polavaram project

పోలవరం ఓ చరిత్ర: లోకేశ్

Updated By ManamWed, 09/12/2018 - 16:02

Polavaram Project, Lokesh Babu, Project prices, పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు ఓ చరిత్రని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు కట్టాలంటే తరాలు మారిపోవడం ఆనవాయితీని, కానీ, పోలవరాన్ని నాలుగేళ్లలో ఓ రూపునకు తెచ్చామన్నారు. కేంద్రం వేసే కొర్రీలన్నింటికీ సమాధానం చెబుతున్నామని లోకేశ్ తెలిపారు. నిర్మాణ జాప్యంతో ప్రాజెక్టు ధరలు పెరుగుతాయని లోకేశ్ చెప్పారు. 14న జలసిరికి హారతి

Updated By ManamTue, 09/11/2018 - 23:20
 • మూడు రోజుల పాటు పూజలు

 • పోలవరం పనులు పుంజుకోవాలి.. నాణ్యతకు పెద్ద పీట వేయాలి

 • అవుకు టన్నెల్ నుంచి నీళ్లిస్తాం.. అధికారులతో సీఎం చంద్రబాబు

polavaramఅమరావతి: ఈనెల 14, 15, 16 తేదీల్లో  జలసిరికి హారతి కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలను సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన వెల్లడించారు. ఈ నెల 14న రాయలసీమ, 15న ఉత్తరాంధ్ర లో, 16న రాజధాని ప్రాంతంలో జలసిరికి హారతిలో పాల్గొంటానని సీఎం స్పష్టం చేశారు. 74వ పోలవరం వర్చువల్ ఇన్‌స్పెక్షన్‌లో చంద్రబాబు మంగళవారం ఉదయం పాల్గొన్నారు. రాబోయే 3నెలలు పోలవరం నిర్మాణానికి అత్యంత కీలకమని, ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం కావాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 58.15 శాతం పనులు పూర్తయ్యాయని...గత వారం రోజుల్లో 0.25 శాతం పనులు మాత్రమే జరిగాయన్నారు. హెడ్ వర్క్స్ పనులు ఈ వారం 0.34 శాతం జరగ్గా, మెయిన్ డ్యామ్ పనులు 0.36 శాతం జరిగాయన్నారు. ఎక్సకవేషన్, కాంక్రీట్ పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ఎడమ ప్రధాన కాలువ పనులు 0.23 శాతం జరిగాయని, స్పిల్ వే ఛానల్ పనుల వేగం తగ్గిందన్నారు. కాంక్రీట్ పనుల వేగం కూడా తగ్గిందని..స్పిల్ వే ఛానల్, కాంక్రీట్ పనులు వేగం పెరగాలని కోరారు. కాంక్రీట్ పనులు జూన్‌లో 1,58,869క్యూ.మీ. గరిష్ఠంగా జరిగిందని.. రాబోయే నెలల్లో దానిని అధిగమించాలని సూచించారు. లక్షా 85వేల క్యూ.మీ కాంక్రీట్ పనులు జరగాలని లక్ష్యం విధించారు. వర్షాలు లేకపోయినా, ప్రాజెక్టు పనులు ఎందుకని ఊపందుకోలేదని అధికారులను ప్రశ్నించారు. 

మా మనవడు ఉత్సాహంగా ఉన్నాడు...
‘మా మనవడు కూడా పోలవరం చూడాలని ఉత్సాహంగా ఉన్నాడు. ‘ఏం చేస్తున్నావురా’ అని అడిగితే ‘పోలవరం కడుతున్నా’ అంటున్నాడు. పిల్లలకు కూడా పోలవరం కట్టాలన్న పట్టుదల ఉంది. భావితరాల భవిష్యత్తు అంతా పోలవరంపైనే ఆధారపడి ఉంది. అధికారులంతా పట్టుదలగా పనిచేయాలి. అడ్డంకులను అధిగమించాలి. ఒక చరిత్రలో మనమంతా భాగస్వాములం అనే స్ఫూర్తితో పనిచేయాలి. రేడియల్ గేట్ల పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలి. సిడబ్ల్యూసి నుంచి డిజైన్లకు ఎప్పటికప్పుడు ఆమోదం లభించేలా శ్రద్ధ చూపాలి. మొత్తం 27 డిజైన్లకుగాను సెప్టెంబర్‌లో 19, అక్టోబర్‌లో 8 డిజైన్లకు ఆమోదం వస్తుందని అంచనా. పోలవరం పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 

