Gali Janardhan Reddy

గాలి జనార్ధన్ రెడ్డికి జ్యుడీషియల్ కస్టడీ

Updated By ManamSun, 11/11/2018 - 16:53
  • 14 రోజల రిమాండ్ విధించిన కోర్టు 

  • లంచం కేసులో అరెస్టు అయిన మైనింగ్ దిగ్గజం 

Gali Janardhan Reddy, Judicial Custody, Court, CCB branch, Bribery caseబెంగళూరు: అంబెడింగ్ కంపెనీ లంచం కేసులో మైనింగ్ దిగ్గజం, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు. నవంబర్ 24 వరకు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు విధించింది. రూ. 18 కోట్ల లంచం కేసులో గాలి జనార్ధన్‌ను సీసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు గాలి జనార్థన్‌ను విచారించిన సీసీబీ క్రైం బ్రాంచ్.. కోర్టులో హాజరుపర్చింది. దాంతో గాలికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సోమవారం గాలి జనార్ధన్‌కు బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. గాలి జనార్దన రెడ్డి మిస్సింగ్!

Updated By ManamThu, 11/08/2018 - 15:57
  • రూ. 18 కోట్ల లంచం ఆరోపణలు

  • మంత్రిగా ఉన్న సమయం నాటి కేసు

  • కనిపించడం లేదన్న పోలీసులు

Gali Janardhan Reddy absconding, say police

బెంగళూరు : బళ్లారి మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి అదృశ్యమయ్యారు. రూ. 18 కోట్ల లంచం కేసులో ఆయనను విచారించాలనుకున్న బెంగళూరు పోలీసులు.. ఆయన కనపడటం లేదని తెలిపారు. కర్ణాటకలో అత్యంత శక్తిమంతమైన వ్యాపారవేత్త, నాయకుడు అయిన జనార్దన రెడ్డిపై పలు అవినీతి ఆరోపణలున్నాయి. ఇప్పటికే మూడేళ్ల పాటు జైల్లో ఉండి, 2015లో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు.

రూ. 18 కోట్ల లంచం కేసులో ఆయనను క్రైం బ్రాంచి పోలీసులు విచారించాలనుకున్నారు. అవినీతి కేసు నుంచి తనను బయట పడేయడానికి మంత్రిగా ఉన్న సమయంలో గాలి జనార్దనరెడ్డి రూ. 18 కోట్ల లంచం డిమాండు చేశారని, ఆ మొత్తాన్ని ఆయన సన్నిహితుల్లో ఒకరికి చెల్లించానని యాంబియెంట్ గ్రూప్ అధినేత ఆరోపించారు. వందలాది మంది పెట్టుబడిదారులను రూ. 600 కోట్ల మేర మోసం చేసినట్లు యాంబియెంట్ గ్రూప్‌పై ఆరోపణలున్నాయి. 

గాలి జనార్దనరెడ్డి ఒక హోటల్లో తనను కలిసి సాయం చేస్తానన్నారని ఆ గ్రూప్ అధినేత సయ్యద్ అహ్మద్ ఫరీద్ తెలిపారు. దాంతో తాను రమేశ్ కొఠారీ అనే బులియన్ వ్యాపారికి రూ. 18 కోట్లు ఇవ్వగా, ఆయన మరో నగల వర్తకుడికి ఇచ్చి, 57 కిలోల బంగారంగా దాన్ని మార్చారన్నారు. ఆ బంగారాన్ని జనార్దనరెడ్డికి సన్నిహిత అనుచరుడైన అలీఖాన్‌కు అందించామని తెలిపారు. దాంతో ఇప్పుడు అలీఖాన్, జనార్దనరెడ్డిలను విచారించాలని చూస్తుండగా ఇద్దరూ కనపడటం లేదని బెంగళూరు పోలీసు కమిషనర్ టి.సునీల్‌కుమార్ తెలిపారు. 

