high court

సంపత్, కోమటిరెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్

Updated By ManamTue, 06/12/2018 - 20:27

Court contempt petition, Sampath kumar, Komati reddy venkatareddy, High court, Telangana assembly speaker హైదరాబాద్‌: ఎమ్మెల్యేలుగా తమను కొనసాగించాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడం లేదని కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల్లో అసెంబ్లీలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఇద్దరి శాసనసభ సభ్యత్వాన్ని రద్దుచేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తమ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై గతంలో కోమటిరెడ్డి, సంపత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేస్తూ వారిద్దరినీ పదవీకాలం పూర్తయ్యే వరకూ యథాతథంగా ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది.

హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర శాసనసభా వ్యవహారాల కార్యదర్శి ఇద్దరూ పరిగణించలేదు. ఎమ్మెల్యేలుగా కాకుండా, రావాల్సిన మర్యాద, జీతభత్యాలను కూడా తమకు ఇవ్వడంలేదంటూ వారిద్దరిపైనా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: అజారుద్దీన్

Updated By ManamTue, 06/12/2018 - 17:02

High court, judgement on HCA president post, Mohammad Azharuddinహైదరాబాద్‌:  హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా మాజీ ఎంపీ వివేక్ ఎన్నికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ చెప్పారు. అంబుడ్స్ మెన్ వివేక్‌పై తీసుకున్న నిర్ణయం సరైందేనని హైకోర్టు తీర్పుతో మరోసారి రుజువైందని అన్నారు. వివేక్ ప్యానల్ ఎంపికలో అవకతవకలు జరిగాయని, ఈ విషయమంలో తాను మొదటి నుంచి పోరాటం చేస్తున్నానని అజారుద్దీన్ చెప్పారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు ఈరోజు న్యాయం జరిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ తదుపరి కార్యాచరణపై సర్వసభ్య సమావేశంలో నిర్ణయిస్తామని అజారుద్దీన్ పేర్కొన్నారు. 
Read Article: హైకోర్టులో మాజీ ఎంపీ వివేక్‌కు ఎదురుదెబ్బకోమటిరెడ్డి, సంపత్‌లకు ఊరట

Updated By ManamMon, 06/04/2018 - 13:26

Komati Reddy, Sampath హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి, సంపత్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. వారిద్దరి సభ్యత్వ రద్దుపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చూస్తూ 12మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అప్పీలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే కోమటి రెడ్డి.. ఈ తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు అని అన్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయనకు రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై నమ్మకం లేదని పేర్కొన్నారు. ప్రజల్ని మోసం చేసినట్లు, న్యాయస్థానాలను మోసం చేస్తున్నారని, ఇప్పటికైనా కోర్టు తీర్పును అమలు చేస్తూ తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.కోర్టుల్లో లైంగిక వ్యతిరేక వేధింపుల ప్యానెళ్లు

Updated By ManamFri, 05/11/2018 - 19:15

Supreme Court, High court, anti-sexual harassment panels, all courts న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టుల్లో లైంగిక వేధింపుల వ్యతిరేక ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని శుక్రవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది. 2013 చట్టాన్ని అనుసరించి రెండు నెలల్లో వీటిని అందుబాటులోకి తేవాలని పేర్కొంది. వారం రోజుల్లో దేశ రాజధానిలోని హైకోర్టుతో సహా అన్ని కింది స్థాయి కోర్టుల్లో వీటిని ఏర్పాటు చేయాలని ఢిల్లీ హైకోర్టు సీజేఐకు సూచించింది. ఢిల్లీలోని తీస్‌ హజారీ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో ఓ మహిళా న్యాయవాది, సహా కొందరు సమ్మె చేస్తున్న సమయంలో న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు కొందరు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆమె సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇరువర్గాలు ఒకరి మీద ఒకరు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్నారు. సీజేఐ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ఖన్విల్కర్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను‌ పరిశీలించింది.

