్రి కంటే ముందే జెమినీ గణేశన్ తన తల్లిని పెళ్లాడి ఇద్దరు పిల్లను కూడా కన్నారని, తొలి ప్రేమ సావిత్రి మీద కాదని, తన తల్లిమీదేనని తెలిపారు. 

ఇక సినిమాలో చూపించినట్లు సావిత్రికి జెమినీ గణేశన్ మద్యం అలవాటు చేయలేదని, ఆమెనే తన తండ్రికి మద్యాన్ని అలవాటు చేసిందని కమలా సెల్వరాజ్. కెరీర్ మొత్తం బిజీగా ఉన్న తన తండ్రిని అవకాశాలు లేక ఖాళీగా కూర్చున్నట్లు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ‘ప్రాప్తం’ సినిమా నుంచి వెనక్కు తగ్గాలని చెప్పడానికి నాన్నతో పాటు తాను కూడా సావిత్రి ఇంటికి వెళ్లామని.. ఆ సమయంలో ఆమె తమపైకి కుక్కులను ఉసిగొల్పిందని, వాటి నుంచి తప్పించుకునేందుకు గోడ దూకి పారిపోయామని కమలా సెల్వరాజ్ గుర్తు చేసుకున్నారు. అయినా ప్రేక్షకులు జెమినీ గణేశన్‌ను అంగీకరించకుంటే ‘కాదల్ మన్నన్’ అనే బిరుదును ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. అయితే మరోవైపు ఈ చిత్రంపై సావిత్రి, జెమినీ గణేశన్ కుమార్తె, కుమారుడు చాముండేశ్వరి, సతీశ్‌లు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తన తల్లికి ఈ చిత్రం ఘన నివాళి అని వారు తెలిపారు. ఇదిలా ఉంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.'మ‌హాన‌టి'.. ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌

Updated By ManamWed, 05/16/2018 - 16:12

keerthy sureshఅల‌నాటి మేటి న‌టి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం 'మ‌హాన‌టి'. కీర్తి సురేశ్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన ఈ సినిమాకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రియాంక ద‌త్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న తెర‌పైకి వ‌చ్చింది. తొలి ఆట నుంచే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా..  విడుద‌లైన ప్ర‌తి చోటా మంచి వ‌సూళ్ళు రాబ‌డుతోంది. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం.. తొలి వారం రోజులకిగానూ (మంగ‌ళ‌వారం నాటికి) తెలుగు రాష్ట్రాల్లో రూ.10.52 కోట్ల షేర్ రాబ‌ట్టుకున్న ఈ సినిమా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.19.62 కోట్ల షేర్ ఆర్జించింద‌ని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల వ‌ర‌కు థియేట్రిక‌ల్ రైట్స్ వాల్యూ ఉన్న ఈ మూవీ.. గురువారం నాటికి ఆ వ‌సూళ్ళు రాబ‌ట్టుకునే అవ‌కాశ‌ముంద‌ని ట్రేడ్ పండితులు అంచ‌నా వేస్తున్నారు. 'మ‌హాన‌టి' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

Updated By ManamThu, 05/10/2018 - 20:21

mahaఅల‌నాటి న‌టి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం 'మ‌హాన‌టి'. కీర్తి సురేశ్ టైటిల్ రోల్‌లో న‌టించిన ఈ సినిమాకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నాగ‌చైత‌న్య‌, మోహ‌న్ బాబు తదిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా బుధ‌వారం తెర‌పైకి వ‌చ్చింది. మొదటి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. తొలి రోజు మంచి వ‌సూళ్ళ‌నే రాబ‌ట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.1.4 కోట్ల షేర్‌ను రాబ‌ట్టుకోగా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.3.27 కోట్ల షేర్‌ను రాబ‌ట్టుకుందని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. తెలుగు, త‌మిళ వెర్ష‌న్‌కు సంబంధించి రూ.20 కోట్ల థియేట్రిక‌ల్ రైట్స్ ఉండ‌గా.. త‌మిళ్ వెర్ష‌న్ (న‌డిగ‌ర్ తిల‌గ‌మ్‌) శుక్ర‌వారం విడుద‌ల కాబోతోంది. అలాగే తెలుగు వెర్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. తెలుగు రాష్ట్రాలు, ఓవ‌ర్సీస్‌లో మిన‌హా ఈ సినిమా మ‌రే ప్రాంతంలోనూ విడుద‌ల కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.  సెన్సార్ పూర్తిచేసుకున్న 'మ‌హాన‌టి'

