jhanvi kapoor

‘ధడక్’ ట్రైలర్.. అదరగొట్టిన జాన్వీ కపూర్

Updated By ManamMon, 06/11/2018 - 12:29

Dhadak శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కత్తర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ధడక్’. మరాఠీలో విజయవంతమైన ‘సైరాట్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కగా, ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. అందులో ఇషాన్, జాన్వీ కపూర్ జోడీ తమ అభినయంతో ఆకట్టుకున్నారు. ఇక ఈ చిత్రానికి శశాంక్ కైతాన్ దర్శకత్వం వహించగా.. అజయ్ అతుల్ సంగీతం అందించారు. కరణ్ జోహార్, హైరో జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

 సారీ జాన్వీ: అర్జున్ కపూర్

Updated By ManamMon, 06/11/2018 - 10:32

arjun  అతిలోక సుందరి శ్రీదేవి మరణం తరువాత ఆమె పిల్లలైన జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు అన్నయ్య బాధ్యతలను తీసుకున్నాడు బోని కపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్. ఈ క్రమంలో వారికి మద్దతుగా ఉంటూ వారిపై విమర్శలు చేసే వారిని తిప్పి కొడుతున్నాడు. అయితే తాజాగా ఓ విషయంలో జాన్వీకి సారీ చెప్పాడు అర్జున్. 

విషయంలోకి వెళ్తే.. జాన్వీ హీరోయిన్‌గా నటించిన ‘దఢక్’ చిత్ర ట్రైలర్ సోమవారం విడుదల కానుంది. అయితే షూటింగ్‌లో బిజీగా ఉండటం వలన అర్జున్ ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో జాన్వీని ఉద్దేశించి ఓ పోస్ట్ చేశాడు అర్జున్. ‘‘ఈ రోజు నువ్వు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఈ రోజు నువ్వు నటించిన దఢక్ చిత్ర ట్రైలర్ విడుదల అవ్వబోతోంది. ఈ సమయంలో నేను ముంబైలో లేనందుకు సారీ. కానీ ఎప్పటికీ నీ పక్క నేనుంటా, బాధపడకు. నువ్వు కష్టపడుతూ, నిజాయితీగా  పనిచేస్తే ఈ పరిశ్రమ చాలా అద్భుతంగా ఉంటుంది. అందరి అభిప్రాయాల, సలహాలు తీసుకుంటూ నీకు నచ్చినట్లుగా ఒక మార్గాన్ని ఏర్పరుచుకో. ఈ పరిశ్రమలోని పిచ్చికి నువ్వు రెడీగా ఉన్నావని అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. నా స్నేహితులైన కరణ్ జోహార్, శశాంక్‌లు నిన్ను, ఇషాన్‌ను మోడ్రన్ రోమియో, జూలియట్‌గా చూపిస్తారని భావిస్తున్నా’’ అంటూ కామెంట్ పెట్టి వారి ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశాడు.జాన్వీ మూవీ ట్రైలర్ వచ్చేస్తోంది

Updated By ManamSun, 06/10/2018 - 13:56

dhadak అతిలోక సుందరి శ్రీదేవి జాన్వీ కపూర్ ‘ధడక్’ అనే చిత్రంలో నటిస్తోంది. షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కత్తర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరాఠీ సూపర్ హిట్ చిత్రం ‘సైరాట్’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. కాగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఈ నెల 11న మధ్యాహ్నం విడుదల కానుంది. దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చింది. ఇక జూలై 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 నా చెల్లిని ఏమైనా అన్నారో

Updated By ManamWed, 06/06/2018 - 10:41

Arjun Kapoor అతిలోక సుందరి శ్రీదేవి మరణం తరువాత జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు బోని కపూర్. ఆయనతో పాటు బోని మొదటి భార్య పిల్లలైన అర్జున్, అన్షులా కపూర్‌లు కూడా జాన్వీ, ఖుషీలను సొంత చెళ్లెల్లా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా జాన్వీపై కామెంట్ చేసిన ఓ దిన పత్రికపై సెటైర్ వేశారు హీరో అర్జున్ కపూర్.

ఇటీవల జాన్వీ కపూర్ ఓ పొట్టి డ్రెస్‌ను వేసుకోగా, దాన్ని పోస్ట్ చేస్తూ ఆమె ఏదో వేసుకోవడం మరిచిపోయిందనే శీర్షికతో ప్రచురించారు. ఇది అర్జున్ కంట పడటంతో సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఒక పెద్ద పత్రిక  విమర్శకులకు ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి వార్తలను తగ్గించడం వలన విమర్శకులను తగ్గించిన వారు అవుతారు అంటూ కామెంట్ పెట్టాడు. మొత్తానికి తన చెల్లిలిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు అంటూ చెప్పకనే చెప్పాడు అర్జున్. కాగా దఢక్ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.శ్రీ‌దేవి పాత్ర‌లో మాధురీ.. జాన్వీ ధ్రువీక‌ర‌ణ‌

