N Chandrababu Naidu

మారతారా.. మార్చేయాలా?

Updated By ManamFri, 11/09/2018 - 01:40
 • ప్రకాశం ఎమ్మెల్యేలకు బాబు హెచ్చరిక

 • జిల్లా టీడీపీలో గ్రూపు రాజకీయాలు

 • ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి

 • నియోజకవర్గాల్లో మారని నేతల తీరు

 • బాబు హెచ్చరికలతోనైనా చెక్ పడేనా..?

N-Chandrababu-Naiduఒంగోలు: ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. తమలో తామే కలహించుకుంటూ పార్టీని నిలువునా భ్రష్టుపట్టిస్తూ కేడర్ రెండుగా చీలడానికి కారణమైన ఎమ్మెల్యేలకు ‘‘మీరు మారతారా? మీ సీట్లు మార్చేయనా’’ అంటూ సీఎం ఇచ్చిన వార్నింగ్ అధికార టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. గత కొంతకాలంగా టీడీపీలో నేతమ మధ్య సమన్వయం లేక, గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ఇటీవల రెండు రోజుల పాటు ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించారు. పర్చూరు నియోజకవర్గం మార్టూరు బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత ఒంగోలులో జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారిన కొండపి నియోజకవర్గ సమీక్షలో చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాలా వీరాంజనేయస్వామితో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఆయన సోదరుడు దామచర్ల సత్యకు సైతం సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. 

దామచర్లకు కూడా..
అదే సమయంలో నియోజకవర్గంలో మరో గ్రూపునకు నేతృత్వం వహిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ను సైతం అందరినీ కలుపుకొని సమన్వయంతో పని చెయ్యాలని హెచ్చరించినట్లు సమాచారం. గ్రూపు రాజకీయాలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని మండిపడ్డారంటున్నారు. కొండపిలో ఎమ్మెల్యే స్వామి, దామచర్ల సత్య ఓ వర్గంగానూ, దామచర్ల జనార్దన్, జూపూడి ప్రభాకరరావు మరో వర్గంగానూ ఉంటున్నారు. దామచర్ల కుటుంబం ఇలా రెండుగా విడిపోవడంతో బాబు సైతం అసహనం వ్యక్తం చేశారు. నాలుగైదు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించుకుని నాకు నివేదికలు ఇస్తారా ? మిమ్మల్ని కార్యకర్తల స్థానాల్లో కూర్చోపెట్టమంటారా అని కూడా బాబు కాస్త సీరియస్‌గానే వారిని ప్రశ్నించినట్టు సమాచారం.

కందులపై ఫిర్యాదు..
పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డిపై నియోజకవర్గానికి చెందిన కొందరు కీలక నాయకులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యకర్తలను ఆయన ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, కందుల కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువ అవుతోందని ఫిర్యాదు చేశారు. దీంతో.. వ్యవహారశైలి మార్చుకోవాలని కందులను చంద్రబాబు హెచ్చరించారు. యర్రగొండపాలెంలో ఎమ్మెల్యే డేవిడ్‌రాజునూ మార్చేయాల్సి ఉంటుందని చెప్పినట్లు సమాచారం. సంతనూతలపాడు ఇన్‌చార్జి విజయకుమార్‌ను మార్చేయాలని ఇప్పటికే నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ నాయకులు రోడ్డెక్కారు. విజయకుమార్ ఈ నియోజకవర్గ నేతలు చాలాసార్లు ముఖ్యమంత్రికి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదుచేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న బాబు.. ఎంపీపీలు, మండల స్థాయి నేతలు చెప్పినట్లు ఎందుకు వినడం లేదంటూ విజయకుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పర్యటనలో చంద్రబాబు ఇలా చాలామంది నేతలకు తలంటేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గ్రూపు తగాదాలను సహించే పరిస్థితి లేదని ఆయన కుండబద్దలు కొట్టేశారు. చాలామందికి హెచ్చరికలు ఇచ్చినా.. సీనియర్ రాజకీయ నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ప్రాధాన్యం ఇచ్చినట్లు అయ్యిందని టీడీపీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. చంద్రబాబు పర్యటనలో చేసిన హెచ్చరికల నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆ మర్నాడే పార్టీ కార్యాలయంలో కొండెపి టీడీపీ నేతలో భేటీ అయ్యారు.  సమస్యలుంటే తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే నియోజకవర్గ టీడీపీ నాయకులు ఎమ్మెల్యే స్వామి వ్యవహారశైలిపై అసంతృప్తితోనే ఉండటం గమనార్హం.


