EC

తెలంగాణలో భారీగా పోలింగ్ నమోదు

తెలంగాణలో భారీగా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే 75 శాతం మేర పోలింగ్ దాటినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి ఎన్నికల్లో ఎక్కువ పోలింగ్ నమోదైనట్టు సమాచారం.

టీఆర్ఎస్‌ను దోషిగా చూపెట్టాం: ఎల్ రమణ

ప్రజాకూటమి 70 నుంచి 80 సీట్లు గెలవబోతున్నట్టు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల గొంతుకను విన్పించేందుకే తాము కూటమిగా ఏర్పడ్డామని చెప్పారు. టీఆర్ఎస్‌ను దోషిగా చూపెట్టామన్నారు.

ఎన్నికల సంఘానికి సుహాసిని ఫిర్యాదు

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు పోలీసులు సహకరిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

'ఆ మాట వాస్తవమే.. కానీ నగదు కాదు'

కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ నివాసంలో గురువారం ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో జూపూడి ఇంట్లో..

'రేవంత్ అరెస్టు దుర్మార్గపు చర్య'

  • గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్.. జైపాల్ రెడ్డి విమర్శలు

హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గపు చర్యగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విమర్శించారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి బంద్ కాల్ ఇవ్వలేదన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తొలుత బంద్‌కు పిలుపునిచ్చినా వెంటనే రేవంత్ విరమించుకున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఇళ్ల తలుపులు పగులగొట్టి కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు.

హరీశ్‌రావుపై ఈసీ సిరీయస్...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ టీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. హరీశ్‌రావుపై ఎఫ్ఐఆర్ నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు