Ys Jagan mohan reddy

నాయీ బ్రాహ్మణులకు వైఎస్ జగన్ హామీ

Updated By ManamTue, 06/19/2018 - 15:46
  • చంద్రబాబు తీరును ఖండించిన ప్రతిపక్ష నేత

  • న్యాయమైన డిమాండ్లపై ఒక సీఎం స్పందించాల్సిన తీరు ఇదేనా?

  • ప్రతీ దేవాలయ బోర్డులో నాయీ బ్రాహ్మణుడికి చోటు

  • అధికారంలోకి రాగానే చిరునవ్వులు కనిపించేలా వేతనం

హైదరాబాద్ ‌: నాయీ బ్రాహ్మణుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తమ గోడు చెప్పుకోవడానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను చంద్రబాబు బెదిరించడం గర్హనీయమని ఆయన అన్నారు.

ys jagan

వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి రాగానే నాయీ బ్రాహ్మణుల మోముపై చిరునవ్వులు కనిపించేలా వేతనం ఇస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జగన్‌ ట్విట్టర్‌లో స్పందించారు. టీటీడీ సహా ప్రతి దేవాలయ బోర్డులో నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రజల్లో వేవ్ జగన్‌కు అనుకూలంగా ఉంది కానీ..

Updated By ManamMon, 06/18/2018 - 13:31

undavalli అమరావతి: ప్రజల్లో వేవ్ జగన్‌కు అనుకూలంగా ఉందని, ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అయితే ప్రజల్లో ఉన్న వేవ్‌ను మార్చగలిగే సామర్థ్యం చంద్రబాబుకు ఉందని ఆయన చెప్పారు. జగన్‌కు సరైన ఎన్నికల బృందం లేదని ఉండవల్లి పేర్కొన్నారు. 

ఇక పవన్ కల్యాణ్ బలంపై ఇప్పుడే అంచనా వేయలేమని ఆయన వెల్లడించారు. తెలంగాణ నుంచి ఏడు మండలాలను విలీనం చేసినప్పుడే చంద్రబాబు హోదా కోసం పట్టుబట్టాల్సిందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో కొనసాగుతానని, అయితే ఏ పార్టీలో చేరనని, తనకు వైసీపీతో పాటు టీడీపీలోనూ మిత్రులున్నారని తెలిపారు. స్టీల్‌ఫ్లాంట్‌పై సీఎం రమేశ్ దీక్షకు మద్దతు కోరితే ఇస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు.192వ రోజు జగన్ యాత్ర సాగనుందిలా..

Updated By ManamMon, 06/18/2018 - 09:23
jagan

రాజమహేంద్రవరం: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర 192వ రోజుకు చేరింది. యాత్రలో భాగంగా సోమవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో గంటి గ్రామ శివారు నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు జగన్. అక్కడి నుంచి గంటి పెడపూడి, ఉచులవారి పేట, ఉడిముడి, బెల్లంపూడి మీదుగా ఎర్రం శెట్టివారి పాలెం, బోడపాటి వారి పాలెం మీదుగా పీ గన్నవరం వరకు సాగనుంది. సాయంత్రం గన్నవరంలో జగన్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.సింగిల్‌గానే పోటీ చేస్తాం

Updated By ManamSat, 06/16/2018 - 14:44

Botsa అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా టీడీపీ, బీజేపీలు ఏపీకి నష్టం కలిగించాయని తెలిపిన ఆయన, ఇప్పుడేమో చంద్రబాబు చాకచక్యంగా మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎప్పటికీ కృషి చేసేది వైసీపీనేనని తెలిపారు.