గత సంవత్సరం ఒకవైపు దేశమంతా పెద్దనోట్ల రద్దు అనంతరం కరెన్సీ దొరక్క కష్టాలు పడుతుంటే అదే సమయంలో గాలి జనార్దనరెడ్డి తన కూతురి వివాహాన్ని అంగరంగవైభవంగా చేశారు. ఇపుడు ఆయన అదృశ్యం కావడంపై ఆయన సన్నిహితుడు, బీజేపీ ఎమ్మెల్యే బి. శ్రీరాములును అడగ్గా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తనకు దీనిపై ఎలాంటి సమాచారం లేదని అన్నారు. అలాగే ఎవరూ చట్టానికి అతీతులు కారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ‘గాలి’కి మంచి రోజులు.. మొత్తం ఏడు టికెట్లు

Updated By ManamTue, 04/24/2018 - 08:57

gali బెంగళూరు: గాలి సోదరులకు రాజకీయాల్లో మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఇనుప గనుల కుంభకోణంలో ఇరుక్కొని బీజేపీకి దూరమైన గాలి, అతని సన్నిహితులకు తాజాగా ఆ పార్టీ ఏడు టికెట్లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జనార్దనరెడ్డి అన్న కరుణాకర్‌ రెడ్డి దావణగరె జిల్లా హరప్పనహళ్లి నుంచి, తమ్ముడు సోమశేఖర్‌రెడ్డి బళ్లారి సిటీ నుంచి పోటీ చేయనున్నారు. జనార్దనరెడ్డి దావణగరె జిల్లా మొలకల్మూరు నుంచి మొత్తం ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. అలాగే గాలి సన్నిహితుడు శ్రీరాములు మేనల్లుడు సురేశ్‌బాబు కంపలి నుంచి మరోసారి గెలిచేందుకు ఉరకలు వేస్తున్నారు. ఇక శ్రీరాములు మేనమామ సన్న పకీరప్ప బళ్లారి రూరల్‌ నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తం జనార్దనరెడ్డి, శ్రీరాములు కుటుంబాల నుంచి ఏడుగురికి ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్లు దొరికాయి. వీరందరి విజయం ఖాయమని భావిస్తున్నారు.శాండిల్‌వుడ్‌పై 'గాలి'

Updated By ManamSat, 11/04/2017 - 12:27

gaali janardhanగాలి జనార్ధన్ రెడ్డి.. ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటకలలో పరిచయం అక్కరలేని పేరు. మైనింగ్ దిగ్గజంగా పేరొందిన రాజకీయ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డి. ఇటీవల జరిగిన కన్నడ రాజ్యోత్సవాల సందర్భంగా తాను పాడిన మ్యూజిక్ ఆల్బమ్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు తన గాలి సినీ ఇండస్ట్రీ మీద పడింది. అందుకే కన్నడ రాజ్యోత్సవాల వేదికను తన కుమారుడు భవిష్యత్తుకి ప్లాట్ ఫాంగా ఎంచుకుని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. గాలి కిరీటి రెడ్డిని త్వరలో శాండల్ వుడ్ కి పరిచయం చేయబోతున్నట్టుగా ప్రకటించేశారు. వచ్చే ఏడాది మార్చిలో కిరీటి హీరోగా సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నదని సమాచారం. ప్రస్తుతం ఈ హీరో.. యాక్టింగ్ స్కిల్ల్స్ ని మెరుగు పరచుకునే పనిలో ఉన్నాడు. తన సోదరి వివాహ వేడుకల‌లో కిరీటి చేసిన డాన్స్ పెర్ ఫార్మెన్స్ కి అక్కడికి వచ్చిన అహూతులంతా ఫిదా అయిపోయారు. సంచలనాలకు మారు పేరైన గాలి జనార్ధన్ రెడ్డి, కొడుకు లాంచింగ్ సినిమాని ఎంత గ్రాండ్ గా తీస్తారో? ఎలాంటి సినిమాని కొడుకుకి, ప్రేక్షకులకి గిఫ్ట్‌ గా ఇస్తారో వేచి చూడాలి.గాలి జనార్ధన్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

Updated By ManamFri, 11/03/2017 - 14:25
  • లండన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి నిరాకరణ
  • పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం

Gali Janardhan Reddy, Hyderabad High court, Mining case, plea to travel to Londonహైదరాబాద్‌: గాలి జనార్ధన్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. లండన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ నెల 5 నుంచి 20 వరకు లండన్‌లో పర్యటించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. అంతేకాక, సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న తన పాస్‌పోర్టును ఇప్పించాలని కోరారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆయన్ను లండన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. మైనింగ్ కేసు విచారణ కారణంగా అనుమతి ఇవ్వలేమని కోర్టు తేల్చిచెప్పింది. గాలి జనార్థన్ రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చింది.

Related News