ntr

మెరిసిన మల్టీ స్టార్స్.. ముచ్చటైన దృశ్యం..!

Updated By ManamTue, 05/22/2018 - 14:25

Tollywood Multi stars, Mahesh babu, NTR, Ram charan Photo viral టాలీవుడ్ స్టార్ హీరోలను ఒకే తెరపై చూసే భాగ్యం అభిమానులకు చాలా అరుదుగా దొరుకుతుంది. అందులోనూ మల్టీ స్టార్స్ ఒకేచోట మెరిస్తే.. ఇక వారి అభిమానుల్లో ఆనందానికి అవధులే ఉండవు. తాజాగా టాలీవుడ్ స్టార్‌ హీరోలు ప్రిన్స్ మహేశ్‌బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవన్ స్టార్ రామ్‌చరణ్‌ కలిసి ఉన్న కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అభిమాన హీరోలు ముగ్గురు ఎంతో సన్నిహితంగా ఉన్న ఆ ఫొటోలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. ‘భరత్‌ అనే నేను’ చిత్రం విడుదలకు ముందు మహేశ్‌.. తారక్, రామ్ చరణ్‌లకు పార్టీ ఇచ్చాడు. ఉపాసన, నమ్రత కూడా ఈ పార్టీ వేడుకలో పాల్గొని సందడి చేశారు.

ఈ సందర్భంగా తారక్‌తో ఎంతో ఆత్మీయంగా ముచ్చటిస్తున్న ఫొటోను ఆదివారం చరణ్‌ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఈ ఫొటోకు సోదరా.. (ఈ సంవత్సరం అద్భుతంగా ముందుకు సాగాలి) అంటూ క్యాప్షన్ పెట్టి #NTR అనే హ్యాష్ ట్యాగ్‌తో తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు చరణ్. ముగ్గురు స్టార్‌ హీరోలు సరదాగా మాట్లాడుకుంటున్న ఫొటోను చూసి ఫిదా అయిన వారి అభిమానులంతా చూడచక్కగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, చరణ్‌, తారక్‌ హీరోలుగా ఎస్.ఎస్ రాజమౌళి (జక్కన్న) దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.‘అరవింద సమేత’లో తెలుగమ్మాయి..?

Updated By ManamTue, 05/22/2018 - 11:22

eesha ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపించనుంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో తెలుగమ్మాయి ఈశా రెబ్బా నటించనున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒక కీలక పాత్రలో ఆమె నటించనుందని, ఇంతవరకు ఈశా చేసిన పాత్రలకు భిన్నంగా ‘అరవింద సమేత’లో కారెక్టర్‌ ఉండబోతుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తుండగా.. థమన్ సంగీతాన్ని అందించనున్నాడు. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఎన్టీఆర్.. రెండు షేడ్స్

Updated By ManamMon, 05/21/2018 - 19:43

ntrయంగ్ టైగర్ ఎన్టీఆర్, ఉత్తరాది భామ పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ముందుగా ‘రాఘవ’, ‘అసామాన్యుడు’ అనే టైటిల్స్ వినిపించాయి. అయితే.. ‘అ’ సెంటిమెంట్ ఉన్న త్రివిక్రమ్ ‘అసామాన్యుడు’కే తన ఓటు వేస్తారని అనుకున్నారంతా. కాని కథానుసారం ‘అరవింద సమేత వీర రాఘవ’ బాగుంటుందని ఫిక్సై.. ఈ టైటిల్‌ను ఖరారు చేసార‌ని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు షేడ్స్‌లో కనిపించనున్నారని అంటున్నారు. అందులో (ఫస్ట్ హాఫ్‌లో) ఫ్యామిలీకి విలువనిచ్చే సాఫ్ట్ షేడ్ ఒక‌టి కాగా.. రెండోది ఆసక్తిని రేకెత్తించే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో.. రఫ్ అండ్ టఫ్‌గా విలన్‌ల పనిబట్టే షేడ్‌ అని తెలుస్తోంది. మరి ఈ రెండు షేడ్స్‌లో తారక్ ఏ విధంగా అలరించనున్నారో తెలియాలంటే ఈ ఏడాది దసరా వరకు ఆగాల్సిందే.‘అరవింద సమేత’ మోషన్ పోస్టర్