Updated By ManamMon, 03/19/2018 - 20:24

srideviక‌ర‌ణ్ జోహార్ నిర్మాణంలో ‘షిద్ధత్’ పేరుతో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. దివంగ‌త న‌టి శ్రీ‌దేవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించాల్సిన ఈ సినిమాలో.. మ‌రో సీనియ‌ర్ న‌టి మాధురీ దీక్షిత్ న‌టిస్తోంద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. తాజాగా ఈ విష‌యాన్ని శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ధృవీక‌రించారు. “మా అమ్మ హృదయానికి దగ్గరగా ఉన్న ఈ సినిమాని అభిషేక్ వర్మన్ తెరకెక్కిస్తున్నారు. ఇంత మంచి చిత్రంలో నటిస్తున్నందుకు మాధురిగారికి నేను, ఖుషి, మా నాన్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అంటూ పోస్ట్ చేసారు జాన్వి. మాధురి, సంజయ్ దత్ దంపతులుగా నటిస్తున్న ఈ సినిమాలో.. అలియా భట్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, ఆదిత్యరాయ్ క‌పూర్ ఇత‌ర‌ ముఖ్యపాత్రలు పోషించనున్నారు.'ధడక్' షూటింగ్‌కు జాన్వీ కపూర్

Updated By ManamFri, 03/09/2018 - 09:25

jhanvi kapoor శ్రీదేవి మరణంతో ఢీలా పడ్డ ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్, ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు ముందు "నువ్వు గర్వపడేలా చేస్తానని" అంటూ శ్రీదేవికి సోషల్ మీడియా వేదికగా మాటిచ్చిన జాన్వీ.. ఇప్పుడు ఆ మాటను నెరవేర్చుకునే క్రమంలో పడింది. ఇందులో భాగంగా తాజాగా తాను హీరోయిన్‌గా నటిస్తున్న 'ధడక్' షూటింగ్‌లో పాల్గొంది జాన్వీ.

గురువారం జాన్వీ దఢక్ షూటింగ్‌లో పాల్గొనగా.. హీరో ఇషాన్, జాన్వీలపై కొన్ని సన్నివేశాలను దర్శకుడు శశాంక్ కైతాన్ తెరకెక్కించాడు. తన వలన సినిమా విడుదల విషయంలో జాప్యం జరగకూడదని భావించిన జాన్వీ.. బాధను దిగమింగుకొని మరీ షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరాఠీ చిత్రం సైరాట్ రీమేక్‌గా తెరకెక్కుతున్ 'ధడక్ జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.అమ్మ లేని మొదటి పుట్టినరోజు ఇలా

Updated By ManamWed, 03/07/2018 - 11:22

Jhanvi Kapoor తన తల్లి శ్రీదేవి ఆకస్మిక మరణం బాధ నుంచి నిదానంగా బయటకు వస్తుంది కుమార్తె జాన్వీ కపూర్. ఈ నేపథ్యంలో తన తల్లి లేకుండా జరిగిన మొదటి పుట్టినరోజును జాన్వీ సాదాసీదాగా జరుపుకొంది. ముంబైలోని ఓ వృద్ధాశ్రమంలో జాన్వీ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. శ్రీదేవి కూడా తన బర్త్‌డే వేడుకలను వృద్ధాశ్రమంలో కానీ అనాధాశ్రమంలో కానీ జరపుకునేది. ఇప్పుడు అదే బాటలో జాన్వీ కూడా నడుస్తోంది. ఇక ఈ వేడుకల తరువాత సోదరి సోనమ్ కపూర్ నివాసంలో తన స్నేహితులందరితో జాన్వీ పుట్టినరోజును జరుపుకుంది. ఈ వేడుకల్లో బోని కపూర్ మొదటి భార్య కుమార్తె అన్షులా కూడా ఉండటం మరో విశేషం. ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ ప్రస్తుతం సైరాట్ హిందీ రీమేక్‌లో నటిస్తోంది. ఇందులో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ హీరోగా కనిపించనున్నాడు. జూలైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Kapoor


నా చెల్లెళ్లను అలా అనకండి

Updated By ManamTue, 03/06/2018 - 08:55

Anshula శ్రీదేవి హఠాన్మరణంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆమె కూతుళ్లను ఆ బాధ నుంచి బయటకు తెచ్చేందుకు పలువురు సెలబ్రిటీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అర్జున్ కపూర్‌కు మద్దతుగా ఉన్న కొందరు సోషల్ మీడియా వేదికగా జాన్వీ, ఖుషీలపై అభ్యంతర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి అండంగా నిలబడింది బోని కపూర్ మొదటి భార్య కుమార్తె అన్షులా కపూర్.