అవుకు టన్నెల్ ద్వారా నీళ్లు విడుదల..
అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే.. అవుకు టన్నెల్ నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులను కూడా సందర్శిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ఛీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర రావు, ఇతర అధికారులు  పాల్గొన్నారు.పోలవరం పనులకు అడ్డంకిగా గోదారి వరద

Updated By ManamTue, 08/21/2018 - 13:42
godavari flood water

ఏలూరు : గోదావరి వరద నీరు పోలవరం ప్రాజెక్ట పనులకు అడ్డంకిగా మారింది. ప్రాజెక్ట్ స్పిల్‌వేలోకి వరద నీరు ప్రవేశిస్తోంది.  సింగన్నపల్లి, గంగాలమ్మ కాలువ నుంచి వరద నీరు ముంపు గ్రామం చేగొండపల్లిని తాకి అక్కడ నుంచి ప్రాజెక్ట్‌లోకి వస్తోంది. దీంతో వరద నీరు లోపలికి రాకుండా నవయుగ కంపెనీ సిబ్బంది ఎత్తుగా మట్టి కట్టడం నిర్మిస్తున్నారు. అయితే గట్టు దాటితే ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుకునే అవకాశం ఉంది.

మరోవైపు జిల్లాలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పలువురు నేతలు పర్యటించారు. చింతలపూడి ఎమ్మెల్యే, మాజీమంత్రి పీతల సుజాత మంగళవారం జంగారెడ్డిగూడెంలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అలాగే ఎంపీ మురళీమోహన్, జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ తదితరులు నల్లజర్ల మండలంలో వరద బాధితుల్ని పరామర్శించారు. అయితే వరద నీటిలో చిక్కుకున్న తమకు సాయం అందటం లేదంటూ పలుచోట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘పోలవరం’ 57.41 శాతం పూర్తి 

Updated By ManamMon, 08/13/2018 - 23:54
 • 86 జలాశయాల్లో 380.68 టీఎంసీల నీరు

 • చెరువులు, భూగర్భాలలో 867 టీఎంసీలు 

 • సరైన ప్రణాళికలతో సమర్థ నీటి నిర్వహణ

 • అధికారులతో సీఎం చంద్రబాబునాయడు

imageఅమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 57.41 శాతం పనులు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వర్షాలు పడుతున్నా పనులు అనుకున్న మేర పూర్తిచేసే ప్రయత్నం జరుగుతున్నదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులతో పాటు పోలవరం ప్రాజెక్టు పనులపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రధాన డ్యామ్ పనులు 44.23 శాతం, ఎడమ కాలువ పనులు 62.74 శాతం, కుడి కాలువ పనులు 90 శాతం పూర్తయ్యాయని అన్నారు.

గేలరీ వాక్ కి స్పిల్‌వే సిద్ధం అవుతోందని అధికారులు వివరించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఇతర తవ్వకం పనులు 77 శాతం పూర్తయ్యాయని తెలియజేశారు. జెట్ గ్రౌటింగ్ పనులు 94.2 శాతం, కాంక్రీట్ పనులు 33.7 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్టును లక్షమంది సందర్శించినట్లు ప్రకటించారు.అన్ని జిల్లాల నుంచి ప్రాజెక్టు సందర్శనకు ప్రోత్సహించాలని, వారికి పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. పునరావాస పనులు వచ్చే డిసెంబర్‌కి పూర్తిచేయాలన్నారు. ఈ పనులకు చెల్లించే బిల్లులపై జీఎస్టీ గురించి కూడా చీఫ్ ఇంజనీర్ల బోర్డు సమావేశం అవుతోందన్నారు. ఈ అంశాలను కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ వనరుల కింద అందుబాటులో ఉన్న జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో అధికారులు వ్యూహాలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