Updated By ManamSun, 05/20/2018 - 10:38

AS త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ విడుదల అవ్వగా.. తాజాగా మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో ఎన్టీఆర్, పూజా హెగ్డే గోడ మీద కూర్చోని మాట్లాడుతున్నట్లు ఉండగా.. ఈ ఇద్దరి జోడీ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇక ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.మొత్తానికి అభయ్ నా కళ్లు మూయడం ఆపేశాడు

Updated By ManamSun, 05/20/2018 - 09:59

Abhay  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆదివారం 35వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులతో పాటు అభిమానుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ సంవత్సరం కూడా తన తనయుడే ముందు విషెస్ చెప్పాడని సోషల్ మీడియాలో తెలిపాడు ఎన్టీఆర్.

‘‘మొత్తానికి అభయ్ నా కళ్లు మూయడం ఆపేశాడు. అభయ్ పెద్దవాడు అవుతున్నాడు. అయినా ఎప్పటిలాగే ఫస్ట్ విషెస్ వాడే చెప్పాడు’’ అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. అలాగే గత ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా తన కుమారుడిని భుజాలపై ఎక్కించుకున్న ఫొటోను షేర్ చేశాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో నటిస్తున్నాడు. దానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ శనివారం విడుదలైన విషయం తెలిసిందే.

 వీర రాఘ‌వ‌గా ఎన్టీఆర్‌.. ఫ‌స్ట్ లుక్‌

Updated By ManamSat, 05/19/2018 - 16:56

ntrయంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ఏస్ డైరెక్ట‌ర్‌ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ సంగీత‌మందిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ద‌స‌రా కానుకగా ఈ సినిమా తెర‌పైకి రానుంది. ఇదిలాఉంటే.. ఎన్టీఆర్ పుట్టిన రోజు (మే 20) సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఈ రోజు (శ‌నివారం) విడుద‌ల చేశారు. చిత్రానికి టైటిల్‌గా 'అరవింద స‌మేత‌..' అని ఫిక్స్ చేశారు. ట్యాగ్ లైన్‌గా 'వీర రాఘ‌వ'ని ఉంచారు. రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం కోసం తార‌క్ సిక్స్ ప్యాక్ లుక్‌లో క‌నిపించ‌నున్నారని ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. ఫ‌స్ట్‌లుక్‌లో అదే లుక్‌తో ఉండే ఫొటోను చిత్ర బృందం విడుద‌ల చేయ‌డం విశేషం.'అరవింద స‌మేత రాఘ‌వ' అంటున్న ఎన్టీఆర్‌

Updated By ManamSat, 05/19/2018 - 14:24

ntrయంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ సంగీత‌మందిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ద‌స‌రా కానుకగా ఈ సినిమా తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఇంకా టైటిల్ క‌న్‌ఫ‌ర్మ్ కాని ఈ సినిమాకి సంబంధించి.. కొన్ని టైటిల్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇప్ప‌టికే 'అసామాన్యుడు' ఎక్కువ‌గా వినిపించ‌గా.. తాజాగా 'రా రా కుమారా', 'అష్ట‌ల‌క్ష్మి టు అమ్ములు', 'గౌత‌మ్ సిద్ధార్థ వ‌యా అమ్ములు' వంటి పేర్లు తోడ‌య్యాయి. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే.. ఈ సినిమాకి 'అరవింద స‌మేత రాఘ‌వ' అనే పేరు దాదాపుగా ఖ‌రార‌య్యింద‌ని తెలుస్తోంది. ఈ టైటిల్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఆదివారం ఎన్టీఆర్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని ఈ రోజు (శ‌నివారం) సాయంత్రం 4.50 గంట‌ల‌కు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కానుంది.ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్..?

Updated By ManamFri, 05/18/2018 - 08:27

ntr మరో రెండు రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. ఈ నేపథ్యంలో తన అభిమానులకు గిఫ్ట్ ఇవ్వాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తుండగా.. పుట్టినరోజు నాడు ఆ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

కాగా ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రేజీ కాంబినేషన్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలే ఉన్నాయి.