ఈ వివాదాన్ని ఇద్దరు స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని పిటిషన్ దాఖలు చేసిన మహిళా న్యాయవాదికి, బార్ కౌన్సిల్ నాయకులకు సూచించింది. ఇరువర్గాల న్యాయవాదుల ఫిర్యాదుల మీద విచారణ జరపాలని ఢిల్లీ పోలీసు క్రైం బ్రాంచ్‌ను కోరింది. విచారణ నిమిత్తం ఈ కేసును ఢిల్లీలోని పటియాల హౌస్‌ జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. న్యాయపరిపాలనలో జోక్యం చేసుకోవద్దని బార్ సభ్యులకు సూచించింది. మహిళలు పనిచేసే చోట లైంగిక వేధింపులను నివారించడానికి 2013లో కేంద్రం చట్టం చేసింది. వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి మహిళలు పనిచేసే ప్రతి చోట ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని సూచించింది.చివరి అవకాశం ఇవ్వరా?

Updated By ManamFri, 04/27/2018 - 03:06
 • టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ప్రశ్నల వర్షం.. హైకోర్టులో కోమటిరెడ్డి.. సంపత్‌ల కేసు

 • 12 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్.. వాళ్లంతా ప్రత్యక్ష సాక్షులన్న న్యాయవాది

 • సభలో కోమటిరెడ్డి హెడ్‌ఫోన్ విసిరితే.. సంపత్‌ను ఎందుకు బహిష్కరించినట్లు

 • లాయర్‌ను ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం.. కేసు విచారణ శుక్రవారానికి వాయిదా

high courtహైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌ల బహిష్కరణ  చెల్లదని ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 12 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఆ ఇద్దరి శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ తెలంగాణ అసెంబ్లీ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ చెల్లదని ఇటీవల సింగిల్ జడ్జి సంచలన తీర్పు చెప్పిన విషయం విదితమే. ఈ కేసులో తమను కూడా ప్రతివాదులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రవీందర్ రెడ్డి, మరో 11 మంది హైకోర్టును ఆశ్రయించారు. శాసనసభ నుంచి తమను బహిష్కరించడం చెల్లదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ దాఖలు చేసిన ప్రధాన కేసులో ఈ 12 మంది ఎమ్మెల్యేలు ప్రతివాదులు కానందున వీరు సింగిల్ జడ్జి తీర్పును తప్పుపడుతూ అప్పీల్ చేసేందుకు హైకోర్టు అనుమతి పొందాలి. అందులో భాగంగా ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ విజయలక్ష్మిలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదికి హైకోర్టు పలు ప్రశ్నలు వేసింది. ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తే వారికి రక్షణ ఎక్కడ ఉన్నట్లు? ప్రతిపక్ష సభ్యుల ఉంటే ఇబ్బందిగా ఉందని బహిష్కరించేస్తారా? కోమటిరెడ్డి మైక్ విసిరారని బహిష్కరిస్తే.. మరి సంపత్‌ను ఎందుకు బహిష్కరించారు? వీటికి వివరణ ఇవ్వండి.. అని బెంచ్ పేర్కొంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదిస్తూ.. అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ప్రసంగ సమయంలో కోమటిరెడ్డి, సంపత్‌లు సభ ప్రతిష్ఠ దిగజారేలా వ్యవహరించినప్పుడు పిటిషనర్లు (12 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు) ప్రత్యక్ష సాక్షులని, సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసేందుకు డివిజన్ బెంచ్ అనుమతి ఇవ్వాలని కోరారు. సింగిల్ జడ్జి తీర్పు ఏకపక్షంగా ఉందని, దానికి చట్టబద్ధత లేదని అన్నారు. అసెంబ్లీ హుందాతనాన్ని కాపాడేందుకు సభలోని సభ్యులు నిర్ణయం తీసుకునే అధికారం ఉందని... కోమటిరెడ్డి, సంపత్‌ల తీరు ఎంతమాత్రం సమర్ధనీయంగా లేనందునే వారిని సభ నుంచి బహిష్కరించినట్లు చెప్పారు. సభ ప్రతిష్ఠ మంటగలిపే సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం ఉంది. అయితే దీనిపై రాజ్యాంగంలో నియమాలేమీ లేవు. 184(3) అధికరణ మేరకు సభకు అసాధారణ అధికారాలుంటాయి. తెలంగాణ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని సింగిల్ జడ్జి తప్పుపడుతూ తీర్పు చెప్పడం రాజ్యాంగ వ్యతిరేకం. సుప్రీంకోర్టు గతంలో చెప్పిన తీర్పునకు కూడా వ్యతిరేకమే. సభ తీసుకునే నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకునే అధికారం లేనే లేదు. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై హెడ్‌ఫోన్ విసిరినట్లు కోమటిరెడ్డి, సంపత్‌లు వాళ్ల పిటిషన్‌లోనే రాశారు. వాళ్లు హెడ్‌ఫోన్ విసిరారనడానికి మొత్తం సభలోని సభ్యులంతా సాక్షులే. స్వామిగౌడ్‌ను గాయపరిచారు. వాళ్లపై సభ కఠిన చర్యలు తీసుకోవడం ఎంతమాత్రం తప్పుకాదు. సభ ఆమోదంతోనే వారిని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.. అని వైద్యనాథన్ వాదించారు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ప్రశ్నల వర్షం
దీనిపై బెంచ్ స్పందిస్తూ.. పిటిషన్‌లో హెడ్‌ఫోన్ విసిరినట్లుగా ఎక్కడుందో చెప్పాలి.. కోమటిరెడ్డి, సంపత్‌లను బహిష్కరించే తీర్మానంలో హెడ్‌ఫోన్‌తో స్వామి గౌడ్‌పై దాడి చేసిన కారణాన్ని పేర్కొన్నారా.. కోమటిరెడ్డి హెడ్‌ఫోన్ విసిరితే సంపత్‌ను ఎందుకు బహిష్కరించారు.. అయినా వారిపై చర్య తీసుకునే ముందు వారికి చివరి అవకాశం ఇవ్వాలి కదా.. అని ప్రశ్నల వర్షం కురిపించింది. వీటిపై శుక్రవారం జరిగే విచారణలో వివరణ ఇవ్వాలని టీఆర్‌ఎస్ తరఫు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌ను బెంచ్ ఆదేశించింది. అదే సమయంలో 12 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ చేసుకునేందుకు అర్హత ఉందో లేదో అనే విషయంలో కోమటిరెడ్డి, సంపత్‌ల వాదనలను వినేందుకు గాను కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. సింగిల్ జడ్జి వద్ద కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫున ఒకే కేసు వేసినట్లు చెప్పి అప్పీల్‌లో వేరువేరుగా దాఖలు చేయడంపై వారి తరఫు న్యాయవాది తీరును బెంచ్ తప్పుపట్టింది.అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు

Updated By ManamWed, 04/25/2018 - 16:57
Agri Gold

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్‌ కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. గత విచారణలో ఆస్తుల కొనుగోలుపై జీఎస్సెల్‌ గ్రూపు వెనక్కి తగ్గడంతో.. కేసును హైకోర్టు ఇవాళ విచారించింది. రూ.100 కోట్ల విలువ చేసే అగ్రిగోల్డ్‌ 10 ఆస్తులను గుర్తించి ప్రభుత్వం వేలం వేసేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. జూన్ 5న నాటికి రూ.1500 కోట్లు డిపాజిట్లు చేయాలని జీఎస్సెల్ సంస్థను ఆదేశించింది. ప్రభుత్వ విధానం తెలిస్తేనే ముందు అడుగు వేస్తామని జీఎస్సెల్ సంస్థ తెలిపింది. ఇక తదుపరి విచారణను జూన్‌ 5కు హైకోర్టు వాయిదా వేసింది.‘దళిత్’ పదం వాడొద్దు

Updated By ManamSun, 04/15/2018 - 00:01
 • రాజ్యాంగంలో ఆ పదంలేదు.. రాష్ట్రాలకు కేంద్రం సూచన

imageన్యూఢిల్లీ: అధికారిక వ్యవహారాలలో షెడ్యూలు కులాలకు చెందిన అందరినీ దళితులని సంబోధించడం మానేయాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల అధికారులకూ సూచించింది. ఈమేరకు హోంమంత్రిత్వ శాఖ నుంచి అందిన మార్గదర్శకాల మేరకు కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ 1982లో షెడ్యూల్ కులాల ధ్రువపత్రాలలో హరిజన్ అనే పదాన్ని వాడకూడదంటూ నిషేధం విధించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలకూ సూచనలు చేసింది. ఆయా ధ్రువపత్రాలలో సంబంధిత వ్యక్తి ఏ కులానికి చెందుతాడనే విషయాన్ని మాత్రమే పొందుపరచాలని పేర్కొంది. ఈమేరకు లేఖలు రాసింది. దీంతో పాటు ఈ విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు వెలువరించిన తీర్పును ఉదహరించింది. ఆ తీర్పు ప్రకారం.. రాజ్యాంగంలో దళిత్ అన్న పదం లేదని చెబుతూ, షెడ్యూలు కులాలు, తెగలకు సంబంధించిన వారి వ్యవహారాలలో దళిత్ అన్న పదాన్ని ఉపయోగించకూడదని హైకోర్టు తేల్చింది.
 ఎమ్మెల్యేలకు నోటీసులు

Updated By ManamTue, 04/10/2018 - 23:15
 • పార్టీ మారిన అందరికీ.. కోర్టు నోటీసు.. ఏపీ అసెంబ్లీ కార్యదర్శి.. న్యాయ కార్యదర్శికీ

 • అనర్హత వేటు వేయాలని ఆళ్ల వ్యాజ్యం.. కౌంటర్ల దాఖలుకు హైకోర్టు ఆదేశం

 • కేసు విచారణ మూడు వారాలకు వాయిదా.. వైసీపీ న్యాయువాదికి హైకోర్టు బెంచ్ ప్రశ్న

 • వారి పదవులకు రాజీనామా చేయించాం.. ధర్మాసనానికి లాయర్ పొన్నవోలు సమాధానం

high courtహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. వైసీపీ నుంచి గెలుపొంది మంత్రులు అయిన నలుగురితో పాటు ఇతర ఎమ్మెల్యేలు 18 మందికి నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో ప్రతివాదులైన ఏపీ శాసనసభ కార్యదర్శి, న్యాయ, శాసనసభా వ్యవహారాల శాఖ కార్యదర్శులకు కూడా హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలుచేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి కె.విజయలక్ష్మిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఈ కేసు విచారణ దశలోనే మధ్యంతర ఆదేశాలు జారీ చేయలేమని, ప్రతివాదుల వాదనలు తెలుసుకున్నాకే మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం తీసుకుంటామని బెంచ్ ప్రకటించింది. నోటీసులు ఇచ్చాక కేసు విచారణకు వస్తుందో లేదో అన్న అనుమానాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వ్యక్తం చేయగా.. ‘‘న్యాయవాదుల కేసులన్నీ ముఖ్యమే. హైకోర్టులో కేసుల ఒత్తిడిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. అయితే వచ్చే విచారణ ఎప్పుడు ఉంటుందో చెప్పాలని న్యాయవాది కోరగా మూడు వారాలకు కేసు వాయిదా వేస్తున్నామని, ఈలోగా ప్రతివాదులంతా తమ వాదనలతో కౌంటర్ వ్యాజ్యాలు దాఖలు చేయాలని బెంచ్ ఆదేశించింది.  పార్టీ ఫిరాయింపులను కట్టడి వేయాలని, ఇది రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగార్చే చర్య కాబట్టి వెంటనే హైకోర్టు స్పందించాలని న్యాయవాది కోరారు. అందుకు హైకోర్టు సిద్ధమేనని, పిటిషనర్ ఉన్న పార్టీ ఎప్పుడూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదా.. అని బెంచ్ ప్రశ్నించింది. గతంలో కొంతమంది నాయకులు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చేప్పుడు పదవులకు రాజీనామా చేస్తేనే వైసీపీలో సభ్యత్వం ఇస్తామని చెప్పడమే కాకుండా అందుకు అనుగుణంగా చేసిన చరిత్ర వైసీపీకి ఉందని న్యాయవాది బదులిచ్చారు. 

