gangster

జైల్లో గ్యాంగ్‌స్టర్ బజరంగీ హత్య

Updated By ManamMon, 07/09/2018 - 21:27
  • తుపాకీతో కాల్చిచంపిన మరో ఖైదీ.. ఉత్తరప్రదేశ్ జిల్లా జైలులో ఘటన 

  • సీరియస్‌గా తీసుకున్న యోగీ సర్కార్.. ఘటనపై న్యాయ విచారణకు ఆదేశం

imageబాఘ్‌పట్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ ప్రేమ్ ప్రకాశ్ సింగ్ అలియాస్ మున్నా బజరంగీ జైల్లోనే హత్యకు గురయ్యాడు. ఓ ప్రజాప్రతినిధి హత్య సహా పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న బజరంగీని ప్రత్యర్థి ముఠాకు చెందిన మరో ఖైదీ తుపాకీతో కాల్చి చంపేశాడు. బాఘ్‌పట్ జిల్లా జైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జైలులో ఉన్న విచారణ ఖైదీల చేతుల్లోకి ఆయుధాలు ఎలా చేరాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ నలుగురు జైలు అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు ఘటనపై విచారణకు ఆదేశించారు. బీజేపీ ఎమ్మెల్యే లోకేష్ దీక్షిత్‌ను డబ్బు కోసం బెదిరించాడనే కేసులో బజ్రంగీపై బాఘ్‌పట్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణకు హాజరుపరిచేందుకు ఝాన్సీ జైలులో శిక్ష అనుభవిస్తున్న బజ్రంగీని ఆదివారం నాడు పోలీసులు బాఘ్‌పట్ జిల్లా జైలుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అదే జైలులో ఉన్న బజరంగీ ప్రత్యర్థి, మరో గ్యాంగ్‌స్టర్ సునీల్ రాతి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో బజరంగీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు వెల్లడించారు.

పోలీసుల హిట్ లిస్ట్‌లో..
గ్యాంగ్‌స్టర్ బజ్రంగీ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన భార్య సీమ గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. బజరంగీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని సీమ ఆరోపించారు. ఈ క్రమంలో సోమవారం బజ్రంగీ హత్యకు గురవడం.. అదీ జిల్లా జైలులోని ఓ ఖైదీ తుపాకీతో కాల్చిచంపడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జైలులోపలికి తుపాకీ ఎలా చేరిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, సోమవారం ఉదయం బజరంగీని న్యాయస్థానానికి తీసుకెళ్లే ప్రయత్నాలలో ఉండగా.. సునీల్ రాతి అనే ఖైదీ కాల్పులు జరిపి బజరంగీని హత్య చేశాడని జైలు అధికారులు వివరిస్తున్నారు.యూపీ జైల్లో గ్యాంగ్‌స్టర్ హతం

Updated By ManamMon, 07/09/2018 - 10:51
Gangster Munna Bajrangi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్  మున్నా భజరంగి హతమయ్యాడు. మున్నా భజరంగిపై జైలులోని సహచర ఖైదీ సునీల్ రాథి కాల్పులు జరపడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.  మున్నా భజరంగిని సోమవారం ఉదయం భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో  కోర్టులో హాజరు పరచాల్సి ఉండగా, భాగ్‌పట్‌ జైల్లో హత్యకు గురయ్యాడు.

ఉదయం 6.30 గంటల సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాగా మున్నాను నిన్నే ఝాన్సీలోని జైలు నుంచి భాగ్‌పట్‌ జైలుకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ విచారణకు ఆదేశించారు. జైలు ఆవరణలో ఇటువంటి సంఘటన చోటుచేసుకోవటం తీవ్రమైన చర్యగా భావిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

కాగా తన భర్త హత్యకు కుట్ర జరుగుతుందంటూ, అతడికి ప్రాణహాని ఉందంటూ మున్నా భజరంగి భార్య  సీమా సింగ్‌  ఆరోపించిన విషయం తెలిసిందే. తన భర్తను నకిలీ ఎన్‌కౌంటర్ చేసేందుకు కుట్ర జరుగుతుందని, ఈ విషయాన్ని సీఎం యోగి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆమె గత నెల్లో పేర్కొన్నారు.  మున్నా భజరంగిపై హత్య కేసుతో పాటు పలు దోపిడీ కేసులలో నిందితుడిగా ఉన్నాడు. సల్మాన్‌ను చంపేందుకు గ్యాంగ్‌స్టర్ కుట్ర

Updated By ManamSun, 06/10/2018 - 13:20

sampath బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రా కుట్ర చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. హరియాణా, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న సంపత్ నెహ్రాను ఇటీవల హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతడి నుంచి కీలక విషయాలు తెలుసుకుంటున్నారు. అందులో అనేక హత్యలు చేసిన నెహ్రా.. బాలీవుడ్ నటుడు సల్మాన్ హత్యకు కుట్ర పన్నాడని, ఇందుకోసం అతడి ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించినట్లు వారు తెలిపారు.