రెండు వర్గాలుగా చీలడంతో..
కొండపి నియోజకవర్గ టీడీపీ రెండేళ్లుగా జనార్దన్, స్వామి వర్గాలు గా రెండుగా చీలిపోయింది. ఓ వర్గం స్వామికి మద్దతు పలుకుతుంటే మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రెండేళ్లుగా పార్టీ పరిశీలకుల మ ద్యవర్తిత్వంతో ఎన్నోసార్లు ఈ సమస్యను పరిష్కరించేందుకు సమావేశవైునా ఈ వివాదం ఓ కొలిక్కి రాలేదు. చివరకు చంద్రబాబు వద్దే తాడో పేడో తేల్చుకోవాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి,. ఈ క్రమంలోనే మారతారా.. మార్చేయాలా అని ఈ ముగ్గురికీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే స్వామిని ఉద్దేశించి ‘నియోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపిస్తేనే తమరు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు తమరు ఒంటెద్దు పోకడలతో వారిని పక్కన పెడితే వారు మిమ్మల్ని కిందకు దింపేస్తారు’ అని హెచ్చరించడంతో స్వామి ముఖం మాడిపోయినట్టు తెలిసింది.మెప్మా, ఎస్‌హెచ్‌జీ సభ్యుల వితరణ

Updated By ManamSun, 09/30/2018 - 00:48
 • కేరళ వరద బాధితులకు 20 లక్షల సాయం

 • ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్ అందజేత

keralaఅమరావతి: వరదలతో అతాలకుతలమైన కేరలను ఆదుకునేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలోని ఉద్యోగులు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, మెప్మా సిబ్బంది ముందుకు వచ్చారు. ఎస్‌హెచ్‌జీ సభ్యులు తమ వంతు సామాజిక బాధ్యతగా ఒక్కొక్కరు ఒక రూపాయి చొప్పున, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలోని ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని సహాయంగా అందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పట్టణాల నుంచి రూ. 20,78,278 విరాళంగా ఇచ్చారు. ఉండవల్లిలో ప్రజాదర్బార్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలసి చెక్‌ను అందజేశారు. చంద్రబాబు ద్వారా ఈ విరాళాన్ని కేరళకు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, మెప్మా మిషన్ డైరెక్టర్ చిన్నతాతయ్య, సాధికార మిత్ర ఏఎండీ కృష్ణ కపర్ది తదితరులు పాల్గొన్నారు. కేరళ వరద బాధితులకు అర్థిక సాయం చేసినందుకు మెప్మా సిబ్బందిని చంద్రబాబు అభినందించారు. కాగా కేరళ వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ తరఫున భారీ సాయం చేసిన సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్‌తో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు విరాళం అందించారు.మాది సోదర బంధం: కుమారస్వామి

Updated By ManamFri, 08/31/2018 - 12:45
Chandrababu Naidu - HD Kumaraswamy

అమరావతి: తెలుగుదేశం పార్టీతో తనది సోదర బంధమని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘2019లో ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనేది ఎన్నికల తర్వాత ఆలోచిస్తాం. ముందుగా ప్రాంతీయ పార్టీలు అన్ని ఏకం కావాలి. ఎన్డీయేను ఓడించేందుకు అన్ని పార్టీలు కలిసి పనిచేయాలి. మేమంతా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నాం.’ అని అన్నారు.

Chandrababu Naidu met Karnataka CM HD Kumaraswamy in Vijayawadaకాగా చంద్రబాబు-కుమారస్వామి మధ్య జరిగిన సమావేశంలో  జాతీయ స్థాయిలో ఫ్రంట్‌ ఏర్పాటు, కర్ణాటకలో కాంగ్రెస్‌ నేతలతో ఇబ్బందులు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా4 వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న కుమారస్వామి నిన్న పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వంలో నెలకొన్న విభేదాలను రాహుల్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు సమాచారం.