మొత్తం రెండు కోట్ల ఎకరాలకు నీరందించాలన్నారు. ఇందుకోసం భూగర్భ జలాలు, జలాశయాలు, చెరువులలో ఉన్న నీటిని సమర్థ నిర్వహణ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.  వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో అధిక శ్రద్ధ పెట్టాలని చంద్రబాబు సూచించారు. మొత్తం రాష్ట్రంలో 86 జలాశయాల్లో 380.68 టీఎంసీ నీరు అందుబాటులో ఉందన్నారు. మిగిలిన చెరువులు, భూగర్భ జలాలు ఇతర వనరులు చూస్తే మొత్తం 867 టీఎంసీలు అందుబాటులో ఉందని ముఖ్యమంత్రి వివరించారు. రెండు కోట్ల ఎకరాలకు నీరు, తాగునీరు, పరిశ్రమలకు నీరు ఇవ్వడానికి ఎలా నీరు వినియోగించాలన్న అంశంపై  పరిశీలించాలన్నారు. మొత్తం వివిధ దశల్లో ఉన్న 25 సాగునీటి ప్రాజెక్టులను డిసెంబర్ కల్లా పూర్తిచేసే లక్ష్యంతో పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కాగా, 37,546 చిన్న తరహా సాగునీటి చెరువులు ఉన్నాయి, 10 లక్షల పంట కుంటలు నిర్మిస్తున్నాం, చెక్ డ్యామ్‌లు నిర్మించి అన్ని చెరువుల్లో నీటిని నిల్వ చేయాలన్నారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, సీఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ పాల్గొన్నారు. రాయపాటికి మరో షాక్

Updated By ManamSat, 08/11/2018 - 17:18
 • ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీపై సీజీఎస్‌టీ అధికారులు దాడులు

rayapati sambasiva rao

హైదరాబాద్ : టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు మరో షాక్ తగిలింది. రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ కార్యాలయంపై సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (సీజీఎస్‌టీ) అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని బేగంపేట్, కమలాపురికాలనీలోని కార్యాలయాల్లో అధికారులు నిన్న (శుక్రవారం) సోదాలు జరిపారు.  రాయపాటికి చెందిన ఆ సంస్థ పన్నులు ఎగవేత కారణంగానే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

కాగా సీజీఎస్‌టీ అధికారుల దాడులపై రాయపాటి సాంబశివరావు కూడా స్పందించారు. తమ కార్యాలయంపై జరిగిన దాడులు వాస్తవమేనని ఆయన అంగీకరించారు. తమ సిబ్బందికి జీఎస్టీ కట్టాలని ఎలాంటి సూచనలు లేనందున వారు దాన్ని విస్మరించారన్నారు. అయితే సీజీఎస్‌టీ అధికారులు ఆకస్మిక సోదాలతో వారు దిగ్ర్భాంతికి గురయ్యారన్నారు. మరోవైపు ఈ దాడులపై ట్రాన్స్‌ట్రాయ్ సిబ్బంది మాత్రం పెదవి విప్పడం లేదు.కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు!

Updated By ManamThu, 07/12/2018 - 14:55

YSRCP Leader criticized State and Central Govt Over Polavaram Project

హైదరాబాద్: వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. గురువారం మధ్యాహ్నం వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. పోలవరాన్ని వదిలేసి పట్టిసీమకు ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలు గుప్పించారు. ఈ నాలుగేళ్లలో బడ్జెట్‌ కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నాయని చెప్పుకొచ్చారు. కేంద్రంలో బీజేపీకి, టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తన స్వార్థం కోసం తీసుకున్నారని బొత్సా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీపీఆర్‌లో ఎందుకు వ్యత్యాసాలు వచ్చాయో చెప్పాలని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.

భూసేకరణ, నిర్మాణ వ్యయం ఎందుకు పెరిగిందో..? చెప్పాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఇవాళ కొత్తగా ప్రశ్నించడం ఆశ్చర్యకరంగా ఉందని ఆయన వివమర్శలు గుప్పించారు. పోలవరాన్ని నిర్మించే చిత్తశుద్ధి ఉందా..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బొత్స ప్రశ్నించారు. పదే పదే పోలవరం ప్రాజెక్టు అంచనాలు ఎందుకు మారుస్తున్నారో చెప్పాలి. గడ్కరీ పోలవరం పర్యటనతో చంద్రబాబు భయంభయంగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్‌లా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు" అని బొత్స చెప్పుకొచ్చారు. 