అంతేకాదు హత్య చేసిన తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు కూడా నెహ్రా ప్రణాళిక వేసినట్లు వారు పేర్కొన్నారు. అయితే కృష్ణజింక కేసులో సల్మాన్‌ను హత్య చేస్తామని బిష్ణోయ్ వర్గం హెచ్చరించింది. ఇక సంపత్ నెహ్రా కూడా అదే వర్గానికి చెందిన వాడు కావడంతోనే సల్మాన్‌ను హత్య చేసినందుకు కుట్ర చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.‘గ్యాంగ్‌స్టర్’ కేడీగా జగ్గుభాయ్

Updated By ManamThu, 05/17/2018 - 12:59
gangster

సామాజిక మాధ్యమాలు పెరుగుతున్న కొద్దీ నటీనటులు కూడా తమ స్టైల్‌ను మార్చేస్తున్నారు. ఒకప్పుడు సినిమాలకు మాత్రమే పరిమితమైన నటీనటులు ఇప్పుడు బుల్లితెరపైనా, వెబ్‌ సిరీస్‌లో తమ సత్తాను చాటుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జగ్గుభాయ్ కూడా వెబ్‌సిరీస్‌లో కనిపించేందుకు సిద్ధమయ్యారు. ‘గ్యాంగ్‌స్టర్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్‌సిరీస్‌లో జగపతిబాబు గ్యాంగ్‌స్టర్ కేడీగా కనిపించనున్నారు.

అలాగే నవదీప్ క్రేజీస్టార్ విశ్వగా, శ్వేతాబసు ప్రసాద్ సూపర్‌స్టార్ ఐశ్వర్యగా, గుంటూరు టాకీస్ ఫేం సిద్దు మరో పాత్రలో కనిపించనున్నారు. అజయ్ భుయాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ టీజర్ శుక్రవారం విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది.

 పుష్క‌ర‌కాలం.. కంగనా కానుక‌

Updated By ManamWed, 11/01/2017 - 12:44

manikarnikaగ్లామ‌ర్‌, పెర్‌ఫార్మెన్స్‌.. ఇలా ఈ రెండు విష‌యాల్లోనూ త‌నేంటో నిరూపించుకుంది కంగ‌నా ర‌నౌత్‌. తొలి చిత్రం 'గ్యాంగ్ స్ట‌ర్' నుంచి గ‌త చిత్రం 'సిమ్ర‌న్' వ‌ర‌కు ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా ఈ ముద్దుగుమ్మ న‌ట‌న‌కి బాలీవుడ్ ప్రేక్ష‌క లోకం ఫిదా అయ్యింది. తెలుగులోనూ ఎనిమిదేళ్ల క్రితం 'ఏక్‌నిరంజ‌న్‌'తో కంగ‌నా సంద‌డి చేసిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. కాగా, కంగ‌నా ప్ర‌స్తుతం ఓ చారిత్రాత్మ‌క చిత్రం చేస్తోంది. అదే 'మ‌ణిక‌ర్ణిక‌'. ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్  తెర‌కెక్కిస్తున్నారు. సంక్రాంతికి వ‌చ్చిన చారిత్రాత్మ‌క చిత్రం 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' త‌రువాత ఆయ‌న వెంట‌నే రూపొందిస్తున్న సినిమా కూడా అదే నేప‌థ్యంతో తెర‌కెక్కుతుండ‌డం విశేషం.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి కంగ‌నా ఎలా ఉండ‌బోతుందో అన్న ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో ఉంది. దానికి త‌గ్గ‌ట్టే.. కొద్ది రోజుల క్రితం జైపూర్  చిత్రీక‌రించిన కొన్ని దృశ్యాల తాలుకు ఛాయాచిత్రాలు లీక్ అయి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడేమో.. ఏకంగా సినిమాలోని స్టిల్సే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే.. అవి లీక్ అయ్యాయా?  చిత్ర బృంద‌మే విడుద‌ల చేసిందా? అనేది తెలియ‌దు. ఆ స్టిల్స్‌ చూసిన‌వాళ్లంతా.. నిజంగానే ఝాన్సీ ల‌క్ష్మీ భాయ్ ఇలాగే ఉంటుందేమో అన్న‌ట్లుగా కంగ‌నా ఉందంటున్నారు. కాగా, ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుద‌ల చేయ‌నున్నారు. విశేష‌మేమిటంటే.. కంగ‌నా తొలి చిత్రం 'గ్యాంగ్ స్ట‌ర్' కూడా స‌రిగ్గా ప‌న్నెండేళ్ల క్రితం ఆ తేదికి ఒక రోజు త‌రువాత అంటే ఏప్రిల్ 28న రిలీజైంది. సో..న‌ట‌ప్ర‌స్థానం పుష్క‌ర‌కాలం పూర్తిచేసుకోనున్న త‌రుణంలో కంగ‌నా.. త‌న అభిమానుల‌కు 'మ‌ణిక‌ర్ణిక' రూపంలో కానుక ఇవ్వ‌నుంద‌న్న‌మాట‌.

 

Related News