సీఎం చంద్రబాబు నాయుడు దోపిడీని పుస్తక రూపంలో తెచ్చి, దేశంలో అన్ని పార్టీల నేతలకు అందజేస్తామని ఆయన అన్నారు. టీడీపీలా ట్యాంపరింగ్ చేసుకునే సంస్కృతి తమకు లేదని, బహిరంగంగానే ప్రజల ముందుకు వస్తామని, అన్ని విషయాలు చెబుతామని పేర్కొన్నారు. బు్గన రాజేంద్రప్రసాద్ ఢిల్లీకి వెళ్తే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అయినా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ సీఎం పక్కనే ఉంటారని, మహారాష్ట్రకు చెందిన మంత్రి భార్య టీటీడీలో మెంబర్‌గా అవకాశమిచ్చారని.. వీటన్నింటిని చూస్తే ఎవరు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారో ప్రజలకు తెలుస్తుందని చెప్పారు. రాజమండ్రిలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం

Updated By ManamTue, 06/12/2018 - 18:10
  • రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జిపై భారీ జనసందోహం

  • పెద్దఎత్తున తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు  

Grand welcome, Ys jagan mohan reddy, Rajamandry road co railway bridgeరాజమహేంద్రవరం: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. జగన్‌ కొవ్వూరు నుంచి బయలుదేరి రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జికి చేరుకున్నారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం జిల్లాలోకి ప్రవేశించగానే అక్కడి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు, మద్దతుదారులు తరలిరావడంతో రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి జనసంద్రమైంది.

జగన్ పాదయాత్ర సందర్భంగా రోడ్‌ కం రైల్వే బ్రిడ్జిని వైఎస్సార్‌సీపీ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో అందంగా తీర్చిదిద్దారు. బ్రిడ్జి కింద గోదావరిలో ఒక వైపున పార్టీ జెండాలతో అలంకరించిన 600 పడవలు జగన్‌కు స్వాగతం పలికాయి. బ్రిడ్జికి మరోవైపున రెయిలింగ్‌కు 7 అడుగుల ఎత్తు, 3.5 కిలోమీటర్ల మేర భారీ పార్టీ జెండాను కట్టి జననేత కు సాధారంగా స్వాగతం పలికారు. 
Grand welcome, Ys jagan mohan reddy, Rajamandry road co railway bridge

Grand welcome, Ys jagan mohan reddy, Rajamandry road co railway bridge


గోదావరికి జగన్ ప్రత్యేక పూజలు

Updated By ManamTue, 06/12/2018 - 12:32

Jagan  తూర్పు గోదావరి: ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరిలో ముగిసి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కొవ్వూరులోని ప్రముఖ పుణ్య క్షేత్రం గోష్పాద క్షేత్రానికి చేరుకున్న జగన్, అక్కడ గోదావరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గోష్పాద క్షేత్రం వేద పండితులు, వేద మంత్రాలు చదువుతుండగా జగన్ గోదావరమ్మకు హారతినిచ్చారు. ఆపై ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జగన్‌తో పాటు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, జిల్లా నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.జగన్ పాదయాత్రలో మరో మైలురాయి

Updated By ManamMon, 06/11/2018 - 11:54

Jagan పశ్చిమగోదావరి: ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు  ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో మైలు రాయిని చేరింది. ఇప్పటివరకు జగన్ 2300కిలోమీటర్ల మేర నడిచారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని నందమూరు క్రాస్ రోడ్డు వద్ద ఈ మైలురాయిని చేరారు జగన్. ఈ సందర్భంగా అక్కడ గుర్తుగా ఓ మొక్కను నాటారు. కాగా వైఎస్ జగన్ పాదయాత్ర సోమవారం 186వ రోజుకు చేరగా, కొవ్వూరు నియోజకవర్గంలో ఆయన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

 వైఎస్ జగన్ ఫ్లెక్సీలో బాలకృష్ణ ఫొటో..!