దుర్గమ్మను దర్శించుకున్న కుమారస్వామి
చంద్రబాబుతో సమావేశం అనంతరం కుమాస్వామి విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశ ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా. శ్రావణ శుక్రవారం రోజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పనిలో పనిగా చంద్రబాబుపై ఆయన ప్రశంసలు కురిపించారు.

‘చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు. రాజధాని లేని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. అమరావతి నిర్మాణం సజావుగా జరగాలని కోరుకున్నా. 17 ప్రాంతీయ పార్టీలను ఒక వేదికపైకి తీసుకురావడంలో చంద్రబాబు సఫలం అయ్యారు. మా భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. చంద్రబాబు నాయకత్వంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించాను. నా వందరోజుల పాలన సంతృప్తికరంగా ఉంది’ అని అన్నారు.టీడీపీలో చేరేందుకు సిద్ధం: వాణీ విశ్వనాథ్

Updated By ManamTue, 11/07/2017 - 15:41
 • చంద్రబాబు నాయకత్వం అంటే ఎంతో ఇష్టం 
 • పార్టీలో చేరే తేదీపై త్వరలో నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం
 • చంద్రబాబు ఆదేశిస్తే.. రోజాపై వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా
 • పూర్తిస్థాయిలో టీడీపీ నేతగా పనిచేయాలన్నదే ఆకాంక్ష 

Actress Vani Viswanath, Roja Selvamani, Next General elections, N Chandrababu Naidu, join in TDPఅమరావతి: తెలుగు సినీపరిశ్రమలో పలు చిత్రాల్లో తనదైన నటనతో తెలుగు ప్రేక్షుకులను మెప్పించిన అందాల నటీ వాణీ విశ్వనాథ్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. అయితే తన రాజకీయ ప్రస్థానాన్ని ఎక్కడ నుంచి మొదలుపెట్టాలనే దానిపై ఆమె ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చేసింది. తెలుగు ప్రజలపై మక్కువతో అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీవైపే మెగ్గుచూపారు. అందులో భాగంగానే తాను టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరులోని నగరంపాలెం కేకేఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేనేత వస్త్రప్రదర్శన శాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు చేనేత వస్త్రాలను వినియోగించి చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాజకీయాలపై ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం అంటే తనకెంతో ఇష్టమన్నారు. ఆయన పరిపాలన తీరు చాలా బాగుంటుందని చెప్పారు. తెలుగువారి ఆదరాభిమానాల కారణంగానే తాను ఈ స్థాయికి వచ్చానని, వారికోసం ఏదో ఒకటి చేయాలనేది తన చాలా రోజులుగా అనుకుంటున్నానని చెప్పారు. అమరావతిలో ఈ రోజు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వాణీ విశ్వనాథ్ కలువనున్నారు. ఈ సందర్భంగా టీడీపీలో తన చేరికపై స్పష్టత ఇవ్వనున్నారు . పార్టీలో చేరే తేదీపై కూడా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. సోమవారం ఓ తెలుగు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాణి మాట్లాడుతూ.. వచ్చే ఏపీ ఎన్నికల్లో తాను పోటీచేయాలనుకుంటున్నట్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఆదేశిస్తే.. రోజాపై పోటీ చేస్తా..!
Actress Vani Viswanath (2576), Roja Selvamani (2577), Next General elections (2578), N Chandrababu Naidu (2579), join in TDP (2580)వైస్ఆర్‌సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే రోజాపై పోటీగా నిలబడాలనుకుంటున్నట్టు చెప్పారు. చంద్రబాబు నాయుడు ఒకవేళ రోజాపై పోటీగా ఎన్నికల్లో నిలబడాలనే ఆదేశిస్తే.. తప్పకుండా తాను రోజాకు పోటీగా ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. పుట్టకతో మలయాళీ అయినప్పటికీ తాను తెలుగు ప్రజలను ఎంతో అభిమానిస్తానని చెప్పారు. పూర్తిస్థాయిలో తాను టీడీపీ నేతగా రాష్ట్ర ప్రజలకు సేవలందించాలని నిర్ణయం తీసుకున్నట్టు వాణీ పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికోస్తే.. తెలుగు సినిమాల్లో చాలా అవకాశాలు వస్తున్నాయని, రెండు చిత్రాల్లో నటించే అవకాశం ఉందని వాణీ విశ్వనాథ్ తెలిపారు.

Related News