in dubai

దుబాయ్ దీపావళి

Updated By ManamWed, 11/07/2018 - 05:11

imageదుబైలో మొట్టమొదటి సారి 10 రోజుల పాటు దీపావళి పండుగను అధికారికంగా జరుపుతున్నారు.  దుబైలోని మన కాన్సులేట్ జనరల్ సహకారంతో కని వినీ ఎరుగని రీతిలో అక్కడి ప్రభుత్వం దివాలీ జరుపుతుండడం విశేషం. దీంతో ఈ ఏడాది దీపావళి పండుగను తాము మాతృదేశానికి వె ళ్లి జరుపుకోలేకపోయామనే బాధ తప్పిందని ఇక్కడి భారతీయులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

గిన్నిస్ రికార్డ్

దుబై వాటర్ ఫ్రంట్ ప్రొమెనేడ్, దుబై ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆధ్వర్యంలో దీపావళి కాంతులీనింది. యూఏఈలో మెగా ఈవెంటుగా దీపావళి సెలబ్రేట్ చేస్తుండడంతో మనవారు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యేందుకు పెద్దఎత్తున దుబై వెళ్లారు. ఓవైపు బాలీవుడ్ హంగామా మరోవైపు దివాలీ స్వీట్లు.. ఇక టపాసుల సందడి మధ్య దుబై సరికొత్తగా కనిపిస్తోంది. ఈనెల ఒకటవ తేదీన ప్రారంభమైన వేడుకలు రాత్రయిందంటే అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి. ఈనెల 10వ తేదీ వరకూ సాగే ‘ఫైర్ క్రాకర్స్ షో’ అదరగొడుతోంది. అత్యధికులు ఎల్‌ఈడీ లైట్లు వెలిగించే కార్యక్రమంలో పాల్గొంటుండడంతో ఇది సరికొత్త గిన్నిస్ బుక్ ఆఫ్ వల్డ్ రికార్డ్ సృష్టించనుంది కూడా.  

image


దుబై పోలీస్ బ్యాండ్ మన జాతీయగీతం ఆలపించడం ఈ ఉత్సవాల్లో హైలైట్‌గా నిలిచింది. దుబై బేస్డ్‌గా ఉన్న ఎమిరేట్స్ విమాన సంస్థ కూడా ఈ ఉత్సవాల్లో పాలుపంచుకుని దివాలీకి కొత్త సొబగులు అద్దే ప్రయత్నం చేసి ప్రయాణికులను ఆశ్చర్యపరిచింది. భారతీయ సంప్రదాయ రుచులను పంచుతూ ఎమిరేట్స్ ఉద్యోగులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.

image


ఇక ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఈ వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతూ, ట్రెండింగ్ అవుతున్నాయి. భారత్-యుఏఈ మధ్య సాంస్కృతిక సంబంధాల మెరుగుదలతో పాటు టూరిజం అభివృద్ధికి కూడా దీపావళి అతిపెద్ద ఈవెంట్‌గా తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడికి వచ్చిన విదేశీ టూరిస్టులు ఓవైపు దుబై అందాలు, మరోవైపు ఆద్యంతం భారతీయతను ఆస్వాదిస్తూ, హ్యాపీగా షికార్లు చేస్తున్నారు. 
 

image

 

Related News