Updated By ManamMon, 06/11/2018 - 11:10

MLA Balakrishna Photo, Ys jagan mohan reddy, YSRCP Flex bannerఏలూరు: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 186వ రోజు ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం కొవ్వూరులో కొనసాగుతోంది. అయితే వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా వైసీపీ కార్యకర్త ఒకరు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశమైంది. మల్లవరానికి చెందిన ఓ కార్యకర్త జగన్‌ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ ఏ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. ఆ ఫ్లెక్సీలో జననేత జగన్‌ ఫొటో‌తో పాటు నందమూరి బాలకృష్ణ ఫొటో కూడా ప్రత్యక్షమైంది. అదే మార్గంలో పాదయాత్రకు వచ్చిన వైసీపీ కార్యకర్తలంతా ఆ ఫ్లెక్సీ చూసి షాక్ అయ్యారు. అయితే ఈ ఫ్లెక్సీ ఏర్పాటుచేసింది వైసీపీ కార్యకర్త. అందులోనూ అతడు నట సింహం బాలకృష్ణకు వీరా అభిమాని కావడంతో ఇలా ఈ ఫ్లెక్సీని పెట్టినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. జగన్‌తో సీఎం రమేశ్ కుమ్మక్కు: టీడీపీ నేత

Updated By ManamSun, 06/10/2018 - 09:16

ramesh కడప: టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ జగన్‌తో కుమ్మక్కయ్యారని  ప్రొద్దుటూరు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీతో సంబంధాలు ఏర్పాటు చేసుకొన్న రమేశ్ కడప జిల్లా టీడీపీ పార్టీలో ముఠాలు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఎంపీ సీఎం రమేశ్ వైఖరి వల్ల జిల్లాలో తెదేపా నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి తలెత్తిందని వరదరాజులు ఆందోళన వ్యక్తం చేశారు. 

పార్టీ ఇచ్చిన రాజ్యసభ పదవిని అనుభవిస్తూ జిల్లా పార్టీలో గొడవలు సృష్టించటమేమిటని ఆయన ప్రశ్నించారు. సీఎం రమేష్‌ పంచాయతీ బోర్డుకు ఎక్కువ, మండలానికి తక్కువ అని ఎద్దేవా చేశారు. ఆయనకు నేరుగా ఎన్నికల్లో పాల్గొని గెలిచే సత్తా ఉందా అంటూ వరదరాజులు ప్రశ్నించారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులు ఆగిపోతే.. వై.ఎస్‌. హయాంలో జగన్‌కు ముడుపులిచ్చి రమేష్‌ బిల్లులు చేయించుకున్నారని పేర్కొన్నారు. వర్షంలోనూ సాగిన జగన్ యాత్ర

Updated By ManamWed, 06/06/2018 - 22:58
  • ఉత్సాహంగా పాల్గొన్న వైసీపీ శ్రేణులు.. సమస్యలు చెప్పుకొన్న ఆటో డ్రైవర్లు

  • ఖాకీ చొక్కొ వేసుకుని ఆటో నడిపిన జగన్

jaganఉండ్రాజవరం: ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా కొనసాగుతోంది. 182వ రోజు పాదయాత్రను ఆయన బుధవారం తణుకు శివారు నుంచి ప్రారంభించారు. వర్షం నిరంతరాయంగా కురుస్తున్నా లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాదయాత్రను చేపట్టారు. ప్రజలు సైతం వర్షంలో తడుస్తూనే ఆయనను కలవడానికి భారీగా తరలి వచ్చారు. పాదయాత్ర ఉండ్రాజవరంలోకి ప్రవేశించగానే వైఎస్ జగన్‌ను అక్కడి ఆటో కార్మికులు కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఖాకీ చొక్కా ధరించి ఆటో నడిపారు. దీంతో ఆటో కార్మికుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏడాదికి 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తానని వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ హామీ పట్ల ఆటోకార్మికులు హర్షం వ్యక్తం చేశారు. అక్కడే ఓ చిన్నారికి వైఎస్ జగన్ అక్షరాభ్యాసం చేయించారు. కామాయపాలెంలో వైఎస్ జగన్‌ను పొగాకు రైతులు కలిసి మద్దతు ధర లేదని ఆవేదన చెందారు. తమ నివాసాలు కూల్చి రోడ్డును పడేశారని పైడిపర్రు నిర్వాసిత మహిళలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తణుకు చేనేత కార్మికులు వైఎస్ జగన్‌ను విన్నవించుకున్నారు. నూలుపై 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరారు. చేనేత కార్మికుల సమస్యల పట్ల వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు.

Related News