కాగా.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. బుధవారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో కలిసి పోలవరం పనులను పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన, అనంతరం మీడియాతో ఇరువురు మాట్లాడిన వ్యాఖ్యలపై బొత్సా సత్యనారాయణ కౌంటరిచ్చారు. అయితే ఈయన వ్యాఖ్యలకు టీడీపీ, బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.పోలవరంపై ఇంకా అభ్యంతరాలు, అనుమానాలు!

Updated By ManamWed, 07/11/2018 - 19:20

Central govt Still Arguments and Doubts On Polavaram project

పోలవరం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పోలవరం పనుల పరిశీలనకు ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ  సీఎం చంద్రబాబుతో కలిసి సుమారు అరగంటపాటు పనులను పరిశీలించారు. పనుల పురోగతిని కేంద్రమంత్రికి బాబు వివరించడం జరిగింది. కేంద్ర మంత్రి రాకతో ఓ వైపు టీడీపీ.. మరోవైపు బీజేపీ వేర్వేరుగా వేదికలను ఏర్పాటు చేసి ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2019 డిసెంబర్ నాటికి డెడ్‌లైన్ పెట్టుకున్నామని  టార్గెట్‌గా పెట్టుకొని పనులు చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి నాటికి కాంక్రీట్ పనుల్ని పూర్తిచేస్తామన్నారు. మెజార్టీ పనులన్నీ ఏప్రిల్ కల్లా పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. డీపీఆర్-2ను కూడా వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని కేంద్రాన్ని ఈ సందర్భంగా బాబు కోరారు. 2013 చట్టం ప్రకారం ఖర్చు అంచనాలు పెరిగాయన్నారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి రూ. 57,940 కోట్లు అవసరమని కేంద్రమంత్రికి బాబు వివరించారు. భూ సేకరణకు రూ. 33వేల కోట్లు అవసరమన్నారు. పెండింగ్‌లో ఉన్న నిధులన్ని విడుదల చేయాలని ఈ సందర్భంగా బాబు కేంద్ర మంత్రికి వివరించారు. కాగా బాబు మాట్లాడుతున్నంత సేపు గడ్కరీ తథేకంగా ఆయనవైపే చూడసాగారు.

నితిన్ గడ్కరీ మాట్లాడుతూ..
"
పోలవరం ఏపీకే కాదు దేశానికి కీలకమైన ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు రైతులకు కొత్త జీవితాన్నిస్తుంది. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. ప్రాజెక్టు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. పోలవరం ఏపీకే కాదు.. దేశానికి కీలకమైన ప్రాజెక్ట్. పనులు పూర్తి చేసేందుకు నిధుల్ని అడ్వాన్స్‌గా చెల్లించాలని సీఎం కోరారు. పోలవరం పూర్తి చేయడానికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారు. ప్రాజెక్ట్ ఏపీకి కొత్త జీవితాన్నిస్తుంది.

త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను కోరాము. భూసేకరణ, పరిహారం కోసం నిధులు చెల్లించాలంటే ఫైనాన్స్ కమిషన్ అనుమతి కావలి. పోలవరం భూసేకరణ ఖర్చు దాదాపు రెట్టింపు అయింది. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రాజెక్ట్ వేరు.. రాజకీయాలు వేరు. ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదు. ముందుగా గిరిజనులకు పరిహారం విషయాన్ని సెటిల్ చేయాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర అధికారులు మూడు రోజుల పాటు ఇక్కడే మకాం వేసి సమస్యలను పరిష్కరించాలని సూచించాను. పెరిగిన ప్రాజెక్టు అంచనాను ఆర్థిక శాఖకు పంపిస్తాము. నీటి సదుపాయం ఉంటే ఎంతమేలు జరుగుతుందో నాకు తెలుసు" అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

