kamaladevi

మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Updated By ManamFri, 11/09/2018 - 02:25
  • అనారోగ్యంతో గాదం కమలాదేవి మృతి

  • 1972లో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • టీటీడీ.. కాయిర్ బోర్డులలో సభ్యత్వం

  • పీఏసీ చైర్మన్‌గానూ బాధ్యతల నిర్వహణ

  • పలు పార్టీల నాయకుల సంతాపం

kamaladeviకాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పామర్రు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గాదం కమలాదేవి (86) గురువారం ఉదయం మరణించారు. ఇటీవల కొంత కాలం క్రితం ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించినా, వయోభారంతో శరీరం చికిత్సకు పెద్దగా స్పందించలేదు. గురువారం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి మృతిచెందారు. గాదం కమలాదేవి 1972లో పామర్రు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం కాలంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలుగా, టీటీడీ సభ్యురాలిగా, కాయిర్ బోర్డు సభ్యురాలిగా కూడా ఆమె పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే కమలాదేవికి నలుగురు సంతానం. వీరిలో రమేష్, మహేష్, హరీష్ అనే ముగ్గురు కుమారులు, అపైరాధ అనే కుమార్తె ఉన్నారు. కమలాదేవి అప్పట్లో పీఏసీ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించడం గమనార్హం. కమలాదేవి మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రము ఖులు సంతాపం వ్యక్తం చేశారు. సేవా కార్యక్రమాలు చేపట్టడంలో గాదం కమలాదేవి ముందంజలో ఉండేవారని గుర్తుచేసుకున్నారు. కాకినాడలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించడానికి ఆమె తన వంతు సహాయం అందించారని పలువురు కొనియాడారు. 

Related News