నోటీసులు వీరికే.. 
అసెంబ్లీ సెక్రటరీ, శాసనసభ, న్యాయ శాఖల కార్యదర్శులతోపాటు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులుగా ఉన్న వెంకట సుజయ కృష్ణరంగారావు, భూమా అఖిలప్రియ, అమర్‌నాథ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డిలకు నోటీసులు వెళ్లాయి. వారితో పాటు.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, గొట్టిపాటి రవికుమార్, డేవిడ్‌రాజు, రామారావు, పాశం సునీల్‌కుమార్, తిరివీధి జయరాములు, రాజేశ్వరి, కిడారి సరేశ్వరరావు, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మణి గాంధీ, అత్తార్ చాంద్ బాషా, జలీల్ ఖాన్, ఉప్పులేటి కల్పన, గిడ్డి ఈశ్వరి, కలమట వెంకట రమణమూర్తి, ఎం.అశోక్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డిలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అడ్వకేట్ జనరల్ డి.శ్రీనివాస్ కల్పించుకుని ఇదే వ్యాజ్యంలో పార్టీ ఫిరాయించిన ఎంపీలను కూడా ప్రతివాదులుగా చేశారనే అంశాన్ని బెంచ్ దృష్టికి తెచ్చారు. ఎంపీలను ప్రతివాదుల జాబితా నుంచి తొలగిస్తామని న్యాయవాది హామీ ఇవ్వడంతో అందుకు బెంచ్ అనుమతి ఇచ్చింది. 

ప్రతివాదిగా చంద్రబాబు ఉన్న కేసులో.. 
పార్టీ ఫిరాయింపులను బాహాటంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని వ్యక్తిగత ప్రతివాదిగా చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని మరో డివిజన్ బెంచ్‌కి నివేదించాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం నిర్ణయించింది. గతంలో న్యాయవాదిగా ఉన్నప్పుడు చంద్రబాబు తరఫున కేసులు వాదించినందున ఈ కేసును తాను విచారించబోనని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్ స్పష్టం చేశారు. దాంతో ఈ ప్రజాహిత వ్యాజ్యాన్ని మరో డివిజన్ బెంచ్‌కు నివేదించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. ఏపీ సీఎం చంద్రబాబు రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, బాహాటంగా పార్టీ ఫిరాయింపులకు పచ్చ జెండా ఊపుతున్నారని ఆరోపిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వి.సతీష్ కుమార్ దాఖలు చేసిన పిల్ మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందుకు వచ్చింది. కేసును తాను విచారించబోనని బెంచ్ వెల్లడించడంతో హైకోర్టు రిజిస్ట్రీ ఈ పిల్‌ను మరో డివిజన్ బెంచ్‌కు కేటాయించాక విచారణ జరుగుతుంది. పార్టీ ఫిరాయించి మంత్రులుగా ఉన్న నలుగురితోపాటు ఇతర వైసీపీ ఎమ్మెల్యేలనే కాకుండా వ్యక్తిగతంగా చంద్రబాబునాయుడిని పిటిషనర్ ప్రతివాదులుగా చేయడం గమనార్హం. సీఎం పదవిలో ఉన్న చంద్రబాబే రాజ్యాంగాన్ని, చట్టాన్ని కాపాడకుండా పార్టీ ఫిరాయింపుల్ని బాహాటంగా ప్రోత్సహించారని, బహిరంగ వేదికపై వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ కండువాలు కప్పేశారని పిటిషనర్ పిల్‌లో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారని.. మరోవైపు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు మంత్రులుగా చేసి రాజ్యాంగ స్ఫూర్తిని నిర్వీర్యం చేశారని అన్నారు. ఫిరాయించిన వారందరిపై అనర్హత వేటు వేయాలని పిల్‌లో పిటిషనర్ కోరారు.ఆ స్థానాల ఖాళీతో సంబంధంలేదు

Updated By ManamSat, 04/07/2018 - 01:27
 • కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వాల రద్దు కేసులో సర్కారు

