janareddy

జానారెడ్డితో ఆర్.కృష్ణయ్య భేటీ

Updated By ManamFri, 10/19/2018 - 16:15
  • కాంగ్రెస్‌లోకి కృష్ణయ్య...!

R.krishnaiah meets Janareddy

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డితో ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తాజా రాజకీయాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కాగా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా, ఎల్బీనగర్ నియోజకవర్గంలో విజయ ఢంకా మోగించిన కృష్ణయ్య, ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో టీడీపీకి అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ముందస్తు ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఆయన ఏ పార్టీకి మద్దతిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది.

బీసీల పెద్దన్నగా పేరుగాంచిన ర్యాగ కృష్ణయ్యకు రాజకీయ పార్టీలు ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. రా.. రా.. క్రిష్ణయ్య అంటూ స్వాగతం పలుకుతున్నాయి. మరోవైపు సొంత పార్టీ పెట్టాలని కార్యకర్తల ఒత్తిడి నడుమ ఎటూ తేల్చుకోలేక ఆయన సతమతమవు తున్నారు. పార్టీ పెడతానని ప్రకటించి నెలలు కావస్తున్నా.. ఆ దిశగా మరో అడుగు ముందుకు పడింది లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గతంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా మహాకూటమి నేతలతో ఇటీవల ఆర్ కృష్ణయ్య ఒకట్రెండు వేదికలను పంచుకున్నారు. మహాకూటమి సీట్ల పంపకాల్లో భాగంగా టీటీడీపీ ఇచ్చిన లిస్టులో కృష్ణయ్య పేరు లేదని సమాచారం. ఈ నేపథ్యంలో కృష్ణయ్యను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ఆ పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. దీంతో.. ఉత్తమ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు రామచంద్ర కుంతియాతో కృష్ణయ్య రహస్య చర్చలు జరిపారని రాజకీయ వర్గాల్లో కొత్త ప్రచారమొకటి ఊపందుకుంది. 

తొలుత పార్టీలో పెద్ద పదవి ఆఫర్ చేసినా, కృష్ణయ్య అంగీకరించలేదని.. ఈ పదవి సహా మహాకూటమి ప్రభుత్వం ఏర్పడితే ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు ఓ శాఖకు మంత్రిని చేస్తామని కుంతియా హామీ ఇచ్చారని ఆ ప్రచార సారాంశం. ఈ నెల 20న ఎన్నికల ప్రచారానికి వస్తున్న పార్టీ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో కృష్ణయ్య కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరోవైపు రాహుల్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి కృష్ణయ్య చేరడం ఖరారు అయినట్లేనని తెలుస్తోంది. ఆ వార్తలకు ఈ భేటీ ఊతం ఇస్తోంది.కేసీఆర్ పాలన మొత్తం వైఫల్యాలే...

Updated By ManamMon, 10/01/2018 - 14:57
janareddy

నల్గొండ : టీఆర్ఎస్‌పై ప్రజలు ఎదురు తిరిగే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ఆయన సోమవారం నల్గొండలో మాట్లాడుతూ...‘నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో మొత్తం వైఫల్యాలే. గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పించుకోవడానికే కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు.

తెలంగాణను అప్పుల రాష్ట్రంగా తయారు చేశాడు. టీఆర్ఎస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం ప్రజల్లోకి వెళుతున్నారు. రాష్ర్టంలో ఎంఐఎంతో, కేంద్రంలో మోదీతో కేసీఆర్ కుమ్మక్కయ్యాడు. టీఆర్ఎస్‌పై ప్రజలు ఎదురు తిరిగే సమయం ఆసన్నమైంది’ అని హెచ్చరించారు.కొడుకుతో కలిసి జానా రాహుల్‌‌తో భేటీ

Updated By ManamMon, 09/24/2018 - 14:43
janareddy met rahul gandhi

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీర్ సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కుటుంబానికి ఒకే సీటు అనే అంశంపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే తన కుమారుడు రఘువీర్‌కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌పై జానారెడ్డి మంతనాలు జరిపినట్లు సమాచారం. ‘ఒక కుటుంబం-ఒక సీటు’ నిబంధనకు మినహాయింపు ఇవ్వాలని రాహుల్‌ను కోరినట్లు భోగట్టా.

కాగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్ నేతలు తమతో పాటు తమ వారసులకు కూడా టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్‌తో పాటు పలువురు తమ వారసులు కూడా పోటీ చేస్తారని, వారికి టికెట్ కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో జానారెడ్డి...రాహుల్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.కేసీఆర్‌ నేనెప్పుడు చెప్పాను: జానారెడ్డి

Updated By ManamSat, 09/08/2018 - 13:24
  • కేసీఆర్ కు జానారెడ్డి బహిరంగ సవాల్

  • కేసీఆర్ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు..

  • నేను అన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

kcr-janareddy

హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే  గులాబీ కండువా కప్పుకుంటారన్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని... ఆయన ఓసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని హితవు పలికారు. 