మొత్తానికి చూస్తే.. పోలవరం విషయంలో కేంద్రం ఎలాంటి హామీలివ్వకపోగా కొర్రీలు పెట్టడం గమనార్హం. తాజా డీపీఆర్‌పై అభ్యంతరాలు, అనుమానాలు కేంద్రం వ్యక్తం చేయడమేంటో అర్థం కాని పరిస్థితి. కనీసం అడ్వాన్స్ ఇచ్చేందుకు కూడా కేంద్రం ముందుకురాకపోవడం విచిత్రం. ఇవన్నీ అటుంచితే పునరావసంపై కూడా గడ్కరీ అనుమానాలు వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్యాకేజీ భారం పెరిగిందని సీఎం చంద్రబాబు కేంద్రానికి విన్నవించుకున్నా ఎలాంటి ఫలితం లేకపోయిందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. పెరిగిన ప్యాకేజీతో పాటు సేకరించిన భూమి కూడా పెరుగుతోందని గడ్కరీ.. సీఎం బాబునే నిలదీయడాన్ని పలువురు విశ్లేషకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.పోలవరం వద్ద బీజేపీ వర్సెస్ టీడీపీ

Updated By ManamWed, 07/11/2018 - 17:47

tdp leaders vs bjp leaders at polavaram project

పోలవరం: పోలవరం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు ఢిల్లీ నుంచి వచ్చారు. దీంతో ఆయనకు ఆహ్వానం పలికేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు విచ్చేశారు. అయితే ఇదే క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా పోలవరంకు రావడం.. ఆయన వెంట కొందరు మంత్రులు కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా.. గడ్కరీ వచ్చే హెలిప్యాడ్ వద్దకు అనుమతించాలని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే పాస్‌లు ఉన్నవారిని మాత్రమే పంపుతామని పోలీసులు చెప్పడంతో బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఈ క్రమంలో పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం ప్రాజెక్టు వద్దే పార్టీ నేతలు, నిర్వాసితులతో గడ్కరీ సమావేశం అవుతారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. గడవులోగా పోలవరాన్ని కేంద్రం నిర్మించి తీరుతుందన్నారు. కేంద్రం నిర్మిస్తున్న పోలవరంపై రాష్ట్రం పెత్తనం ఏంటి..? అని కన్నా వ్యాఖ్యానించారు. ప్రజలకు నిజాలు చెప్తున్నామని మాపై దాడులు చేస్తున్నారన్నారు. దీంతో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది. పోలవరంపై రాష్ట్రానికి కేంద్రం ఒక్కరూపాయి కూడా బాకీలేదన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు రాష్ట్రానికి ఏం సంబంధం లేదని ఈ సందర్భంగా కన్నా స్పష్టం చేశారు. కేంద్రం, కాంట్రాక్టర్ల మధ్య రాష్ట్ర ప్రభుత్వం సమన్వయకర్త మాత్రమేనన్నారు. కాగా తాజా వ్యవహారాలపై నేతలు, పార్టీ శ్రేణుల చర్చలో భాగంగా.. ఇటీవల జరిగిన దాడులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు కన్నా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే విషయం విన్న తర్వాత కేంద్ర మంత్రి నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో వేచిచూడాల్సిందే.పోల‌వరం కాంగ్రెస్‌ పార్టీ మానస పుత్రిక

Updated By ManamWed, 07/11/2018 - 16:31

Congress Leader Tulasi Reddy Fires On Chandrababu Naidu Over Polavaram Project

 • కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి పర్యటన మొక్కుబడి తంతు కాకూడదు

 • ప్రాజెక్టు నిర్మాణంపై మోడీ, బాబు సమాధానం చెప్పాలి

 • ఏపిసిసి ఉపాధ్యక్షులు  డాక్టర్‌ ఎన్‌.తుల‌సిరెడ్డి

అమరావతి: 2014లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చివుంటే ఈ పాటికి పూర్తయ్యేదని.. 2019 జూన్‌ చివరి నాటికైనా పూర్తి చేయాలని ఏపిసిసి ఉపాధ్యక్షులు  డాక్టర్‌ ఎన్‌.తుల‌సిరెడ్డి  చెప్పుకొచ్చారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర జనాభాపై భారం పడకుండా కేంద్ర నిధుల‌తో పూర్తి చేసి భూ నిర్వాసితుల‌కు న్యాయం చేయాలన్నారు. ఉన్నత ప్రమాణాల‌తో ప్రాజెక్టును నిర్మించాలన్నారు. ఏపీ ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు అమలు, పోల‌వరం నిర్మాణంపై  ప్రధాని, మోడి, ఏపి సీఎం చంద్రబాబు ప్రజల‌కు సమాధానం చెప్పాల‌ని ఆయన డిమాండ్‌ చేశారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి ప్రసాదించిన వరం అని అన్నారు. ఈ రోజు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరి పర్యటన మొక్కుబడి తంతు కాకూడన్నారు. 