Updated By ManamFri, 05/04/2018 - 15:55

mahanatiఓ త‌రం జ్ఞాప‌కం.. మ‌హాన‌టి సావిత్రి. ఆమె జీవితం ఆధారంగా తెర‌కెక్కిన సినిమా 'మ‌హాన‌టి'. కీర్తి సురేశ్ టైటిల్ రోల్‌లో న‌టించిన ఈ సినిమాకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌మంత‌, మోహ‌న్ బాబు, నాగ‌చైత‌న్య‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, షాలినీ పాండే, భానుప్రియ‌, దివ్య‌వాణి, ప్ర‌కాశ్ రాజ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి మిక్కీ జే మేయ‌ర్ స్వ‌రాలందించారు. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ఈ నెల 9న తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్య‌క్ర‌మాలు ఈ రోజు (శుక్ర‌వారం) పూర్త‌య్యాయి. సెన్సార్ క‌మిటీ ఈ చిత్రానికి 'క్లీన్ యు' జారీ చేసింది.‘మహానటి’ కోసం అతిథిగా ఎన్టీఆర్

Updated By ManamTue, 05/01/2018 - 12:20

Mahanati  మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’(తమిళ్‌లో నడిగర్ తిలగమ్). ఈ చిత్ర తెలుగు ఆడియో మంగళవారం హైదరాబాద్‌లో  జరగనుండగా, ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరుకానున్నాడు. చిత్ర నిర్మాతలలో ఒకరైన స్వప్నాదత్‌, ఎన్టీఆర్‌కు మంచి స్నేహితురాలు కావడంతో ఈ కార్యక్రమానికి వచ్చేందుకు ఎన్టీఆర్ ఒప్పుకొన్నట్లు సమాచారం. 

ఇక సినిమాలోని ప్రధాన పాత్రాధారులైన కీర్తి సురేశ్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, శాలిని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు ఆకట్టుకోవడంతో ఆల్బమ్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి స్వరాలను అందించిన విషయం తెలిసిందే. 

 అమ్మాయిలకు ‘మహానటి’ టీం బంపర్ ఆఫర్

Updated By ManamSun, 04/29/2018 - 12:59

Mahanati సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఒక ఆసక్తికర పోటీని పెట్టింది. సావిత్రి నటించిన ‘మాయాబజార్’ చిత్రంలోని ‘అహ నా పెళ్లంట’(ధమ్ ధమ్ ఎన్ కల్యాణమ్)అనే పాటకు ఎవరి స్టైల్‌లో వారు డ్యాన్స్‌ చేసి #CelebrateSavitri పేరుతో సామాజిక మాధ్యమాలలో అప్‌లోడ్ చేస్తే.. అందులో మహానటి టీంకు నచ్చిన వారికి అదిరిపోయే గిఫ్ట్‌లు ఇవ్వనున్నారు. ఆలస్యమెందుకు అమ్మాయిలు మీలో ఉన్న టాలెంట్‌ను బయటపెట్టేందుకు ఇది మరో అవకాశం. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.

 సావిత్రి పాత్ర దొరకడం నా అదృష్టం

Updated By ManamSun, 04/29/2018 - 11:41

Savitri సావిత్రి పాత్రలో నటించడం నిజంగా తన అదృష్టమని మలయాళ బ్యూటీ కీర్తి సురేశ్ అన్నారు. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపింది. మొదట ఈ పాత్ర తనకు వచ్చినప్పుడు నటించాలా వద్దా అని చాలా ఆలోచించానని కీర్తి పేర్కొన్నారు. సావిత్రి జీవిత చరిత్ర ఒక తెరిచిన పుస్తకమని, కానీ ఈ పాత్రలో నటించేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ తనను ఎంతో ప్రోత్సహించారని, ఆయన నమ్మకమే ఈ మూవీలో ఇంత బాగా నటించేందుకు సహకరించదని తెలిపారు.

ఇక ఈ పాత్రలో నటించేందుకు సావిత్రి నటించిన పలు చిత్రాలను చూశానని, నిజజీవితంలో ఆమె గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నానని చెప్పారు. అలాగే ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరు సినిమా బాగా వచ్చేందుకు కృషి చేశారని పేర్కొంది.

Related News