"నా చెల్లెళ్లను అసభ్యపదజాలంతో దూషించకండి. వీటిని ఖండిస్తూ నేను కొన్ని కామెంట్లను డిలీట్ చేస్తున్నాను. నా సోదరుడు, నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్. కానీ నా చెల్లెళ్లను మాత్రం అలా అనకండి" అంటూ ఆమె ఓ పోస్ట్‌ను పెట్టింది. దీనిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే శ్రీదేవి బతికున్నంతకాలం బోని కపూర్ మొదటి పిల్లలైన అన్షులా, అర్జున్ కపూర్ ఆమెకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.అమ్మా.. గుండెలు బరువెక్కుతున్నాయి 

Updated By ManamSat, 03/03/2018 - 15:53

Jhanvi Kapoor, Sridevi అతిలోక సుందరి శ్రీదేవి ఆకస్మిక మరణం అభిమానులందరీ చేత కండతడి పెట్టించింది. ముఖ్యంగా తన కుమార్తె జాన్వీని హీరోయిన్‌గా చూడాలని ఆశపడిన శ్రీదేవి.. ఆ కోరిక నెరవేరకుండానే తనువు చాలించడం ఆమె ఇంట్లో వారికి కోలుకోలేని దెబ్బగా మిగిలింది. ఈ నేపథ్యంలో తన తల్లిపై ప్రేమను తెలుపుతూ జాన్వీ కపూర్  రాసిన లేఖ ఇప్పుడు అందరి చేత కంటతడి పెట్టిస్తోంది.

"నువ్వు లేకుండా ఇకపై నేను ఎలా జీవించాలి అన్న ప్రశ్న నా గుండెను బరువెక్కిస్తోంది. ఇంత శూన్యంలోనూ నేను నిన్ను ఫీల్ అవుతున్నా. తట్టుకోలేని బాధ, నొప్పి నుంచి నువ్వు నన్ను కాపాడుతున్నావని భావిస్తున్నా. నేను కళ్లు మూసుకున్న ప్రతిసారి నీతో గడిపిన మంచి విషయాలే గుర్తొస్తున్నాయి. అది నీ వల్లనే అని నాకు తెలుసు. మా అందరి జీవితానికి నువ్వొక వరం. నువ్వు చాలా మంచిదానికి, మంచి హృదయంగల దానికి, ప్రేమించే మనసున్న దానికి. అందుకే ఆ దేవుడు నిన్ను తన దగ్గరకు తీసుకెళ్లాడు. కానీ ఇప్పటికీ నువ్వు మా దగ్గరే ఉన్నావు.

నా స్నేహితులందరూ నేను చాలా సంతోషంగా ఉంటానని చెప్పేవారు. ఇదంతా నీ వల్లనే అని ఇప్పుడు అర్థం అవుతుంది. ఇప్పటి నుంచి నేను ఎప్పుడూ డల్‌గా ఉండను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నావు. నా ఆత్మలో నువ్వు ఉన్నావు. నా మంచి స్నేహితురాలివి నువ్వు. నీ జీవితాంతం మాకు ఇవ్వడమే చేశావు. ఇప్పుడు అదే విధంగా నిన్ను తిరిగి సంతోషపెట్టాలని అనుకుంటున్నా. నిన్ను గర్వపడేలా చేయడమే నా కోరిక. ఏదో ఒకరోజు నన్ను చూసి గర్వపడేలా చేస్తా. ఈ విషయంలో నీకు నేను మాటిస్తున్నా. ఎందుకంటే నువ్వు ఇంకా నాతోనే, నా పక్కనే ఉన్నావని భావిస్తున్నా. నువ్వు నాలో, ఖుషీలో, నాన్నలో ఉన్నావు. మేము ముందుకు సాగడానికి ఇది చాలు. ఐ లవ్ యు, మై ఎవ్రీథింగ్" అని పోస్ట్ చేసింది. దీనికి తోడు మీ తల్లిదండ్రులను ఎప్పుడూ ప్రేమించండి అంటూ జాన్వీ కపూర్ సందేశాన్ని ఇచ్చింది.

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

 కూతురితో శ్రీ‌దేవి సీక్వెల్ చేస్తోందా?

Updated By ManamWed, 11/01/2017 - 16:00

sridevi, jhanviహిందీ తెర‌పై అనిల్ క‌పూర్‌, శ్రీ‌దేవి అంద‌మైన జంట మాత్ర‌మే కాదు హిట్ పెయిర్ కూడా. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రాలు బాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని అల‌రించాయి. వాటిలో 'మిస్ట‌ర్ ఇండియా' (1987) ఒక‌టి. ఇందులో 'హ‌వా హ‌వాయి' అంటూ శ్రీ‌దేవి చేసిన సంద‌డిని హిందీ ప్రేక్ష‌కులు ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. శేఖ‌ర్ క‌పూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందంటూ కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ చిత్రంలో త‌ల్లీకూతుళ్లైన శ్రీ‌దేవి, జాన్వీ క‌పూర్ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని తెలిసింది. మొద‌టి భాగంలో క‌థానాయిక‌గా న‌టించిన శ్రీ‌దేవి ఇందులో అతిథి పాత్రలో మెర‌వ‌నుంద‌ని.. జాన్వీ క‌థానాయిక పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని బీ టౌన్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. క‌థానాయ‌కుడుగా ఎవ‌రు న‌టిస్తారు అన్న‌దానిపై క్లారిటీ రాలేదు. 'మామ్‌'కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ర‌వి ఉద్య‌వ‌ర్ ఈ సీక్వెల్‌ని టేకాఫ్ చేస్తార‌ని స‌మాచార‌మ్‌.

Related News