 • హైకోర్టులో కౌంటర్ దాఖలు.. ఎన్నికలకు చర్యలు తీసుకోలేదు: ఈసీ

high_courtహైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్‌కుమార్ బహిష్కరణ నేపథ్యంలో వారు ప్రాతినిథ్యం వహించే నల్లగొండ, ఆలంపూర్ నియోజకవర్గాలు ఖాళీ అవ్వడానికి,  ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని  తెలంగాణ సర్కారు  హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టులో కౌంటర్ వ్యాజ్యం దాఖలు చేసింది. తమ సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ సదరు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన కేసుతో ప్రభుత్వానికి సంబంధం లేదని, అసెంబ్లీ సెక్రటరీకే హైకోర్టు ఆదేశాలివ్వాలని ప్రభుత్వం కోరింది. నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేస్తూ శాసనసభ సెక్రటరీ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అమలును నిలిపేయాలని మాత్రమే ఆ ఎమ్మెల్యేలు హైకోర్టును కోరారని అని ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఈ కేసులో కావాలనే ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేశారని. వారిద్దరికి జరిమానా విధించి కేసు కొట్టేయాలని ప్రభుత్వం తరఫున న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి నిరంజన్‌రావు కౌంటర్ దాఖలు చేశారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం కూడా కౌంటర్ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఈసీ తరఫున డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎం.సత్యవాణి ఈ కౌంటర్ వేశారు. హైకోర్టు గతంలో ఆదేశించిన మేరకు నల్లగొండ, అల్లంపూర్ నియోజకవర్గాల ఉప ఎన్నికలపై ఆరు వారాలపాటు ఎలాంటి చర్యలు తీసుకోరాదనే ఉత్తర్వుల్ని అమలు చేశారు. చట్టసభ సీట్లు ఖాళీ అయిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. 

అయితే ఇందుకు తాము ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలియజేశారు.  కోమటిరెడ్డి, సంపత్‌ల కేసులను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి శివశంకరరావు.. మండలి చైర్మన్ స్వామి గౌడ్‌పై దాడి జరిగిందని చెబుతున్న గత నెల 12 నాటి అసెంబ్లీ వీడియో ఫుటేజీ సమర్పించాలని, ఈ కేసులో కేంద్ర ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వం కౌంటర్లు వేయాలని ఆదేశించారు. ఈ కేసు శుక్రవారం విచారణ జరగాల్సివుంది. అయితే న్యాయమూర్తి సెలవు పెట్టడంతో కేసు విచారణకు రాలేదు.తాత్కాలిక ఉద్యోగులకు వెయిటేజి..

Updated By ManamTue, 03/06/2018 - 02:24

ప్రతిభావంతులకు అన్యాయమే: కోర్టు
high courtహైదరాబాద్
: ట్రాన్సోకో, మెడికల్ శాఖల్లో వివిధ పోస్టుల భర్తీ సమయంలో తాత్కాలిక, ఒప్పంద కార్మికులకు ప్రాధాన్యమిస్తూ వెయిటేజీ మార్కులు ఇవ్వడాన్ని సవాల్ చేసిన పలు రిట్ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. నేడు సమయం సరిపోకపోవడంతో కేసు ప్రాధాన్యత దృష్ట్యా బుధవారం సమగ్రంగా విచారణ కొనసాగిస్తామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి విజయలక్ష్మిలతో కూడిన డివిజన్ బెంచ్ ప్రకటించింది. తా త్కాలిక, ఒప్పంద ప్రాతిపదికపై ఉద్యోగాలు చేసే వారికి వెయిటేజీ మార్కులు ఇస్తే పోటీపరీక్షల్లో ప్రతిభ చూపేవారికి తీరని అన్యాయం జరుగుతుందన్నది పిటిషనర్ల లాయర్ వాదన. సుప్రీంకోర్టు కూడా పోటీపరీక్షల్లో అందర్నీ సమానంగానే చూడాలని, వెయిటేజీ మార్కులు ఇవ్వడం చెల్లదని చెప్పిందని ఆయన చెప్పారు. విచారణ 7వ తేదీకి వాయిదా పడింది.

Related News