"1981 మే 19న నాటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు. 2004 జూలైలో నాటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పరిపాలనలో మంజూరు చేశారు. 2004-2014 మధ్య కాంగ్రెస్ పాల‌నలో రాష్ట్ర బడ్జెట్‌ నుంచి రూ.5,136 కోట్లు ఖర్చు చేసి 32 శాతం పని పూర్తి చేయడమైంది. 25.10.2005న పర్యావరణ అనుమతి, 6.7.2006న వన్యమృగ సంరక్షణ అనుమతి, 2010 జూలైలో అటవీ అనుమతి, 4.1.2011న టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ అనుమతి తెప్పించడమైంది. జల‌యజ్ఞం క్రింద చేర్చడమైంది. విభజన చట్టంలో సెక్షన్‌ 90 ద్వారా జాతీయ ప్రాజెక్టుగా చట్టబద్దత కల్పించడమైంది. 20.2.2014న నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని ప్రకటించారు. 2014లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి వుంటే కేంద్ర ప్రభుత్వ నిధుల‌తో ఈ పాటికి పూర్తి అయ్యి వుండేది.

1998 నుంచి 2004 వరకు కేంద్రంలో ఆరుసంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ పోల‌వరంపై ఆరు పైస‌లు ఖర్చు పెట్టలేదు. 1983-2004 మధ్య 16 సంవత్సరాల‌ టిడిపి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ 16 పైస‌లు ఖర్చు పెట్టలేదు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్ర నిధుతో సత్వరం పూర్తి చేయాల‌ని చట్టం చెబుతున్నప్పటికీ ప్రాజెక్టు నత్తనడకన సాగుతుండటం శోచనీయం. భౌతికంగా 56 శాతం పని పూర్తయింది. ఇంకా 44 శాతం పనిమిగిలే వుంది. 
ఆర్థికంగా 26 శాతం ఖర్చు చేయడమైంది. ఇంకా 74 శాతం నిధులు విడుదల‌ కావాలి. రివైజుడు అంచనా విలువ రూ.54,113 కోట్లు ఇంత వరకు ఆమోదం పొందలేదు.


ఇప్పటి వరకు. రూ.13,798 కోట్లు ఖర్చు అయ్యింది. ఇంకా రూ.41,692 కోట్లు ఖర్చు చేయాలి.2019 జూన్‌ చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ నిధుల‌తో ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని, భూ నిర్వాసితుకు న్యాయం చేయాల‌ని, ఉన్నత ప్రమాణాల‌తో ప్రాజెక్టును నిర్మించాల‌ని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ డిమాండ్‌ చేస్తోంది" అని తులసిరెడ్డి చెప్పుకొచ్చారు.'చంద్రబాబుకు బాగా ముడుపులు అందాయి'

Updated By ManamSat, 02/17/2018 - 17:43

Jairam ramesh, Chandrababu naidu, Polavaram project, AP bifurcation న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బాగా ముడుపులు అందాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. విదేశాల్లో ఆయన ముడుపులు తీసుకున్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. విభజన చట్టాన్ని అమలు చేయడంలో బీజేపీ, టీడీపీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. నాలుగేళ్ల పరిపాలనలో టీడీపీ కేవలం పునాది రాళ్లకే పరిమితమయిందని చెప్పారు.

రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని తెలిపారు. విభజన హామీలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు ఇద్దరూ డ్రామాలాడుతున్నారని అన్నారు. ఏపీ విభజన శాస్త్రీయంగా జరగకుంటే పార్లమెంట్‌లో మెజార్టీ ఉన్న బీజేపీ..చట్టంలో మార్పులు చేయమనండి.. కాంగ్రెస్ మద్దతిస్తుందని చెప్పారు. 

Related News