గులాబీ జెండా పట్టుకుంటానని తానెప్పుడు అనలేదని, కావాలంటే అసెంబ్లీ రికార్డులు పరిశీలించుకోవచ్చని జానారెడ్డి సూచించారు. తాను ఆ మాట అన్నట్లు నిరూపిస్తే తాను 24 గంటల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఒక అబద్ధాన్ని నిజం చేయాలని అలవాటు కేసీఆర్‌కు ఉందని అన్నారు. కాగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ ప్రజ ఆశీర్వాద సభలో కేసీఆర్ నిన్న జానారెడ్డిపై ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.'తెలంగాణపై రాహుల్ దృష్టి పెట్టారు'

Updated By ManamSat, 08/11/2018 - 21:05

Rahul gandhi, Telangana state, Janareddy, Sonia gandhi హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రత్యేక దృష్టి పెట్టారని సీఎల్పీ నేత జానారెడ్డి చెప్పారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీనే అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అనైతిక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అణిచివేతలే కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఓయూలో రాహుల్ సభకు ఎందుకు అనుమతివ్వలేదో చెప్పాలన్నారు. రాహుల్ పర్యటనకు ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిందని జానారెడ్డి హితవు పలికారు. ఉత్తమ్, జానాకు డిపాజిట్లు రాకుండా చేస్తా!

Updated By ManamMon, 07/16/2018 - 22:10

MiryalaGuda MLA Nallamothu Bhaskar Rao Sensational Comments On Congress Leaders Uttam and Janareddy

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఇటీవల నల్గొండ జిల్లా పర్యటనలో మంత్రి జగదీశ్ రెడ్డి, టీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు స్పందించారు. "వచ్చేఎన్నికల్లో జగదీష్ రెడ్డి యాభై వేల మెజార్టీతో గెలుస్తారు. ఒక వేళ ఆయన గెలవకపోతే నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేస్తాము. కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలను ఓడించే బాధ్యతను పార్టీ నాకు అప్పగిస్తే వారికి డిపాజిట్ రాకుండా చేస్తాను. ఇచ్చిన మాట నెరవేర్చుకోకపోతే మెడలో చెప్పుల దండ వేసుకుని తిరుగుతాను" భాస్కర్ రావు సవాల్ విసిరారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి భాస్కర్ రావు ఒక్క మాట కూడా మాట్లాడకుండానే తన ప్రసంగాన్ని ముగించడం గమనార్హం.

చెప్పులు మెడలో వేసుకుని తిరుగుతా..!
"
రాజకీయాల్లో ఉండేందుకు ఏమైనా ఫీట్ల లెక్కుందా? ఈ మాటలు జ్ఞానం ఉన్న మనుషులు మాట్లాడేవేనా? జగదీష్ రెడ్డి గారికి డిపాజిట్ కూడా రాదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు! చాలెంజ్ చేసి చెబుతున్నా.. 50 వేల మెజార్టీ కన్నా తక్కువొస్తే నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరం రాజీనామాలు చేస్తాం. నల్గొండ పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ గెలుస్తుందా? జానా, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను మేము ఓడించకపోతే చెప్పులు మెడలో వేసుకుని బజారులో తిరుగుతాను" అని ఎమ్మెల్యే అన్నారు.

కాగా.. ఈ మధ్య టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు, మాటల యుద్ధం జరుగుతోంది. అయితే తాజాగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోని ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేయడంతో నేతలు ముక్కున వేలేసుకున్నారట. అంతేకాదు వామ్మో ఈయన మాములు స్పీడుగా లేడు కదా..? అంటూ టీఆర్ఎస్ నేతలు సైతం గుసగుసలాడుకుంటున్నారట.కత్తి మహేష్‌పై వ్యాఖ్యలపై స్పందించిన జానారెడ్డి

Updated By ManamWed, 07/04/2018 - 12:37

janareddy

హైదరాబాద్ : శ్రీరాముడిపై సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఘాటుగా స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ ‘గత రెండు, మూడు రోజులుగా టీవీ ఛానెల్స్‌లో కత్తి మహేష్ మాట్లాడిన విధానం, చేసిన అనుచిత వ్యాఖ్యలు సమాజంలో భావోద్వేగాలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయి.

అహంకారపూరితంగా మాట్లాడటం, సమాజంలో ఘర్షణలు తలెత్తేలా ఉన్నాయి. కత్తి మహేష్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆయన వ్యాఖ్యలను సమాజంలోని అన్ని వర్గాలు అసహ్యించుకుంటున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. మావోయిజం, టెర్రరిజం అరికట్టేందుకు ముందస్తు చర్యలు ఎలా తీసుకుంటారో...ఇలా  మాట్లాడేవారిపై అటువంటి చర్యలు తీసుకోవాలి. 