 ఎన్టీఆర్, ఏఎన్నార్‌కు షాకిచ్చిన సావిత్రి

Updated By ManamThu, 05/17/2018 - 21:55

savitriతెలుగు సినీ పరిశ్రమకు మ‌హాన‌టులు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళ లాంటివారు. అటువంటి మహానటులు సైతం వారి సినిమాల్లో అల‌నాటి మేటి న‌టి సావిత్రి ఉండాల‌ని నిర్మాతలను డిమాండ్ చేసారంటే.. సావిత్రి నటనా ప్రతిభ ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ ఇద్ద‌రు హీరోల‌తో సమానంగా అప్పట్లో పారితోషికాన్ని అందుకున్న లేడీ సూపర్ స్టార్ మహానటి సావిత్రి.. రెండు సందర్భాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లను సైతం ఆశ్చర్యానికి గురి చేశార‌ట‌.

కాస్త ఆ వివరాల్లోకి వెళితే.. 1977 సంవ‌త్స‌రంలో ఆంధ్రప్రదేశ్‌లోని దివిసీమలో జరిగిన ప్రకృతి వైపరీత్యానికి  తెలుగు సినీ పరిశ్రమ స్పందించింది. ఆ వైపరీత్యానికి బాధితులైన వారిని ఆదుకోవడానికి ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో పాటు సావిత్రి కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ కొంతమంది అభిమానులు ఎన్టీఆర్‌ను పూలమాలతో సత్కరిస్తే.. ఆ మాలను వేలం పాటలో రూ.10,000కు సొంతం చేసుకున్నారు సావిత్రి. దానికి షాక్ అయిన‌ ఎన్టీఆర్ “కేవ‌లం ఒక పూలదండ‌ కోసం డబ్బులను ఎందుక‌లా దుబారాగా ఖర్చు చేస్తావ్?” అని హెచ్చరించారట. దానికి బదులుగా ఆమె, “ఇది అందరికీ మాలే కాని నాకు మాత్రం వెల కట్టలేని వస్తువు. అదీగాక ఈ రూపంలో ఈ బాధితులకు సాయం చేసినందుకు ఆనందంగా కూడా ఉంది” అని బదులిచ్చారట.

మరొక సందర్భంలో చెన్నైలో ఒక ఇంటిని కట్టుకున్న ఏఎన్నార్, తన పాత ఇంటిని అమ్మకానికి పెడితే.. ఒక బ్లాంక్ చెక్కుతో ఆ ఇంటి విలువను రాసుకోమని చెప్పారట సావిత్రి. దీంతో.. ఏఎన్నార్ షాక్‌కు గుర‌వ‌డ‌మే కాకుండా త‌న‌ ఈగో కూడా హ‌ర్ట‌య్యింద‌ట‌. తన అభిమాన నటుడి ఇంటిని వెల కట్టడం తన వల్ల కాదన్న‌దే ఆమె భావన కావ‌డంతో.. అలా చేశార‌ట‌. ఆమె ఉద్దేశం ఏదైనా.. ఆమె ఎంచుకున్న మార్గం మాత్రం సరైనది కాదని అప్పట్లో కొంతమంది అభిప్రాయ‌ప‌డ్డారు.

ఏదేమైనా.. ఈ రెండు సందర్భాలను ‘మహానటి’ సినిమాలో చూపించి ఉంటే మ‌రింత‌ బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు.ఎన్టీఆర్‌, వైజ‌యంతి మూవీస్.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

Updated By ManamWed, 05/16/2018 - 15:51

ntrయంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి విజ‌యంగా నిలిచిన చిత్రం 'స్టూడెంట్ నెం.1'. ఆ సినిమాని వైజ‌యంతి మూవీస్ సంస్థ‌కి అనుబంధ సంస్థ అయిన స్వ‌ప్న సినిమా నిర్మించింది. ఆ త‌రువాత తార‌క్‌, వైజ‌యంతి మూవీస్ కాంబినేష‌న్‌లో 'కంత్రి', 'శ‌క్తి' చిత్రాలు వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే మ‌రో సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. 'రాజా రాణి', 'పోలీస్‌', 'అదిరింది' వంటి త‌మిళ అనువాద చిత్రాల‌తో తెలుగు వారికి చేరువైన యువ ద‌ర్శ‌కుడు అట్లీ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని తెలిసింది. 2019 ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవ‌కాశ‌ముంది. వైజ‌యంతి మూవీస్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఆ చిత్రం తెర‌పైకి రానుంది. అక్టోబ‌ర్ నుంచి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ పట్టాలెక్క‌నుంది. రామ్ చ‌ర‌ణ్ ఇందులో మ‌రో హీరోగా న‌టించ‌నున్నారు.
Related News