మీడియా కూడా సంస్కారహీనంగా మాట్లాడిన ఇటువంటి వాటిని చూపించొద్దు, రాయొద్దు.  జర్నలిజం ఇటువంటి వాటిని సెన్సార్ చేయాలి.  రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించినందుకు సంతోషిస్తున్నా, సర్కార్‌ను అభినందిస్తున్నా.’అని జానారెడ్డి అని అన్నారు. మరోవైపు రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కత్తి మహేష్‌పై పలువురి ఫిర్యాదులతో కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.వలిగొండ దుర్ఘటన విచారకరం: జానారెడ్డి

Updated By ManamSun, 06/24/2018 - 15:25

Janareddy, exgratia to valigonda, tractor accident victimsయాదాద్రి: యాదాద్రి జిల్లా వలిగొండలో ట్రాక్టర్ బోల్తా పడి 17 మంది మృతిచెందిన ఘటనపై తెలంగాణ శాసనసభ ప్రతిపక్ష నేత, ఎమ్మెల్యే కె. జానారెడ్డి స్పందించారు. ఈ సంఘటన హృదయ విచారకరమైనదన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డవారికి సరైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు. మృతులు, పేదవారు, వ్యవసాయ కూలీలైన వారి ప్రతీ కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని జానారెడ్డి డిమాండ్ చేశారు. కాగా, యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం, వేములకొండ గ్రామ సమీపంలో 30 మంది వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి 17 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. స్పీకర్‌, రేవంత్‌ మధ్య వాగ్వాదం

Updated By ManamMon, 06/11/2018 - 15:05

Congress leader Revanth reddy, Janareddy, Speaker Madhusudana charyహైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరిపై వేసిన అనర్హత వేటుపై వినతిపత్రం సమర్పించేందుకు సీఎల్పీ నేత జానారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం స్పీకర్ మధుసూదనాచారి వద్దకు వెళ్లింది. కోర్టు తీర్పు అమలు చేయాలని కోరేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్లిన సమయంలో స్పీకర్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని స్పీకర్‌ను రేవంత్ ప్రశ్నించారు. ‘పెన్ను దొంగలిస్తేనే ఉరిశిక్ష వేసినట్టు’ గా మీ వైఖరి ఉందంటూ స్పీకర్‌ను ఆయన గట్టిగా నిలదీశారు. రేవంత్ ఇలా మాట్లాడితే తాను వెళ్లిపోతానంటూ.. స్పీకర్ లేచారు. దాంతో రేవంత్‌ను జానారెడ్డి నిలువరించారు. స్పీకర్ మధుసూదనాచారిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సముదాయించారు. కోర్టు తీర్పును అమలు చేయాల్సిందే

Updated By ManamSat, 06/09/2018 - 02:45
  • ఎమ్మెల్యే సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్ నేతల డిమాండ్

  • 11వ తేదీన స్పీకర్‌ను కలవనున్న ఎమ్మెల్యేలు.. లేదంటే దశలవారీగా ఆందోళనలు చేస్తాం

  • నియోజకవర్గాల్లో ధర్నాలు, నిరసన ర్యాలీలు.. జానారెడ్డి నివాసంలో సీఎల్పీ సమావేశం

 janareddyహైదరాబాద్: ఇద్దరు శాసన సభ్యుల సభ్యత్వాలను రద్దు చేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పును అమలు చేయనందుకు నిరసనగా కాంగ్రెస్ దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎల్పీ నాయకుడు జానా రెడ్డి నివాసంలో శుక్రవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తవ్‌ుకుమార్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్  ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. కోర్టు తీర్పును గౌరవించని సీఎంకు ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. తీర్పు అమలు చేయాలని కోరడానికి ఈ నెల 11న ఉదయం 11 గంటలకు స్పీకర్‌ను కలిసి కోరనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. కోర్టు తీర్పును స్పీకర్ అమలు చేయకుంటే కోర్టు ధీక్కార పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల సభ్యత్వాలను రద్దు చేసే అధికారం స్పీకర్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మరోసారి కలిసి తీర్పును తక్షణమే అమలు చేసేందుకు  చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎలా ఖూనీ చేసిందో జాతీయ స్థాయిలోనూ వివరిస్తామన్నారు. రాష్ట్రపతిని కలిసి ఎమ్మెల్యేల బహిష్కరణ, కోర్టు తీర్పు, దాన్ని అమలు చేయకపోవడాన్ని వివరిస్తామని ఉత్తమ్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను, ఎమ్మెల్యేలను అన్యాయంగా బహిష్కరించిన విషయాలను, కోర్టు తీర్పును ఖాతరు చేయకపోవడాన్ని ప్రజలకు  కూడా వివరిస్తామన్నారు. దీని కోసం ఖమ్మం, అలంపూర్‌లో బహిరంగ సభలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  పార్టీ నాయకులతో 24 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తామన్నారు. సీఎల్పీ నాయకుడు జానారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని పునరుద్ధరించకుంటే, అందరం మూకుమ్మడి రాజీనామాలు చేసే అంశాన్ని కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని  చెప్పారు. 

కోమటిరెడ్డిపై జానా ఆగ్రహం
సీఎల్పీ సమావేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మూకుమ్మడి రాజీనామాల విషయంలో బహిరంగా తన పేరు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించినట్లు సమాచారం. ముఖ్యమైన అంశాల విషయంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడం సరికాదని, ఇలాంటి విషయాలు సమావేశాల్లో మాత్రమే చర్చించాలని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. 

Related News